బ్యాంకింగ్ రంగం – మైలురాళ్లు
1949, జనవరి 1: పార్లమెంటు చట్టం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకును జాతీయం చేశారు.
-1951, సెప్టెంబర్ 4: ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలను తీసుకుని అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వ ప్రకటన.
-1955, జూలై 1: ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్పు.
-1956: భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ ఆఫ్ ఇండియా) జాతీయం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ.
-1964, జూలై 3: భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ (IDBI) ఏర్పాటు.
-1969 జూలై 19: 14 బ్యాంకులను జాతీయం చేశారు. అవి.. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
-1973: విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టం (ఫెరా) అమల్లోకి వచ్చింది.
-1978, జనవరి 11: వెయ్యి, 5 వేలు, 10 వేల రూపాలయల నోట్లను చలామణి నుంచి తొలగించారు.
-1980, ఏప్రిల్ 15: ఆరు బ్యాంకులను జాతీయం చేశారు. అవి.. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, విజయా బ్యాంక్.
-1982: నాబార్డ్ (NABARD) ఏర్పాటు.
-1988, జూలై 9: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) ఏర్పాటు.
-1991, నవంబర్: బ్యాంకింగ్ రంగ సంస్కరణలపై ఎం. నరసింహం కమిటీ మొదటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం మూడేండ్లలో ఎస్ఎల్ఆర్ 25 శాతానికి తగ్గింపు. నాలుగేండ్లలో సీఆర్ఆర్ 10 శాతానికి తగ్గింపు.
-1993, జనవరి: విదేశీ మారకద్రవ్య నిరోధక చట్టానికి సవరణ. ప్రైవేటు రంగంలో బ్యాంకు ల ఏర్పాటుకు నియమనిబంధనల జారీ.
-1993, సెప్టెంబర్: పంజాబ్ నేషనల్ బ్యాంకు లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం.
-1994, మార్చి: ప్రైవేటు రంగంలో మొదటి బ్యాంకుగా యూటీఐ బ్యాంక్ ఏర్పాటు.
-1996, జూలై: బీమారంగాన్ని ప్రైవేటీకరించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (IRA) ఏర్పాటు.
-1999, నవంబర్ 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దేశంలో బంగారం డిమాండ్‌ను తట్టుకోవడానికి, బంగారం దిగుమతులను తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
-2000, అక్టోబర్ 21: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000, అక్టోబర్ 21 నుంచి 2000, నవంబర్ 26 వరకు ఇండియా మిలీనియం డిపాజిట్స్ (IMD) పథకాన్ని నిర్వహించింది.
-2002, నవంబర్ 14: కేరళకు చెందిన నెడుంగడి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమైంది.
-2003, సెప్టెంబర్: దేశంలోని పెద్ద బ్యాంకులు కలిసి నెలకొల్పిన ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (అస్సెట్ రీ కనస్ట్రక్షన్ కార్పొరేషన్) పనిచేయడం మొదలైంది. ఆర్థిక సంబంధ ఆస్తుల పునర్నిర్మాణానికి, సెక్యూరిటైజేషన్‌కు అనుమతిచ్చే చట్టాన్ని 2002లోనే ప్రభుత్వం తీసుకురాగా, ఆ చట్టం కింద ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఏర్పాటయ్యింది.
-2004: నిరర్థక ఆస్తులను పూర్తిగా తొలగించుకున్న తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నమోదైంది.
-2004, జూలై 26: గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనమైంది.
-2005, జూన్ 4: భారతీయ స్టేట్ బ్యాంక్ 200 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. బ్యాంక్ ద్విశతాబ్ది వేడుకలను ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు