పాలిటెక్నిక్‌లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా
– ఈ ఏడాదికి 113 పాలిటెక్నిక్ కాలేజీల్లో 26,822 సీట్లు
ఈ విద్యాసంవత్సరం 133 పాలిటెక్నిక్ కాలేజీల్లో 26 వేల సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీచేయనున్నారు. వీటిలో 11 వేల సీట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉండగా, 14 వేలకు పైగా సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి 113 పాలిటెక్నిక్ కాలేజీలకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిచ్చింది. వీటిలో 26,822 సీట్లకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది తొలిసారిగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తారు. మొదటి విడత కౌన్సెలింగ్ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్‌కు అవకాశమివ్వగా, తొలిరోజే 4,637 విద్యార్థులు స్లాట్ బుక్‌చేసుకున్నారు. 22 వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశమివ్వగా, 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. విద్యార్థులు https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.
కన్వీనర్ కోటా సీట్ల వివరాలు
(2022-23 విద్యా సంవత్సరానికి)
యాజమాన్యం విద్యాసంస్థలు సీట్లు
ప్రభుత్వ పాలిటెక్నిక్స్ 54 11,892
ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ 01 230
ప్రైవేట్ పాలిటెక్నిక్స్ 58 14,700
మొత్తం 113 26,822
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు