టీఐఎఫ్ఆర్ జీఎస్ గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్ 2021


పరిశోధనలకు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సంస్థ.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్). మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో కోర్సులు, అర్హతలు, ప్రవేశాలు కల్పించే విధానం, క్యాంపసుల వివరాలు నిపుణ పాఠకుల కోసం…
టీఐఎఫ్ఆర్
- ఈ సంస్థను ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.హోమి భాభా 1945 జూన్‌లో ప్రారంభించారు. టాటా ట్రస్ట్ సహకారంతో దీన్ని ఏర్పాటుచేశారు. ఫండమెంటల్ సైన్సెస్, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ ఎడ్యుకేషన్లలో పరిశోధనల కోసం ప్రారంభించి కాలక్రమేణ పలు ఇతర ప్రోగ్రామ్స్, క్యాంపసులను ఏర్పాటుచేశారు.
- జీఎస్-2021: ఎమ్మెస్సీ, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టెస్టే గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్ (జీఎస్-2021).
మ్యాథమెటిక్స్: పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్:
ఈ ప్రోగ్రామ్‌ను ముంబైలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని సెంటర్ ఫర్ అప్లికబుల్ మ్యాథమెటిక్స్ (సీఏఎం), బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్) కేవలం పీహెచ్డీ మాత్రమే.
అర్హతలు: పీహెచ్డీ కోర్సుకు – ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ: బీఏ/బీఎస్సీ లేదా బీఈ/బీటెక్
ఫిజిక్స్: పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ముంబైలోని టీఐఎఫ్ఆర్లోని కింది విభాగాలు పై ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ & అస్ట్రోఫిజిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ & మెటీరియల్స్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హై ఎనర్జీ ఫిజిక్స్, డిపార్ట్మెంట్ ఆప్ న్యూక్లియర్ & అటామిక్ ఫిజిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్.
పుణెలోని ఎన్సీఆర్ఏ, హైదరాబాద్‌లోని టీసీఐఎస్ పై ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి.
నోట్: ఫిజిక్స్‌కు దరఖాస్తు చేసుకునేవారికి ఇండియన్ బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్‌వో)లో గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ (జీటీపీ)లో కూడా ప్రవేశాలు తీసుకోవచ్చు. అయితే దరఖాస్తు సమయంలో ఈ విషయాన్ని పేర్కొనాలి.
అర్హతలు: పీహెచ్డీ- ఎమ్మెస్సీ/ఎంఎస్ ఇన్ ఫిజిక్స్ లేదా తత్సమానకోర్సు.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ-ఎంఈ/ఎంటెక్ లేదా బీఎస్సీ/బీఎస్ లేదా బీఈ/బీటెక్/ఇంజినీరింగ్ ఫిజిక్స్ లేదా తత్సమాన కోర్సు (కోర్సు కాలపరిమితి కనీసం మూడేండ్లు ఉండాలి).
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ- సంబంధిత సబ్జెక్టులో కనీసం నాలుగేండ్ల కోర్సు ఉత్తీర్ణత. అదేవిధంగా టీసీఐఎస్ నిర్వహించే రాతపరీక్ష తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
కెమిస్ట్రీ
పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ముంబైలోని టీఐఎఫ్ఆర్, హైదరాబాద్‌లోని టీసీఐఎస్
అర్హతలు: పీహెచ్డీ-ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్ లేదా ఎంఫార్మా లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ – బీఎస్సీ/బీఫార్మా లేదా బీఎస్ లేదా తత్సమాన కోర్సు. బీఈ/బీటెక్ డిగ్రీ ఉన్నవారు ఆప్షనల్స్‌ను బట్టి ఎమ్మెస్సీ డిగ్రీకి ఎంపికచేస్తారు.
బయాలజీ
పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ముంబైలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని ఎన్సీబీఎస్, హైదరాబాద్‌లోని టీసీఐఎస్ (ఇక్కడ కేవలం పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉన్నాయి)
అర్హతలు: పీహెచ్డీ- ఎమ్మెస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఏదైనా బ్రాంచీ లేదా ఎంఫార్మా/ఎంటెక్ లేదా ఎంబీబీఎస్/ఎండీఎస్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ-బేసిక్ సైన్సెస్‌లో డిగ్రీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీలో ఏదైనా బ్రాంచీ) లేదా తత్సమాన కోర్సు/బీవీఎస్సీ, బీఫార్మా
కంప్యూటర్ & సిస్టమ్స్ సైన్సెస్ (కమ్యూనికేషన్స్ అండ్ అప్లయిడ్ ప్రాబబిలిటీ) పీహెచ్డీ ప్రోగ్రామ్
ముంబైలోని టీఐఎఫ్ఆర్
అర్హతలు: పీహెచ్డీ-బీఈ/బీటెక్ లేదా ఎంటెక్/ఎంఈ లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ/ఈఈఈ లేదా సంబంధిత బ్రాంచీలు.
సైన్స్ ఎడ్యుకేషన్
పీహెచ్డీ ప్రోగ్రామ్
ముంబైలోని హోమిబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్
కోర్సులు కాలవ్యవధులు
పీహెచ్డీ ఐదేండ్లు
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ఆరేండ్లు
ఎమ్మెస్సీ ప్రోగ్రామ్ – వేర్వేరుగా ఉన్నాయి
వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ప్రవేశాలు ఎలా కల్పిస్తారు..?
సైన్స్ ఎడ్యుకేషన్ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా కల్పిస్తారు.
గమనిక: జీఎస్-2021 ద్వారానే కాకుండా సైన్స్ (కమ్యూనికేషన్, అప్లయిడ్ ప్రాబబిలిటీ సబ్జెక్టులు), బయాలజీ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ వారికి గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అదేవిధంగా ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు గేట్/జెస్ట్, నెట్ ద్వారా కూడా ప్రవేశాలు కల్పిస్తారు.
ఫెలోషిప్స్: పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌కు ఆగస్టు 1 నుంచి, ఎమ్మెస్సీకి జూలై 1 నుంచి ఫెలోషిప్స్ ఇస్తారు.
పీహెచ్డీ- ప్రారంభంలో నెలకు రూ.31 వేలు (రిజిస్ట్రేషన్ తర్వాత రూ.35 వేలు) ఇస్తారు.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ- మొదటి ఏడాది నెలకు రూ.21 వేలు, ప్రతిభను బట్టి రూ.31 వేల వరకు ఇస్తారు. పీహెచ్‌డీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక నెలకు రూ.35 వేలు ఇస్తారు.
ఎమ్మెస్సీ బయాలజీకి నెలకు రూ.16 వేలు, ఎమ్మెస్సీ (వైల్డ్‌లైఫ్ అండ్ కన్జర్వేషన్)కి నెలకు రూ.12 వేలు ఇస్తారు.
నోట్: పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలకు నామమాత్రపు ఫీజుతో వసతి కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో అక్టోబర్ 8 నుంచి ప్రారంభం
చివరితేదీ: నవంబర్ 7
ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: 2021, డిసెంబర్ 12
వెబ్సైట్: http://univ.tifr.res.in/gs2022
బయాలజీ @ జేజీఈఈబీఐఎల్ఎస్
టీఐఎఫ్ఆర్ నిర్వహించే జాతీయస్థాయి జీఎస్-2021 బయాలజీ పరీక్షను జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ బయాలజీ అండ్ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్ సైన్సెస్ (జేజీఈఈబీఐఎల్ఎస్)గా పిలుస్తారు.
ఈ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పించే సంస్థలు:
- Tata Institute of Fundamental Research (TIFR):
- NCBS Bangalore (https://ncbs.res.in)
- DBS Mumbai (http://www.tifr.res.in/dbs)
- TCIS Hyderabad (https://www.tifrh.res.in)
- Indian Institute of Science Education and Research (IISER):
- Kolkata (http://www.iiserkol.ac.in);
- Pune (http://www.iiserpune.ac.in) and
- Thiruvananthapuram (http://www.iisertvm.ac.in)
- Tirupati (http://www.iisertirupati.ac.in)
- Advanced Centre for Treatment, Research and Education in Cancer (ACTREC), Mumbai (http://www.actrec.gov.in)
- Centre for Cellular and Molecular Biology, Hyderabad (http://www.ccmb.res.in)
- Centre for DNA Fingerprinting and Diagnostics, Hyderabad (http://www.cdfd.org.in)
- National Brain Research Centre, Manesar(http://www.nbrc.ac.in)
- National Institute of Immunology, New Delhi (http://www1.nii.res.in/)
- National Institute of Science Education and Research, Bhubaneshwar (http://www.niser.ac.in)
- Institute for Stem Cell Biology and Regenerative Medicine, Bangalore (http://instem.res.in/)
- National Centre for Cell Science, Pune (http://www.nccs.res.in)
- Regional Centre for Biotechnology, Faridabad (http://www.rcb.res.in)
- Saha Institute of Nuclear Physics, Kolkata (http://www.saha.ac.in)
- Institute of Mathematical Sciences, Chennai (http://www.imsc.res.in)
- MAHE: Manipal Academy of Higher Education, Manipal (Life Sciences)
- http://www.manipal.edu/mu.html)
- Bose Institute, Kolkata (www.jcbose.ac.in)
- Tags
- Education News
RELATED ARTICLES
-
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
-
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు
-
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
-
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
-
Scholarships 2023 | Scholarships for Students
-
Chemistry – IIT,NEET Special | Decrease in Energy.. Leads to Stability
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
English Grammar | We should all love and respect