కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు!


ఐదు నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు.. ఐఐటీ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తర్ఫీదుగురుకులాలు…నాణ్యమైన విద్య, చక్కటి వసతి సౌకర్యాలు, ఇంటిని మరిపించేలాంటి భోజన సౌకర్యాలతో పాటు ఉచితంగా పుస్తకాలు, దుస్తులే కాకుండా విద్యకు అవసరమైన అన్నింటిని అందిచడంతోపాటు ఓవరాల్ డెవలప్మెంట్ కోసం క్రీడలు, సంగీతం, నృత్యం వంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్‌తో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలాంటి విద్యను అందిస్తున్నాయి గురుకులాలు. రాష్ట్రంలోని వివిధ గురకులాల్లో ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌ల ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి గురించి సంక్షిప్తంగా…
రెసిడెన్షియల్ స్కూల్స్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలో సుమారు తొమ్మిది వందలకుపైగా గురుకులాలు ఉన్నాయి. వీటిలో ఐదోతరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
మైనార్టీ గురుకులాలు
రాష్ట్రంలో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో 33 జిల్లాల్లో 204 పాఠశాలలు ఉన్నాయి.
వీటిలో బాలురకు 107, బాలికలకు -97 పాఠశాలలు ఉన్నాయి.
ప్రవేశాలు కల్పించే తరగతులు: 5, 6, 7, 8
అర్హతలు: 4, 5, 6, 7 తరగతులు ఉత్తీర్ణులైనవారు ఆ పై తరగతిలో ప్రవేశాలను పొందవచ్చు.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ పరిధిలో ఐదోతరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
సోషల్ వెల్ఫేర్ సొసైటీ కింద మొత్తం 230 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదోతరగతి ప్రవేశాల కోసం టీజీ సెట్-2021 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో బాలురకు 42, బాలికలకు 85 ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను సొసైటీ నిర్వహిస్తుంది.
డిగ్రీలో ప్రవేశాల కోసం టీజీయూజీసెట్-2021 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
వీటితోపాటు టీఎస్‌డబ్ల్యూ సీఓఈ, ఆర్మ్డ్ ప్రిపరేటరీ కాలేజీలు, సైనిక్స్కూల్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తి వివరాల కోసం https://tswreis.in
బీసీ గురుకులాలు
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం 261 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఐదోతరగతి నుంచి పదోతరగతి తరగతులున్నాయి.
ఐదో తరగతిలో ప్రవేశాల కోసం టీజీ సెట్-2021 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ఇంటర్, డిగ్రీ ప్రవేశాల కోసం ఆర్జేసీ & ఆర్డీసీ సెట్-2021 నిర్వహిస్తారు.
బీసీ వెల్ఫేర్ శాఖ కింద మొత్తం 138 గురుకుల కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది 119 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో 68 బాలురు, 70 బాలికల కాలేజీలు ఉన్నాయి.
మహిళా డిగ్రీ కాలేజీ (ఇంగ్లిష్ మీడియం) ఒకటి జగదేవ్‌పూర్‌లో ఉంది. దీనిలో బీఎస్సీ, బీఏ, బీకాం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తి వివరాల కోసం
http:/mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ చూడవచ్చు. లేదా 2nd Floor, D S S Bhavan, Owaisi Pura, Masab Tank, Hyderabad, Telangana 500028. ఫోన్ నంబర్: 040-23328266 చిరునామాలో సంప్రదించవచ్చు. ఎంపిక లక్కీ డీప్ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 20
వెబ్సైట్: http://tmreis.telangana.gov.in
- Tags
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు