ప్రజల జీవితంలో మార్పు తీసుకువస్తాను…
- 355వ ర్యాంకర్
- సౌమిత్ రాజ్ కంచనపల్లి
కుటుంబం, విద్యాభ్యాసం
మాది హన్మకొండ జిల్లా, బాలసముద్రం. నాన్న భరత్ బాబు, అమ్మ ప్రవీణజ్యోతి బొటిక్ రన్ చేస్తుంది. చెల్లి టీసీఎస్ జాబ్. స్కూల్ ఎడ్యుకేషన్ వరంగల్‌లో సాగింది. ఇంటర్, ఇంజినీరింగ్ (ఐఐటీ హైదరాబాద్) హైదరాబాద్‌లో చదివాను.
ప్రైవేట్ జాబ్ చేస్తూ…
సివిల్స్ వైపు రావడానికి స్నేహితుడు సాయితేజ కారణం. బీటెక్ పూర్తయ్యాక ఫ్లిప్‌కార్ట్‌లో రెండు సంవత్సరాలు జాబ్ చేశాను. ఆ సమయంలో సాయితేజ సివిల్స్ ర్యాంకు సాధించాడు. అతడిని ఆదర్శంగా తీసుకుని.. నేను కూడా సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్నాను.
రెండో ప్రయత్నం
రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కోచింగ్ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపేరయ్యాను. ఎక్కువగా ఇంటర్నెట్ ఆన్లైన్ టెస్టులు, మాక్‌టెస్టులు అటెంప్ట్ చేశాను. ఇంటర్వ్యూ కోసం రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సార్ వాట్సప్ గ్రూప్ నుంచి చాలా నేర్చుకున్నాను.
ప్రిలిమ్స్, మెయిన్స్
ఆప్షనల్ సబ్జెక్ట్ పొలిటికల్‌సైన్స్ తీసుకున్నాను. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్‌కు వీలైనన్ని ఎక్కువ మాక్‌టెస్టులు రాస్తే చాలామంచిది. స్నేహితులతో సబ్జెక్ట్స్ పై చర్చించుకోవడం కూడా కలిసివచ్చింది. నోట్స్ రాసుకొని.. ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవాలి.
స్మార్ట్ వర్క్, సలహాలు, ఆత్మవిశ్వాసం, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలదొక్కుకుని ర్యాంకు సాధించాలని పట్టుదలతో ప్రయత్నించాను.
ఇంటర్వ్యూ
ఎయిర్ మార్షల్ అజిత్ బోస్లే సార్ బోర్డ్ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగం, వరంగల్ రామప్ప టెంపుల్, కొవిడ్ సెకండ్ వేవ్, క్వాంటమ్ కంప్యూటింగ్, గాంధీజీ, మార్క్స్ తత్వాల గురించి అడిగారు.
భవిష్యత్ లక్ష్యాలు, సలహాలు
విద్య, ఆరోగ్య రంగాల్లో తగినంత అభివృద్ధిని తీసుకురావాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా కృషిచేస్తాను. ఇంటర్నెట్ను సరైన పద్ధతిలో ఉపయోగించుకుని స్మార్ట్‌వర్క్ చేస్తే సివిల్స్ సాధించవచ్చు. చాలామందితో ఎలా చదవాలనే సలహాలు, సూచనలు తీసుకొని తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని చదవాలి.
-సూదగాని సత్యం గౌడ్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు