జేఈఈ మెయిన్ 2022 – పరీక్షల సమాచారం
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ ప్రకటన సుమారు మూడు నెలల ఆలస్యంగా విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీలు, ఐఐఐటీలులతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. దీంతో పాటు ఈ పరీక్షలో అర్హత సాధించిన సుమారు 2.40 లక్షల మందిని దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్ష మొదటి సెషన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పరీక్ష విధానం, అర్హతలు తదితరాలు నిపుణ పాఠకుల కోసం..
జేఈఈ మెయిన్
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ లైన ఐఐటీ, ఎన్ఐటీ, సీఎఫ్టీఐల్లో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2022 సెషన్-1 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2019 నుంచి జేఈఈ మెయిన్‌ను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. గతేడాది కొవిడ్-19 కారణంగా నాలుగుసార్లు నిర్వహించారు. కానీ ఈసారి ఎప్పటిలాగే రెండుసార్లు నిర్వహించనున్నారు.జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1
ఈ పరీక్ష ద్వారా బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ స్కోర్ ద్వారా ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్టీఐల్లో, కొన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పేపర్-2
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నోట్: 2021 నుంచి లక్నోలోని డా.ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ, గోరఖ్‌పూర్‌లోని మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా బీటెక్/ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి.
జేఈఈ మెయిన్ సెషన్-1 ఏప్రిల్ 16- 21 వరకు, సెషన్-2 మే 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.
అభ్యర్థులు రెండుసార్లు పరీక్షను రాయవచ్చు. ఎక్కువ స్కోర్ వచ్చిన పరీక్షను ఎన్టీఏ పరిగణనలోకి తీసుకుంటుంది.
ఎవరు అర్హులు?
ఇంటర్/10+2 లేదా తత్సమాన కోర్సు (ఎంపీసీ/బయోటెక్నాలజీ, బయాలజీ/టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టులు)/డిప్లొమా ఉత్తీర్ణత లేదా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: జేఈఈ మెయిన్-2022కు గరిష్ఠ వయోపరిమితి లేదు. 2020, 2021 ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు, 2022లో పరీక్షలు రాస్తున్నవారు అర్హులు.
పరీక్ష విధానం
పేపర్- 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు. పేపర్-2లో రెండు రకాల పరీక్షలు ఉన్నాయి. అవి పేపర్-2ఏ ఇది బీఆర్క్‌కు సంబంధించింది. దీనిలో పార్ట్-1, పార్ట్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో, పార్ట్-2 డ్రాయింగ్ టెస్ట్‌ను పెన్, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. పేపర్ -2బీ ఇది బీప్లానింగ్ ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. దీనిలో పార్ట్-1, 2, 3 మూడు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే నిర్వహిస్తారు.
మీడియం: పరీక్ష నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈసారి నుంచి ఇంగ్లిష్, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్, ఉర్దూల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థి పై వాటిలో ఏదో ఒక భాషలో రాయవచ్చు.
పేపర్-1లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఇస్తారు. మూడు సబ్జెక్టులకు సమాన మార్కులు కేటాయించారు.
పేపర్-2ఏలో పార్ట్-1 మ్యాథ్స్, పార్ట్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్, పార్ట్-3 డ్రాయింగ్ టెస్ట్ ఉంటాయి. పార్ట్- 1, 2 ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 82 ప్రశ్నలు 400 మార్కులు.
పేపర్-2బీలో మూడు పార్ట్లు కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 105 ప్రశ్నలు. 400 మార్కులు.
గమనిక: పేపర్-1లో ప్రతి సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 300 మార్కులకు పరీక్ష. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. పరీక్షను రెండు షిప్టుల్లో
నిర్వహిస్తారు.
మొదటి షిప్ట్ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు ఉంటుంది.
ఈసారి ఎంసీక్యూలతోపాటు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోతవిధిస్తారు. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు. ప్రశ్నకు జవాబు రాయకుంటే సున్నా మార్కులు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు
ఆదిలాబాద్, గద్వాల, హయత్‌నగర్, హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్.
జేఈఈలో మార్పులు
ఈ ఏడాది రెండుసార్లు (ఏప్రిల్, మే) మాత్రమే పరీక్షను నిర్వహించనున్నారు.
ఈ ఏడాది అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి కరెక్షన్లు చేసుకోవడానికి వీలు లేదు. ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కరక్షన్ చేసుకొనే అవకాశం లేదు.
తల్లిదండ్రుల వార్షికాదాయం తప్పనిసరిగా పేర్కొనాలి.
ఆధార్ కార్డ్ వివరాలను సమర్పించడం ఐచ్ఛికం (ఆప్షనల్)
ఈసారి సెక్షన్ ఏ, సెక్షన్ బీలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ఎన్టీఏ ఈసారి ప్రవేశపెట్టింది.
ఈసారి Sandes App డౌన్లోడ్ చేసుకుంటే ఎన్టీఏ వెబ్‌సైట్‌తోపాటు ఈ యాప్ ద్వారా పరీక్షకు సంబంధించిన తాజా వివరాలను ఎప్పటికప్పుడు ఎన్టీఏ దీనిలో పొందుపరుస్తుంది.
ఇంటర్ పరీక్షను 2020/2021లో ఉత్తీర్ణులై జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్టర్ అయి 2021లో పరీక్ష (రెండు పేపర్లు) రాయనివారు ఈసారి నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్-2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం కొవిడ్ కారణంగా ఈ ఒక్కసారి ఇస్తున్నారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో.. చివరితేదీ: మార్చి 31
సెషన్-1 పరీక్ష తేదీలు: ఏప్రిల్ 16-21 వరకు
సెషన్-2 పరీక్ష తేదీలు: మే 24- 29 వరకు
పరీక్ష ఫీజు: ఏదైనా ఒక పేపర్ రాసే వారికి జనరల్/ఓబీసీ (ఎన్సీఎల్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.650/-
బాలికలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు రూ.325/-
వెబ్సైట్: https://jeemain.nta.nic.in
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






