ఒక లక్ష్యాన్ని సముపార్జించడానికి తోడ్పడేవి?
- జ్ఞానరంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థుల్లో
ఏ వికాసం జరుగుతుంది? (టీజీటీ-2017)
1) మూర్తిమత్వ వికాసం 2) ఉద్వేగ వికాసం
3) సాంఘిక వికాసం 4) శారీరక వికాసం - బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా విశ్లేషించిన విద్యావేత్త? (టెట్-2018)
1) బెంజిమన్ బ్లూమ్
2) కొమర్రాజు లక్ష్మణరావు
3) జేఎఫ్ క్రో 4) సర్వేపల్లి రాధాకృష్ణన్ - ఉపాధ్యాయ కేంద్ర విద్య కాకుండా శిశుకేంద్ర విద్యగా సాగాలన్నది ఎవరి అభిమతం? (టెట్-2018)
1) మాక్స్‌ముల్లర్ 2) డార్విన్
3) కారల్గ్రూస్ 4) బ్లూమ్ - బోధనా లక్ష్యాలను విశ్లేషించిన ప్రముఖులు? (టీజీటీ-2018)
1) స్కిన్నర్, పావ్లావ్, బ్లూంఫీల్డ్
2) స్కిన్నర్, పావ్లావ్, బ్లూంఫీల్డ్
3) బ్లూమ్స్, క్రాత్‌హాల్, సింప్సన్
4) క్రాత్‌హాల్, సింప్సన్, యశ్పాల్ - మానసిక చలనాత్మక రంగంలోని బోధనా లక్ష్యాలను ఏ ముగ్గురు ప్రచురించారు? (పీజీటీ-2017)
1) సింప్సన్, దవే, క్రాత్‌హాల్
2) బ్లూమ్, మాసియా, క్రాత్‌హాల్
3) మాసియా, క్రాత్‌హాల్, బ్లూమ్
4) దవే, బ్లూమ్, సింప్సన్ - జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ‘టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్: ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ గోల్స్: హ్యాండ్ బుక్-I, కాగ్నిటివ్ డొమైన్’ను ప్రచురించినవారు, సంబంధించిన సంవత్సరం వరుసగా?
1) బెంజిమన్ బ్లూమ్స్, 1956
2) క్రాత్‌హాల్, బ్లూమ్స్, మాసియా, 1964
3) సింప్సన్, దవే, క్రాత్‌హాల్, 1972
4) బెంజిమన్ బ్లూమ్, 1964 - టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ హ్యాండ్‌బుక్-II, ది ఎఫెక్టివ్ డొమైన్ అనే పుస్తకాన్ని రచించినవారు? (టీజీటీ-2017)
1) క్రాత్‌హాల్, బ్లూమ్, మాసియా
2) బెంజిమన్ బ్లూమ్, దవే, మాసియా
3) బెంజిమన్ బ్లూమ్, సింప్సన్, దవే
4) సింప్సన్, దవే, క్రాత్‌హాల్ - భావావేశ రంగం (ఎఫెక్టివ్ డొమైన్)లోని లక్ష్యాలకు సంబంధించిన విశ్లేషణను తెలియజేసినవారు?
1) బెంజిమన్ బ్లూమ్స్-1956
2) క్రాత్‌హాల్, బ్లూమ్స్, మాసియా-1964
3) సింప్సన్, దవే, క్రాత్‌హాల్-1972
4) బెంజిమన్ బ్లూమ్స్-1964 - విద్యావ్యవస్థ సాధించాల్సిన అంతిమ ధ్యేయాలు?
1) ఉద్దేశాలు 2) లక్ష్యాలు
3) గమ్యాలు 4) స్పష్టీకరణలు - ఆశయాల విశదీకరణే? (ఎస్జీటీ-2019)
1) గమ్యం 2) ఉద్దేశం
3) లక్ష్యం 4) స్పష్టీకరణ - విద్యాపరంగా ఊహాజనిత సుదూర గమ్యాలు? (ఎల్పీ 2018)
1) విద్యాదర్శాలు 2) విద్యోద్దేశాలు
3) విద్యాలక్ష్యాలు 4) విద్యాస్పష్టీకరణలు - విద్యాగమ్యాలు అంటే? (టీజీటీ 2017)
1) విషయ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి స్వల్పకాలికాలు
2) పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడేవి స్పల్పకాలికాలు
3) విద్యాప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు
4) బోధనా కృత్యాల రూపకల్పనకు తోడ్పడేవి దీర్ఘకాలికాలు - గమ్యాలనే ఇలా కూడా పిలుస్తారు?
1) ఉద్దేశాలు 2) ధ్యేయాలు
3) లక్ష్యాలు 4) స్పష్టీకరణలు - గమ్యాల (గోల్స్)కు సంబంధించి సరైనవి?
ఎ. పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధమున్న అందరూ కలిసి సాధించాల్సినవి
బి. సాధించడానికి దుర్లభమైనవి
సి. ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత అనేవి ఆధునిక భారతీయ విద్యాగమ్యాలు
డి. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యాప్రణాళిక ద్వారా సాధించాల్సిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు గమ్యాలు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి 4) ఎ, బి, సి, డి - విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల అధ్యయనం ద్వారా విద్యార్థులు కనబర్చాల్సిన స్థూలమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి? (టీజీటీ, టెట్-2018)
1) ఉద్దేశాలు 2) సహజాతాలు
3) ప్రకృతులు 4) వికృతులు - పాఠ్యాంశాల బోధన ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న స్థూలపరమైన ప్రవర్తనా మార్పులు తెలిపేవి? (పీజీటీ-2018)
1) ఉద్దేశాలు 2) స్పష్టీకరణలు
3) గమ్యాలు 4) లక్ష్యాలు - ఏవి విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి? (టీజీటీ-2018)
1) గమ్యాలు 2) ఉద్దేశాలు
3) లక్ష్యాలు 4) ఆదర్శాలు - విద్యాధ్యేయాల నుంచి ప్రభవించినవి? (ఎస్జీటీ-2019)
1) విద్యాదర్శాలు 2) విద్యోద్దేశాలు
3) విద్యాగమ్యాలు 4) విద్యాలక్ష్యాలు - పిల్లలు తమ అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలను లిఖితరూపంలో వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని పెంపొందించడం ఏ స్థాయిలో తెలుగు బోధనోద్దేశం? (ఎస్జీటీ-2019)
1) ప్రాథమిక స్థాయి 2) మాధ్యమిక స్థాయి 3) ఉన్నత స్థాయి 4) స్నాతకోత్తర స్థాయి - ఉద్దేశాలు, గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం నెరపి, ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనామార్పుల్ని సూచించేది?
(టెట్-2018)
1) స్పష్టీకరణలు 2) లక్ష్యాలు
3) ధ్యేయాలు 4) సూక్ష్మరూపాలు - కింది వాటిలో సరికానిది?
1) ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి లేదా ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడనివి- సంవృత లక్ష్యాలు
2) అనేక వ్యాఖ్యల్లో సమాధానం కోరే లక్ష్యాలు- వివృత లక్ష్యాలు
3) అభ్యసన ప్రక్రియకు ముందుగానే పేర్కొనే అభిలషణీయమైన ఫలితం- స్పష్టీకరణ
4) ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి వివృత లక్ష్యాలు - ఒకే పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యాపరిభాషలో ఏమంటారు?
1) గమ్యాలు 2) ఉద్దేశాలు
3) లక్ష్యాలు 4) స్పష్టీకరణలు - ప్రవర్తనా భాగం, పాఠ్యభాగం ఈ రెండూ ముఖ్యభాగాలు దేనిలో ఉంటాయి? (టీజీటీ-2019)
1) విద్యాలక్ష్యం 2) విద్యాధ్యేయం
3) విద్యాగమ్యం 4) విద్యాదర్శం - కింది వాటిలో విద్యాలక్ష్యాల లక్షణం కానిది? (ఎస్జీటీ-2019)
1) పూర్వనిర్ణితాలు
2) విద్యార్థుల ప్రవర్తనారూపంలో చెప్పబడతాయి
3) సామూహికంగా వర్ణింపబడవు
4) కొలవదగని ప్రవర్తనా పరివర్తనలు - స్పష్టీకరణలు (స్పెసిఫికేషన్స్)కి సంబంధించి సరికానిది?
1) విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలు, ఆవయవిక చర్యలను స్పష్టీకరణలు అంటారు
2) విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తనా మార్పులు
3) ఆశించే అభ్యసన ఫలితాలు అని కూడా అంటారు
4) స్పష్టీకరణలనే గమ్యాలు/ధ్యేయాలు అని కూడా అంటారు - స్పష్టీకరణలు లక్షణాలకు సంబంధించి సరికానిది?
1) ఒక పాఠ్యాంశం పిల్లలకు బోధిస్తే దాని ద్వారా పిల్లల నుంచి ఏమి కోరుకుంటామో వాటినే స్పష్టీకరణలు అనవచ్చు
2) స్పష్టీకరణలనే సామర్థ్యాలని పిలుస్తారు
3) విద్యాప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడుతాయి
4) బోధన ప్రణాళికను తయారుచేసుకోవడానికి ఉపకరిస్తాయి - స్పష్టీకరణలు లక్షణాలతో సంబంధంలేనిది?
1) మూల్యాంకనం చేయడానికి
వీలుగా ఉంటాయి
2) రెండు లక్ష్యాల మధ్య భేదాలు
చెప్పడానికి ఉపకరించేవి
3) బోధనాభ్యసన సన్నివేశాల్లో అంతరదృష్టిని సారించడానికి, మూల్యాంకనంలో ప్రశ్నల తయారీకి తోడ్పడుతాయి
4) లక్ష్యాల అర్థాలను పరిమితం చేసేవి - బోధన లక్ష్యాలను ప్రవర్తనారూపంలో వాచ్యం చేసి, బోధన కృత్యానికి ప్రాతిపదికలుగా, అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి? (టీజీటీ-2018)
1) అక్షర చిత్రాలు 2) కల్పనలు
3) ఆలోచనలు 4) స్పష్టీకరణలు - కింది వాటిలో స్పష్టీకరణ లక్షణం? (ఎల్పీ-2018)
1) పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి
2) పూర్వనిర్ణితాలు
3) పరిశీలించదగిన ప్రవర్తనామార్పులను సూచిస్తాయి
4) సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి - విద్యాభ్యసనానికి సాక్ష్యాలు? (ఎస్జీటీ-2019)
- బోధనాభ్యసనకు ప్రాతిపదికలు, బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలు? (టెట్-2018)
1) లక్ష్యాలు 2) స్పష్టీకరణలు
3) గమ్యాలు 4) ఉద్దేశాలు - ఒక లక్ష్యాన్ని సముపార్జించడానికి తోడ్పడేవి? (టెట్-2018)
1) ఉద్దేశాలు 2) గమ్యాలు
3) స్పష్టీకరణలు 4) ప్రాతిపదికలు - ఆలోచించడం, తెలుసుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం మొదలైన సంజ్ఞానాత్మక ప్రక్రియలకు సంబంధించినదిగా ఉండే రంగం?
1) మానసిక చలనాత్మక రంగం
2) భావావేశరంగం
3) జ్ఞానాత్మకరంగం 4) ధార్మికరంగం - జ్ఞానరంగంలోని అంశాల అనుక్రమాల్లో సరైనవి? (టీజీటీ-2018)
1) జ్ఞానం->అవబోధం->
వినియోగం->విశ్లేషణ
2) జ్ఞానం->వినియోగం->
మూల్యాంకనం->విశ్లేషణ
3) జ్ఞానం->అవబోధం->
ఆలోచన->సంశ్లేషణ
4) జ్ఞానం->మూల్యాంకనం->
కౌశలం->కౌతుకం - జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు? (టీజీటీ-2017)
1) గ్రహణం, వ్యవస్థీకరణ, విశ్లేషణ
2) అనుప్రయుక్తం, విశ్లేషణ, సంశ్లేషణ
3) సమన్వయం, అనువర్తన, విశ్లేషణ
4) అనుకరణ, అనువర్తన, సంశ్లేషణ - ఒక సంక్లిష్ట విషయాన్ని సామాన్య భాగాలుగా విభజించి వాటి క్రమాన్ని, వాటి మధ్యగల సంబంధాల్ని గుర్తించగలగడం జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యానికి చెందినది?
1) అవబోధం 2) వినియోగం
3) విశ్లేషణ 4) సంశ్లేషణ - ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వేర్వేరు అంశాలను క్రమపద్ధతిలో చేర్చి, అందులోని సమైక్యభావాన్ని విశదీకరించగలగడం జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యానికి చెందినది?
1) అవబోధం 2) వినియోగం
3) విశ్లేషణ 4) సంశ్లేషణ - బ్లూమ్స్ వర్గీకరణలోని జ్ఞానాత్మక రంగాన్ని (కాగ్నిటివ్ డొమైన్) 2001లో సవరించి నామవాచక పదాలను క్రియాపదాలుగా మార్చినవారు?
1) క్రాత్‌హాల్, మాసియా
2) దవే, క్రాత్‌హాల్
3) అండర్సన్, క్రాత్‌హాల్
4) అండర్సన్, బ్లూమ్స్ - క్రాత్‌హాల్, అండర్సన్‌ల వర్గీకరణంలో అన్నింటికంటే ఉన్నతంగా చూపబడింది?
(పీజీటీ-2018)
1) విలువ కట్టడం 2) మూల్యాంకనం
3) సృజించడం 4) సంశ్లేషణ - క్రాత్‌హాల్, అండర్సన్‌లు సవరించిన కొత్త బ్లూమ్స్ వర్గీకరణలో ఎన్ని రకాల
జ్ఞానాలను పేర్కొన్నారు?
1) 4 2) 3 3) 5 4) 6 - క్రాత్‌హాల్, అండర్సన్‌లు మలివర్గీకరణ (2001)లో సంజ్ఞానాత్మక ప్రక్రియకు సంబంధించిన 6 స్థాయిల ద్వారా మొత్తం ఎన్ని రకాలైన సంజ్ఞానాత్మక ప్రక్రియలను పేర్కొన్నారు?
1) 16 2) 19 3) 24 4) 95 - బ్లూమ్స్ జ్ఞానరంగంలోని లక్ష్యాలు-స్పష్టీకరణలకు సంబంధించి ‘జ్ఞానం’ అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు?
1) అనువదించడం, సమన్వయించడం
2) జ్ఞప్తి, ఊహించడం 3) జ్ఞప్తి, గుర్తించడం
4) అంశవిశ్లేషణ, వినయోగించడం - అనువదించడం, సమన్వయించడం, కొనసాగించడం, ఊహించడం మొదలైనవి భాగమైన లక్ష్యం?
1) అవగాహన 2) వినియోగం
3) అభిరుచి 4) అనుభూతి
Answers
1-1, 2-1, 3-4, 4-3, 5-1,
6-1, 7-1, 8-2, 9-3, 10-1,
11-1, 12-3, 13-2, 14-4, 15-1,
16-1, 17-2, 18-2, 19-1, 20-2,
21-4, 22-3, 23-1, 24-4, 25-4,
26-3, 27-1, 28-4, 29-1, 30-2,
31-2, 32-3, 33-3, 34-1, 35-2,
36-3, 37-4, 38-3, 39-3, 40-1,
41-2, 42-3, 43-1.
లోక్‌నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్ ,వికారాబాద్
- Tags
Previous article
సింగరేణి స్థాపించిన సంవత్సరం?
Next article
శ్వాసకోసపు చేపలు ఏ క్రమానికి చెందినవి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు