ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరు?
1. రజాకార్ల దాష్టీకాలను చిత్రీకరించే ‘నక్క ఆండాళమ్మ ఉయ్యాల పాట’ను రచించింది ఎవరు?
ఎ) చెర్విరాల భాగయ్య
బి) గడ్డం సారయ్య
సి) చందాల కేశవదాసు
డి) బల్ల గౌతయ్య
2. కింది వాటిని సరిగ్గా జతపరచండి?
ఎ. ఇత్తడికళ 1. హైదరాబాద్
బి. సిల్వర్ ఫిలిగ్రీ 2. పెంబర్తి
సి. ఇక్కత్ వస్త్రకళ 3. పోచంపల్లి
డి. బిద్రి వస్తువులు 4. కరీంనగర్
ఎ) ఎ-4, బి-2, సి-3, డి-1
బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-1, బి-2, సి-3, డి-4
డి) ఎ-2, బి-4, సి-3, డి-1
3. తెలంగాణలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ గద్దెలకు సమర్పించే నైవేద్యాన్ని సాధారణంగా ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) ప్రసాదం బి) బంగారం
సి) పసుపు కుంకుమ డి) పాయసం
4. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించి కిందివాటిని పరిశీలించి సరైన వాటిని గుర్తించండి?
1. శ్రీ కృష్ణకమిటీ తన నివేదికను 9 అధ్యాయాలు, 505 పేజీలతో 2010 డిసెంబర్ 30న కేంద్ర హోంశాఖకు సమర్పించింది
2. శ్రీకృష్ణ కమిటీలో వీకే దుగ్గల్, డాక్టర్ రణ్‌భీర్ సింగ్, డాక్టర్ అబూసలే షరీఫ్, డాక్టర్ రవీందర్ కౌర్‌లు జస్టిస్ శ్రీకృష్ణతో పాటు సభ్యులుగా ఉన్నారు
3. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచాలని చెప్పింది
4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నింటికంటే వెనుకబడిన ప్రాంతం తెలంగాణ అని, ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకన్నా వెనుకబాటుకు గురయిందని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో చెప్పింది.
ఎ) 1, 2, 3, 4, బి) 1, 2, 3
సి) 2, 3, 4 డి) 1, 3, 4
5. 1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు ప్రత్యేకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏ సంవత్సరం వరకు కొనసాగాలని నిర్ణయించారు?
ఎ) 1958 బి) 1961
సి) 1962 డి) 1959
6. కింది వాటిని సరిగ్గా జతపరచండి?
ఎ. ఆదివాసీ హక్కుల పోరాట సమితి 1. మోకు దెబ్బ
బి. వడ్డెర హక్కుల పోరాట సమితి 2. చాకిరేవు దెబ్బ
సి. గౌడ జనహక్కుల పోరాట సమితి 3. తుడుం దెబ్బ
డి. చాకలి హక్కుల పోరాట సమితి 4. గన్ను దెబ్బ
ఎ) ఎ-3, బి-1, సి-4, డి-2 బి) ఎ-3, బి-1, సి-4, డి-2
సి) ఎ-3, బి-4, సి-1, డి-2 డి) ఎ-2, బి-1, సి-3, డి-4
7. 2010 జనవరి 30న విద్యార్థి జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది?
ఎ) విద్యార్థి గర్జన బి) విద్యార్థి రణభేరి
సి) విద్యార్థి పొలికేక డి) విద్యార్థి యుద్ధబేరి
8. కింది వాటిని సరిగ్గా జతపరచండి?
ఎ. సకలజనుల సమ్మె 1. 2011, ఫిబ్రవరి 17
బి. సహాయ నిరాకరణ ప్రారంభం 2. 2011, సెప్టెంబర్ 13
సి. మిలియన్ మార్చ్ 3. 2013 మార్చి 21
డి. సడక్ బంద్ 4. 2011 మార్చి 10
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4 బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-1, డి-2 డి) ఎ-3, బి-4, సి-1, డి-2
9. తెలంగాణ సమస్యపై అచ్చయిన మొదటి పరిశోధనాత్మక గ్రంథం?
ఎ) తెలంగాణ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్
బి) తెలంగాణ ప్రాబ్లమ్ అండ్ సెపరేట్ స్టేట్
సి) తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇన్ జస్టిస్
డి) తెలంగాణ మూవ్మెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్
10. 2005లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృతమైన సంప్రదింపుల కోసం ఎవరి అధ్యక్షతన ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది?
ఎ) ఎం చిదంబరం బి) ఏకే ఆంటోని
సి) ప్రణబ్ ముఖర్జీ
డి) సుశీల్ కుమార్ షిండే
11. 1969 మార్చిలో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో జరిగిన తెలంగాణ కన్వెన్షన్‌కు ఎవరు అధ్యక్షత వహించారు?
ఎ) టీ సదాలక్ష్మి బి) కొండా లక్ష్మణ్
సి) రావాడ సత్యనారాయణ రావు
డి) మురళీధర్ దేశ్‌పాండే
12. 1969 జనవరి 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 36కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి?
1. 1969 జనవరి 19న ముఖ్యమంత్రి నివాసమైన ఆనంద నిలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశ ఫలితంగా ఈ జీవో విడుదలైంది
2. ఈ జీవో ప్రకారం 1969 ఫిబ్రవరి 28 లోగా తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా తెలంగాణకు కేటాయించిన పోస్టుల్లో నియమితులైన నాన్ ముల్కీలను సర్వీసుల నుంచి రిలీవ్ చేయాలి
3. జీవో 36 సూచించిన ఆదేశాలను అమలు పరిచే బాధ్యతను ఐఏఎస్ అధికారులైన ఐజే నాయుడు, ఆర్ విఠల్రావులకు అప్పగిస్తూ అదే జీవోలో పేర్కొన్నారు
4. 1969 జనవరి 21న ఇచ్చిన జీవో 36 రాజ్యాంగ విరుద్ధం అని జస్టిస్ చిన్నప రెడ్డి తీర్పు చెప్పారు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
13. జిందా తిలస్మాత్ అనేది ఒక?
ఎ) యునాని సంబంధిత ఔషధం
బి) ఆయుర్వేద సంబంధిత ఔషధం
సి) హోమియోపతి సంబంధిత ఔషధం
డి) అల్లోపతి సంబంధిత ఔషధం
14. సీత్లా భవానీ, తీజ్ పండుగలను సాధారణంగా ఏ తెగవారు జరుపుతారు?
ఎ) కోయలు బి) చెంచులు
సి) లంబాడాలు డి) కొండరెడ్లు
15. రయ్యత్ పత్రిక సంపాదకుడు?
ఎ) మందముల నర్సింగరావు
బి) షోయబుల్లాఖాన్
సి) మీర్ హసనుద్దీన్
డి) అడవి బాపిరాజు
16. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం ఏ సంవత్సరంలో చేశారు?
ఎ) 1949 బి) 1950
సి) 1956 డి) 1948
17. విశాలాంధ్ర ఆలోచన వెనుక దుర్రాకమణోద్దేశ పీడిత సామ్రాజ్య వాదతత్వం దాగి ఉన్నదని వాఖ్యానించింది ఎవరు?
ఎ) కేవీ రంగారెడ్డి
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) అంబేద్కర్
డి) ఫజల్ అలీ
18. తెలంగాణ రక్షణలు అమలు కోసం 1969 జనవరి 8న ఖమ్మం జిల్లా పాల్వంచలో గాంధీచౌక్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేసిన వ్యక్తి?
ఎ) అన్నాబత్తుల రవీంద్రనాథ్
బి) కొలిశెట్టి రామదాసు
సి) కే రామసుధాకర్ రాజు
డి) శ్రీధర్‌రెడ్డి
19. ‘కోడెను కట్టు’ సాంప్రదాయం తెలంగాణలో ఏ దేవాలయంలో ఉంది?
ఎ) రాజరాజేశ్వర దేవాలయం- వేములవాడ
బి) ఛాయా సోమేశ్వర దేవాలయం- నల్లగొండ (పానగల్లు)
సి) వీరభద్ర దేవాలయం- కురవి
డి) లక్ష్మీనరసింహస్వామి ఆలయం- యాదగిరి గుట్ట
20. బతుకమ్మలో ఏ పువ్వును ప్రధానంగా వినియోగిస్తారు?
ఎ) గానుగ బి) గులాబి
సి) శనగ డి) గునుగు
21. కిందివాటిని జతపరచండి?
ఎ. ది బ్రోకెన్ వింగ్స్ 1. కేఎం మున్షీ
బి. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ 2. సరోజినీ నాయుడు
సి. ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా 3. లాయక్ అలీ
డి. హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ 4. అలీ యావర్ జంగ్
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4 బి) ఎ-2, బి-1, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1 డి) ఎ-4, బి-2, సి-1, డి-3
22. కవులు, వారు రాసిన పాటలతో జతపరచండి?
ఎ. సుద్దాల హనుమంతు 1. రాజిగ ఒరె రాజిగా
బి. గూడ అంజయ్య 2. పల్లెటూరి పిల్లగాడ
సి. అందెశ్రీ 3. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా
డి. మిట్టపల్లి సురేందర్ 4. సూడచక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4 బి) ఎ-4, బి-3, సి-1, డి-2
సి) ఎ-1, బి-4, సి-3, డి-1 డి) ఎ-2, బి-1, సి-4, డి-3
23. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చిన విద్యార్థి నాయకుడు?
ఎ) మల్లికార్జున బి) శ్రీధర్ రెడ్డి
సి) రఘోత్తం రెడ్డి డి) పోటు కృష్ణమూర్తి
24. ‘ఓటమి తిరుగుబాటు’ కవితా సంకలనం ఎవరు రచించారు?
ఎ) చెరబండరాజు బి) అలిశెట్టి ప్రభాకర్
సి) జ్వాలాముఖి డి) నిఖిలేశ్వర్
25. ‘తెలుగుదేశం పారీ’్టని ఎన్టీఆర్ ఏ సంవత్సరంలో స్థాపించాడు?
ఎ) 1982 బి) 1983
సి) 1984 డి) 1981
26. రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1970 బి) 1984
సి) 1992 డి) 1974
27. 1906లో ‘జగన్ మిత్రమండలి’ని ఎవరు స్థాపించారు?
ఎ) జస్టిస్ జగన్మోహన్ రెడ్డి
బి) భాగ్యరెడ్డి వర్మ
సి) ఎం.ఎల్ ఆదయ్య
డి) మాడపాటి హనుమంతరావు
28. తెలంగాణలో సాధారణంగా ‘అటికె’ అంటే?
ఎ) జంతువు పేరు
బి) మట్టిపాత్ర
సి) ఒక వ్యవసాయ పరికరం
డి) నీటిని నిల్వ ఉంచే వస్తువు
29. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్?
ఎ) కే స్వామిగౌడ్
బి) మధుసూదనాచారి
సి) పద్మాదేవేందర్ రెడ్డి
డి) విద్యాసాగర్
30. 29-11-2009న కేసీఆర్ తన ఆమరణ నిరాహారదీక్ష ఎక్కడ చేయాలని నిర్ణయించారు?
ఎ) రంగధాంపల్లి (సిద్దిపేట)
బి) అలుగునూరు
సి) ఖమ్మం
డి) హైదరాబాద్
31. తెలంగాణ డాక్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 2013 మే 19న వైద్యుల శంఖారావం ఎక్కడ జరిగింది?
ఎ) హైదరాబాద్ బి) వరంగల్
సి) ఖమ్మం డి) వికారాబాద్
32. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనతో సంబంధం లేని వ్యక్తి?
ఎ) బీఎస్ రాములు
బి) బీవీఆర్ చారి
సి) గణపతి స్థపతి
డి) ప్రొఫెసర్ గంగాధర్
33. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ‘పోరుయాత్ర’ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కొనసాగింది?
ఎ) కృష్ణా నుంచి భద్రాచలం వరకు
బి) చేవెళ్ల నుంచి నిర్మల్ వరకు
సి) జోడెఘాట్ నుంచి అమరవీరుల స్థూపం వరకు
డి) హైదరాబాద్ నుంచి నిర్మల్ వరకు
34. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదాన్ని తొలిసారిగా కేసీఆర్ ఎప్పుడు ఇచ్చారు?
ఎ) సింహగర్జన సభ, కరీంనగర్
బి) నిజాం కాలేజీ సభ, హైదరాబాద్
సి) తెలంగాణ ఉద్యోగ గర్జన సభ, సిద్దిపేట
డి) మిలియన్ మార్చ్, హైదరాబాద్
35. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పటేల్-పట్వారీ వ్యవస్థలను రద్దు చేసిన ముఖ్యమంత్రి?
ఎ) నారా చంద్రబాబునాయుడు
బి) ఎన్టీ రామారావు
సి) వైఎస్ఆర్
డి) కాసు బ్రహ్మానందరెడ్డి
36. కింది వాటిని సరిగ్గా జతపరచండి?
ఎ. మన్నెంకొండ జాతర 1. లక్ష్మీ నర్సింహస్వామి
బి. బెజ్జంకి జాతర 2. వేంకటేశ్వర స్వామి
సి. కొమురవెల్లి జాతర 3. మల్లన్న దేవుడు
డి. గొల్లగట్టు జాతర 4. లింగమంతుల స్వామి
ఎ) ఎ-2, బి-1, సి-4, డి-3
బి) ఎ-2, బి-4, సి-3, డి-1
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
37. 1947 డిసెంబర్ 7న నిజాంపై బాంబు దాడి సంఘటనతో సంబంధం లేని వ్యక్తిని గుర్తించండి?
ఎ) నారాయణరావు పవార్
బి) మాడపాటి హన్మంతరావు
సి) జగదీశ్ ఆర్య
డి) గండయ్య
38. 1938 హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన వందేమాతర ఉద్యమ ఫలితంగా అడ్మిషన్ కోల్పోయిన విద్యార్థులకు ఏ యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చింది?
ఎ) ఆంధ్రా యూనివర్సిటీ
బి) నాగ్‌పూర్ యూనివర్సిటీ
సి) అలీఘర్ యూనివర్సిటీ
డి) ఏదీకాదు
సమాధానాలు
1-డి, 2-డి, 3-బి, 4-బి 5-సి, 6-సి, 7-ఎ, 8-బి 9-డి, 10-సి 11-ఎ, 12-డి 13-ఎ, 14-సి, 15-ఎ, 16-బి 17-బి, 18-ఎ, 19-ఎ, 20-డి 21-ఎ, 22-డి, 23-బి, 24-సి
25-ఎ, 26-డి, 27-బి, 28-బి 29-బి, 30-ఎ 31-డి, 32-సి 33-ఎ, 34-సి, 35-బి, 36-సి
37.బి 38.బి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు