పుస్తకావిష్కరణ
జాతీయం
పుస్తకావిష్కరణ
‘ది స్టోరీ ఆఫ్ విప్రో’ అనే పుస్తకాన్ని విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ సెప్టెంబర్ 21న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని విప్రోలో మొదట్లో పనిచేసిన ఉద్యోగులు రచించగా వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్స్ ప్రచురించింది.
నేషనల్ సింగిల్ విండో సిస్టమ్
నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) పోర్టల్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పోర్టల్ వల్ల వ్యాపారాలను నమోదు చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన సమస్య తప్పుతుంది.
యూఏఈ విదేశాంగ మంత్రి
భారత పర్యటనలో భాగంగా యూఏఈ విదేశాంగ మంత్రి థాని బిన్ అహ్మద్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సెప్టెంబర్ 23న భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై చర్చించారు. 2022, మార్చిలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సమావేశం కానున్నారు.
ఈవీ చార్జింగ్ స్టేషన్
ప్రపంచంలోనే అత్యధిక ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్‌ను సెప్టెంబర్ 24న హిమాచల్ ప్రదేశ్, లాహౌల్, స్పితి జిల్లాలోని కాజా గ్రామంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ప్రారంభించారు. దీనిని 500 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు.
మెగా సదస్సు
అంతర్జాతీయ సహకార సంస్థల తొలి మెగా సదస్సును సెప్టెంబర్ 25న ఢిల్లీలో ప్రారంభించారు. సహకార శాఖ కేంద్ర మంత్రిగా పదవి స్వీకరించిన తరువాత అమిత్ షా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్ఎఫ్సీఓ-ఇఫ్కో), నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ-నాఫెడ్), క్రిషక్ భారతి కోఆపరేటివ్ (క్రిభ్కో) సంస్థలు ఈ సదస్సును నిర్వహించాయి.
అంతర్జాతీయం
జీ-4 సమావేశం
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జీ-4 దేశాల (భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్) విదేశాంగ మంత్రులు సెప్టెంబర్ 22న భేటీ అయ్యారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి కార్లోస్ ఆల్బెర్టో ఫ్రాంకో ఫ్రాంకా, జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్, జపాన్ విదేశాంగ మంత్రి మొతెగి తొషిమిట్సులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఐరాస సమావేశాలు సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించారు. ఈ సమావేశాలకు 76వ సెషన్స్ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్.
గ్లోబల్ కొవిడ్ సమ్మిట్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో ‘గ్లోబల్ కొవిడ్ సమ్మిట్’ను సెప్టెంబర్ 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కొవిడ్ వల్ల ఏర్పడిన ఆర్థిక కష్టాలను పరిష్కరించుకోవాలని, టీకాల ధ్రువపత్రాలకు పరస్పర ఆమోదాలు తెలుపుకోవాలని చర్చించారు.
భారత్, జపాన్, ఫ్రాన్స్‌లకు నో చాన్స్
ఆస్ట్రేలియా, యూకేలతో కలిసి ఏర్పాటు చేసిన త్రైపాక్షిక కూటమి (ఆకస్.. ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ)లో భారత్, ఫ్రాన్స్, జపాన్‌లను చేర్చుకోబోమని సెప్టెంబర్ 23న అమెరికా ప్రకటించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో 21వ శతాబ్దంలో ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, చైనా దూకుడును నిలువరించడానికి ఆకస్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా అమెరికా మొదటిసారిగా ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సమకూర్చనుంది.
సీఈవోలతో మోదీ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అడోబ్ సీఈవో శంతను నారాయణ్, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్, క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఇ ఎమాన్, ఫస్ట్ సోలార్ సీఈవో మార్క్ విద్మర్, బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీఫెన్ ఎ ష్వార్జమెన్లతో సెప్టెంబర్ 23న భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సీఈవోలు సుముఖత వ్యక్తం చేశారు.
క్వాడ్ దేశాల సమావేశం
క్వాడ్ ఫోర్స్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) అధినేత సమావేశం వాషింగ్టన్లో సెప్టెంబర్ 24న నిర్వహించారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని యోషిహిడెసుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌లు ఉగ్రవాదం నిర్మూలన, పేదరికం, కొవిడ్-19లపై చర్చించారు. క్వాడ్ ఫోర్స్‌ను 2004 సునామీ తర్వాత భవిష్యత్తులో అలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఏర్పాటు చేశారు.
వార్తల్లో వ్యక్తులు
మనోరమ మహాపాత్ర
ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మనోరమ మహాపాత్ర సెప్టెంబర్ 19న మరణించారు. 1934, జూన్ 10న ఒడిషాలో జన్మించిన ఆమె సమాజ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. 1984లో సాహిత్య అకాడమీ అవార్డు, 1988లో సోవియట్ నెహ్రూ అవార్డు, 1990లో భారత క్రిటిక్ అవార్డు, 1991లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సమ్మాన్ అవార్డు, 1994లో రూపంబర్ అవార్డు అందుకున్నారు.
చరణ్‌జీత్ సింగ్
పంజాబ్ కొత్త సీఎంగా దళిత నేత చరణ్‌జీత్ సింగ్ చన్నీ సెప్టెంబర్ 19న నియమితులయ్యారు. దీంతో పంజాబ్‌కు తొలి దళిత సీఎం అయ్యారు. చామ్‌కౌర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జస్టిన్ ట్రూడో
కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో 3వ సారి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 20న నిర్వహించిన ఎన్నికల్లో ట్రూడో నేతృత్వం వహించిన లిబరల్ పార్టీ 157 స్థానాల్లో గెలిచింది. ఆయన 2015 నుంచి అధికారంలో ఉన్నారు.
షేక్ హసీనా
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా సస్టెయినబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ప్రోగ్రెస్ అవార్డును సెప్టెంబర్ 21న న్యూయార్క్‌లో అందుకున్నారు. ఆమె ప్రముఖ ఆర్థికవేత్త, అభివృద్ధి వ్యూహకర్త ప్రొఫెసర్ జెఫ్రీ డీ సాచ్చ్ నేతృత్వంలో సుస్థిరమైన అభివృద్ధి ఆచరణాత్మక పరిష్కారాలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు లభించింది.
వివేక్‌రామ్ చౌధరి
భారత వైమానిక దళానికి కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ వివేక్‌రామ్ చౌధరి సెప్టెంబర్ 21న ఎన్నికయ్యారు. ప్రస్తుత ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందనున్నారు. వివేక్‌రామ్ పరమ్ విశిష్టా, అతి విశిష్టా, వాయుసేన పతకాలను అందుకున్నారు. 1982లో ఐఏఎఫ్ ఫైటర్‌గా నియమితులయ్యారు. ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ సఫేద్ సాగర్‌లో పాల్గొన్నారు.
రాజీవ్ బన్సల్
ఎయిర్ ఇండియా చీఫ్‌గా రాజీవ్ బన్సల్ సెప్టెంబర్ 23న నియమితులయ్యారు. 1988 ఐఏఎస్ నాగాల్యాండ్ కేడర్‌కు చెందినవారు. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖలో పనిచేశారు.
క్రీడలు
పంకజ్ అద్వాణీ
ఖతార్ రాజధాని బర్ 21న జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్‌ను పంకజ్ అద్వాణీ గెలుచుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ మసిహ్‌పై గెలుపొందాడు. దీంతో ప్రపంచకప్ గెలవడం ఇది 24వ సారి. ఇతడు కర్ణాటక రాష్ర్టానికి చెందినవాడు.
బ్యాటర్
క్రికెట్లో ఇక నుంచి బ్యాట్స్‌మన్ పదానికి బదులుగా బ్యాటర్ అనే పదం వాడాలని మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సెప్టెంబర్ 22న ప్రకటించింది. ఆటలో లింగసమానత్వం కోసం ఈ పదాన్ని ఉపయోగించేందుకు ఈ పదాన్ని చేర్చాలని వెల్లడించింది. క్రీడల్లో లింగ వివక్ష ఉండకూడదని, సాంకేతిక పదాల్లో కూడా అది కనిపించరాదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు ఎంసీసీ తెలిపింది.
జూనియర్ హాకీ ప్రపంచకప్
ఒడిషాలో నిర్వహించనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ టోర్నీ లోగో, ట్రోఫీని సీఎం నవీన్ పట్నాయక్ సెప్టెంబర్ 23న ఆవిష్కరించారు. కళింగ స్టేడియంలో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. దీనిలో 16 జట్లు పాల్గొననున్నాయి. 2016లో ఈ టోర్నమెంట్‌ను లక్నోలో నిర్వహించారు.
పుస్తక సమీక్ష లేటెస్ట్ కరెంట్ అఫైర్స్
పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ & జీకే చాలా కీలకం. ముఖ్యంగా ఆయా అంశాలను సమకాలీన అంశాలతో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. దీన్ని సులభంగా అందరూ నేర్చుకునే విధంగా కరెంట్ అఫైర్స్ బోధనలో సుమారు రెండు దశాబ్దాల అనుభవం గడించిన వేముల సైదులు ఒక క్రమ పద్ధతిలో పుస్తక రూపంలో అందించారు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పేరుతో 2021-22 సంవత్సరానికిగాను 28 టాపిక్స్‌తో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలతో సమగ్రంగా అందించారు. అన్ని రకాల పోటీపరీక్షలకు ప్రిపేరయ్యేవారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్‌లో లభిస్తుంది. పేజీలు: 220, ధర: రూ.200
వివరాల కోసం: ఏఎన్ఆర్ పబ్లికేషన్స్, అరుణోదయ కాలనీ, నాగోల్. ఫోన్ నంబర్లు 9666654511, 9347974747
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు