వ్యవసాయ కోర్సులు
ఎవర్గ్రీన్ కెరీర్లో అగ్రికల్చర్ కోర్సులకు మొదటి స్థానం ఇవ్వొచ్చు. భూమ్మీద మనుషు లు ఉన్నంత వరకు ఈ రంగానికి ఢోకా ఉండదు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో అందరికీ ఆహారం అందించాలంటే ఈ రంగంలో నిపుణులు ఎంతైనా అవసరం. అగ్రికల్చర్ రంగంలో నూతన సాంకేతికత, కొత్త కొత్త ఆవిష్కరణల అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా….
ఏఐఈఈఏ-2022
-దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షే.. ఐకార్-ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఈఈఏ)-2022. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది.
ప్రవేశాలు కల్పించే కోర్సులు
– యూజీ (బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ న్యూట్రిషిన్ అండ్ డైటిక్స్, బీఎస్సీ ఆనర్స్ సెరికల్చర్, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బీటెక్ డైయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయో టెక్నాలజీ
– అర్హతలు: ఇంటర్లో బైపీసీ లేదా బైఎంపీ లేదా ఎంపీసీ, ఇంటర్ అగ్రికల్చర్ ఉత్తీర్ణత.
-పీజీ కోర్సులు: ప్లాంట్ బయో టెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అగ్రోఫారెస్ట్రీ అండ్ సిల్వికల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటె క్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్సెస్, ఫిషరీ సైన్స్, డైయిరీ సైన్స్, డైయిరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్.
ఏఐసీఈ జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ) స్పెషలైజేషన్లు
-జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్రూట్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటర్అప్లికేషన్స్ తదితర 70 రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి.
అర్హతలు: పీజీ కోర్సులకు డిగ్రీ, పీహెచ్డీ కోర్సులకు పీజీఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.
ప్రవేశాలు కల్పించే సంస్థలు: దేశవ్యాప్తంగా 79 అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, 64 వెటర్నరీ, హార్టికల్చరల్, ఫిషరీస్ యూనివర్సిటీలు, 4 డీమ్డ్ యూనివర్సిటీలు, 3 సెంట్రల్ యూనివర్సిటీలు తదితరాలు.
పరీక్ష విధానం
-యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఉంటుంది.
-ఇది ల్యాన్ బేస్డ్ సీబీటీ
– పరీక్ష సమయం 2.30 గంటలు
-మొత్తం ప్రశ్నలు 150. ఇవి మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు, తప్పు జవాబుకు -1 మార్కు కోత విధిస్తారు.
– ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 19
వెబ్సైట్: https://icar.nta. nic.in
– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు