బ్యాంకింగ్ వ్యవస్థ – నూతన పరిణామాలు
ఎకానమీ
- ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
- బ్యాంకుల జాతీయీకరణ తర్వాత బ్యాంకుల వ్యవహార సరళిలో దృక్పథంలో మార్పు వచ్చింది.
- సంప్రదాయ బద్ధమైన బ్యాంకింగ్ విధానాల స్థానంలో ఆధునిక విధానాలను అనుసరిస్తున్నాయి.
- బ్యాంకుల జాతీయీకరణ తర్వాత డిపాజిట్ల సేకరణ రుణాల మంజూరుతోపాటు, ఇతర విత్త సంబంధమైన సేవలను కూడా ప్రస్తుతం ఆధునిక బ్యాంకులు అందిస్తున్నాయి.
- ఆధునిక విధానాలు, పురోగామి పద్ధతులు అనుసరించడానికి 1949 బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించారు.
- బ్యాంకింగ్ వైవిధ్యీకరణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది.
ఆధునిక బ్యాంకింగ్ విధానాలు / బ్యాంకుల వైవిధ్యీకరణ
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్
- ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్కు, కాగితం వ్యవహారాలకు బదులుగా కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, నిధులను మళ్ళించే పద్ధతినే ‘ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్’ అంటారు.
ఉదా: ఈ-బ్యాంకింగ్, ఈ-మనీ ఏటీఎం (ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్) : - బ్యాంక్ ఖాతాదారుల సౌలభ్యం కోసం వాణిజ్య బ్యాంకులు ఏటీఎంలను ప్రారంభించాయి. ఖాతాదారులు ఏ సమయంలోనైనా ఏటీఎం ద్వారా ద్రవ్యాన్ని పొందవచ్చు.
- ఏటీఎం బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతా లావాదేవీలను నిర్వహించడానికి సౌకర్యంగా ఉంటుంది.
- బ్యాంకు ఖాతాదారుడు తమ ఖాతాలోని డబ్బును తనిఖీ చేయడానికి, డబ్బును బదిలీ చేయడానికి, ద్రవ్యాన్ని తీసుకోవడానికి, ఖాతా లావాదేవీలను ముద్రించుకోవడానికి, ఇతర సేవలు పొందడానికి ఈ ఏటీఎం ఉపయోగపడుతుంది.
- ఏటీఎం నిరంతరం అన్ని సమయాల్లో అన్ని రోజుల్లో 24/7 పనిచేస్తుంది.
- ప్రపంచంలో మొదట ఏటీఎంను బ్రిటన్‌కు చెందిన జాన్ షెపర్డ్ బారెన్ రూపొందించారు.
- 1967 జూన్‌లో లండన్‌లోని ఎన్ ఫీల్డ్‌లోని ఒక వీధిలో బార్క్లెస్ బ్యాంకు బ్రాంచ్‌లో ఏర్పాటు చేశారు.
- భారతదేశంలో మొట్టమొదటి ఏటీఎం నెలకొల్పిన బ్యాంక్ హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ బ్యాంకు 1987లో ముంబైలో ఏర్పాటు చేసింది.
- ఏటీఎం వినియోగం బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పును తెచ్చింది.
- ఏటీఎం ద్వారా ఆదాయాన్ని చెల్లించే సౌకర్యం ప్రారంభించిన మొదటి భారతీయ బ్యాంక్ – యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఈ ఏటీఎం అనేది ఒక ప్లాస్టిక్ కార్డుతో పని చేస్తుంది.
- ఈ ప్లాస్టిక్ కార్డ్‌ను డెబిట్‌కార్డ్ అంటారు. భారతదేశంలో డెబిట్ కార్డ్ ప్రవేశ పెట్టిన సీడీఎం (క్యాష్ డిపాజిట్ మెషిన్)
మొదటి బ్యాంక్-సిటీ బ్యాంక్
- అంధ ఖాతాదార్ల కోసం మాట్లాడే ఏటీఎంను ఏర్పాటు చేసిన భారతీయ బ్యాంక్ – యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
- ఖాతాదారులు తమ ఖాతాలో గానీ, లేదా ఇతర ఖాతాలో గాని నేరుగా ద్రవ్యాన్ని డిపాజిట్ చేయడానికి, తమ ఖాతా నుంచి ద్రవ్యాన్ని తీసుకోవడానికి, ఇతర సేవలు పొందడానికి సీడీఎంను ఏర్పాటు చేశారు.
- ఏటీఎంతోపాటు సీడీఎం ద్వారా కూడా బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పు వచ్చింది.
స్మార్ట్‌కార్డ్
అంతర్జాల బ్యాంకింగ్
- ఒక బ్యాంకింగ్ సంస్థకు ముందుగా కొంత చెల్లించినప్పుడు ఆ మొత్తాన్ని వాడుకోవ డానికి ఆ బ్యాంకు జారీ చేసే కార్డునే స్మార్ట్ కార్డ్ అంటారు. దీనినే ముందు చెల్లింపు కార్డు అని కూడా అంటారు. భారత దేశంలో ఈ స్మార్ట్‌కార్డ్‌ను బొంబాయిలోని ‘దేనాబ్యాంకు’ పరిచయం చేసింది.
- ఇంటర్నెట్ సౌకర్యం వినియోగించుకుంటూ బ్యాంకు ఖాతాదార్లు తమ ఖాతా లావాదేవీలు నిర్వహించుకునేందుకు అంతర్జాల బ్యాంకింగ్ / ఇంటర్నెట్ బ్యాంకింగ్/ నెట్ బ్యాంకింగ్‌ను ప్రవేశ పెట్టారు.
- బ్యాంకింగ్ నెట్ వర్కింగ్ ద్వారా బ్యాంక్ ఖాతాదారులు దేశంలో ఎక్కడి నుంచైనా అనుమతించిన బ్యాంక్ ద్వారా తమ ఖాతా ద్రవ్యం/ లావాదేవీలను జరపవచ్చు.
- భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన మొదటి బ్యాంక్ – ఐసీఐసీఐ బ్యాంక్ -2002.
మొబైల్ బ్యాంకింగ్
- మొబైల్ ఫోన్లలో యాప్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఉదా: ఎస్బీఐ యోనో, యూనియన్ బ్యాంక్ - భారతదేశంలో మొబైల్ బ్యాంకింగ్‌లో మొదటిస్థానం హెచ్డీఎఫ్సీ కాగా రెండవది ఐసీఐసీఐ, మూడోది ఎస్బీఐ.
వాచ్ బ్యాంకింగ్
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాపిల్ వాచ్‌లో మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా వాచ్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించింది.
ఈ-వాలెట్
- మొబైల్లో ఈ-వాలెట్ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
ఉదా: ఎస్బీఐ బడ్డీ, ఐసీఐసీఐ ప్యాకెట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేజాప్, యాక్సిస్ బ్యాంక్ లైం, పేటీఎం, ఎయిర్టెల్ మనీ, జియో మనీ మొదలైనవి ఈ కోవకు చెందినవి. - భారత బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కూడా ఎక్కడైనా వివిధ రకాల బిల్లులు చెల్లించవచ్చు.
వెంచర్ కాపిటల్ నిధులు - ఆధునిక సాంకేతిక పరిజానం ఉపయోగించి నూతన సాంకేతిక వస్తు సేవలను అందించడానికి వచ్చే సాహసోపేతమైన ఉద్యమదారులకు బ్యాంకులు వెంచర్ క్యాపిటల్ నిధులు ఏర్పాటు చేస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్
- కొన్ని వాణిజ్య బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించి అందుకు ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసుకున్నాయి.
- ప్రస్తుతం 7 ప్రభుత్వ రంగ బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తున్నాయి.
చందాపూచీ సేవలు: (Under writing services) - కొత్తజారీలకు ముఖ్యంగా ఆధిక్య వాటాలకు, డిబెంచర్లకు చందాపూచీ ఇస్తున్నారు.
మర్చెంట్ బ్యాంకింగ్
- అనేక వాణిజ్య బ్యాంకులు స్వతంత్రంగా మర్చెంట్ బ్యాంకింగ్ సేవలు చేపట్టాయి.
- ఫ్యాక్టరింగ్ సేవలు (Factoring Services)
ఇందుకు ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేసుకున్నాయి.
రిటైల్ బ్యాంకింగ్
- గృహరుణాలు, వినియోగ రుణాలు సమీక్షఅందించడానికి వాణిజ్య బ్యాంకులు రిటైల్ బ్యాంకింగ్‌ను అనుసరిస్తున్నాయి.
- ఈ రుణాలు అందించడానికి క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్నాయి.
- ఒక విత్త మధ్యవర్తిత్వ సంస్థ బ్యాంకు అనుబంధ శాఖల ఖాతాలను విక్రయించడం ద్వారా వాటి ఖాతా పుస్తకాల్లోని బాకీలను వేగంగా వసూలు చేసే విధానాన్ని ఫ్యాక్టరింగ్ అంటారు.
- ఈ ఫ్యాక్టరింగ్ సేవలను కొన్ని బ్యాంకులు మాత్రమే అందిస్తున్నాయి.
ఉదా: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్, కెనరాబ్యాంకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాయి. - బ్యాంకుల జాతీయీకరణ, బ్యాంకింగ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిణామాల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో రూపురేఖలు మారిపోయాయని చెప్పవచ్చు.
- బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ పరిణామాల వల్ల ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయి.
- వివిధ రంగాలకు అవసరమైన మూలధనాన్ని అందిస్తున్నాయి.
- దేశంలోని పొదుపును లాభదాయకమైన పెట్టుబడి మార్గంలోకి మళ్ళిస్తున్నాయి.
- సామాజిక లక్ష్యాలు సాధించడంలో బ్యాంకులు ప్రభుత్వానికి చేయూతనిస్తున్నాయి.
- దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ ఆధునీకరణ చెందుతున్నాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. ఈ- బ్యాంకింగ్ అంటే
ఎ) ఎమర్జెన్సీ బ్యాంకింగ్
బి) ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్
సి) ఎనీటైం బ్యాంకింగ్ డి) పైవన్నీ
2. బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం ఏ సంవత్సరంలో సవరించారు?
ఎ) 1945 బి) 1949
సి) 1955 డి) 1935
3. ఏటీఎం అంటే
ఎ) ఎనీ టైం మనీ
బి) ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్
సి) ఆల్ టైం మనీ
డి) ఆటోమేటిక్ ట్రోల్ మెషిన్
4. ప్రపంచంలో మొట్టమొదటి సారి ఏటీఎం ను ఏర్పాటు చేసిన బ్యాంకు ఏది?
ఎ) బార్క్లెస్ బ్యాంక్
బి) లండన్ బ్యాంక్
సి) ఎన్ఫీల్డ్ బ్యాంక్
డి) ఇంగ్ల్లండ్ బ్యాంక్
5. భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఏటీఎంను ఎక్కడ ఎప్పడు ఏర్పాటు చేశారు?
ఎ) కలకత్తా -1985 బి) న్యూఢిల్లీ 1987
సి) ముంబై 1987 డి) మద్రాస్ 1985
6. సీడీఎం అంటే
ఎ) క్యాష్ డిపాజిట్ మెషిన్
బి) క్యాష్ డ్రా మెషిన్
సి) క్యాష్ డిక్లర్ మెషిన్
డి) క్రెడిట్ డిపాజిట్ మెషిన్
7. ముందు చెల్లింపు కార్డ్ అని దేనిని పిలుస్తారు?
ఎ) స్మార్ట్‌కార్డ్ బి) డెబిట్ కార్డ్
సి) క్రెడిట్ కార్డ్ డి) పైవన్నీ
8. అంతర్జాల బ్యాంకింగ్‌కు మరొక పేరు ?
ఎ) ఇంటర్నెట్ బ్యాంకింగ్
బి) నెట్ బ్యాంకింగ్
సి) స్మార్ట్ బ్యాంకింగ్ డి) ఎ, బి
9. భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి?
ఎ) 2000 బి) 2001
సి) 2002 డి) 2003
10. ఎస్బీఐ యోనో అనేది దేనికి చెందినది?
ఎ) వాచ్ బ్యాంకింగ్
బి) మొబైల్ బ్యాంకింగ్
సి) ఇ-వాలెట్ డి) పైవన్నీ
11. వాచ్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించిన బ్యాంక్ ఏది?
ఎ) ఎస్బీఐ బి) ఐసీఐసీఐ
సి) హెచ్డీఎఫ్సీ
డి) యూనియన్ బ్యాంక్
12. ఎస్బీఐ బడ్డీ అనేది ఏ కోవకు చెందినది?
ఎ) మొబైల్ బ్యాంకింగ్
బి) ఈ-వాలెట్
సి) వాచ్ బ్యాంకింగ్
డి) వెంచర్ క్యాపిటల్
13. నూతన వ్యవస్థాపకులకు బ్యాంకులు ఏ రకమైన నిధులను సమకూర్చుతున్నది?
ఎ) మ్యూచువల్ ఫండ్స్
బి) వెంచర్ క్యాపిటల్
సి) చందాపూచి డి) పైవన్నీ
14. ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్‌ను అమలు చేస్తున్నాయి?\
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
15. బ్యాంకింగ్ వ్యవస్థ అధునీకరణలో భాగం?
ఎ) చందాపూచీ సేవలు
బి) మర్చెంట్ బ్యాంకింగ్
సి) రిటైల్ బ్యాంకింగ్ డి) పైవన్నీ
16. ఫ్యాక్టరింగ్ సేవలు అందిస్తున్న బ్యాంకులు ఏవి?
ఎ) స్టేట్ బ్యాంక్ బి) కెనరాబ్యాంక్
సి) ఎ, బి
డి) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
17. ఏటీఎం ను రూపొందించినది ఎవరు?
ఎ) జాన్ షెపర్డ్బారెన్ బి) బార్క్లెస్
సి) ఎన్ఫీల్డ్ డి) షాంఘై
18. ఏటీఎంను మొట్టమొదట ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) 1967 – లండన్
బి) 1965 – ఇంగ్లండ్
సి) 1967- షాంఘై
డి) 1987 – ముంబై
19. భారతదేశంలో స్మార్ట్ కార్డ్‌ను మొదట పరిచయం చేసిన బ్యాంక్ ఏది?
ఎ) ఎస్బీఐ బి) హెచ్డీఎఫ్సీ
సి) దేనాబ్యాంక్ డి) ఐసీఐసీఐ
20. భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మొదటగా ప్రారంభించిన బ్యాంక్ ఏది?
ఎ) ఎస్బీఐ బి) ఐసీఐసీఐ
సి) హెచ్డీఎఫ్సీ డి) యూటీఐ
21. అంధ ఖాతాదార్ల కోసం మాట్లాడే ఏటీఎంను ఏర్పాటు చేసిన భారతీయ బ్యాంక్ ఏది?
ఎ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) యూనిట్ ట్రస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
22. ఈ-మనీ అంటే ?
ఎ) ఎలక్ట్రానిక్ మనీ బి) ఎమర్జెన్సీ మనీ
సి) ఈజీమనీ డి) పైవన్నీ
23. ఏటీఎంను రూపొందించిన జాన్షెపర్డ్ బారెన్ ఏ దేశానికి చెందిన వారు?
ఎ) అమెరికా బి) బ్రిటన్
సి) రష్యా డి) ఇటలీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు