ఓటర్ల రీత్యా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది?
- కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (సి)
- తాజా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో అన్ని దేశాలు తిరోగమించాయి
- ఈ సూచీలో అగ్రస్థానంలో స్వీడన్ ఉంది
- ఈ సూచీలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది
- భారత్ 120వ స్థానంలో ఉంది
ఎ) 1, 4 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 2, 4
వివరణ: సుస్థిరాభివృద్ధి సూచీని సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ విడుదల చేసింది. భారత్ 60.1 స్కోర్‌ను సాధించి ఈ జాబితాలో 120వ స్థానంలో ఉంది. మొత్తం 165 దేశాలకు ఆ సంస్థ ర్యాంకింగ్ ఇచ్చింది. 2015 నుంచి ఈ సూచీకి సంబంధించి ర్యాంక్‌లు ఇస్తుండగా తొలిసారి అన్ని దేశాలు తిరోగమనాన్ని చూపాయి. కొవిడ్ కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఫిన్లాండ్ ఉంది. 2, 3 స్థానాల్లో వరుసగా స్వీడన్, డెన్మార్క్‌లు నిలిచాయి.
- ఎన్‌ఐఎస్‌హెచ్‌టీహెచ్‌ఏ (నిష్తా) అనేది ఒక? (ఎ)
ఎ) ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం
బి) కొత్త సాఫ్ట్వేర్ సి) కరోనా పరీక్ష విధానం
డి) ఏదీకాదు
వివరణ: ఎన్‌ఐఎస్‌హెచ్‌టీహెచ్‌ఏ (నిష్తా) అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్స్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సమీకృత శిక్షణ ఇస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం. 2019-20లో దీనిని ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. ఇటీవల గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సామర్థ్య పెంపునకు ఒక అవగాహన కుదిరింది. - ‘పుస సాంబ 1850 ఇటీవల’ వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) కరోనాను వేగంగా గుర్తించే పరీక్ష
బి) కొత్త వేరియంట్
సి) కొత్త బియ్యపు రకం డి) ఏదీకాదు
వివరణ: పుస సాంబ 1850 పేరుతో కొత్త బియ్యపు రకాన్ని ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సాంబ మసూరీని మరింతగా వృద్ధి చేసి ఈ కొత్త రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. అధికంగా దిగుబడి రావడంతో పాటు ఎలాంటి క్రిమి సంహారకాలు వినియోగించాల్సిన అవసరం ఈ పంటకు లేదు. దీనిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ర్టాల్లో పండిస్తున్నారు. - ప్రపంచంలో అతి ఎక్కువ మంది శరణార్థులను కలిగి ఉన్న దేశం? (డి)
ఎ) బంగ్లాదేశ్ బి) సిరియా
సి) ఆఫ్ఘనిస్తాన్ డి) టర్కీ
వివరణ: ప్రపంచంలో అతి ఎక్కువ మంది శరణార్థులు టర్కీ దేశంలో ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 82.4 మిలియన్ ప్రజలు శరణార్థులుగా ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద శరణార్థుల శిబిరం కుతుపలాంగ్. ఇది బంగ్లాదేశ్‌లో ఉంది. ఏటా జూన్ 20న ప్రపంచ శరణార్థుల రోజుగా నిర్వహిస్తారు. 1951లో ఐక్యరాజ్యసమితిలో ఒక సమావేశం నిర్వహించారు. ఇది రిఫ్యూజీస్‌కు లేదా శరణార్థులకు సంబంధించింది. ఈ సమావేశం జరిగిన 50 సంవత్సరాల తర్వాత జూన్ 20న వరల్డ్ రిఫ్యూజీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇతివృత్తం-టుగెదర్ ఉయ్ హీల్, లెర్న్, అండ్ షైన్. - ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ అనేది ఏ క్రీడాకారుడి ఆత్మకథ? (బి)
ఎ) అయూబ్ ఖాన్ బి) మిల్కాసింగ్
సి) రొనాల్డో డి) పీటర్
వివరణ: ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ అనేది మిల్కాసింగ్ ఆత్మకథ. ఆయన స్ప్రింట్ దిగ్గజం. ఇటీవల మృతిచెందారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. తుదిపోరులో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. 1956, 1964 ఒలింపిక్స్ పోటీల్లో కూడా ఆయన భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. ఫ్లయింగ్ సిఖ్‌గా ఆయనకు పేరు ఉంది. 1959లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. మిల్కాసింగ్ గోవిందపూర్ అనే గ్రామంలో జన్మించారు. ఇప్పుడు ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది. - కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (సి)
- ఓపెన్ సొసైటీ ప్రైజ్‌ను గెలుచుకుంది కేకే శైలజ
- యునైటెడ్ నేషన్స్ ల్యాండ్ ఫర్ లైఫ్-2021 ప్రైజ్‌ను రాజేశ్వర్ పాఠక్ దక్కించుకున్నారు
- యునైటెడ్ నేషన్స్ ల్యాండ్ ఫర్ లైఫ్-2021 ప్రైజ్‌ను శ్యాం సుందర్ జైనీ దక్కించుకున్నారు
పై వాక్యాల్లో సరైనది
ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) 3
వివరణ: ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకుగాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ‘ఓపెన్ సొసైటీ ప్రైజ్’ను కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి శైలజకు ఇచ్చారు. కరోనా కట్టడికి సమర్థంగా చర్యలు తీసుకున్నందుకు ఆమెకు ఈ అవార్డ్ దక్కింది. అలాగే పర్యావరణవేత్త శ్యాం సుందర్ జైనీ ‘యునైటెడ్ నేషన్స్ ల్యాండ్ ఫర్ లైఫ్-2021 అవార్డ్’కు ఎంపికయ్యారు. ఫ్యామిలియన్ ఫారెస్ట్రీ అనే ఒక సామాజిక పథకాన్ని ప్రారంభించి రాజస్థాన్‌లో 2.5 మిలియన్ మొక్కలను నాటడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ఈ అవార్డ్ లభించింది.
- ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? (ఎ)
ఎ) రోమ్ బి) పారిస్
సి) నైరోబి డి) న్యూయార్క్
వివరణ: ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకు సంబంధించిన 42వ సమావేశం ఇటీవల వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సంస్థ తన సమావేశాలను రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. తన విధానాలు, బడ్జెట్, ఆహార, వ్యవసాయ సంబంధ అంశాలపై నిర్ణయాలు ఈ సమావేశాల్లోనే తీసుకుంటారు. భారత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇందులో పాల్గొన్నారు. దేశంలో అమలవుతున్న పీఎం కిసాన్, కిసాన్ రైలు, ప్రధాన మంత్రి కృషి సించయ్ యోజన తదితర పథకాలను వివరించారు. - గ్రేట్ బారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది? (డి)
ఎ) దక్షిణాఫ్రికా బి) పెరూ
సి) అర్జెంటీనా డి) ఆస్ట్రేలియా
వివరణ: ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రేట్ బారియర్ పగడపు దీవి లేదా గ్రేట్ బారియర్ రీఫ్ ఆస్ట్రేలియాలో ఉంది. దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ‘ప్రమాదంలో ఉన్న’ విభాగంలో చేర్చాలని ఇటీవల యునెస్కో సూచించింది. పగడాల సంఖ్య తగ్గడమే దీనికి కారణం. ప్రస్తుతం ఈ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 53 ప్రదేశాలు ఉన్నాయి. కార్బన్ ఉద్గారాల కట్టడిలో ఆస్ట్రేలియా తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని పర్యావరణవేత్తల ఆరోపణ. ఈ దీవుల వల్ల ఏటా ఆ దేశం నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లను ఆర్జిస్తుంది. పర్యాటక నగదుగా దీనిని చెప్పొచ్చు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో దీనిని 1981లో చేర్చారు. - ఆంటోనియో గుటెరస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? (సి)
ఎ) ఆస్ట్రియా బి) స్వీడన్
సి) పోర్చుగల్ డి) బెల్జియం
వివరణ: ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. 2017 నుంచి ఆయనే ఈ పదవిలో ఉన్నారు. తాజాగా రెండో దఫా కూడా ఆయన ఎన్నికయ్యారు. గతంలో ఆయన పోర్చుగల్ ప్రధానిగా కూడా విధులు నిర్వహించారు. గతంలో ప్రభుత్వాధినేతగా ఉండి సెక్రటరీ జనరల్ అయిన తొలి వ్యక్తి ఆయనే. అలాగే ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం తర్వాత జన్మించిన వారిలో సెక్రటరీ జనరల్ అయిన తొలి వ్యక్తి కూడా ఆయనే. 1949లో ఆయన జన్మించారు. - ఓటర్ల రీత్యా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది? (బి)
ఎ) నిజామాబాద్ బి) మల్కాజిగిరి
సి) లక్షద్వీప్ డి) లఢక్
వివరణ: 2019 జనరల్ ఎలక్షన్స్ అట్లాస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది. దీని ప్రకారం ఓటర్ల రీత్యా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి. దీని ప్రకారం 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మంది పాల్గొన్న నియోజకవర్గం నిజామాబాద్. 17వ లోక్‌సభకు జరిగిన ఈ ఎన్నికల్లో 185 మంది పోటీపడ్డారు. 10,378 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. - ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఒక అత్యున్నత స్థాయి సలహా గ్రూప్‌లో సభ్యుడిగా ఎంపికయిన భారతీయుడు ఎవరు? (డి)
ఎ) రఘురాం రాజన్ బి) కౌశిక్ బసు
సి) అరవింద్ పనగరియా
డి) మాంటెక్‌సింగ్ అహ్లువాలియా
వివరణ: అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు సంయుక్తంగా ఒక ఉన్నత స్థాయి గ్రూప్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో భారత్‌కు చెందిన మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సభ్యుడిగా ఎంపికయ్యారు. కొవిడ్-19, పర్యావరణ మార్పు తదితర అంశాల నేపథ్యంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ గ్రూప్ ఏర్పడింది. దీనికి మరి పంగేత్సు, సెలా పజర్బాసిగోలు, నికొలస్ స్టెర్న్లు నేతృత్వం వహిస్తారు. మాంటెక్ సింగ్ అహ్లువాలియా భారత్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ గ్రూప్‌లో గీతా గోపీనాథ్ కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో ఎకనామిక్ కౌన్సిలర్ అండ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. - ఇటీవల విడుదల చేసిన ప్రపంచ శాంతి సూచీలో భారత్ ఎన్నో ర్యాంక్‌లో నిలిచింది? (సి)
ఎ) 120 బి) 105 సి) 135 డి) 145
వివరణ: ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ శాంతి సూచీలో భారత్ 135వ స్థానంలో ఉంది. ఇందులో ఐస్లాండ్ అగ్రస్థానంలో ఉంది. వివిధ అంశాల ఆధారంగా వివిధ దేశాలకు ర్యాంక్‌లు కేటాయించగా చివరి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉంది. చివరన ఉండటం ఆ దేశానికి ఇది వరుసగా నాలుగో సారి. - రామ్‌ఘర్ విషధారి వైల్డ్‌లైఫ్ శాంక్చువరీకి టైగర్ రిజర్వ్‌గా అనుమతి ఇచ్చారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? (ఎ)
ఎ) రాజస్థాన్ బి) మధ్యప్రదేశ్
సి) అస్సాం డి) తమిళనాడు
వివరణ: రాజస్థాన్‌లోని విషధారి వైల్డ్‌లైఫ్ శాంక్చువరీని టైగర్ రిజర్వ్‌గా గుర్తించేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతి ఇచ్చింది. దీంతో దేశంలో టైగర్ రిజర్వ్‌ల సంఖ్య 52కు పెరిగింది. ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవంగా నిర్వహిస్తారు. దేశంలో ప్రాజెక్ట్ టైగర్‌ను 1973లో ప్రారంభించారు. - ఇటీవల ముగిసిన టెస్ట్ చాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసింది ఎవరు? (బి)
ఎ) బుమ్రా
బి) రవిచంద్రన్ అశ్విన్
సి) సౌథి
డి) పాట్ కమిన్స్
వివరణ: టెస్ట్ చాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. తుదిపోరులో భారత్‌ను ఓడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసింది భారత్‌కు చెందిన రవిచంద్రన్ అశ్విన్. మొత్తం 14 మ్యాచుల్లో అతను 71 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక పరుగులు చేసింది ఆస్ట్రేలియాకు చెందిన మర్నస్ లబుషేన్. అతను మొత్తం 1675 పరుగులు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసింది రహానే. అతను 1159 పరుగులు చేశాడు. - కింది వాటిలో సరైనది ఏది? (సి)
- మైక్రోసాఫ్ట్ సంస్థకు చైర్మన్‌గా సత్య నాదెళ్ల ఎంపికయ్యారు
- మైక్రోసాఫ్ట్ సంస్థకు చైర్మన్, సీఈవోగా వ్యవహరించనున్న తొలి వ్యక్తి సత్య నాదెళ్ల
- మైక్రోసాఫ్ట్ సంస్థకు చైర్మన్, సీఈవోగా వ్యవహరించనున్న రెండో వ్యక్తి సత్య నాదెళ్ల
పై వాటిలో సరైనవి
ఎ) 1 బి) 1, 2 సి) 1, 3 డి) ఏదీకాదు
వివరణ: మైక్రోసాఫ్ట్ సంస్థకు చైర్మన్‌గా ఆ సంస్థ బోర్డ్ సత్య నాదెళ్లను ఎంపిక చేసింది. ఇప్పటికే సంస్థకు ఆయన సీఈవోగా ఉన్నారు. ఇప్పుడు ఈ నియామకంతో చైర్మన్, సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్న రెండో వ్యక్తి ఆయనే. గతంలో ఈ రెండు బాధ్యతలను సంస్థ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నెరవేర్చారు. 2014 నుంచే సంస్థకు సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్నారు. సంస్థకు మూడో చైర్మన్ సత్య నాదెళ్ల. తొలి చైర్మన్‌గా బిల్‌గేట్స్, రెండో చైర్మన్‌గా జాన్ థాంప్సన్‌లు వ్యవహరించారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ ,9849212411
- Tags
- Education News
Previous article
HDFC Bank Parivartan’s ECS Scholarship 2021-22
Next article
కుతుబ్‌షాహీల పరిపాలన వ్యవస్థ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు