జీవితంలో ఇవీ ముఖ్యమే..!
నేటితరం పిల్లలు చదువులో విశేషంగా రాణిస్తున్నప్పటికీ.. కొన్ని అంశాల్లో (సాంఘిక సంబంధాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్) వెనుకబడే ఉంటున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కేవలం చదువుపై మాత్రమే శ్రద్ధ కనబరుస్తుండటం ఇందుకు కారణం. పిల్లలకు చదువుతో పాటు కాస్త సంస్కారం కూడా నేర్పాలంటున్నారు విద్యావేత్తలు. పాఠ్యాంశాలతోపాటు జీవిత పాఠాలనూ పాఠశాల కరికులమ్‌లో భాగం చేయాలి. దీనివల్ల బాల్యం నుంచి మంచి నడవడిక అలవడి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని విద్యావేత్తల అభిప్రాయం.
సంఘం పట్ల మర్యాద
నేటి తరం పిల్లలు పెద్దలు చెప్పే విషయాలేవీ పట్టించుకోకుండా ఫోన్కో, టీవీకో అతుక్కుపోవడం సర్వసాధారణంగా మారింది. దాంతో ఇతరులు ఏం చెబుతున్నారు? ఎలా మాట్లాడాలి? ఏవిధంగా ప్రవర్తించాలి? అనే విషయాలేవీ చాలామంది పిల్లలకు తెలియడం లేదు. పిల్లలు సక్రమమైన దారిలో నడవాలంటే చదువుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తే సరిపోదు. సంఘం పట్ల మర్యాద కూడా తెలిసి ఉండాలి.
ఉద్యోగ సాధన
చదువే కాదు ఉద్యోగం పొందడమనేదీ నేడు చాలెంజింగ్ టాస్క్. సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం ఎలా సంపాదించాలి? అందుకు కావాల్సిన నైపుణ్యాలేంటి? వంటి విషయాలు పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. సొంతంగా రెజ్యూమేను ప్రిపేర్ చేసుకోవడం, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలతీరు, పలు అంశాలపై అనర్గళంగా మాట్లాడటం వంటి నైపుణ్యాలను స్కూల్స్థాయిలోనే బోధించాలి. ఇలాంటివి నేర్పించినప్పుడే భవిష్యత్తులో తగు జాగ్రత్తలు పాటించి తప్పులు చేయకుండా ఉండగలుగుతారు.
నేర్చుకునే ప్రక్రియ
ఇష్టమైన అంశాలు నేర్చుకోవడానికి మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ పరీక్షలు, లక్ష్యాన్ని నిర్దేశించే అంశాలు నేర్చుకోవడానికి మనసు మొండికేస్తుంది. మనసును కఠినమైన అంశాలపై కేంద్రీకరించి చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పిల్లలకు చెప్పగలగాలి. నేర్చుకునే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సులభంగా ఎలా నేర్చుకోవాలో దారులు చూపించి సమస్యను పరిష్కరించగలగాలి. ఈ విషయంలో స్కూల్స్థాయిలోనే బీజం పడేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ కనబర్చాలి.
కమ్యూనికేషన్ స్కిల్స్
కమ్యూనికేషన్ స్కిల్ అనగానే జాబ్‌కు ఉండాల్సిన అర్హతలని భావిస్తుంటారు చాలామంది. కానీ వ్యక్తిగత జీవితానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అనే విషయం పిల్లలకు తెలియజెప్పాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా ఎలా మాట్లాడాలో తెలియజేయడం ద్వారా స్పష్టమైన అవగాహన కలిగి పబ్లిక్ స్పీకింగ్, ఈమెయిల్ రైటింగ్ వంటి విషయాల్లో చురుగ్గా ఉండగలుగుతారు.
ఇంటర్నెట్ సేఫ్టీ
ప్రస్తుత జనరేషన్ ఆన్లైన్ చుట్టూ తిరుగుతుంది. చాలామంది యువత సోషల్‌మీడియాకు అడిక్ట్ కావడంవల్ల విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇంటర్నెట్ సేఫ్టీ విషయంలో పిల్లలకు తగు జాగ్రత్తలు బోధించాలి. ఏదైనా ప్రమాదం బారినపడితే సైబర్ సెక్యూరిటీని ఏవిధంగా ఆశ్రయించాలో పిల్లలకు నేర్పించాలి.
పొదుపు పాఠాలు
నేటితరానికి మనీ మేనేజ్మెంట్ గురించి అస్సలు అవగాహన ఉండటం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని చెబుతుండాలి. భవిష్యత్తులో ఉన్నతమైన చదువులకు స్టడీ లోన్స్ ఏవిధంగా పొందాలో కూడా పిల్లలకు నేర్పిస్తుండాలి. పుస్తకాల్లోని ప్రధాన సబ్జెక్టులతో పాటు పొదుపు పాఠాలు కూడా కచ్చితంగా నేర్పాలి.
స్నేహితులను పొందడం
చాలామందికి ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా.. ఒంటరితనంతో బాధపడుతుంటారు. స్నేహితులు లేకుండా ఉండే పిల్లల్లో ఆందోళన, భయం నెలకొని ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటప్పుడు స్నేహితులను ఎంచుకునే విధానం పిల్లలకు నేర్పాలి. చెడు స్నేహాలకు పోకుండా బెస్ట్ ఫ్రెండ్స్‌ను ఎంచుకునే అవకాశం కల్పించాలి. చిన్నప్పటి నుంచే ఇతరులతో కలిసిపోయే గుణం పిల్లలకు అలవర్చడంవల్ల స్నేహభావంతో మెలగుతారు.
ఆత్మరక్షణ
పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకొనే నేర్పు ఉండాలి. చదువుతోపాటు సెల్ఫ్ డిఫెన్స్‌ను భాగం చేయాలి. స్కూలింగ్లోనే ఆత్మరక్షణ పద్ధతులు చెప్పడంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుంది.
డ్రైవింగ్ స్కిల్స్-ట్రాఫిక్ రూల్స్
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నది యువతనే. మితిమీరిన వేగంతోపాటు అవగాహనరాహిత్యం కూడా ఇందుకు కారణం. సేఫ్ డ్రైవింగ్ ఎలా చేయాలో ప్రాథమికస్థాయిలోనే అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ రూల్స్ పట్ల సరైన అవగాహన కల్పిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. పిల్లలకు స్వయంగా డ్రైవింగ్ స్కిల్స్ నేర్పి ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేసేలా పాఠాలు బోధించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు