ఎస్టీ గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

– 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాలకు
– వచ్చే నెల 31న రాత పరీక్ష
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆదివారం తెలిపారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 9వ తరగతిలో, వికారాబాద్ జిల్లా పరిగి, ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 8వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి జూలై 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31న రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పాఠశాలలవారీగా ఖాళీల వివరాలను www.tswreis.ac.in, www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లలో పెట్టినట్టు తెలిపారు.
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇన్కాయిస్ లో సైంటిస్ట్ పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ