భూ సరిహద్దును, తీర రేఖను కలిగి ఉన్న రాష్ట్రాలేవి?
అంతర్జాతీయ భూ సరిహద్దులు :
- కేంద్ర హోం శాఖలోని సరిహద్దు నిర్వహణ విభాగం (Department of Border Manage ment) 2019-20 వార్షిక నివేదిక ప్రకారం భారతదేశపు మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు 15,106.7 కిలోమీటర్లు.
- భారతదేశంతో పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ ఈ విధంగా ఏడు దేశాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి.
- మొత్తం 7 దేశాలతో భారత్‌లోని 16 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి.
- భారతదేశం ప్రపంచంలో 3వ అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది.
- 1) చైనా – సరిహద్దు పొడవు – 22,147 కిలోమీటర్లు
- 2) రష్యా – సరిహద్దు పొడవు – 20,017 కిలోమీటర్లు
- భారత్‌కు సరిహద్దుగా ఉన్న దేశాలు : 7 అవి
1) పాకిస్థాన్ – పాకిస్థాన్‌తో సరిగహద్దుగా ఉన్న రాష్ర్టాలు 4 కేంద్ర పాలిత ప్రాంతం 1 – మొత్తం 5
- 1. జమ్ము కశ్మీర్
- 2. లఢఖ్
- 3. రాజస్థాన్
- 4. పంజాబ్
- 5. గుజరాత్
- మొత్తం సరిహద్దు పొడవు (పాకిస్థాన్-భారత్ మధ్య) 3323 కిలో మీటర్లు.
- పాకిస్థాన్‌తో ఎక్కువ పొడవైన సరిహద్దును రాజస్థాన్ రాష్ట్రం, తక్కువ పొడవు సరిహద్దును పంజాబ్
- రాష్ట్రం పంచుకుంటున్నాయి.
2) ఆఫ్గానిస్థాన్ : ఆఫ్గానిస్థాన్‌తో సరిహద్దు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం – లఢఖ్
- ఆఫ్గానిస్థాన్‌ల మధ్య సరిహద్దు పొడవు 106 కిలోమీటర్లు.
- భారత్‌తో తక్కువ పొడవైన సరిహద్దును పంచుకుంటున్న దేశం ‘ఆఫ్గానిస్థాన్’
3) చైనా: చైనాతో సరిహద్దును కలిగిన రాష్ట్రాలు 4
- 1. అరుణాచల్ ప్రదేశ్
- 2. హిమాచల్‌ప్రదేశ్
- 3. ఉత్తరాఖండ్
- 4. సిక్కిం
- కేంద్ర పాలిత ప్రాంతం 1 – లఢఖ్
- చైనాతో ఎక్కువ సరిహద్దు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్, తక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం సిక్కిం.
- చైనాల మధ్య సరిహద్దు పొడవు 3488 కిలోమీటర్లు.
4) నేపాల్: నేపాల్‌తో సరిహద్దును కలిగిన రాష్ర్టాలు ఐదు
- 1. ఉత్తరాఖండ్, 2. ఉత్తరప్రదేశ్, 3. బీహార్, 4. పశ్చిమ బెంగాల్, 5. సిక్కిం
- భారత్, నేపాల్ మధ్య సరిహద్దు పొడవు 1751 కిలోమీటర్లు.
- నేపాల్‌తో పొడవైన సరిహద్దును బీహార్, తక్కువ పొడవైన సరిహద్దును పశ్చిమబెంగాల్ పంచుకుంటున్నాయి.
5) భూటాన్ : భూటాన్‌తో సరిహద్దును కలిగిన రాష్ర్టాలు నాలుగు.
- 1. సిక్కిం
- 2. పశ్చిమ బెంగాల్
- 3. అసోం
- 4. అరుణాచల్ ప్రదేశ్
- భారత్, భూటాన్‌ల మధ్య సరిహద్దు పొడవు 699 కిలోమీటర్లు.
- భూటాన్‌తో అతి పొడవైన సరిహద్దును అసోం, తక్కువ పొడవైన సరిహద్దును సిక్కిం రాష్ర్టాలు పంచుకుంటున్నాయి.
6) బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్‌తో సరిహద్దును కలిగిన రాష్ర్టాలు ఐదు.
- 1. పశ్చిమబెంగాల్
- 2. మేఘాలయ
- 3. అసోం
- 4. త్రిపుర
- 5. మిజోరాం
- భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సరిహద్దుపొడవు 4,096 కిలోమీటర్లు.
- బంగ్లాదేశ్‌తో పొడవైన సరిహద్దును పశ్చిమబెంగాల్ రాష్ట్రం, తక్కువ పొడవైన సరిహద్దును అసోం రాష్ట్రం పంచుకుంటోంది.
- భారత్‌తో ఎక్కువ అతి పొడవైన భూసరిహద్దను కలిగిన దేశం బంగ్లాదేశ్.
7) మయన్మార్ : మయన్మార్‌తో సరిహద్దు కలిగిన రాష్ర్టాలు నాలుగు
- 1.అరుణాచల్ ప్రదేశ్
- 2.నాగాలాండ్
- 3.మణిపూర్
- 4.మిజోరాం
- భారత్, మయన్మార్ మధ్య సరిహద్దు పొడవు 1643 కిలోమీటర్లు
- (భూటాన్‌తో ) మయన్మార్‌తో పొడవైన సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్,
- తక్కువ పొడవు సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం నాగాలాండ్.
- భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ భూసరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ .
మూడువైపుల 3 దేశాలు సరిహద్దుగా కలిగిన రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
- 1. లఢఖ్ : పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, చైనా
- 2. సిక్కిం : నేపాల్, చైనా, భూటాన్
- 3. ఆరుణాచల్‌ప్రదేశ్ : భూటాన్, చైనా, మయన్మార్
- 4. పశ్చిమ బెంగాల్ : నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్
ఒకే దేశంతో(బంగ్లాదేశ్) మూడు వైపులా సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం – త్రిపుర
రెండు దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ర్టాలు 3
- 1. ఉత్తరాఖండ్ : చైనా, నేపాల్
- 2. మిజోరాం : బంగ్లాదేశ్, మయన్మార్
- 3. అసోం : భూటాన్, బంగ్లాదేశ్
అంతర్జాతీయ భూ, జల సరిహద్దులను కలిగిన రాష్ర్టాలు రెండు
- 1. గుజరాత్ : పాకిస్థాన్, అరేబియా సముద్రం.
- 2. పశ్చిమ బెంగాల్: బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, బంగాళఖాతం
1) భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు – వివాదాలు
- 1947లో సర్ రాడ్క్లిప్ అనే బ్రిటిష్ ఇండియన్ భారతదేశం, పాకిస్థాన్‌లను సరిహద్దు రేఖతో విభజించారు.
- భారత్ – పాకిస్థాన్, నేటి బంగ్లాదేశ్ – భారత్‌ల మధ్య అంతర్జాతీయ సరిహద్దును సర్ రాడ్‌క్లిఫ్ రేఖగా పిలుస్తారు.
2) సియాచిన్ హిమనదం (Siachin Glacier)
- ఈ హిమనదం కారకోరం శ్రేణిలో 5400 మీటర్లు ఎత్తుతో విస్తరించి ఉంది.
- ధృవప్రాంతాల బయట సియాచిన్ హిమనదం (76 కిలోమీటర్లతో) ప్రపంచంలోనే రెండవ పొడవైన
- హిమనదిగా నిలిచింది. మొదటిది 77 కిలోమీటర్లుతో ఫెడ్చెంకో హిమనదం తజకిస్థాన్‌లో ఉంది.
- హిమనదాలతో కూడిన కారకోరం శ్రేణిని భూమి మూడవ ధృవం (Third pole) గా పిలుస్తారు.
- 1972 సిమ్లా ఒప్పదం ప్రకారం సియాచిన్ ప్రాంతాన్ని సైన్యరహిత ప్రాంతంగా గుర్తించారు.
- 1980లో పాకిస్థాన్ సియాచిన్ హిమనదం పైకి పర్వతారోహకులకు అనుమతించడంతో భారత సైన్యం 13 ఏప్రిల్ 1984న ఆపరేషన్ మేఘదూత్ ద్వారా సియాచిన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది.
- ఫలితంగా సియాచిన్ హిమనదం ప్రపంచంలోనే అత్యంత ఎతైన యుద్ధక్షేత్రంగా నిలిచింది.
- ఈ ప్రదేశాన్ని భారత్, పాకిస్థాన్ సరిహద్దును (AGPL- Actual Ground Position Line)గా పిలుస్తారు.
3) సర్ క్రీక్ వివాదం (Sir Creek Dispute)
- భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సన్నని జల భాగాన్ని క్రీక్ అంటారు.
- ఉదాహరణకు- సర్ క్రీక్, కోరి క్రీక్, పీర్ క్రీక్.
- కచ్ ప్రాంతానికి, పాకిస్థాన్‌లోని సింధు రాష్ర్టానికి మధ్యలోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతం ఈ సర్‌క్రీక్
- దీనినే స్థానికంగా బాన్ గంగా అని పిలుస్తారు.
24 డిగ్రీల సమాంతర రేఖ వివాదం (24Degrees parallel Dispute):
- రాణ్ ఆఫ్ కచ్ 9000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 8000 చదరపు కిలోమీటర్ల భూ భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించి సరిహద్దు నిర్ణయంలో భాగంగా 24 డిగ్రీల రేఖను సమాంతర రేఖగా పాకిస్థాన్ ప్రతిపాదన చేసినప్పటికీ భారత్ దానిని అంగీకరించలేదు.
- దీనినే 24 డిగ్రీల రేఖ వివాదం అంటారు.
2) భారత్ – ఆఫ్గానిస్థాన్ సరిహద్దు :
- డ్యూరాండ్ (Durand) రేఖను 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా, ఆఫ్గానిస్థాన్ రాజు మధ్య ఒప్పదంతో ఏర్పాటు చేశారు.
3) భారత్ – నేపాల్ మధ్య ఒప్పదం :
- 1816లో నేపాల్, భారత్‌ల మధ్య జరిగిన సుగౌలి ఒప్పదం (Treaty of sugauli) మేరకు కాళి, నారాయణి (గండక్) నదుల ప్రాంతాలను సరిహద్దుగా గుర్తించారు.
- సుగౌలి ప్రస్తుతం బీహార్‌లోని ఒక పట్టణం.
- భారత్ – నేపాల్ శాంతి, స్నేహపూర్వక ఒప్పదం 1950లో జరిగింది.
- ఉతరాఖండ్ , నేపాల్‌కు మధ్య సరిహద్దుగా కాళి నదిని గుర్తించారు. కానీ, ఈ నది తరచుగా తన ప్రవాహాన్ని మార్చుకుంటోంది.
- కాళి నది ఉత్తరాన కాలాపాని లోతు (ఉత్తరాఖండ్), లింపియదుర, లిపులేఖ్ ప్రాంతాలతో కూడిన త్రిముఖ కూడలి ని నేపాల్ తమవిగా వివాదాన్ని సృష్టిస్తోంది.
- 2015లో అమలులోకి వచ్చిన నేపాల్ కొత్త రాజ్యాంగం ప్రకారం 2020 మేలో విడు దల చేసిన మ్యాప్‌లో పై మూడు ప్రాంతాలను తమ దేశంలోనివిగా చూపించింది.
4) భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం :
- భారతదేశ మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దులో 27.11 శాతం సరిహద్దును బంగ్లాదేశ్‌తో కలిగి ఉంది.
- ఈ రేఖను త్రిపుర, బంగ్లాదేశ్ మధ్య ‘జీరో లైన్ బార్డర్’ (Zero Line Border) అంటారు.
- 1970 వరకు పాకిస్థాన్‌లో భాగంగా ఉన్న తూర్పు పాకిస్థాన్ భారత్ సహకారంతో 1971లో స్వాతంత్య్రం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది.
- భారత్ – బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద నదులు ‘తీస్తా’ ‘ఫెని’
- భారత్ – బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద దీవులు ‘న్యూమూర్’ (newmoor) దీవులు.
మాదిరి ప్రశ్నలు
1. ఈ కింది వాక్యాలలో సరైనది గుర్తించండి. (ఎ)
1. అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు 15,106.7 కిలోమీటర్లు.
2. పాకిస్థాన్‌తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం గుజరాత్
3. భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య అత్యంత పొడవైన సరిహద్దు ఉంది.
4. భారతదేశం ఆఫ్గానిస్థాన్‌తో అత్యంత తక్కువ సరిహద్దును కలిగి ఉంది.
ఎ) 1,4,3 బి) 2,3,4
సి) 1,2,3 డి) 2,1,4
2. ఏ రాష్ట్రం మూడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది ? (సి)
ఎ. జమ్ము-కశ్మీర్ బి. తెలంగాణ
సి. సిక్కిం డి. మేఘాలయ
3. భారతదేశంతో ఏ దేశం ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటోంది? (డి)
ఎ. మయన్మార్ బి. భూటాన్
సి. పాకిస్థాన్ డి. చైనా
4. భారతదేశం మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవులో 23 శాతం సరిహద్దును ఏ దేశం పంచుకుంటోంది ? (ఎ)
ఎ. చైనా బి. బంగ్లాదేశ్
సి. నేపాల్ డి. పాకిస్థాన్
5. సరికాని జతను గుర్తించండి . (డి)
దేశాలు భూ సరిహద్దుకలిగిన రాష్ట్రం
ఎ. భూటాన్ – అసోం
బి. పాకిస్థాన్ – రాజస్థాన్
సి. మయన్మార్ – అరుణాచల్‌ప్రదేశ్
డి. బంగ్లాదేశ్ – అసోం
6. భారతదేశంలోని ఎన్ని జిల్లాలు ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి ? (సి)
ఎ. 90 జిల్లాలు బి. 85 జిల్లాలు
సి. 92 జిల్లాలు డి. 8 జిల్లాలు
7. ఏ రాష్ర్టాలు భూ సరిహద్దును, తీర రేఖను కలిగి ఉన్నాయి ? (బి)
ఎ. గుజరాత్, రాజస్థాన్ బి. పశ్చిమ బెంగాల్, గుజరాత్
సి. పశ్చిమ బెంగాల్, ఒడిషా డి. ఒడిషా, గుజరాత్
8. ఏ దేశంతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును కలిగి లేదు ?(సి)
ఎ. భూటాన్ బి. చైనా
సి. నేపాల్ డి. మయన్మార్
9. భారతదేశంలో నూతనంగా 2019లో ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలు (బి)
1) పుదిచ్చేరి 2) ఛండీగఢ్
3) జమ్మూ కశ్మీర్ 4) లఢఖ్
ఎ) 1,2 బి) 3,4
సి) 1,4 డి) 2,3
10. భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది? (సి)
ఎ) పాకిస్థాన్ బి) నేపాల్
సి) బంగ్లాదేశ్ డి) చైనా
11. భారతదేశంతో అతి తక్కువ పొడవైన సరిహద్దు ఉన్న దేశం ఏది? (డి)
ఎ) మయన్మార్ బి) నేపాల్
సి) భూటాన్ డి) ఆఫ్గానిస్థాన్
12. కిందివాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది?(డి)
ఎ) మేఘాలయ బి) లక్షదీవులు
సి) పశ్చిమబెంగాల్ డి) మణిపూర్
13. భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? (సి)
ఎ) కేరళ
బి) లక్షదీవులు
సి) గ్రేట్ నికోబార్
డి) లిటిల్ నికోబార్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు