కీటకాహార హైడ్రోఫైట్ ఏది?
1. పాల్గెట్టి బహుమతి పొందిన శాస్త్రవేత్త?
1) రోనాల్డ్ రాస్ 2) విలియం హార్వే
3) పంచానన్ మహేశ్వరి 4) సలీం అలీ
2. కింది వాటిని జతపర్చండి.
1. ICAR ఎ. ఎల్లాప్రగడ సుబ్బారావు
2. డీఎన్ఏ ద్విసర్పిల నిర్మాణం
బి. ఎంఎస్ స్వామినాథన్
3. పెబ్రయిన్ సి. వాట్సన్, క్రిక్
4. జంతువుల పిండాభివృద్ధి డి. లూయీ పాశ్చర్
5. ఆరియోమైసిన్ ఇ. అరిస్టాటిల్
ఎఫ్. రోనాల్డ్ రాస్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
3) 1-బి, 2-సి, 3-ఇ, 4-డి, 5-ఎఫ్
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-ఎఫ్
3. కింది వాటిలో సరికాని జత?
1) NBRI-లక్నో 2) ICRISAT-హైదరాబాద్
3) ICMR-పుణె 4) IARI-న్యూఢిల్లీ
4. వృక్ష, జంతువుల శిలాజాలు-ముద్రలు, వివిధ రూపాల గురించి అధ్యయనం?
1) ఇకాలజీ 2) సిస్మాలజీ
3) ఆంత్రోపాలజీ 4) పేలియంటాలజీ
5. కృత్రిమ జన్యువును ప్రయోగశాలలో తయారుచేసినది?
1) వాట్సన్, క్రిక్ 2) జేజే మెండల్
3) ఖొరానా 4) లీవెన్ హుక్, రాబర్ట్ హుక్
6. భూమిని శుభ్రపరిచే తోటీలని వేటిని పిలుస్తారు?
1) ఈస్టులు 2) లైకెన్లు
3) పరాన్నజీవ శిలీంధ్రాలు
4) సాప్రోఫైటిక్ శిలీంధ్రాలు
7. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లుగా పిలిచే సూక్ష్మజీవులు?
1) ప్రొటోజోవన్లు 2) డైనోఫ్లాజెల్లేట్లు
3) డయాటమ్‌లు 4) డెస్మిడ్లు
8. జీవ ఎరువులుగా ఉపయోగించే నిమ్నశ్రేణి జీవులు?
ఎ. నాస్టాక్ బి. అనబినా సి. లెగ్యూమ్‌లు డి. క్లోరెల్లా
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
9. లైకెన్లు, తంతురూప శైవలాలు, మాస్, శిలీంధ్రాల్లో సర్వసాధారణ ప్రత్యుత్పత్తి?
1) సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది
2) తంతువులు ముక్కలవడం ద్వారా/ఫ్రాగ్మెంటేషన్ 3) సంయోగబీజాల కలయిక ద్వారా
4) ప్రరోహాల పుట్టుక ద్వారా/బడ్డింగ్
10. ఫెర్న్ మొక్కలు ఏ విభాగానికి చెందినవి?
1) టెరిడోఫైటా 2) బ్రయోఫైటా
3) థాలోఫైటా 4) మెటాఫైటా
11. కింది వాటిలో పుష్పాలను, విత్తనాలను ఏర్పర్చేవి?
ఎ. సైకస్ బి. ఫైనస్ సి. మక్కజొన్న డి. బఠాణీ
1) ఎ, బి 2) ఎ, బి, సి 3) సి, డి 4) ఎ, బి, సి, డి
12. కింది సరైన జతను గుర్తించండి.
1) ప్లాస్టిడ్లు-వృక్షకణం 2) సెంట్రియోళ్లు-జంతుకణం 3) ప్లాస్మిడ్లు-బ్యాక్టీరియా కణం 4) అన్నీ సరైనవే
13. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనని వర్ణద్రవ్యాలను కలిగి ఉండే కణాంగం?
1) క్లోరోప్లాస్ట్ 2) పెరాక్సిజోమ్
3) లైసోజోమ్ 4) రిక్తిక
14. క్రోమోజోమ్‌ల సంఖ్య స్థిరంగా ఉండటానికి, జాతులలో/జనాభాలో వైవిధ్యానికి మూలం?
1) మైటాసిస్ 2) మియాసిస్
3) సమవిభజన 4) అసమవిభజన
15. ఊతవేళ్లను కలిగి ఉండే మొక్కలు?
ఎ. సిరియస్ బి. సెరాటియం
సి. పాండనస్ డి. మక్కజొన్న ఇ. చెరుకు
1) డి, ఇ 2) ఎ, బి, సి
3) బి, సి, డి, ఇ 4) సి, డి, ఇ
16. కీటకాహార హైడ్రోఫైట్?
1) డ్రాసిరా 2) డయోనియా
3) నెపంథిస్ 4) యుట్రిక్యులేరియా
17. ఎల్లోడియా మొక్క ప్రయోగం ద్వారా విద్యార్థులు తెలుసుకునేది?
1) కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరం
2) కాంతి దశకు H2O అవసరం
3) కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరం
4) కిరణజన్య సంయోగక్రియలో O2 విడుదల
18. పర్వతాలను ఎక్కేటప్పుడు గానీ, పరుగెత్తేటప్పుడు గానీ కండరగ్లానికి కారణం?
1) O2 నిల్వ ఉండటం 2) CO2 లేకపోవడం
3) లాక్టికామ్లం ఏర్పడటం 4) గ్లూకోజ్ స్థాయి పెరగడం
19. అంటు కట్టడానికి ఉపయోగించే ఎన్నుకున్న లక్షణాలుగల, వేర్లు లేనటువంటి కొమ్మను ఏమని పిలుస్తారు?
1) స్టోలన్ 2) స్టాక్ 3) సయాన్ 4) సక్కర్
20. కింది వాటిలో రైజోమ్ శాఖీయోత్పత్తికి తోడ్పడేది?
ఎ. అల్లం బి. పులకంద సి. కరివేపాకు డి. పసుపు
1) ఎ, బి, డి 2) ఎ, సి 3) ఎ, బి, సి, డి 4) ఎ, డి
21. వాయు పరాగసంపర్కం/ఎనిమోఫిలిని చూపే మొక్కలు?
1) గడ్డిజాతులు 2) పప్పుధాన్యాలు
3) ఫెర్న్మొక్కలు 4) మాస్ మొక్కలు
22. తోళ్లను శుద్ధి చేయడానికి ఉపయోగించే ముదురు గోధుమ రంగు కర్బన సమ్మేళనాలు?
1) ఆల్కలాయిడ్ 2) గ్లూకోసైడ్లు
3) రెజిన్లు 4) టానిన్లు
23. కింది వాటిలో కృత్రిమ దారం కానిది?
1) ఆక్రలిన్ 2) నైలాన్ 3) సిల్క్ 4) పాలిస్టర్
24. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) డెడ్లీనైట్ షేడ్ – అట్రోపా 2) పాక్స్గ్లవ్ – డిజిటాలిస్
3) కేంపర్ – ఆసిమమ్ 4) రిసర్పిన్ – సింకోనా
25. కింది వాటిని సరిగా జతపర్చండి.
1. మార్ఫిన్ ఎ. కార్డమస్ టింక్టోరియస్
2. నువ్వులు బి. సిసామమ్ ఇండికం
3. రొట్టె గోధుమ సి. ట్రిటికం వల్గేర్
4. సాలు డి. ఫోరియా రొబస్టా
5. సాఫ్లవర్ ఇ. పపావర్ సోమ్నిఫెరమ్
ఎఫ్. ట్రిటికం ఈస్టివం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-ఇ, 2-బి, 3-ఎఫ్, 4-ఎ, 5-డి
3) 1-ఇ, 2-బి, 3-ఎఫ్, 4-డి, 5-ఎ
4) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి, 5-ఎ
26. కింది వాటిలో వైరస్‌కి సంబంధించని వ్యాధి?
1) మశూచి 2) రుబెల్లా 3) టుంగ్రో 4) ప్లేగు
27. జలప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు?
1) నిమటోడ్లు 2) సీలెంటిరేటాలు
3) మొలస్కాలు 4) ఇకైనోడర్మేటాలు
28. కింది వాటిలో శీతల రక్త జంతువులు కానివి?
1) చేప, సాలమాండర్ 2) సరీసృపాలు
3) పక్షులు, క్షీరదాలు 4) 2, 3
29. లార్వాదశలో పృష్ఠవంశం తోకకు పరిమితమై, ప్రౌఢ దశలో అది లోపించిన జీవులు?
1) ఇఖైనోడర్మేటాలు 2) యూరోకార్డేటాలు
3) సెఫలోకార్డేటాలు 4) వర్టిబ్రేట్లు
30. మెగ్గాట్ అని దేనికి పేరు?
1) దోమ లార్వా 2) కప్ప లార్వా
3) ఈగ లార్వా 4) క్యూలెక్స్ దోమ ప్రౌఢదశ
31. కప్ప టాడ్‌పోల్ లార్వా రూపవిక్రియ జరుగడానికి ఉపయోగపడే హార్మోన్?
1) ఇన్సులిన్ 2) గ్లూకగాన్
3) థైరాక్సిన్ 4) వాసోప్రెస్సిన్
32. క్లోనింగ్ జీవి డాలీ సృష్టికర్త ఎవరు?
1) ఇయాన్ విల్మట్ 2) అండర్సన్
3) రోజాలిన్ 4) స్కాటిస్
33. కకూన్లను వేడినీటిలో ఉంచి చంపివేయడాన్ని ఏమని పిలుస్తారు?
1) రీలింగ్ 2) స్టిప్పింగ్ 3) గైనేజర్ 4) ట్విస్టర్
34. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) ఎపికల్చర్ – తేనెటీగల పెంపకం
2) సెరికల్చర్ – పట్టుపురుగుల పెంపకం
3) హార్టికల్చర్ – ఉద్యానవన మొక్కల పెంపకం
4) ఫ్లోరికల్చర్ – కలపనిచ్చే మొక్కల పెంపకం
35. NECCను విస్తరించండి.
1) National Egg Co-operative Council
2) National Egg Co-ordination Committee 3) National Empowerment and Co-ordination Committe
4) National Egg and Correlated Council
36. తేనెలో ఉండే చక్కెర?
1) ఫ్రక్టోజ్ 2) సుక్రోజ్ 3) మాల్టోజ్ 4) గ్లూకోజ్
37. ఉన్నిలోని వివిధ రకాల చెత్తను తొలిగించడాన్ని ఏమంటారు?
1) కార్డింగ్ 2) బ్లీచింగ్ 3) సార్టింగ్ 4) ఊల్ క్లాఫింగ్
38. కింది వాటిలో ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమానికి సంబంధించినది?
1) పాల ఉత్పత్తి 2) చేపల ఉత్పత్తి
3) గొర్రెలు, మేకల పెంపకం 4) పైవన్నీ
39. నిల్వ ఉన్న చేపలను పాడుచేసే బ్యాక్టీరియా?
1) అసిటోబాక్టర్ 2) బాసిల్లస్
3) జాంథోమోనాస్ 4) క్లాస్ట్రీడియం
40. స్పంజికా చూషక రక ముఖభాగాలు కలిగినవి?
1) చిలుక, సాలీడు 2) ఈగలు, తేలు
3) సీతాకోక చిలుక, ఈగ 4) ఏదీకాదు
41. కింది వాటిలో ఆమ్నివోర్స్ను గుర్తించండి.
1) పులి, నక్క, పిల్లి
2) కాకి, బొద్దింక, పిచ్చుక
3) ఆవు, మేక, ఎలుగుబంటి
4) కుక్క, గబ్బిలం, ఆవు
42. చీమలు కుడితే వచ్చే మంటకు కారణం?
1) ఎసిటికామ్లం 2) ఫార్మికామ్లం
3) ఆస్కార్బికామ్లం 4) సిట్రికామ్లం
43. కంటిలోని వెలుపలి పొర?
1) నేత్ర పటలం 2) దృఢస్థరం
3) రక్తపటలం 4) ఫోవియా
44. కింది వాటిలో కంటికి సంబంధించిన వ్యాధి?
1) మయోపియా 2) వర్ణాంధత్వం
3) హైపర్ మెట్రోపియా 4) పైవన్నీ
45. స్టేపిస్ ఏ చెవిలో ఉండే ఎముక?
1) వెలుపలి చెవి 2) మధ్య చెవి
3) లోపలి చెవి 4) త్వచాగహనం
46. చర్మంలోని బాహ్యస్తరంలో లేనిది?
1) కార్నియాస్తరం 2) మాల్ఫీజియన్స్తరం
3) సెచెసియస్ 4) గ్రాన్ని
47. కింది వాటిలో సూక్ష్మజీవుల ప్రభావం వల్ల కలుగని చర్మవ్యాధి?
1) తట్టు 2) గజ్జి 3) మొటిమలు 4) పెల్లాగ్రా
48. మానవునిలో దంతసూత్రం?
1) 2122/2122 2) 2123/2123
3) 4243/4243 4) 4226/4226
49. నాలుక అంచులు గుర్తించే ఆహారపు రుచి?
1) చేదు 2) పులుపు 3) హాచింగ్ 4) తీపి
50. జీర్ణాశయంలో ఆహారం లేనప్పుడు ఆకలిని కలిగింపజేసే హార్మోన్?
1) లెప్టిన్ 2) థైరాక్సిన్ 3) గ్రీలిన్ 4) కోలిసిస్టోకైనిన్
51. కొవ్వుల ఎమల్సీకరణంలో పాల్గొనే పైత్యరసంలో ఉండే వర్ణకాలు?
1) ట్రిప్సిన్లు 2) సోడియం కోలెట్లు
3) అమైలేజ్లు 4) ఏదీకాదు
52. కింది వాటిలో సరికాని జత?
1) వానపాము-చర్మశ్వాసక్రియ
2) బొద్దింక-వాయునాళ శ్వాసక్రియ
3) సరీసృపాలు-పుపుస శ్వాసక్రియ
4) పక్షులు-వాయునాళ శ్వాసక్రియ
53. శ్వాసించేటప్పుడు మానవునిలో వాయు రవాణా మార్గాన్ని గుర్తించండి?
1)బాహ్యనాసికారంధ్రం-నాసికాకుహరం-అంతరనాసికారంధ్రం-గ్రసని-స్వరపేటిక-వాయునాళం-శ్వాసనాళం-శ్వాసనాళిక-వాయుగోణులు
2) బాహ్యనాసికా రంధ్రం-అంతరనాసికా రంధ్రం-స్వరపేటిక-గ్రసని-శ్వాసనాళిక-వాయునాళం-వాయుగోణులు (ఊపిరితిత్తులు)
3) నాసికా కుహరం-బాహ్యనాసికా రంధ్రం-అంతరనాసికా రంధ్రం- గ్రసని-స్వరపేటిక- శ్వాసనాళిక-శ్వాసనాళం-వాయుగోణులు
4) బాహ్యనాసికా రంధ్రం- నాసికా కుహరం-అంతరనాసికా రంధ్రం- స్వరపేటిక- గ్రసని- వాయునాళం- శ్వాసనాళిక- శ్వాసనాళం-వాయుగోణులు
54. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి తోడ్పడేది?
1) థ్రాంబోకైనేజ్ 2) ప్రోథ్రాంబిన్
3) థ్రాంబిన్ 4) హెపారిన్
55. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
ఎ. ఎర్రరక్త కణాలు (1 cmm) – 4.5-5.5X106
బి. ఎర్రరక్త కణాల జీవితకాలం – 120 రోజులు
సి. ల్యూకోసైట్ల జీవితకాలం – 12-13 రోజులు
డి. సూక్ష్మరక్షక భటులు – న్యూట్రోఫిల్స్
ఇ. పారిశుద్ధ్య కార్మికులు – లింఫోసైట్లు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి, ఇ
56. మూత్రపిండం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం?
1) న్యూరాన్ 2) భౌమన్ గుళిక
3) నెఫ్రాన్ 4) గ్లోమరులస్
57. మూత్రం లేతపసుపురంగులో ఉండటానికి కారణమైన యూరోక్రోమ్ దేని నుంచి ఏర్పడుతుంది?
1) వాసోప్రెస్సిన్ 2) యూరికామ్లం
3) క్రియాటిన్ 4) హీమోగ్లోబిన్
58. కింది వాటిని సరిగా జతపర్చండి.
1. సీలెంటిరేటా ఎ. జలప్రసరణ కుల్యావ్యవస్థ
2. ఆర్థ్రోపొడా బి. రెనెట్ కణాలు
3. ఇఖైనోడర్మేటా సి. నీటి ప్రసరణ కణాలు (అన్ని)
4. నిమటోడా డి. జ్వాలాకణాలు
5. ప్లాటిహెల్మింథిస్ ఇ. మాల్ఫీజియన్ నాళికలు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
2) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-డి
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-డి, 5-బి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి, 5-ఇ
59. పునరుత్పత్తి/రీజనరేషన్ చెందే జీవి?
1) సముద్ర నక్షత్రం 2) ప్లనేరియా
3) వానపాము 4) పైవన్నీ
60. మానవ శుక్రకణంలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య?
1) 22 జతలు 2) 1 జత 3) 23 జతలు 4) 23
61. పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్?
1) ఈస్ట్రోజెన్ 2) టెస్టోస్టిరాన్
3) ప్రొజెస్టిరాన్ 4) బ్యూటాడయీన్
62. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) కుందేలు గర్భావధికాలం 21-22 రోజులు
2) గుర్రం గర్భావధికాలం 330 రోజులు
3) ఏనుగు గర్భావధికాలం 600 రోజులు
4) కుక్క గర్భావధికాలం 63 రోజులు
63. వడదెబ్బ తగిలిన మనిషిలో పనిచేయని మెదడు భాగం?
1) ద్వారగోర్థం 2) హైపోథాలమస్
3) మస్తిష్కం 4) పెంజెల్లం
64. దగ్గడం, తుమ్మడం, మింగడం, వాంతులు చేసుకోవడంలాంటి ప్రతిచర్యలను నియంత్రించేది?
1) సెరిబ్రం 2) సెరిబెల్లం
3) మజ్జాముఖం 4) పైవన్నీ
65. హృదయ కండరాల చలనం, రక్తనాళాల్లో రక్తప్రసరణ మొదలైన చర్యలను నియంత్రించేది?
1) వెన్నుపాము 2) స్వయంచోదిత నాడీవ్యవస్థ
3) కేంద్రనాడీ వ్యవస్థ 4) పరిధీయ నాడీవ్యవస్థ
66. నాడీ కణాలకు పోషక పదార్థాలను అందించేవి?
1) గ్లియల్ కణాలు 2) సైటాన్
3) ఆక్డాన్స్ 4) డెండ్రైట్స్
67. ప్రథమ చికిత్సకు మూలపురుషుడు?
1) ఇస్మార్క్ 2) లూయీపాశ్చర్
3) రాబర్ట్ హుక్ 4) స్పాల్లాంజనీ
68. నాగుపాము, కట్లపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది?
1) నాడీ వ్యవస్థ 2) రక్తప్రసరణ వ్యవస్థ
3) కండర వ్యవస్థ 4) పైవన్నీ
69. ఓఆర్ఎస్ను విస్తరించండి.
1) ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్
2) ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్
3) ఓరల్ రీహైడ్రేషన్ షుగర్
4) ఓరల్ రీహైడ్రేషన్ సాల్వెంట్
70. పోలియో వ్యాక్సినేషన్‌ను కనుగొన్నవారు?
1) రోనాల్డ్ రాస్ 2) జోనస్ సాల్క్
3) ఆల్బర్ట్ సాల్క్ 4) పై అందరు
71. సముద్రంలో ప్రాథమిక ఉత్పత్తిదారులు?
1) డయాటమ్‌లు 2) ప్రొటోజోవన్లు
3) యూగ్లినాయిడ్లు 4) అన్నీ
72. నత్రజని స్థాపనలో పాల్గొనే సూక్ష్మజీవులు?
1) రైజోబియమ్ 2) అజటోబాక్టర్
3) అజోస్పెరిల్లమ్ 4) పైవన్నీ
73. ఆడ క్యూలెక్స్ దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధి?
1) ఫైలేరియా 2) చికున్ గున్యా
3) డెంగ్యూ 4) మలేరియా
74. వేరుశనగలో వచ్చే టిక్కా తెగులు వ్యాధి జనకం?
1) వైరస్ 2) శిలీంధ్రం 3) బ్యాక్టీరియా 4) ప్రియాన్
75. కింది ఆహార గొలుసులోని హెర్బివోర్లను గుర్తించండి.
ఎ. గడ్డి->మిడత->కప్ప->పాము->గద్ద
బి. మొక్కలు->మేక->తోడేలు->పులి
సి. గడ్డి->కుందేలు->నక్క->పులి
1) మిడత, కప్ప, నక్క 2) కప్ప, తోడేలు, నక్క
3) మిడత, మేక, కుందేలు 4) గద్ద, పులి
76. సముద్ర ఆవరణ వ్యవస్థలో కాంతి రహిత మండలం?
1) యూఫోటిక్ మండలం 2) అబైసల్ మండలం
3) బెథియల్ మండలం 4) లిమ్నోటిక్ మండలం
77. ఏ ఆవరణ వ్యవస్థలో శక్తి సంబంధ పిరమిడ్ నిటారుగా ఉంటుంది?
1) అడవి 2) గడ్డిమైదానం 3) కొలను 4) పైవన్నీ
78. ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుతారు?
1) ఏప్రిల్ 22 2) మార్చి 22
3) జనవరి 22 4) నవంబర్ 22
79. బిష్ణోయి ఉద్యమ రూపకర్త?
1) సుందర్‌లాల్ బహుగుణ 2) వందనాశివ
3) అమృతాదేవి 4) రేచల్
80. గ్రీన్హౌస్ ఎఫెక్ట్‌కు కారణమయ్యే వాయువు?
1) CO2 2) CH4 3) H2S 4) NO2
81. IUWCని విస్తరించండి.
1) International Union for Wildlife Conservation
2) International Union for Water life Conservation
3) Inter state Union for Wildlife Conservation
4) ఏదీకాదు
82. రెడ్ డాటా బుక్‌ను ప్రచురించే సంస్థలు?
1) ZSL, WWF 2) WWF, IUWC
3) IRRI, IUCN 4) IUWC, ZSL
83. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు-2012 ప్రకారం తెలంగాణలో అంతరించిపోతున్న జంతువులు?
1) సాలీడు, బట్టమేక పక్షి 2) రాబందు, నెమలి
3) సాలీడు, తెల్లపులి 4) పాలపిట్ట, రాబందు
84. ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యేవి?
1) మీథేన్ 2) క్లోరోఫ్లోరో కార్బన్స్
3) నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లు 4) ఏరోసాల్స్
85. పాకాల వన్యసంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
1) కరీంనగర్ 2) ఆదిలాబాద్
3) వరంగల్ 4) నిజామాబాద్
86. దీర్ఘకాలిక పంటను గుర్తించండి.
1) మినుములు 2) పెసలు
3) అవిసెలు 4) కందులు
87. ఖరీఫ్ పంటను గుర్తించండి.
1) జొన్న, పత్తి 2) ధనియాలు, ఆవాలు
3) బార్లీ, శనగలు 4) జీలకర్ర, శనగలు
88. విశ్వధాన్యపు పంటగా పేరొందినది?
1) గోధుమ 2) వరి 3) మక్కజొన్న 4) బార్లీ
89. వరిలో వచ్చే శిలీంధ్ర తెగులును గుర్తించండి.
ఎ. ఆకుమచ్చ తెగులు బి. బ్లాస్ట్ తెగులు
సి. ైబ్లెట్ తెగులు డి. టుంగ్రోవైరస్ తెగులు
1) ఎ, సి 2) బి, డి 3) ఎ, బి 4) ఎ, బి, సి, డి
90. కింది వాటిలో రైతులకు సహాయకారులుగా ఉండేవి?
ఎ. వానపాము బి. చీమలు సి. ట్రైకోగామా డి. ట్రైకోడెర్మా
1) ఎ, సి 2) ఎ, డి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
91. కొత్త పత్రాలు, పుష్పాలు వేగంగా రావడానికి కారణమైన స్థూలపోషకం?
1) పొటాషియం 2) ఫాస్ఫరస్
3) నత్రజని 4) మెగ్నీషియం
92. పంచగవ్య, వర్మీ కంపోస్టు, జీవామృతం ఉపయోగం?
1) నేలలో పోషక పదార్థాలను పెంచుతాయి
2) సూక్ష్మజీవ నాశకాలు 3) కృత్రిమ ఎరువులు
4) కృత్రిమ రసాయనాలు
93. కింది వాటిలో మిత్ర కీటకాలు?
1) సాలెపురుగు, డ్రాగన్ైఫ్లె 2) క్రిసోపా, లేడీబర్డ్ బీటిల్
3) జస్సిడ్స్, ట్రిప్స్ 4) 1, 2
94. హంస, ఫల్గుణ, స్వర్ణ, రవి, జయ, సాంబ మొదలైనవి ఏ పంట రకాలు?
1) జొన్న 2) గోధుమ 3) వరి 4) వేరుశనగ
95. పండ్ల రసాలను నిల్వచేయడానికి ఉపయోగించే రసాయనం?
1) పొటాషియం మెటా బైసల్ఫేట్
2) సోడియం బైకార్బొనేట్
3) సోడియం గ్లుటామేట్ 4) సిట్రికామ్లం
96. AGMARK (అగ్మార్క్) విధి?
1) ఆహారపదార్థాల నాణ్యతను తెలుపడం
2) ఆహారపదార్థాల ఉత్పత్తి 3) నూనెగింజల ఉత్పత్తి 4) విత్తనోత్పత్తిని తగ్గించడం
97. ఎలుకలను చంపడానికి వాడే రసాయనం?
1) అమ్మోనియం ఫాస్ఫైడ్ 2) జింక్ ఫాస్ఫేట్
3) జింక్ సల్ఫేట్ 4) 1, 2
98. ధృవ ప్రాంతాల్లో మంచుతో కట్టే ఇండ్లను ఏమని పిలుస్తారు?
1) గుడారం 2) మంచె
3) ఇగ్లూలు 4) బోటు ఇల్లు
99. తేనెటీగలకు సంబంధించి సరైన వ్యాఖ్య?
ఎ. సాంఘిక కీటకాలు
బి. శరీర ఉదరభాగంలో మైనపు సంచులు ఉంటాయి
సి. తేనెటీగల విషాన్ని కీళ్లనొప్పుల నివారణ మందుల్లో ఉపయోగిస్తారు
డి. వీటి మైనం కొవ్వొత్తులు, పాలిష్ తయారీలో వాడుతారు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి, డి 4) పైవన్నీ సరైనవే
100. చీడపురుగులను నియంత్రించడానికి అనుసరించే పొగచూరించడం పద్ధతిలో వాడే రసాయనం?
1) ఇథలీన్ 2) అల్యూమినియం ఫాస్ఫైడ్
3) మలాథియాన్ 4) డీడీటీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు