సీడాక్ ‘సీ క్యాట్’-2021
- జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్
- విభిన్నమైన పీజీ డిప్లొమా కోర్సులు
- బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ అభ్యర్థులకు అవకాశం
- కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు
- కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడాక్‌లో ప్రోగ్రామ్స్
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) కెరీర్ ఓరియెంటెడ్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్ నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: సీడాక్‌ను 1988లో కేంద్రం ప్రారంభించింది. అత్యున్నత స్థాయిలో రిసెర్చ్, డెవలప్మెంట్ కోసం దీన్ని ప్రారంభించారు. సీడాక్‌లో కంప్యూటింగ్, గ్రిడ్, క్లౌడ్ కంప్యూటింగ్, మల్టీ లింగ్వల్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ఈ సంస్థ ప్రధాన కార్యక్రమాలు.
సీడాక్ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఐటీ ట్రెయినింగ్ సెంటర్లను, ప్రాజెక్ట్‌లను చేపడుతుంది. ఘనా, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, వియత్నాం, కోస్టా రికా, సౌదీ అరేబియా, పెరూ, భూటాన్ తదితర దేశాల్లో సీడాక్ పనిచేస్తుంది. మొత్తం 100కు పైగా దేశాలలో శిక్షణ కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది.
పీజీ డిప్లొమా కోర్సులు – అర్హతలు
కింది కోర్సులన్నింటికి ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఈ/బీటెక్/ 4 ఏండ్ల బీఎస్సీ ఇంజినీరింగ్, ఏఎంఐఈ లేదా డీవోఈఏసీసీ బీ లెవల్ ఇన్ ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ లేదా పీజీ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ సైన్సెస్ (ఎమ్మెస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటివి)
పీజీ డిప్లొమా ఇన్ జియోఇన్ఫర్మేటిక్స్
అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలు లేదా పీజీ ఇన్ అప్లయిడ్ సైన్సెస్, జియోగ్రఫీ, జియాలజీ, ఫిజిక్స్, కంప్యుటేషనల్ సైన్సెస్, మ్యాథ్స్ లేదా సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలతోపాటు ఏదైనా ఇంజినీరింగ్ లేదా ఎంసీఏ/ఎంసీఎం లేదా ఫిజిక్స్/కంప్యుటేషనల్ సైన్సెస్/ మ్యాథ్స్‌లో పీజీ డిగ్రీ లేదా పీజీ మేనేజ్మెంట్లో సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్స్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ కంప్యూటింగ్
అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలుతోపాటు పీజీ డిప్లొమా ఇన్ మ్యాథ్స్ లేదా సంబంధిత విభాగాలు లేదా ఎంసీఏలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీజీ డిప్లొమా ఇన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
అర్హతలు: పీజీలో మ్యాథ్స్/ సంబంధిత ఏరియాల్లో పీజీ/ ఎంసీఏలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీజీ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అర్హతలు: పైన పేర్కొన్న అర్హతలు లేదా ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ఎంసీఎం లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
పీజీడీ ఇన్ బిగ్ డాటా అనలిటిక్స్
అర్హతలు: ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
పీజీడీ ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ:
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పైన పేర్కొన్న కామన్ ఎలిజబులిటీ లేదా పీజీలో మ్యాథ్స్/స్టాటిస్టిక్స్ ఉత్తీర్ణత.
పీజీడీ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పీజీడీ ఇన్ అడ్వాన్స్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్:
అర్హతలు: ఈ రెండు కోర్సులకు పైన పేర్కొన్న కామన్ ఎలిజబులిటీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత
పీజీ డిప్లొమా ఇన్ ఎంబడెడ్ సిస్టమ్స్ డిజైన్, పీజీ డిప్లొమా ఇన్ వీఎల్ఎస్ఐ డిజైన్, పీజీ డిప్లొమా ఇన్ ఐల్లెడ్ టెక్నాలజీస్
అర్హతలు: పై మూడు కోర్సులకు కామన్ ఎలిజిబిలిటీ లేదా బీఈ/బీటెక్‌లో మెకట్రానిక్స్/మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత
నోట్: పీజీ డిప్లొమా కోర్సులకు ఎటువంటి వయోపరిమితి లేదు.
ఆన్లైన్ కోర్సు ప్రత్యేకతలు
సుమారు 30 వారాల ఫుల్‌టైం కోర్సులు, 900 గంటలు థియరీ+ల్యాబ్+ ప్రాజెక్ట్
వారానికి ఆరు రోజులు, ప్రతిరోజు ఆరు గంటలపాటు థియరీ+ల్యాబ్ సెషన్స్ ఉంటాయి.
కోర్సు పూర్తయ్యేంత వరకు ల్యాబ్, ఇంటర్నల్ అసెస్మెంట్ జరుగుతుంటుంది.
ఆప్టిట్యూడ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూలపై ప్రత్యేక శిక్షణ ఉంటుంది
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్: ఏటా సీడాక్ కామన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా
నిర్వహిస్తుంది. సుమారు 400కు పైగా కంపెనీలు ఈ ప్లేస్‌మెంట్స్‌కు వస్తుంటాయి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చే కొన్ని ప్రముఖ కంపెనీలు.. ఏబీబీ, 3ఐ ఇన్ఫోటెక్, కాగ్నిజెంట్, కాంటినెంటల్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బోయింగ్, బుక్ మై షో, బాస్క్, సీడాక్, క్యాప్‌జెమినీ, సిస్కో, హెచ్‌పీ, జీఈ, గోద్రేజ్, హెచ్ఎస్బీసీ, హువాయి, ఐబీఎం, టాటా, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, సింటెల్, ఐగేట్, జేపీ మోర్గాన్, ఎల్జీ సాఫ్ట్ తదితరాలు ఉన్నాయి.
ఎంపిక విధానం
సీడాక్ సెప్టెంబర్ 2021 బ్యాచ్ కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ద్వారా అభ్యర్థులకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సీడాక్ క్యాట్ (సీ క్యాట్)
ఈ పరీక్షను సీడాక్ సెంటర్లలో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు
ఈ పరీక్షలో వచ్చిన స్కోర్/ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు
సీ క్యాట్‌లో మూడు సెక్షన్లు ఉంటాయి. అవి సెక్షన్ ఏ, బీ, సీ. ఈ పరీక్ష కాలవ్యవధి గంట. అభ్యర్థి ఎంచుకునే కోర్సును బట్టి సెక్షన్ ఏ లేదా బీ లేదా సీ లేదా ఏవైనా రెండు/మూడు సెక్షన్ల పేపర్లను రాయాల్సి ఉంటుంది.
ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
ప్రతి సెక్షన్లో 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు మూడు మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబు గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు.
సెక్షన్ ఏ: ఈ సెక్షన్లో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్
సెక్షన్ బీ: కంప్యూటర్ ఫండమెంటల్స్, సీ ప్రోగ్రామింగ్, డాటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్
సెక్షన్ సీ: కంప్యూటర్ ఆర్కిటెక్చర్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రోప్రాసెసర్
నోట్: ఒక్కో సెక్షన్‌కు ఒక గంట సమయం.
పరీక్ష తేదీలు: ఆగస్టు 7, 8 (మధ్యాహ్నం 2 నుంచి 5.30 వరకు)
రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
సీడాక్ క్యాంపస్‌లు
హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, నాగ్‌పూర్, నాసిక్, నవీ ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, పాట్నా, పుణె, తిరువనంతపురం.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 29
అడ్మిట్ కార్డులు డౌన్లోడ్: ఆగస్ట్ 5-7 నుంచి
సీక్యాట్ పరీక్షతేదీ: ఆగస్ట్ 7, 8
సీక్యాట్ ర్యాంకుల వెల్లడి: ఆగస్ట్ 20
హైదరాబాద్ చిరునామా
C-DAC
Plot No. 6 & 7, Hardware Park,
Sy No. 1/1, Srisailam Highway,
Pahadi Shareef Via (Keshavagiri Post) Hyderabad – 501510
Telangana(India)
Phone:+91-9100034446/7/8
Fax: +91-9100034450
వెబ్సైట్: https://www.cdac.in
క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీం
క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీమ్ నోటిఫికేషన్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రెయినింగ్ (డీజీటీ) విడుదల చేసింది.
కోర్సు: క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీం
ఈ స్కీంలో భాగంగా ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడుల్లో శిక్షణ ఇస్తారు.
దేశవ్యాప్తంగా 33 నేషనల్ స్కిల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో 19 సెంటర్లను మహిళలకు కేటాయించారు. హైదరాబాద్ ఎన్ఎస్టీఐలో మొత్తం 160 సీట్లు ఉన్నాయి.
యువతకు ముఖ్యంగా మహిళలకు ఉపాధి లేదా/ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దీనిని రూపొందించారు.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ ఆధారంగామహిళా ఎన్ఎస్టీఐలలోని ట్రేడులు
బ్యూటీ అండ్ వెల్నెస్, ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్‌వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఈఎస్, టెక్స్టైల్ అండ్ అప్పారెల్, ట్రావెల్ టూరిజం, క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, ఐఓటీ టెక్నీషియన్ (స్మార్ట్ అగ్రికల్చర్), సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్.
జనరల్ ఎన్ఎస్టీఐలలోని ట్రేడులు
వీటిలో రెగ్యులర్ కోర్సులతోపాటు మరికొన్ని కొత్త కోర్సులను (న్యూ ఏజ్) చేర్చారు. ఈ కొత్త కోర్సుల్లో అభ్యర్థులు ఏవైనా రెండింటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటికి డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రెయినింగ్ (డీఎస్టీ) స్కీమ్ కింద శిక్షణ ఇస్తారు.
రెగ్యులర్ కోర్సులు
టర్నర్, వెల్డర్, ఫౌండ్రీమెన్, మెషినిస్ట్, టూల్ అండ్ డై మేకర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ (ఇంగ్లిష్), ట్రావెల్ అండ్ టూర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (హిందీ/ ఇంగ్లిష్), ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రాసెసింగ్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్), ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్ట్రానిక్స్ మెకానిక్, డ్రెస్ మేకింగ్, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్), డీటీపీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ అండ్ డిజైనింగ్, క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్, కాస్మటాలజీ, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మెన్.
న్యూ ఏజ్ కోర్సులు
జియో ఇన్ఫర్మాటిక్స్ అసిస్టెంట్, సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (3డీ ప్రింటింగ్), రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్/ డ్రోన్ పైలట్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సోలార్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్), టెక్నీషియన్ మెకట్రానిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (స్మార్ట్ అగ్రికల్చర్/ స్మార్ట్ హెల్త్ కేర్/స్మార్ట్ సిటీ), స్మార్ట్ ఫోన్ టెక్నీషియన్ కమ్ యాప్ టెస్టర్.
నోట్: ఈ కోర్సులకు మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సీట్ల వివరాలు
దేశవ్యాప్తంగా మొత్తం 4432 సీట్లు ఉన్నాయి. వీటిలో మహిళలకు 2816 రెగ్యులర్ సీట్లు, 728 న్యూ ఏజ్ కోర్సుల సీట్లను ప్రత్యేకించారు.
హైదరాబాద్‌లోని మహిళా ఎన్ఎస్టీఐలో ఐఓటీ టెక్నీషియన్ (స్మార్ట్ అగ్రికల్చర్)-24, సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్-24 సీట్లు ఉన్నాయి.
విద్యానగర్ ఎన్ఎస్టీఐలో సోలార్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-20, జియో ఇన్ఫర్మాటిక్స్-24, మెషినిస్ట్-20 సీట్లు ఉన్నాయి.
రామంతాపూర్ సెంటర్లో ఐఓటీ టెక్నీషియన్ (స్మార్ట్ హెల్త్‌కేర్)-24, రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్- డ్రోన్ పైలట్- 24 సీట్లు ఉన్నాయి.
అర్హత: అభ్యర్థులు ఎంచుకొన్న ట్రేడ్‌ని బట్టి ఎనిమిదోతరగతి/ పదోతరగతి/ ఉత్తీర్ణులై ఉండాలి.
జియో ఇన్ఫర్మాటిక్ అసిస్టెంట్‌కు ఇంటర్ పాసై ఉండాలి. సెక్రటేరియల్ ప్రాక్టీస్ ట్రేడ్‌కు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం అవసరం. తరగతులు ప్రారంభమయ్యే నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో.. చివరితేదీ: జూలై 30
వెబ్సైట్: ww.nimionlineadmission.in
/ https://msde.gov.in
- Tags
- nipuna
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు