ఎంసెట్ కు గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదు
ఎంసెట్ కు హాజరయ్యే విద్యార్థులకు ప్రింట్ తీసిన ఆన్ లైన్ దరఖాస్తుపై గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు. ఆన్ లైన్ దరఖాస్తుపై విద్యార్థి ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాల్సి ఉండగా, తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్టు చెప్పారు. ఎంసెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. విద్యార్థులు రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులు మాస్క్ ధరించాల్సిందేనని తెలిపారు. విద్యార్థులు ఏదైనా గుర్తింపు కార్డు, హాల్ టికెట్ తోపాటు చిన్నసైజు వాటర్ బాటిల్ , శానిటైజర్ ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. సెషన్ కు 29 వేల మంది చొప్పున మొత్తం ఆరు సెషన్స్‌లో 1.72 లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకుంటామని, మెహిందీ లాంటివి చేతికి పెట్టుకోవద్దని సూచించారు.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






