దేశంలో భూకంప పరిశోధనా కార్యక్రమం
భూకంప పర్యవేక్షణ
దేశంలో భూకంపాల పర్యవేక్షణకు భారత వాతావరణ విభాగం ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది. ఈ విభాగం 1898లో కలకత్తాలో మొదటి భూకంప అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భూకంపాలను త్వరితంగా లెక్కగట్టి వాటి సమాచారాన్ని కేంద్ర, రాష్ట్ర విభాగాలకు తెలియజేసి వాటి ద్వారా సమర్థవంతమైన రీతిలో సహాయ పునరావాస చర్యలను చేపట్టేందుకు కృషి చేయడం ఈ విభాగం ముఖ్య విధి.
భూకంప కార్యక్రమ కేంద్రం
– దేశంలోని భూకంపచర్యలను పర్యవేక్షించేందుకు భారత వాతావరణ విభాగాన్ని నెలకొల్పారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది సుదూర కేంద్రాల నుంచి VSAT మొదలైన సాధనాల ద్వారా తరంగరూపంలో సమాచారాన్ని సంగ్రహించి, విశ్లేషించి భూకంప సమాచారాన్ని వివిధ కేంద్ర, రాష్ట్ర విభాగాలకు పంపిస్తుంది.
నేషనల్ సిస్మాలాజికల్ నెట్వర్క్
– భారత వాతావరణ విభాగం దేశవ్యాప్తంగా నేషనల్ సిస్మాలాజికల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుంది. ఈ నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా 55 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని నాలుగు కేంద్రాలు భాక్రా మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేస్తున్నాయి. ఈ 55 అధ్యయన కేంద్రాలు అత్యాధునికమైన బ్రాడ్‌బ్యాండ్ సెన్సర్లు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, కాల అనుసంధానిత సౌకర్యాలు కలిగి సుదూర ప్రాంతాల నుంచి సమాచారాన్ని పొంది విశ్లేషించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ కదలికల అధ్యయనం కోసం భారత వాతావరణ విభాగం 16 స్టేషన్ల ఆధారిత డిజిటల్ భూ కదలికల టెలిమెట్రో వ్యవస్థను నిర్వహిస్తుంది.
జాతీయ భూకంప పరిశోధనా బులెటిన్
– భూకంప పరిశోధనా విభాగం ప్రతి నెలా భూకంప ప్రాంతాలకు సంబంధించిన, విశ్లేషించిన సమాచారాన్ని ఒక బులెటిన్ రూపంలో వెలువరిస్తుంది.
– భారత్ అంతర్జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం యూకేలో సభ్య దేశం.
– ఇందులో భాగంగా భారత భూకంప పరిశోధన విభాగం ప్రచురించే బులెటిన్ భూకంప పరిశోధన కేంద్రం కిందికి వస్తుంది.
– ఈ రకమైన వ్యవస్థ ద్వారా మొత్తం భౌగోళికంగా అందుబాటులో ఉన్న భూకంప, భూకదలిక సమాచారాన్ని పొంది మన దేశానికి ఉపయోగపడే విశ్లేషణను జరుపుతున్నది.
నేషనల్ సిస్మాలాజికల్ డేటాబేస్ కేంద్రం
– ఇది న్యూఢిల్లీలో ఉన్నది. అన్ని నెట్వర్క్ స్టేషన్ల నుంచి పొందిన సమాచారాన్ని జాతీయం చేయడం, విశ్లేషించడం, ఒక పద్ధతిలో నిక్షేపపర్చడం దీని విధి. ఈ సమాచారాన్ని వివిధ వ్యవస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు పొంది వినియోగిస్తున్నాయి. తద్వారా భూకంప సమయంలో చేయాల్సిన కార్యక్రమాలను రూపొందించుకుంటాయి.
– భారత వాతావరణ విభాగం, భూకంప పరిశోధనా విభాగం రష్యా, మెక్సికో, ఐస్లాండ్ తదితర దేశాలతో భూకంప సమాచారాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి. ఇందులో భాగంగా 2003లో ఇండో-రష్యా భూకంప పరిశోధనా కేంద్రాన్ని ఢిల్లీలోని భారత వాతావరణ విభాగం ప్రాంగణంలో నెలకొల్పారు.
– అంతేకాకుండా భూకంప పరిశోధన కోసం భారత భూకంప పరిశోధనా విభాగం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కలిసి రాష్ట్ర విభాగాల అధికారుల శిక్షణా కార్యక్రమాలను, వర్క్‌షాపులను నిర్వహిస్తున్నది.
భారత జాతీయ సముద్ర సేవా కేంద్రం
– 2004 డిసెంబర్ 26న ఏర్పడిన సునామీని సృష్టించిన అత్యంత విధ్వంసకర గ్రేట్ సుమత్రా భూకంపం తర్వాత భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఊహించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, భారత ప్రభుత్వం హైదరాబాద్ భారత జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రంలో భారత సునామీ ముందస్తు హెచ్చరికా కేంద్రాన్ని ఏర్పరిచింది.
– ఇందులో భాగంగా 17 స్టేషన్లు వాస్తవ స్థితి భూకంప పర్యవేక్షణ నెట్‌వర్క్‌ను భారత వాతావరణ విభాగం ఏర్పరిచినది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు