న్యాయవిద్యకు రాచమార్గం
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్ఎల్బీ కోర్సు చేయడానికి అఖిల భారత స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). దేశవ్యాప్తంగా మొత్తం 19 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మొదటిసారి క్లాట్ పరీక్ష 2008లో నిర్వహించారు. అప్పటి నుంచి రొటేషన్ పద్ధతిలో ఏదో ఒక న్యాయ విశ్వవిద్యాలయం ప్రతి ఏటా క్లాట్‌ను నిర్వహిస్తుంది.
ఇంగ్లిష్, కాంప్రహెన్షన్
-వొకాబులరీ, ఇడియమ్స్, ఫ్రేజెస్, ఫారెన్ టర్మ్స్, అనాలసిస్, కాంప్రహెన్షన్, గ్రామర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ వంటి గ్రామర్‌కు సంబంధించిన ప్రశ్నలు ఖాళీల రూపంలో ఇస్తారు. గ్రామర్‌కు సంబంధించిన అంశాల కోసం హైస్కూల్ పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, కామన్ ఎర్రర్స్ వంటి వాటిపై దృష్టిసారించాలి. ప్రస్తుతం పరీక్షకు చాలా తక్కువ సమయం ఉన్నందున వొకాబులరీ వంటి లోతైన అంశాలపై దృష్టిసారిస్తే సమయం వృథా అవుతుంది. సాధారణంగా ఉపయోగించే ఇడియమ్స్, ఫ్రేజెస్ పట్టికలు కొంతవరకు పరీక్షకు ఉపయోగపడవచ్చు. కాంప్రహెన్షన్‌కు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది.
జనరల్నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్
-ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కలిపి వస్తాయి. స్టాక్ జీకేకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వర్తమాన వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో 2017, మార్చి నుంచి 2018, మార్చి మధ్య జరిగిన వర్తమాన అంశాలు చాలా ముఖ్యమని అభ్యర్థులు గ్రహించాలి. ఇందుకు మనోరమ ఇయర్ బుక్, మంచి జీకే మ్యాగజైన్లు ఉపయోగపడుతాయి. స్టాక్ జీకేకు భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, నిత్య జీవితంలో ఉపయోగపడే సైన్స్‌కు సంబంధించిన అంశాలు, పుస్తకాలు-రచయితలు, అపూర్వ నిర్మాణాలు-ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి.
గణిత ప్రాథమికాంశాలు
-ఈ విభాగానికి సంబంధించి హైస్కూల్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. క.సా.గు, గ.సా.భా, నిష్పత్తులు, శాతాలు, లాభనష్టాలు, వడ్డీ, సరాసరి, పని-కాలం, దూరం-కాలం, క్షేత్రగణితం, ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలను సాధన చేయడం ద్వారా కచ్చితమైన, నిర్ణీత సమయం లోపల సమాధానాలను గుర్తించవచ్చు.
లీగల్ ఆప్టిట్యూడ్
-ఈ విభాగంలో ప్రశ్నలు లీగల్ రీజనింగ్, లీగల్ ఆప్టిట్యూడ్ నుంచి ఉంటాయి. లీగల్ రీజనింగ్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, చట్టపరమైన సూత్రం ఇచ్చి ప్రశ్నలను అడుగుతారు. అభ్యర్థి చట్టపరమైన సూత్రాన్ని అర్థం చేసుకుని, ఇచ్చిన పరిస్థితికి అన్వయించి సమాధానం గుర్తించాలి. చట్టపరమైన సూత్రాలకు సంబంధించి ఎక్కువగా నేరాలు, ఒప్పందాలు, క్రిమినల్ లా నుంచి ప్రశ్నలు వస్తాయి. గతంలో ఇచ్చిన ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా చట్టపరమైన మౌలిక సూత్రాలపై పట్టు సాధించి మంచి మార్కులు సాధించవచ్చు.
-భారత రాజ్యాంగం, చట్టపరమైన నిబంధనల నుంచి ఎక్కువగా లీగల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా ఉపయోగించే చట్టపరమైన నిబంధనలు, భారత రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలను అభ్యర్థి బాగా అర్థం చేసుకోవాలి.
లాజికల్ రీజనింగ్
-ఈ విభాగానికి సంబంధించి ప్రశ్నలు రక్తసంబంధాలు, కోడింగ్-డికోడింగ్, డైరెక్షన్ టెస్ట్, పజిల్స్, సారూప్యాలు, క్లాక్-క్యాలెండర్, త్రియాంశ తర్కాలు, సిరీస్, ఆడ్ వన్ అవుట్, ప్రకటనలు-అంచనాలు, ప్రకటనలు-నిర్ధారణలు, క్రిటికల్ రీజనింగ్ తదితరాలు. ఈ విభాగానికి సంబంధించి ఎక్కువ మార్కులు సాధించడానికి గత ప్రశ్నపత్రాలతోపాటు నమూనా ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ఏదైనా మంచి లాజికల్ రీజనింగ్ పుస్తకంలో పైన పేర్కొన్న అంశాలను సాధన చేయాలి.
ఉత్తమ ర్యాంక్ కోసం
-గత ఫలితాలను గమనిస్తే 140 మార్కులు సాధించిన విద్యార్థి టాప్ నేషనల్ లా స్కూల్లో ప్రవేశం దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లాట్‌లో మంచి స్కోర్ సాధించడానికి కింది అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. గత పదేండ్ల క్లాట్ ప్రశ్నపత్రాలతోపాటు ఎన్ఎల్ఎస్ఐయూ, నల్సార్, ఎన్‌యూజే గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.
సమయపాలన
-120 నిమిషాల్లో 200 ప్రశ్నలను సాధన చేయడమనేది సవాలుతో కూడుకున్నది. ప్రణాళిక ప్రకారం సన్నద్ధమైతే అది పెద్ద విషయమేం కాదు. లీగల్, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి, జీకే, ఇడియమ్స్, ఫ్రేజెస్, చట్టపరమైన నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కేవలం 15 సెకండ్లలో గుర్తించాలి. సమయపాలనకు ఆన్లైన్ పరీక్ష ఎంతో ఉపకరిస్తుంది. ఎందుకంటే అప్పటివరకు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించావు, ఇంకా ఎన్ని గుర్తించాల్సి ఉంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి, ఏదైనా ప్రశ్న సంక్లిష్టంగా ఉన్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసుకొని చివరలో సమాధానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
పరీక్ష సన్నద్ధతకు వ్యూహం
-పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అభ్యర్థి నిర్దిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. తమ బలాలు, బలహీనతల ఆధారంగా తొలుత ఏ విభాగంలోని ఏ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి, చివరలో ఏ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి, ఏయే ప్రశ్నలకు ఎంత సమయం కేటాయించాలనే వాటిపై ఒక నిర్ధారణకు రావాలి.
నమూనా పరీక్షలు
-పరీక్షను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు సమయపాలన కోసం కనీసం 5 నుంచి 8 నమూనా పరీక్షలు రాయడం చాలా అవసరం. ఇలా చేయడం ద్వారా మొత్తం పరీక్షను ఎదుర్కోవడంతోపాటు అవసరమైన మానసిక సన్నద్ధత లభిస్తుంది.
ఆన్లైన్ పరీక్ష అనుభవం
-ఆన్లైన్ విధానంలో కొన్ని నమూనా పరీక్షలు రాయడం చాలా అవసరం. దీని ద్వారా అన్ని ఆన్లైన్ ఫీచర్లు, నావిగేషన్, మార్కింగ్ మెకానిజం, యూజర్ ఇంటర్ఫేస్ వంటి వాటిపై అవగాహన కలుగుతుంది.
నెగెటివ్ మార్కింగ్
-అంచనా వేసి సమాధానం గుర్తించడానికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. ఎందుకంటే ప్రతి తప్పుడు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. కాబట్టి, అంచనా సమాధానాల ద్వారా మీరు కష్టపడి సాధించిన మార్కులను కోల్పోతారు. అందుకే కచ్చితత్వం ముఖ్యం.
పరీక్ష పేపర్
-మొత్తం మార్కులు -200
-సమయం -2 గంటలు
-బహుళైచ్ఛిక రూపంలో ప్రశ్నలు ఉంటాయి.
సబ్జెక్టులవారీగా ప్రశ్నలు
సబ్జెక్టు ప్రశ్నలు
ఇంగ్లిష్, కాంప్రహెన్షన్ 40
జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 50
గణిత ప్రాథమికాంశాలు
(న్యూమరికల్ ఎబిలిటీ) 20
లీగల్ ఆప్టిట్యూడ్ 50
లాజికల్ రీజనింగ్ 40
ఒక్కో సరైన సమాధానానికి 1 మార్కు కాగా, ఒక తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు