అఫ్లియేటెడ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి 6వేల దరఖాస్తులు
జేఎన్టీయూ ఆధ్వర్యంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అఫిలియేషన్ల ప్రక్రియ వేగం పుంజుకున్నది. మరోపక్క వారం రోజుల్లో ఎంసెట్ ఫలితాలు విడుదల చేసి, వెంటనే అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ లోగా అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా ఆయా కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. అఫిలియేషన్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. జేఎన్టీయూ పరిధిలో ఉన్న దాదాపు 140 అఫిలియేటెడ్ ఇంజినీరింగ్ కాలేజీల్లో నియామకాల కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ స్సేన్ తెలిపారు. గుర్తింపు పొందిన ప్రైవేటు కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఈ నియామక ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు.
ఇంటర్వ్యూల నిర్వహణకు 20 నోడల్ కేంద్రాలు..
ఇంటర్వ్యూల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అభ్యర్థులకు అనుకూలంగా ఉండే విధంగా 20 నోడల్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, దీని వల్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులకు జేఎన్టీయూ కూకట్పల్లికి రావాల్సిన అవసరం లేదని అధికారులు అన్నారు. ఇంటర్వ్యూలకు రావాల్సిన సమయం, తేదీ, ఇంటర్వ్యూ నిర్వహించే నోడల్ కేంద్రానికి సంబంధించిన వివరాలను అభ్యర్థులకు తెలియజేస్తున్నామన్నారు. ఇందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో జేఎన్టీయూకి చెందిన సీనియర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ నామినితో పాటు ఒక అఫిలియేషన్ పొందిన కాలేజీలో సీనియర్ ప్రొఫెసర్గా పని చేస్తున్న వారికి ఇంటర్వ్యూ బోర్డు కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు