సివిల్స్ ప్రిలిమినరీ-21 కటాఫ్ విశ్లేషణ
ప్రతి సబ్జెక్ట్లోకాన్సెప్షన్, క్లారిటీ చాలా ఉండాలి
ఉదా: పాలిటీ తీసుకుంటే బేసిగ్గా పొలిటికల్ థియరీ ఇంటర్ ఫస్టియర్ ఎన్సీఈఆర్టీ బుక్‌లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతున్నాయి. అంటే కాన్సెప్ట్స్ బట్టి కాకుండా కాన్సెప్షన్ ప్రశ్నలు చాలా వచ్చాయి.
ఉదా: బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేస్తే అదే ఫైనల్. అక్కడ జ్యుడీషియరీ చట్టం ప్రశ్నించలేదు. అదే ఇండియన్ పార్లమెంట్ చట్టం చేస్తే జ్యుడీషియరీ క్వశ్చన్ చేస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా వాటిలో అంటే సమానత్వానికి సంబంధించిన అంశాలు. అదే విధంగా మన చట్ట సభలకు సంబంధించిన అంశాలు రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? వంటి చక్కటి అంశాలు అడిగారు. ఇలా ఎవరికయితే కాన్సెప్ట్స్‌పై క్లారిటీ ఉంటుందో వారు మాత్రమే ఆన్సర్ చేయగలరు. అందులో భాగంగానే ఈసారి మొత్తం ప్రిలిమ్స్ పేపర్ చూస్తే బేసిక్ జాగ్రఫీ అనుకుంటే అడవుల్లో రకాలు, నేలల రకాలు ఇలా 1999-2000లో ఇదే తరహాలో ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. వీటిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ప్రశ్నలు చూస్తే కోర్ కాన్సెప్ట్స్, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్స్ ఆర్గనైజేషన్స్ వంటి టాపిక్స్ అడిగారు. కొంచెం ట్రెండ్ మారింది. ఇంతకుముందు చూస్తే ఎన్విరాన్మెంట్స్కు సంబంధించి యానిమల్స్, బర్డ్స్ గురించి ఉండేది. సైన్స్ అండ్ టెక్నాలజీలో జెనెటిక్స్ బయోటెక్నాలజీ పై ఎక్కువ ఫోకస్ చేశారు. గతేడాది మాదిరిగానే ఈసారి ఊహించని విధంగా గతేడాది అగ్రికల్చర్‌కు సంబంధించి ఐదు ప్రశ్నలు ఈసారి కూడా వచ్చాయి. ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ రెండూ ఇంటర్ రిలేటెడ్పై ఫోకస్ చేశారు. ఈసారి కొన్ని బయాలజీ, కెమిస్ట్రీ జనరల్ సైన్స్ రిలేటెడ్ బిట్స్ కూడా కొన్ని వచ్చాయి. దీంతోపాటు యూపీఎస్సీలో 15 ఏండ్ల క్రితం ఒక ట్రెండ్ ఉండేది. ఒక 3, 4 స్పోర్ట్స్ క్వశ్చన్స్ అడిగేవారు. అయితే అది ఇప్పుడు తగ్గిపోయింది.
కానీ ఈసారి మూడు స్పోర్ట్స్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే స్పోర్ట్స్ నచ్చనివాళ్లు కూడా స్పోర్ట్స్‌ను ఫాలో కావాల్సిందే. జనరల్‌గా యూపీఎస్సీ ట్రెండ్ ప్రకారం ఇండెక్స్ (సూచీలు) ఎవరిస్తారు, పుస్తకాలు, వాటి రచయితలు మిలిటరీ ఎక్సర్సైజెస్లతో పాటు గవర్నమెంట్ అండ్ పాలసీస్ పై డైరెక్ట్ ప్రశ్నలు పెద్దగా రాలేదు. ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ ఇంటర్ మిక్సింగ్‌పై బాగా ఫోకస్ చేశారు. దీంతో పాటు కోర్ జాగ్రఫీపై దృష్టిపెట్టారు. హిస్టరీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉదాహరణకు ఐఎన్ఏలో ప్రేమ్సైగల్, షా నవాజ్‌ఖాన్, ఆర్ఎస్ థిల్లాన్ల పై డైరెక్ట్ ప్రశ్నలు. క్విట్ఇండియా ఉద్యమం ప్రారంభం పై ప్రశ్నలు వచ్చాయి. కొన్ని ప్రశ్నలు మోడ్రన్ ఇండియాకు సంబంధించి ఈజీ ప్రశ్నలు, మధ్యయుగానికి సంబంధించి కొన్ని కఠినప్రశ్నలు అడిగారు. వివిధ సబ్జెక్టుల్లో క్వశ్చన్ డివిజన్ చూస్తే కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి చాలావరకు ప్రత్యక్షంగా రాకపోయినా.. పరోక్షంగా మాత్రం ఉందనే చెప్పవచ్చు. 6, 7 క్వశ్చన్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నాయి. పాలిటీ నుంచి 15 వచ్చాయి. హిస్టరీలో 19, సైన్స్ అండ్ టెక్నాలజీ 18, ఎన్విరాన్మెంట్, బయాలజీ, బయోడైవర్సిటీ, జాగ్రఫీ, అగ్రికల్చర్ రిలేటెడ్ 25, ఎకానమీ నుంచి 15 వచ్చాయి. ఎకానమీలో బాగా ప్రిపేరైనవారు 8 ప్రశ్నలవరకు చేయవచ్చు. మొత్తంగా కటాఫ్ మార్కులు చూస్తే.. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఉండే అవకాశముంది. ఇంకా 2, 3 మార్కులు తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ పెద్దగా పెరిగే అవకాశం లేదు. కాబట్టి వీటి ప్రకారం చూస్తే 1, 2 మార్కులు అటుఇటుగా ఉండే అవకాశం ఉండవచ్చు. అంటే 80, 85 మార్కులకు అటు ఇటుగా ఉన్నవారు మెయిన్స్‌కు ప్రిపేర్ అవ్వచ్చు. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రిపరేషన్ సాగించవచ్చు.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు