నీలిట్‌లో బీటెక్, ఎంటెక్
ఔరంగాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
నీలిట్: డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంయుక్తంగా మొదట బెంగళూరులోని ఐఐఎస్సీలో 1974లో సీఈడీటీగా ప్రారంభించాయి. తర్వాత కాలంలో ఔరంగాబాద్, ఇంఫాల్, శ్రీనగర్‌లలో ఇటువంటి సంస్థలను ప్రారంభించి సాంకేతిక రంగ పురోగతికి బాటలు వేసింది డీవోఈ. తదనంతర కాలంలో సీఈడీటీ, డీవోఈఏసీసీలు కలిసిపోయి జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా ఆవిర్భవించాయి. ఆ సంస్థ పేరే ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్)’గా పెట్టారు. దీన్ని 2011, అక్టోబర్ 10న ప్రారంభించారు. ఔరంగాబాద్ క్యాంపస్ 1987 నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తుంది. పలు కోర్సులతోపాటు పరిశోధనలకు నెలవుగా ఈ కేంద్రం పేరుగాంచింది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యాసంస్థ.
ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ డిజైన్&టెక్నాలజీ)
అర్హతలు: ఫుల్‌టైం కోర్సులో చేరడానికి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
పార్ట్‌టైం కోర్సులో చేరడానికి బీఈ/బీటెక్ తర్వాత అకడమిక్ ఇన్స్టిట్యూట్/ఆర్ అండ్ డీ ఆర్గనైజేషన్స్‌లో కనీసం రెండేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఆ సంస్థ స్పాన్సర్డ్ కోటాలో ప్రవేశాలు కల్పిస్తారు.
బీటెక్ (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, స్పెషలైజేషన్ ఇన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్)
బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలను 2021 సీఎస్ఏబీ కౌన్సెలింగ్ ద్వారా చేస్తారు.
లేటరల్ ఎంట్రీ కింద సంబంధిత స్ట్రీమ్‌లో డిప్లొమా (మూడేండ్ల) ఇంజినీరింగ్ కోర్సు పూర్తయిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్
ఈ కోర్సులో పోస్ట్ ఎస్ఎస్సీ డిప్లొమా అడ్మిషన్స్ కింద డీటీఈ మహారాష్ట్ర నిర్వహించే సీఏపీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్లేస్‌మెంట్స్
ఔరంగాబాద్ నీలిట్‌లో చదివిన విద్యార్థులు గతంలో ఇస్రో, డిఫెన్స్, బాస్క్, స్టెరిలైట్, ట్రైమ్యాక్స్, బ్రాడ్కాం, హెచ్‌సీఎల్, వీడియోకాన్, బజాజ్, ఏటీసీ కార్పొరేషన్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 10
వెబ్సైట్: https://nielit.gov.in/aurangabad
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు