కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయం
థాయ్‌లాండ్ ప్రధానికి జరిమానా
మాస్క్ ధరించలేదని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్ వో చాకు అధికారులు ఏప్రిల్ 26న జరిమానా విధించారు. వ్యాక్సిన్ కొనుగోలు విషయమై ప్రధాని తన సలహాదారులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాస్క్ వేసుకోలేదని 6 వేల బాట్ల (సుమారు రూ.14,270) ఫైన్ వేశారు.
అమెరికా జనాభా 33 కోట్లు
అమెరికా జనాభా 33 కోట్లకు చేరిందని 2020 జనాభా లెక్కల డాటాను యూఎస్ పాపులేషన్ బ్యూరో ఏప్రిల్ 27న విడుదల చేసింది. 50 రాష్ర్టాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో పాటు యునైటెడ్ స్టేట్స్ నివాస జనాభా 2020, ఏప్రిల్ 1 నాటికి 331,449,281గా ఉంది. అమెరికాలో పదేండ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు.
రష్యా-బాల్టిక్ దేశాల దౌత్యవేత్తల బహిష్కరణ
బాల్టిక్ దేశాలపై లిథువేనియా, ఎస్తోనియా, లాత్వియా, స్లోవోకియాకు చెందిన ఏడుగురు దౌత్యవేత్తలను రష్యా ఏప్రిల్ 28న బహిష్కరించింది. అంతకుముందు బాల్టిక్ దేశాలు కూడా ఏడుగురు రష్యా దౌత్యవేత్తలను బహష్కరించాయి.
భారత్‌కు అమెరికా వైద్య సామగ్రి
భారత్‌కు రూ.740.66 కోట్ల (10 కోట్ల డాలర్లు) పైగా విలువైన వైద్య సామగ్రి పంపించనున్నట్లు అమెరికా ఏప్రిల్ 29న ప్రకటించింది. ఈ వైద్య సామగ్రిలో కాలిఫోర్నియా రాష్ట్రం సమకూర్చిన 440 ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు ఉన్నాయి.
డిఫెండర్-యూరోప్-21
యూఎస్ ఆర్మీ-లెడ్ నాటో మిలిటరీ సంయుక్తంగా ‘డిఫెండర్-యూరోప్-21’ పేరుతో సైనిక విన్యాసాలను ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహించారు. వీటిని అల్బేనియాలో చేపట్టారు. 1949, ఏప్రిల్ 4న నాటో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బ్రసెల్స్, బెల్జియం. దీనిలో సభ్యదేశాలు 30.
అంతరిక్షంలో ఆకుకూరలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న నాసా వ్యోమగామి మైకేల్ హాప్కిన్స్ ఆకుకూరలను సాగుచేశారని అధికారులు ఏప్రిల్ 29న వెల్లడించారు. పాక్ చోయి, అమారా ఆవాల మొక్కలను ఆయన పండించారు. 64 రోజుల పాటు ఇవి పెరిగాయి. అంతరిక్ష కేంద్రంలో అత్యంత ఎక్కువ కాలం పెరిగిన ఆకుకూరల పంట ఇదే.
జాతీయం
ఎబిజినెస్ సదస్సు
‘ఇండియన్ బిజినెస్ స్కూల్స్ లీడర్షిప్ కాంక్లేవ్-2021’ను ఆన్లైన్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏప్రిల్ 27న ప్రారంభించారు. ఈ సదస్సులో ‘ఇండియన్ బిజినెస్ స్కూల్స్ స్థానిక, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల విలీనంతో సుస్థిరాభివృద్ధి సాధన’ అంశంపై చర్చించారు.
సోలీ సొరాబ్జీ మృతి
ప్రముఖ న్యాయకోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సొరాబ్జీ ఏప్రిల్ 30న మరణించారు. 1930, మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన 1989-90, 1998-2004 మధ్య అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఆయన 2002లో పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ‘లా ఆఫ్ ప్రెస్ సెన్సార్షిప్ ఇన్ ఇండియా, ది ఎమర్జెన్సీ, సెన్సార్షిప్ అండ్ ది ప్రెస్ ఇన్ ఇండియా’ వంటి పుస్తకాలను రచించారు.
ఆస్కార్ అవార్డ్-2021
ఆస్కార్ చరిత్రలోనే మొదటిసారిగా రెండు ప్రదేశాల్లో (లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో, యూనియన్ స్టేషన్లో) 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాలను ఏప్రిల్ 26న నిర్వహించారు.
ఉత్తమ నటుడు: ఆంథోని హాప్కిన్స్ (ది ఫాదర్)
ఉత్తమ సహాయనటుడు: డేనియల్ కలువోయా (జూడాస్ అండ్ ది బ్లాక్ మెసయ్య)
ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ (నోమాడ్ ల్యాండ్)
ఉత్తమ సహాయ నటి: యు జంగ్ యున్ (మినారి)
ఉత్తమ చిత్రం: నోమాడ్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రం: సోల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎరిక్ (మాంక్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: అన్ రోత్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఉత్తమ దర్శకత్వం: క్లోయూ జాన్ (నోమాడ్ ల్యాండ్)
ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్):
మై ఆక్టోపస్ టీచర్
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్): కొలెట్టే
ఉత్తమ ఎడిటింగ్: మికెల్ ఇ జి నీల్సెన్ (సౌండ్ ఆఫ్ మెటల్)
ఇంటర్నేషనల్ బెస్ట్ ఫిల్మ్: అనదర్ రౌండ్ (డెన్మార్క్)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్): ఫైట్ ఫర్ యూ (జూడాస్ అండ్ ది బ్లాక్ మెసయ్య)
ఉత్తమ లఘు చిత్రం (యానిమేటెడ్): ఇఫ్ ఎనీ థింగ్ హ్యాపెన్స్ ఐ లవ్యూ
ఉత్తమ లఘు చిత్రం (లైవ్ యాక్షన్): టు డిస్టాంట్ స్ట్రేంజర్స్
ఉత్తమ సౌండ్: సౌండ్ ఆఫ్ మెటల్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్
ఉత్తమ రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): క్రిస్టఫర్ హాంప్టన్, ఫ్లోరియన్జెల్లర్
(ది ఫాదర్)
ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే): ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
89 ఏండ్ల వయస్సులో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మహిళగా అన్రోత్ చరిత్రకెక్కారు.
మెక్‌డోర్మండ్ 1997లో ‘ఫర్గో’, 2018లో ‘త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ చిత్రాల్లో నటనకుగాను ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్నారు. నోమాడ్ ల్యాండ్ చిత్రంతో ఆమె మూడోసారి ఈ అవార్డును అందుకుంది.
రెండు కొత్త మండలాలు
రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో మహమ్మదాబాద్, వికారాబాద్ జిల్లాలోని చౌడాపూర్లను మండలాలుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ఏప్రిల్ 24న నోటిఫికేషన్ జారీచేసింది. 10 గ్రామాలతో మహమ్మదాబాద్, 14 గ్రామాలతో చౌడాపూర్ మండలాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు మండలాలతో కలిసి రాష్ట్రంలోని మండలాల సంఖ్య 595కు చేరింది.
చంద్ర మృతి
ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, కళాదర్శకుడు మైదం చంద్రశేఖర్ ఏప్రిల్ 29న మరణించారు. చంద్ర పేరుతో ప్రసిద్ధులైన ఆయన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందినవారు. రాజకీయ, సామాజిక, వ్యంగ్య కార్టూన్లతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల రేఖాచిత్రాలను గీశారు. రంగుల కల, చిల్లర దేవుళ్లు, మాభూమి వంటి సినిమాల్లో నటించారు.
ఎవిటా ఫెర్నాండెజ్‌కు అవార్డు
హైదరాబాద్‌కు చెందిన స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్‌కు 29వ యుధ్వీర్ స్మారక పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏప్రిల్ 30న ఆన్లైన్ ద్వారా ప్రదానం చేశారు. భారత స్వాతంత్య్రంలో పాల్గొన్న యుధ్వీర్ ఉర్దూ, హిందీ, మిలాప్ పత్రికలను స్థాపించారు. ఆయన పేరుమీదగా ఈ అవార్డును అందజేస్తున్న కింద రూ.10 లక్షల నగదును అందజేస్తారు.5
వార్తల్లో వ్యక్తులు
జగన్నాథ్
భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) దక్షిణ మధ్య ప్రాంత జోనల్ అధికారిగా ఎ జగన్నాథ్ ఏప్రిల్ 26న బాధ్యతలు చేపట్టారు. దక్షిణ మధ్య జోన్లోకి తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలు వస్తాయి.
ఝంపాలాహిరి
పులిట్జర్ బహుమతి గ్రహీత ఝంపాలాహిరి ఇంగ్లిష్‌లో రచించిన కొత్త పుస్తకం ‘వేర్ అబౌట్స్’ ఏప్రిల్ 27న విడుదలైంది. 2018లో ఇటాలియన్ భాషలో ఆమె రచించిన ‘డోవ్ మి ట్రావో’ నవలకు ఇది అనువాదం.
కిరణ్ మజుందార్ షా
క్యాన్సర్ చికిత్స, పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అయిన యూఎస్‌లోని స్లోన్ మెమోరియల్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ బోర్డులో ట్రస్టీగా బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఏప్రిల్ 28న నియమితులయ్యారు. ఈ బోర్డులోని 52 మంది ట్రస్టీల్లో ఆమె ఒకరు. భారత్ నుంచి ఈ హోదాకు ఎంపికైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఆమె ఈ పదవిలో మూడేండ్లపాటు ఉంటారు.
సోమనాథన్
కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్ ఏప్రిల్ 28న నియమితులయ్యారు. ఆయన 1987 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. కోల్‌కతా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. ఉత్తమ ఐఏఎస్‌గా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆర్థిక శాఖలోని కార్యదర్శుల్లో అత్యంత సీనియర్‌కు ఆర్థిక కార్యదర్శి హోదాను ఇస్తారు.
క్రీడలు
బార్సిలోనా ఏటీపీ విన్నర్ నాదల్
బార్సిలోనా ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్లో స్పెయిన్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ రఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 25న జరిగిన ఫైనల్లో నాదల్ ప్రపంచ ఐదో ర్యాంకర్ స్టెఫనో సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచాడు.
ఆసియా బాక్సింగ్ వేదిక దుబాయ్‌కి
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ వేదికను ఢిల్లీ నుంచి దుబాయ్‌కు మార్చినట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అధ్యక్షుడు అజయ్ సింగ్ ఏప్రిల్ 28న ప్రకటించారు. ఈ టోర్నీ మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగుతంది. కరోనా, ప్రయాణ ఆంక్షల వల్ల టోర్నీ వేదికను మార్చక తప్పలేదు.
పృథ్వీ షా రికార్డు ఫోర్లు
ఐపీఎల్ 14లో ఏప్రిల్ 29న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టాడు. శివమ్ మావి వేసిన తొలి ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టి ఈ రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అజింక్యా రహానె (రాజస్థాన్ రాయల్స్, 2012లో బెంగళూరుపై) తర్వాతి స్థానంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు.
చంద్రో తోమర్
‘షూటర్ దాది’గా పేరు తెచ్చుకున్న వెటరన్ షూటర్ చంద్రో తోమర్ ఏప్రిల్ 30న మరణించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె 60 ఏండ్లు దాటాక షూటర్ పోటీలో అడుగుపెట్టింది. 30కి పైగా వెటరన్ షూటింగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ప్రపంచంలోనే ఎక్కువ వయస్సు కలిగి ఉండి మహిళా షార్ప్ షూటర్‌గా నిలిచిన చంద్రో జీవిత కథ ఆధారంగా ‘సాండ్ కి ఆంఖ్’ పేరుతో హిందీలో సినిమాలో కూడా తీశారు
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు