‘అవగాహన’ లక్ష్యానికి సంబంధించిన సరైన స్పష్టీకరణ?
గతవారం తరువాయి..
- భారతీయ సంస్కృతి పట్ల ఆదరాభిమానాలు పెంపొందించుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం
ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు?
1) సృజనాత్మకత 2) వాగ్రూప వ్యక్తీకరణ
3) లిఖిత రూప వ్యక్తీకరణ
4) సంస్కృతి, సంప్రదాయాలు - ‘సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలగడం’ అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందినది? (పీజీటీ 2017, ఎస్ఏ 2018)
- ‘సృజనాత్మకత’ లక్ష్యానికి సంబంధించి సరికాని స్పష్టీకరణ?
1) సారాంశాన్ని గ్రహిస్తారు
2) స్వతంత్ర రచనలు చేస్తారు, శైలిలో ప్రత్యేకతను కనబరుస్తారు
3) తమ రచనల్లో లోకోక్తులు, జాతీయాలు ఉపయోగిస్తారు
4) సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చుతారు - ‘ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను తెలుసుకోవడం ఉభయ భాషల్లోని సమానార్థక పదాలకు జాతీయాలను ఎన్నుకోవడం’ అనే స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి?
1) సముచిత మనోవైఖరులు
2) భాషాంతరీకరణ
3) సృజనాత్మకత
4) సంస్కృతి, సాంప్రదాయాలు - కళాకారులను, పండితులను, కవులను పాఠశాలకు ఆహ్వానించి వారి ప్రసంగాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనం? (పీజీటీ 2018)
1) నేత్రోత్సవమగుట
2) సహృదయ స్పందన
3) సముచిత మనోవైఖరులు పెంపొందడం
4) స్థానికులను పరిచయం చేయడం - ‘విమర్శలను సహృదయంతో స్వీకరించగలగడం’ అనే స్పష్టీకరణ
ఏ బోధనా లక్ష్యానిది? (పీజీటీ 2017)
1) ఆంధ్రీకరణ 2) మనోవైఖరులు
3) అవగాహన 4) వినియోగం - ‘విద్యార్థులు వేమన వంటి కవుల పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించడం’ అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానిది? (పీజీటీ 2017)
1) అవగాహన 2) రసానుభూతి
3) సముచిత వైఖరులు 4) సృజనాత్మకత - ఒక వస్తువును గురించి గాని, ప్రదేశాన్ని గురించి గాని లేదా వ్యక్తిని గురించి కానీ విద్యార్థికి ఏర్పడే ప్రత్యేక భావం?
1) అభిరుచి 2) నాణ్యత
3) వైఖరి 4) స్థాయి - ‘వైఖరి’ అనే లక్ష్యం ఏ రంగానికి చెందినది?
1) సృజనాత్మక రంగం
2) జ్ఞానాత్మక రంగం
3) భావావేశ రంగం
4) మానసిక-చలనాత్మక రంగం - ‘సముచిత మనోవైఖరులు’ విద్యార్థుల్లో కలిగించే స్పష్టీకరణలకు సంబంధించి సరికానిది?
1) సాహితీవేత్తల పట్ల గౌరవ భావంతో ఉంటారు
2) స్వతంత్ర రచనలు చేస్తారు
3) ఇతర భాషల పట్ల సమానాదరణ చూపిస్తారు
4) సాహిత్య కృషిని ప్రోత్సహిస్తారు - ‘సముచిత మనోవైఖరులు’ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ?
1) విమర్శనాత్మక దృష్టితో ఉండటం, విమర్శలను సహృదయంతో స్వీకరించడం
2) పోలికలు, భేదాలు చెప్పగలగడం
3) తన్మయత్వం పొందడం
4) స్వతంత్ర రచనలు చేయడం - ‘ఉద్దేశాలు (ఎయిమ్స్)’కు సంబంధించి సరైన ప్రవచనం గుర్తించండి?
ఎ. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి
బి. సంవత్సరం చివర విషయ ప్రణాళికల (సిలబస్) ద్వారా సాధించాల్సిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు
సి. ఉద్దేశాలు సామాన్య ఉద్దేశాలు, ప్రత్యేక ఉద్దేశాలు అని రెండు విధాలుగా విభజించవచ్చు
డి. దీర్ఘకాలికాలు. సాధించడానికి దుర్లభమైనవి
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి 4) ఎ, డి - ఉద్దేశాలకు సంబంధించి సరైన ప్రవచనాలు గుర్తించండి?
ఎ. బోధన విషయాలకు (సబ్జెక్ట్స్) సంబంధించిన స్థూల ప్రయోజనాలు- సామాన్య ఉద్దేశాలు
బి. విషయ ప్రణాళికలోని అన్ని విషయాలకు వర్తించేవి-> సామాన్య ఉద్దేశాలు
సి. ఒక్కో బోధనాంశం ద్వారా సాధించాల్సిన పరిమిత ప్రయోజనాలు-> ప్రత్యేక ఉద్దేశాలు
డి. ఒక బోధనాంశానికి మాత్రమే పరిమితమైనవి- ప్రత్యేక ఉద్దేశాలు
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి - కింది వాటిలో విద్యాలక్ష్యాల లక్షణం కానిది గుర్తించండి?
1) మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి
2) నిర్ణయించిన కాలపరిమితిలో సాధించడానికి వీలుగా ఉంటాయి
3) పరిశీలించదగినవి, కొలవదగినవిగా ఉంటాయి
4) విద్యావిషయకంగా ప్రాముఖ్యం కలిగి, విద్యార్థులు సాధించలేనివిగా ఉంటాయి - ‘గమ్యాలు దీర్ఘకాలికమైనవి. ఒక రకంగా అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. ఉద్దేశాలు నియమితమైనవి. లక్ష్యాలు ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టమైనవి. ఉద్దేశాలు విద్యకు మార్గదర్శకాలు. కానీ చేరుకోగల అంతిమ దృక్పథం లక్ష్యమే లక్ష్యసాధన ఉద్దేశాల సాధనకు చేరుస్తుంది’ అని నిర్వచించినది?
1) బెంజిమన్ బ్లూమ్స్
2) డేవిడ్ ఆర్ క్రాత్హాల్
3) జీకే సూద్
4) మాసియా, సింప్సన్, హోరో - జ్ఞానాత్మక రంగానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది?
1) జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ‘సమన్వయీకరణ’ అనే అంశం ఆధారంగా వర్గీకరించబడింది
2) ఒక వస్తువుకు, విషయానికి విలువ కట్టి దానికి సంబంధించినవి నిర్ణయించగలగడం- మూల్యాంకనం
3) జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలను ‘సరళత నుంచి క్లిష్టత’ అనే అంశం ఆధారంగా వర్గీకరించబడింది- జ్ఞానాత్మక రంగంలో 6 లక్ష్యాలు ఉంటాయి
- కింది మొదటి వరుసలోని బ్లూమ్ జ్ఞానాత్మక రంగంలోని వర్గీకరణకు సంబంధించి నామవాచక పదాలకు, రెండో వరుసలోని క్రాత్హాల్, అండర్సన్ల వర్గీకరణలోని క్రియా పదాలతో జతపర్చండి?
మొదటి వరుస రెండో వరుస
అ. జ్ఞానం య. విలువ కట్టడం
ఆ. అవబోధం ర. సృజించడం
ఇ. సంశ్లేషణ ల. అవగాహన చేసుకోవడం
ఈ. మూల్యాంకనం
వ. ధారణ కలిగి ఉండటం
మొదటి వరుసలోని లక్ష్యాలు అ, ఆ, ఇ, ఈ లకు వరుసగా సరిపోయే రెండో వరుసలోని అంశాలు
1) య, ర, ల, వ 2) వ, ర, ల, య
3) వ, ల, ర, య 4) ల, ర, వ, య - జ్ఞానాత్మక రంగం (కాగ్నిటివ్ డొమైన్)నకు సంబంధించి సరైనవి?
ఎ. విషయ సంబంధ జ్ఞానం (ఫ్యాక్టువల్ నాలెడ్జ్), భావన సంబంధ జ్ఞానం (కాన్సెప్టువల్ నాలెడ్జ్), విధానపరమైన/ప్రక్రియాపరమైన జ్ఞానం (ప్రొసీజరల్ నాలెడ్జ్), అధి సంజ్ఞానాత్మక జ్ఞానం (మెటా కాగ్నిటివ్ నాలెడ్జ్) అనే నాలుగు రకాలైన జ్ఞానాలు ఉంటాయి
బి. అధి సంజ్ఞానాత్మక జ్ఞానంలో సంజ్ఞానాత్మక ప్రక్రియలకు సంబంధించిన జ్ఞానం, విద్యార్థి స్వీయ సంజ్ఞానాత్మకతకు సంబంధించిన జ్ఞానం ఇమిడి ఉంటాయి
సి. అండర్సన్, క్రాత్హాల్లు జ్ఞాన రంగాన్ని ‘ద్విముఖం’గా మార్చారు
డి. జ్ఞానాన్ని విషయ సంబంధంగానూ, సంజ్ఞానాత్మక ప్రక్రియకు సంబంధించినదిగానూ రెండు విధాలుగా ప్రతిపాదించారు
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి - భావావేశ రంగం (ఎఫెక్టివ్ డొమైన్)నకు సంబంధించి సరైన ప్రవచనాలు గుర్తించండి?
ఎ. క్రాత్హాల్, బ్లూమ్, మాసియా 1964లో ప్రచురించారు
బి. ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, విలువలు, అనుభూతులు, ప్రశంసలు భావావేశ రంగానికి చెందినవి
సి. మానవ ప్రవృత్తి, ప్రవర్తన, ప్రతిస్పందనలకు సంబంధించినవి
డి. జ్ఞానం, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగిన సంస్కారం వల్ల విద్యార్థి భావావేశ రంగంలోకి ప్రవేశిస్తాడు
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి - భావావేశ రంగంలోని లక్ష్యాలను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించారు?
1) సమన్వయీకరణం అనే అంశం ఆధారంగా
2) అంతరవృద్ధి అనే లక్షణం ఆధారంగా
3) సరళత నుంచి క్లిష్టత అనే అంశం ఆధారంగా
4) క్లిష్టత నుంచి సరళత అనే అంశం ఆధారంగా - భావావేశ రంగంలోని లక్ష్యాల సరైన వరుసక్రమం?
1) లక్షణీకరణ-> వ్యవస్థీకరణ-> మూల్య నిర్ధారణ-> ప్రతిస్పందించడం-> గ్రహించడం
2) గ్రహించడం-> ప్రతిస్పందించడం-> లక్షణీకరణ-> వ్యవస్థీకరణ-> మూల్య నిర్ధారణ
3) గ్రహించడం-> ప్రతిస్పందించడం-> మూల్య నిర్ధారణ-> లక్షణీకరణ-> వ్యవస్థీకరణ
4) గ్రహించడం-> ప్రతిస్పందించడం-> మూల్య నిర్ధారణ (మౌల్వీకరణ)-> వ్యవస్థీకరణ (వర్గీకరణ)-> లక్షణీకరణం (గుణీకరణం) - మానసిక చలనాత్మక రంగా (సైకో మోటార్ డొమైన్)నికి సంబంధించి సరైనవి? (Imp)
ఎ. దవే (1962), సింప్సన్ (1972), క్రాత్హాల్ (1972)లు ప్రచురించారు
బి. మెదడు ద్వారా కండరాల, అవయవాల కదలికను సమన్వయం చేసుకునే శక్తి ఏ రంగ లక్ష్యానికి నిర్ణయిస్తుంది
సి. చేతిరాత, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య మొదలైనవి మానసిక చలనాత్మక రంగానికి ఉదాహరణలు
డి. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగాల్లో విద్యార్థి సంపాదించిన సామర్థ్యాల ఫలితంగా మానసిక చలనాత్మక రంగంలో అభివృద్ధి జరుగుతుంది
1) ఎ, బి 2) ఎ, బి
3) సి, డి 4) ఎ, బి, సి, డి - మానసిక చలనాత్మకరంగంలోని లక్ష్యాలను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించబడింది?
1) సమన్వయీకరణ 2) అంతరవృద్ధి
3) సరళత నుంచి క్లిష్టత
4) క్లిష్టత నుంచి సరళత - తెలుగు భాషాబోధనా లక్ష్యాలు-స్పష్టీకరణలకు సంబంధించి సరైన ప్రవచనం?
ఎ. 1990 నుంచి కనీస అభ్యసన సామర్థ్యాల ఆధారంగా తెలుగు భాషాబోధన జరిగింది
బి. 1974-2013 వరకు ప్రాథమిక దశ నుంచి సెకండరీ స్థాయి వరకు ప్రథమ భాషగా తెలుగు భాషాబోధనను ఏ లక్ష్యాల ఆధారంగా నిర్వహించారు
సి. SCERT 1972-73 నుంచి మాధ్యమిక, సెకండరీ స్థాయిలో (6-10) తెలుగు భాషాబోధన లక్ష్యాలు-స్పష్టీకరణలు నిర్ణయించారు
డి. తెలుగు భాషా బోధనకు 10 లక్ష్యాలు ప్రతిపాదించారు
1) ఎ, బి 2) ఎ, బి, సి, డి
3) సి, డి 4) ఎ, సి - ‘అవగాహన’ లక్ష్యానికి సంబంధించిన సరైన స్పష్టీకరణలు గుర్తించండి?
ఎ. నానార్థాలు, వ్యతిరేకార్థాలు చెప్పగలగడం
బి. భావాలు, సంఘటనలను సరైన క్రమంలో వర్ణించడం
సి. భాషణ, లేఖనాల్లో నిక్షిప్తమైన భావాలను వివరించడం
డి. పద్య, గద్యాల్లో ముఖ్యమైన పదాలు, సమాసాలు గుర్తించడం
1) ఎ, బి 2) సి, డి
3) బి, డి 4) ఎ, బి, సి, డి - ‘అవగాహన’ లక్ష్యానికి సంబంధించిన సరైన స్పష్టీకరణ?
1) ఉచ్ఛారణ దోషరహితంగా మాట్లాడటం
2) పదాలు, వాక్యాలను ఇతర రూపాల్లోకి (వ్యతిరేకార్థం, కాలం) మార్చగలగడం
3) సభాకంపం లేకుండా మాట్లాడగలగడం
4) వర్ణక్రమ దోషాలు లేకుండా రాయగలగడం
114.భాషాంతరీకరణం/తర్జుమా/అనువాదానికి సంబంధించి సరైన ప్రవచనం?
ఎ. ఒక భాషలో ఉన్న విషయ సారాన్ని మరో భాషలోకి సమానార్థకంగా మార్చే ప్రక్రియను భాషాంతరీకరణ అంటారు
బి. మూల భాషలోని అంశాలను లక్ష్య భాషలోకి మార్చడమే తర్జుమా
సి. ఏ భాషలోని అంశాలను తెలుగులోకి అనువదించాలని అనుకుంటామో దాన్ని మూల భాష (సోర్స్ లాంగ్వేజ్) అంటారు
డి. తెలుగులోకి అనువదిస్తున్నాం కాబట్టి తెలుగును లక్ష్య భాష (టార్గెట్ లాంగ్వేజ్) అంటారు
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
- Answers
88-4, 89-1, 90-1, 91-2, 92-3, 93-2, 94-3, 95-3, 96-3, 97-2, 98-1, 99-1, 100-4, 101-4, 102-3,103-1, 104-3, 105-4, 106-4, 107-2, 108-4 109-4, 110-1, 111-2, 112-4, 113-2, 114-4.
లోక్నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
Previous article
సముద్ర ఎలుక అని దేన్ని పిలుస్తారు?
Next article
సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు