కలెక్టర్లను చూసి కలెక్టర్ అవ్వాలనుకున్నా
- 541వ ర్యాంకర్
- పృథ్వీనాథ్ గౌడ్
పాఠశాలలో నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మోటివేషనల్ స్పీచ్‌కు అతడు ఇన్స్పైర్ అయ్యాడు. అప్పుడే తాను కూడా కలెక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యసాధన దిశలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అనుకున్నది తొలి ప్రయత్నంలోనే సాధించాడు పృథ్వీనాథ్ గౌడ్. సివిల్స్ ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే..
ప్రణాళికాబద్ధంగా..
ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే సివిల్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు వస్తాయని సీనియర్లను అడిగాను. సక్సెస్ అయిన వాళ్లతో, ఫెయిల్యూర్ అయినవాళ్లతోనూ మాట్లాడాను. 6 నుంచి 10 వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, రెగ్యులర్‌గా ఇంగ్లిష్ పేపర్‌ను ఫాలో అయ్యాను. బెంగళూరులో ప్రిలిమ్స్ కోసం కోచింగ్ తీసుకున్నాను. కరోనా వల్ల ప్రిలిమ్స్ ఆలస్యం అవడం కూడా కలిసి వచ్చింది. డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్ పెట్టుకొని చదివాను. సివిల్స్ గురించి వాట్సప్ గ్రూప్స్‌లో సాధ్యమైనంత మేరకు డిసషన్స్ ఉపయోగపడ్డాయి.
సమయం వృథాచేయకుండా..
మెయిన్స్‌కు రెండు నెలల సమయం ఉంది. ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకున్న. హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న. సమయం వృథా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చదివాను. నాకంటే తెలివైనవాళ్లు, ఎకువసేపు కష్టపడేవాళ్లు కూడా మెయిన్స్‌లో వైఫల్యం చెందారని తెలుసుకున్నాను. వాళ్లు చేసిన లోపాలేంటో, వాటిని ఎలా అధిగమించాలో వారినే అడిగాను. అలా వాటిని అధిగమిస్తూ కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను.
ఇంటర్వ్యూ
స్మితా నాగరాజు బోర్డు ఇంటర్వ్యూ చేశారు. ఇదివరకే ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూలు చేయడం చాలా కలిసి వచ్చింది. ఆంత్రోపాలజీ ఆప్షన్ ఎందుకు తీసుకున్నావ్, బాల్య వివాహాలపై నీ అభిప్రాయం ఏంటి, గోలొండ కోట గురించి
అడిగారు.
అధికారికంగా సేవ చేయాలని..
మెరుగైన విద్య, వైద్యం అందించడమే ధ్యేయంగా పనిచేస్తాను. డాక్టర్‌గా కొంతమందికి మాత్రమే సేవ చేయగలిగాను. అదే సివిల్స్ అధికారి అయితే అధికారిగా అనేకమందికి సేవ చేసే అవకాశం ఉంటుందని సివిల్స్ సాధించాను. ఇందుకు అమ్మానాన్న గుండ్రాతి శ్రీనివాస్ గౌడ్, వనజ, బాబాయ్ మధు గౌడ్ సహకరించారు. వనపర్తికి కలెక్టర్‌గా పనిచేసిన శ్వేతా మహంతి కూడా సివిల్స్ ఎలా ప్రిపేర్ కావాలో వివరించారు.
సలహా
సివిల్స్ కోసం ఎలా సిద్ధం అవ్వాలో అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. అలాంటివారు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవాలి. దీనివల్ల ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎంత చదవాలో అనే అవగాహన వస్తుంది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వాట్సాప్ గ్రూప్ కూడా ఇంటర్వ్యూకు ఉపయోగపడింది. సివిల్స్‌కు ప్రిపేరయ్యే వాళ్లు సీనియర్ల అనుభవాన్ని తెలుసుకోవాలి.
- పెద్ది విజయ భాసర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు