ఏడు రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రాలెన్ని?
భారతదేశం ఉనికి-విస్తరణ
- భౌతిక, సాంఘిక, సాంస్కృతిక తారత మ్యాలు గల భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తుంది.
- భౌగోళిక విస్తీర్ణం, విశిష్ట లక్షణాల దృష్ట్యా భారతదేశాన్ని ఒక ఉపఖండమని చెప్పవచ్చు. విశిష్ట లక్షణాలంటే భూస్వరూపాల్లో వైవిధ్యం
- నదుల పరీవాహకంలో వైవిధ్యం
- రుతుపవన శీతోష్ణస్థితిలో వైవిధ్యం
- మృత్తికల్లో వైవిధ్యం
- ఉద్భిజ్జ రకాల్లో వైవిధ్యం
- జంతు సంపదలో వైవిధ్యం
- వివిధ పంటల ఉత్పత్తిలో వైవిధ్యం
- భారతదేశంలో పురాతన కాలం నుంచి అనేక మతాలు, కులాలు, భాషలు, ఆచారాలు, అలవాట్లు
- ఉన్నప్పటికీ సాంస్కృతిక ఏకత్వం కూడా ఉంది.
- ఏదైనా ఒక దేశానికి ఖండానికి ఉన్న లక్షణాలు ఉంటే ఆ దేశాన్ని ఉపఖండం అంటారు.
- పై లక్షణాలు భారతదేశానికి ఉండటం వల్ల భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తున్నారు.
మరికొన్ని ఉపఖండాలు
1) స్కాండినేవియా (ఐరోపా)
2) ఐబీరియా (ఐరోపా)
3) మధ్య అమెరికా
4) ఇండో-చైనా
- దేశంలోని వాయవ్య భాగంలోని సింధూనది (ఆంగ్లంలో ‘ఇండస్’) పేరు మీదుగా ఈ దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.
- సింధూనది వెంట నివసించే ప్రజలను ఇండోయిలుగా ప్రాచీన కాలంలో గ్రీకులు గుర్తించారు. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వారు దీనిని ‘ఇండియా’గా పిలవడం ప్రారంభించారు.
- పూర్వం ఈ దేశాన్ని పాలించిన భరతుని పేరుతో దీనికి భారతదేశం అనే పేరు వచ్చింది.
ద్వీపకల్పం(Peninsula): మూడు వైపుల జలభాగం, ఒకవైపు భూభాగం ఉన్న ప్రాంతాన్ని ‘ద్వీపకల్పం’ అంటారు. - భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరం దిక్కున భూభాగం ఉండటం వల్ల ద్వీపకల్పంగా పిలుస్తారు.
భారతదేశంలో ద్వీపకల్పాలు
1) దక్కన్ ద్వీపకల్పం- దక్షిణ భారత్
2) కన్యాకుమారి ద్వీపకల్పం- తమిళనాడు
3) కథియవార్ ద్వీపకల్పం- గుజరాత్
4) కచ్ ద్వీపకల్పం- గుజరాత్
5) కొలాబ ద్వీపకల్పం- ముంబై
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పాలు
1) అరేబియా ద్వీపకల్పం
2) దక్కన్ ద్వీపకల్పం (భారత్)
3) ఆగ్నేయాసియా (ఇండో-చైనా) ద్వీపకల్పం
4) సోమాలియా ద్వీపకల్పం
సరిహద్దులు: ఇండియాకు ఆగ్నేయంలో బంగాళా ఖాతం, నైరుతిలో అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి.
సరిహద్దు రాష్ర్టాలు: భారతదేశంలో ఉత్తరాన ఉన్న రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతం లఢక్.
దక్షిణాన ఉన్న రాష్ట్రం తమిళనాడు.
తూర్పున ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్.
పశ్చిమాన ఉన్న రాష్ట్రం గుజరాత్
సరిహద్దు ప్రాంతాలు
- ఉత్తరాన ఉన్న చిట్టచివరి సరిహద్దు ప్రాంతం: ఇందిరాకాల్ (Indiracol)
- ఇది కారకోరం శ్రేణిలో సియాచిన్ హిమానీ నదానికి దక్షిణంవైపు ఉంది.
- ఇది ఉత్తరాన చైనా, పడమర దిక్కున పాకిస్థాన్ ఉన్న త్రికూడలి.
- పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరాన ఉన్న చివరి ప్రాంతం ‘కిలిక్దావన్’ కనుమ.
- ఇది కారకోరం శ్రేణుల ఉత్తర భాగాన, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉంది.
దక్షిణ సరిహద్దు ప్రాంతాలు
- భారతదేశ ప్రధాన భూభాగ దక్షిణాగ్రం ‘కన్యాకుమారి/ కేప్ కొమొరిన్ (తమిళనాడు)
- కానీ మొత్తం భారతదేశానికి (ప్రధాన భూభాగం+దీవులు) దక్షిణ ప్రాంతం ‘ఇందిరాపాయింట్/
- పిగ్మాలియన్ పాయింట్’. ఇది గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది.
- భారత్‌లో భూమధ్య రేఖకు ఉత్తరాన దగ్గరగా ఉన్న ప్రాంతం ఇందిరాపాయింట్.
- భారత్‌కు దక్షిణ చివర ఉన్న దీవి లేదా అండమాన్ నికోబార్ దీవుల్లో చివరన ఉన్న దీవి గ్రేట్ నికోబార్ దీవి. (6045 ఉత్తర అక్షాంశం)
తూర్పు సరిహద్దు ప్రాంతాలు
- భారతదేశంలో తూర్పు చివరన ఉన్న ప్రాంతం ‘దిపు/ కిభితు కనుమ’. పూర్వాంచల్ పర్వతాల్లో (అరుణాచల్ ప్రదేశ్)
- పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు: భారత్‌లో పశ్చిమాగ్రంలో ఉన్న ప్రాంతం ‘గుహర్ మోటా’. ఇది రాణ్ ఆఫ్ కచ్ (గుజరాత్)లో ఉంది.
- భారతదేశం విస్తీర్ణం (Indian Area): భారతదేశ విస్తీర్ణం 32,87,263 చ.కి.మీ. (3.28 మిలియన్ చ.కి.మీ.)
- భూమి ఉపరితల (ఖండాల/ప్రపంచ) విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 2.42%
- భూగోళం మొత్తం ఉపరితలంలో (సము ద్రాలతో కలిపి) విస్తీర్ణం 0.57%
- భారతదేశం విస్తీర్ణపరంగా ప్రపంచంలో 7వస్థానంలో ఉంది.
- భారతదేశంలో మొత్తం 36 రాజకీయ విభాగాలు (28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు) ఉన్నాయి.
- 2020 జనవరి 26న దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూలను కలిపి ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం వల్ల కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 8కి తగ్గింది.
రాష్ర్టాలు సరిహద్దులు
- 1) ఉత్తరప్రదేశ్ 8 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సరిహద్దులు కలిగి ఉంది. అవి.. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ (ఎక్కువ పొడవు), రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ (తక్కువ పొడవు) ఉత్తరాఖండ్, ఢిల్లీ
- 2) అసోం, ఛత్తీస్‌గఢ్‌లు 7 రాష్ర్టాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి.
- ఎ) అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, పశ్చిమబెంగాల్.
- బి) ఛత్తీస్‌గఢ్‌కు జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్.
- 6 రాష్ర్టాలతో సరిహద్దులున్న రాష్ర్టాలు- 2
- మహారాష్ట్ర: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా
- కర్ణాటక: గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ.
- 5 రాష్ర్టాలతో సరిహద్దు కలిగిన రాష్ర్టాలు- 5
- ఆంధ్రప్రదేశ్: ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు
- మధ్యప్రదేశ్: ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్
- పశ్చిమబెంగాల్: సిక్కిం, అసోం, ఒడిశా, జార్ఖండ్, బీహార్
- రాజస్థాన్: పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్
- జార్ఖండ్: పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్
- 2 రాష్ర్టాలతో సరిహద్దు కలిగిన రాష్ర్టాలు
- కేరళ: కర్నాటక, తమిళనాడు
- గోవా: మహారాష్ట్ర, కర్నాటక
- ఉత్తరాఖండ్: ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
- త్రిపుర: అసోం, మిజోరం
- అరుణాచల్ ప్రదేశ్: నాగాలాండ్, అసోం
- 1 రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ర్టాలు 2
- ఎ) సిక్కిం: పశ్చిమబెంగాల్
- బి) మేఘాలయ: అసోం
భూపరివేష్టిత రాష్ర్టాలు: (Land locked States)
- అంతర్జాతీయ భూ సరిహద్దు, జలసరిహద్దు లేదా రెండూ లేని ప్రాంతాలు/ రాష్ర్టాలను భూ పరివేష్టిత రాష్ర్టాలు అంటారు.
- భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ర్టాల సంఖ్య 5. అవి విస్తీర్ణపరంగా
- 1) మధ్యప్రదేశ్
- 2) ఛత్తీస్‌గఢ్
- 3) తెలంగాణ
- 4) జార్ఖండ్
- 5) హర్యానా
- భూపరివేష్టిత కేంద్రపాలిత ప్రాంతాలు 2 అవి
- 1) ఢిల్లీ 2) చండీగఢ్
ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు
- దేశం రాజధాని ఖండం విస్తీర్ణం
- రష్యా మాస్కో యూరప్, ఆసియా 1,70,98,242 చ.కి.మీ.
- కెనడా ఒట్టావా ఉత్తర అమెరికా 99,84,670 చ.కి.మీ.
- అమెరికా వాషింగ్టన్ ఉత్తర అమెరికా 99, 62,909 చ.కి.మీ.
- చైనా బీజింగ్ ఆసియా 95,96 961 చ.కి.మీ.
- బ్రెజిల్ బ్రసీలియా దక్షిణ అమెరికా 85,14,877 చ.కి.మీ.
- ఆస్ట్రేలియా కాన్బెర్రా ఓషియానియా 77,41,220 చ.కి.మీ.
- ఇండియా న్యూఢిల్లీ ఆసియా 32,87,263 చ.కి.మీ
ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణంలో అతి పెద్ద, చిన్న దేశాలు
పెద్దవి
1. రాజస్థాన్ 2. మధ్యప్రదేశ్ 3. మహారాష్ట్ర 4. ఉత్తరప్రదేశ్ 5. గుజరాత్
చిన్నవి
1. గోవా 2. సిక్కిం 3. త్రిపుర 4. నాగాలాండ్ 5. మిజోరాం
విస్తీర్ణంపరంగా అతి పెద్ద, చిన్న కేంద్ర పాలిత ప్రాంతాలు
పెద్దవి చిన్నవి
1) లఢక్ 1) లక్ష్యదీవులు
2) జమ్ముకశ్మీర్ 2) చండీగఢ్
3) అండమాన్ నికోబార్ 3) పుదుచ్చేరి
4) న్యూఢిల్లీ 4) దాద్రానగర్ హవేలీ & డయ్యూడామన్
విస్తీర్ణ పరంగా చిన్న, పెద్ద జిల్లాలు
పెద్దవి చిన్నవి
1) కచ్ (గుజరాత్) 1) మహి (పుదుచ్చేరి)
2) లేహ్ (లడఖ్) 2) యానాం (పుదుచ్చేరి)
3) జైసల్మీర్ (రాజస్థాన్) 3) మధ్య ఢిల్లీ
4) బికనీర్ (రాజస్థాన్) 4) లక్షద్వీప్
5) భార్మర్ (రాజస్థాన్) 5) న్యూఢిల్లీ
అత్యధిక జిల్లాలున్న రాష్ర్టాలు
ఉత్తరప్రదేశ్ (75), మధ్యప్రదేశ్ (52), బీహార్ (38)
అత్యల్ప జిల్లాలున్న రాష్ర్టాలు
గోవా (2), సిక్కిం (4)
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం – ఏర్పడిన తేదీ – ఏ రాష్ట్రం నుంచి – సరిహద్దులు
జమ్ము కశ్మీర్ – 2019, 31 అక్టోబర్ – జమ్ము కశ్మీర్ – లఢక్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్
లఢక్ – 2019, 31 అక్టోబర్ – జమ్ము కశ్మీర్ – హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్
తెలంగాణ – 2014, 2 జూన్ – ఆంధ్రప్రదేశ్ – ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్
జార్ఖండ్ – 2000,15 – నవంబర్ – బీహార్ – పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్
ఉత్తరాఖండ్ – 2000, 9 నవంబర్ – ఉత్తరప్రదేశ్ – ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
ఛత్తీస్‌గఢ్ – 2000,1 నవంబర్ – మధ్యప్రదేశ్ – జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర,
మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్
1. భారతదేశానికి వివిధ కొనలలో ఉన్న వివిధ ప్రాంతాలను సవ్యదిశలో అమర్చండి? (బి)
1) ఇందిరాకాల్ 2) గురుమేత్
3) దిపు 4) ఇందిరాపాయింట్
ఎ) 1, 3, 2, 4 బి) 1, 3, 4, 2
సి) 3, 1, 2, 4 డి) 2, 1, 3, 4
2. కిందివాటిలో సరైనది? (డి)
ఎ) కచ్ద్వీపకల్పం -మహారాష్ట్ర
బి) కథియవార ద్వీపకల్పం – మధ్యప్రదేశ్
సి) కోలంబ ద్వీపకల్పం – తెలంగాణ
డి) కన్యాకుమారి ద్వీపకల్పం- తమిళనాడు
3. భారతదేశం విస్తీర్ణం పరంగా సరికానిది ఏది? (డి)
ఎ) 32,87,263 చ.కి.మీ.
బి) 3.28 మిలియన్ చ.కి.మీ.
సి) 33 లక్షల చ.కి.మీ.దాదాపు
డి) 2.34%
4. రష్యా విస్తీర్ణం పరంగా భారతదేశం కన్నా ఎన్ని రెట్లు పెద్దది? (సి)
ఎ) 4 రెట్లు బి) 6 రెట్లు
సి) 5 రెట్లు డి) 7 రెట్లు
5. విస్తీర్ణ పరంగా కింది రాష్ర్టాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి? (ఎ)
1) మధ్యప్రదేశ్ 2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్ 4) మహారాష్ట్ర
ఎ) 2, 3, 4, 1 బి) 1, 4, 3, 2
సి) 3, 4, 1, 2 డి) 4, 3, 2, 1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు