దేశంలో సిక్కింను ఎన్నో రాష్ట్రంగా ఏర్పాటు చేశారు?
1. భారతదేశ భూభాగపరిధి గురించి రాజ్యాంగంలో వివరణ ఎక్కడ ఉన్నది?
1) మొదటి భాగం -ఆర్టికల్స్. 1 నుంచి 4
2) మొదటి భాగం -ఆర్టికల్స్ 1 నుంచి 5
3) మొదటి భాగం – ఆర్టికల్స్ 2 నుంచి 4
4) మొదటి భాగం – ఆర్టికల్స్ 1 నుంచి 6
2. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) భారతదేశం సిద్ధాంతపరమైన సమాఖ్యను కలిగి ఉన్నది.
బి) భారతదేశం పరిపాలనా పరమైన సమాఖ్యను కలిగి ఉన్నది
సి) రాజ్యాంగంలో యూనియన్ అనే పదాన్ని చేర్చాలని డా. బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.
డి) యూనియన్ అనే పదాన్ని కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి
3 రాజ్యాంగంలోని 1ద ఆర్టికల్‌లో భారతదేశాన్ని కింది విధంగా పేర్కొన్నారు?
1) యూనియన్ ఆఫ్ స్టేట్స్
2) ఫెడరల్ స్టేట్స్
3) కలెక్టివ్ ఆఫ్ స్టేట్స్
4) అగ్రిమెంట్ ఆఫ్ స్టేట్స్
4. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.
ఎ) భారతదేశంలో ఒక రాష్ట్రం ఎన్ని రాష్ర్టాలుగానైనా విడిపోవచ్చు
బి) భారత రాజ్యాంగంలో ‘సమాఖ్య’ అనే పదాన్ని ఉపయోగించారు
సి) భారతదేశం నుంచి ఏ ఒక్క రాష్ట్రం విడిపోయే వీలులేదు
డి) భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేని సమాఖ్యగా అంబేద్కర్ పేర్కొన్నారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
5. సమాఖ్య విధానం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్బాగం అని 1994లో ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
1) బాబూలాల్ పరాటే Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు
2) ఎస్ఆర్ బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) చిరంజిత్ లాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) అశోక్ కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
6. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 1 ప్రకారం భారత భూభాగం అంటే భారత్‌లో ఉన్న రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
బి) ఆర్టికల్ 2 ప్రకారం పార్లమెంటు కొత్త శాసనాన్ని రూపొందించి ఇతర భూభాగాలను భారత్‌లో విలీనం చేయవచ్చు
సి) అంతర్జాతీయ న్యాయసూత్రాలను అనుసరించి సార్వభౌమ రాజ్యమైన భారతదేశం విదేశీ భూభాగాలను అర్జించవచ్చు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
7. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1960లో ‘బెరుబారి’ ప్రాంతాన్ని మనదేశం నుంచి పాకిస్థాన్‌కు బదిలీ చేశారు.
బి) 1954లో ఫ్రెంచి వారి నియంత్రణ నుంచి విముక్తి చెందిన పాండిచ్చేరి భారత్‌లో విలీనమైంది
సి) 1961లో పోర్చుగీసు వారి నియంత్రణ నుంచి విముక్తి చెందిన గోవా భారత్‌లో విలీనమైంది.
డి) 1974 కంటే ముందు సిక్కిం చోగ్యాల్ రాజు పరిపాలనలో ఉండేది.
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
8. ఏ రాజ్యాంగ సవరణ చట్టం మనదేశం సిక్కింకు సహరాష్ట్ర (Associate State) హోదా కల్పించింది?
1) 31వ రాజ్యాంగ సవరణ చట్టం 1973
2) 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1974
3) 34వ రాజ్యాంగ సవరణ చట్టం 1974
4) 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1974
9. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కిం రాష్ర్టానికి గల ‘సహరాష్ట్రహోదా’ను రద్దు చేసి భారతదేశంలో 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు?
1) 36 రాజ్యాంగ సవరణ చట్టం 1975
2) 37వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
3) 40వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
4) 41వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఒక రాష్ట్రం భూభాగాన్ని విస్తరింప చేయడం
బి) ఒక రాష్ట్రం భూభాగాన్ని తగ్గించడం
సి) రాష్ట్రం సరిహద్దులను మార్పులు చేర్పులకు గురి చేయడం
డి) రాష్ట్రం పేరును మార్పు చేయడం
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) బి,సి
11. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ప్రవేశ పెట్టాలి
బి) ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు
సి) ఈ బిల్లును పార్లమెంటు 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది
డి) పునర్వ్యవస్థీకరించే రాష్ట్రం అభిప్రాయాన్ని రాష్ట్రపతి లాంఛనంగా తెలుసుకోవాలి
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి
12. ఆర్టికల్ 3ప్రకారం ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు’ను రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పంపినపుడు శాసనసభ తన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత కేంద్రం బిల్లులో మార్పులు చేసినప్పటికీ తిరిగి రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పునిచ్చింది?
1) బాబులాల్ పరాటే Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు
2) ఎస్.ఆర్.బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
3) ఎక్సెల్ వేర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) రతన్‌లాల్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు
13. 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ద్వారా రాజ్యాంగంలో జరిగిన మార్పులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) రాజ్యాంగంలో గల ఆర్టికల్, 2(ఎ) ను తొలగించారు
బి) రాజ్యాంగంలో గల 10వ షెడ్యూల్‌ను తొలగించారు
సి) రాజ్యాంగానికి 9(ఎ) షెడ్యూల్‌ను చేర్చారు
డి) రాజ్యాంగానికి ఆర్టికల్ 371 (ఎఫ్)ను చేర్చారు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
14. విదేశీ భూభాగాలను భారత్‌లో విలీనం చేయాలన్నా భారత్‌కు చెందిన భూభాగాన్ని విదేశాలకు బదిలీ చేయాలన్నా తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) కేశవానంద భారతి Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు
2) బెరుబారి Vs యూనియన్ ఆఫ్ ఇండియా
3) నర్గీస్ మీర్జా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
4) బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
15. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1958లో భారత్ -పాకిస్థాన్‌ల మధ్య కొన్ని భూభాగాల పరస్పర మార్పిడికి ఒప్పందం జరిగింది
బి) పాకిస్థాన్ ఆధీనంలోని ‘కూచ్ బీహార్’
ప్రాంతాన్ని భారత్‌కు బదిలీ చేయడం జరిగింది
సి) భారత్ ఆధీనంలోని బెరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు బదిలీ చేయడం జరిగింది
డి) భారత్ ఆధీనంలోని చిట్టగాంగ్ ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు బదిలీ చేయడం జరిగింది
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
16. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత్ ఆధీనంలోని బెరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు బదిలీ చేయడం జరిగింది.
1) 8వ రాజ్యాంగ సవరణ చట్టం 1958
2) 9వ రాజ్యాంగ సవరణ చట్టం 1960
3) 10వ రాజ్యాంగ సవరణ చట్టం 1961
4) 13వ రాజ్యాంగ సవరణ చట్టం 1963
17. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని భూభాగాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) పార్ట్ -ఎ, రాష్ట్రాలు 9 ఉన్నాయి
బి) పార్ట్-బి రాష్ర్టాలు 9 ఉన్నాయి
సి) పార్ట్-సి రాష్ర్టాలు 10 ఉన్నాయి
డి) పార్ట్-డి రాష్ర్టాలు 1 ఉన్నాయి
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
18. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) రాబర్ట్ రిస్లే నివేదిక ప్రకారం బెంగాల్ రాష్ట్ర విభజన జరిగింది
బి) 1905లో బెంగాల్‌ను విభజించిన
గవర్నర్ జనరల్ – లార్డ్ కర్జన్
సి) 1911లో బెంగాల్ విభజనను రద్దు
చేసిన గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్
డి) 1919లో బెంగాల్ విభజనపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడు -అట్లీ
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
19. కోస్తా ఆంధ్ర – రాయలసీమ నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1937 జనవరి 16
2) 1937 మార్చి 16
3) 1937 సెప్టెంబర్ 16
4) 1937 నవంబర్ 16
20. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) శ్రీబాగ్ అనేది మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు గృహం పేరు
బి) శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్ర రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలి
సి) శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి
డి) 1942లో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సర్.విజయ్ క్రిప్స్మిషన్ను కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు.
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
21. భాషా ప్రయుక్త ప్రావిన్సుల కమిటీకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఈ కమిటీని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఏర్పాటు చేశారు
బి) ఈ కమిటీకి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన ఎస్.కె.థార్ అధ్యక్షుడిగా వ్యవహరించారు
సి) ఈ కమిటీ 1948, జూన్ 17న ఏర్పడింది
డి) ఈ కమిటీ తన నివేదికను 1950 జనవరి 3న సమర్పించినది
1) ఎ, బి, సి, 2) ఎ, బి, సి,డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
22. ఎస్.కె. థార్ కమిటీలో గల సభ్యులను గుర్తించండి?
1) చిరంజిత్లాల్ శ్రీపాదశాస్త్రి ముఖర్జీ
2) ఎస్.ఎన్ మిశ్రా, పట్టాభి సీతారామయ్య
3) పన్నాలాల్, జగత్నారాయణ్ లాల్
4) శ్రీమన్నారాయణ్ ఆగర్వాల్, కె.ఎం.ఫణిక్కర్
23. 1948 డిసెంబర్లో జైపూర్ కాంగ్రెస్ సమావే శంలో ఏర్పాటు చేసిన రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌లో లేని సభ్యుడిని గుర్తించండి?
1) జవహర్లాల్ నెహ్రూ
2) హృదయనాథ్ కుంజ్రూ
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) భోగరాజు పట్టాభి సీతారామయ్య
24. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) 1953 ఫిబ్రవరి 7న కైలాస్నాథ్ వాంఛూ కమిటీ ఏర్పడింది
బి) కైలాస్నాథ్ వాంఛూ కమిటీ ప్రత్యేక ఆంధ్ర విధి విధానాలను నిర్దేశించింది.
సి) ఎస్.ఎన్. మిశ్రాకమిటీ సిఫారసుల మేరకు బళ్లారిని మైసూర్ రాష్ట్రంలో విలీనం చేశారు.
డి) 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం
ఏర్పడింది
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, సి, డి
25. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ఎప్పుడు జరిగింది?
1) 1948 సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు
2) 1948, సెప్టెంబర్ 3 నుంచి 13 వరకు
3) 1948, సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు
4) 1948, సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు
26. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం జరిగిన ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యకు ఎవరు నేతృత్వం వహించారు?
1) జయంత్‌నాథ్ చౌదరీ
2) రాం సుభాగ్ సింగ్
3) రఘునందన్ మిశ్రా
4) ఫిరోజ్ సజ్జనార్
27. హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావ విషయానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) హైదరాబాద్ భారత్ యూనియన్‌లో విలీనం అయినట్లు సంతకం చేసిన నిజాం పాలకుడు – మీర్ ఉస్మాన్-అలీఖాన్
బి) హైదరాబాద్ మిలిటరీ గవర్నర్‌గా నియమితులైనది జేఎన్ చౌదరీ
సి) 1949 నుంచి 1950 వరకు హైదరాబాద్‌కు పాలనాధికారిగా వ్యవహరించింది ఎం.కె. వెల్లోడి
డి) 1940 నుంచి 1952 వరకు హైదరాబాద్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించినది ఎం.కె. వెల్లోడి
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
28. 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరించారు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) కొండా వెంకట రంగారెడ్డి
3) మర్రి చెన్నారెడ్డి
4) జె.వి. నరసింహారావు
29. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు మొదటి స్పీకర్ కాశీనాథ్‌రావు వైద్య
బి) హైదరాబాద్ రాష్ట్ర శాసనమండలికి మొదటి చైర్మన్ మాడపాటి హనుమంతరావు
సి) 1956 వరకు హైదరాబాద్ రాష్ర్టానికి రాజ్ ప్రముఖ్ గవర్నర్‌గా వ్యవహరించినది – మీర్ ఉస్మాన్ అలీఖాన్
డి) ఆపరేషన్ పోలో పేరిట జరిగిన అకృత్యాలపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులుగా
వ్యవహరించినది సుందర్‌లాల్
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
30. దేశంలో మొదటి రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1) 1952, డిసెంబర్ 22
2) 1953, డిసెంబర్ 22
3) 1954, జనవరి 24 4) 1954, నవంబర్ 26
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు