Economy | స్థిర జనన మరణ రేటు.. సత్వర జనాభా వృద్ధి
జనాభా పరిణామ సిద్ధాంతం (Theory of population evolution)
- జనాభాను మానవ వనరులు అని కూడా అంటారు.
- జనాభా అనేది వ్యక్తుల పూర్తి సమూహం.
- డెమోగ్రఫి అనేది థియరీలో సంక్షిప్త శాస్త్రం.
- జనాభా, జనాభా కూర్పు, జనాభా సంయోగం, జనాభా లక్షణాలు, జనాభా ధోరణి మొదలైన అంశాల గురించి తెలియజేసే దాన్ని డెమోగ్రఫీ లేదా పాపులేషన్ సైన్స్ అని అంటారు.
- సాంఘిక శాస్త్రంలో జనాభాశాస్త్రం అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు. జనాభా శాస్త్రంలో, జనాభా పరివర్తన అనేది తక్కువ విద్యా సాంకేతికత, ఆర్థికాభివృద్ధి కలిగిన సమాజంలో అధిక జనన, మరణరేటు నుంచి తక్కువ జనన, మరణరేటుకు చారిత్రక మార్పును సూచించే ఒక దృగ్విషయం లేదా సిద్ధాంతం.
- డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది కాలక్రమేణా జనాభా మార్పును వివరించే నమూనా.
- జనాభా పరిణామం అనగా అధిక జనన, మరణరేట్ల నుంచి అల్ప జనన, మరణ రేట్లకు మారడం.
- జనాభా పరిణామ సిద్ధాంతాన్ని 1929లో అమెరికన్ డెమోగ్రాఫర్ డబ్ల్యూ.ఎస్. థామ్సన్ మొదట ప్రతిపాదించగా w. నోట్ స్టెయిన్ చేత ప్రాచుర్యం పొందినది.
- ఆధునిక కాలంలో అధిక మంది ఆర్థిక వేత్తలు ఆమోదించిన సిద్ధాంతం.
- ‘Economic Development in low income Countries అనే గ్రంథంలో కోల్ మరియు హోవర్లు జనాభా పరిణామ సిద్ధాంతాన్ని చర్చించారు.
- జనన, మరణ రేట్లకు, ఆర్థికాభివృద్ధికి మధ్యగల సంబంధాన్ని తెలియజేసే దాన్ని జనాభా పరిణామ సిద్ధాంతం అంటారు.
- జనన, మరణ రేట్లలోని మార్పుల ప్రభావాలు జనాభా వృద్ధిరేటుపై ఏ విధంగా ఉంటాయో జనాభా పరిణామ సిద్ధాంతం వివరిస్తుంది కూడా.
- జనాభా పరిణామం, జనాభా చక్రానికి సంబంధించినది. ఈ జనాభా చక్రం మరణాల రేటు తగ్గుదలతో ప్రారంభమై జనాభా వృద్ధి వేగంగా ఉండే దశలో కొనసాగి జననాల రేటు తగ్గుదలతో ముగుస్తుంది. అని ఇ.జి. డోలోన్ పేర్కొన్నాడు.
- జనన, మరణాల రేట్లకు ఆర్థికాభివృద్ధికి మధ్యగల సంబంధాన్ని బట్టి అంటే జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏ దేశమైన మూడు దశల్లో జనాభా మార్పులను సూచిస్తుంది.
మొదటి దశ (First stage)
- జనాభా పరిణామ సిద్ధాంతం మొదటి దశలో ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉంటుంది.
- వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో జనన, మరణాల రేట్లు అధికంగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల, స్థిరంగా ఉంటుంది.
- ఈ దశలో వ్యవసాయ రంగ ప్రాధాన్యం, పోషకాహార లోపం ప్రజలందరికి సమతుల్య ఆహారం అందకపోవడం, అపరిశుభ్రత, వైద్య సదుపాయాలు లేకపోవడం, అంటువ్యాధులు ప్రబలటం , శిశుమరణాల రేటు అధికంగా ఉండటం, తక్కువ తలసరి ఆదాయం, అల్పజీవన ప్రమాణస్థాయి వల్ల మరణాల రేటు అధికంగా ఉంటుంది.
- అధిక నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడం, మూడనమ్మకాలు, ఆధునిక పద్ధతుల కంటే సంప్రదాయ పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జననాల రేటు అధికంగా ఉంటుంది.
- ఈ విధంగా మొదటి దశలో అధిక జననాల రేటు, మరణాల రేటు సమానంగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల స్తబ్దంగా ఉంటుంది. సాధారణంగా వెనుకబడిన దేశాలు ఈ దశలో ఉంటాయి.
- 1921కి పూర్వం భారతదేశం ఈ దశలో ఉంది.
రెండవ దశ(Second stage)
- జనాభా పరిణామ సిద్ధాంతం రెండవ దశలో ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగుపడుతుంది.
- ఈ దశలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక రంగం వైపు మరలడం, తలసరి ఆదాయం, జీవన ప్రమాణం మెరుగు పడటం, పౌష్టికాహారం లభించడం. విద్య, వైద్య సౌకర్యాలు పెరగడం వల్ల మరణాల రేటు తగ్గుతుంది.
- ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగు పడినప్పటికీ అల్ప విద్యా, వైద్య సౌకర్యాల కల్పన, సంప్రదాయ విధానం ప్రజల ఆలోచనలో మార్పు లేకపోవడం వల్ల జననాల రేటు అధికంగానే ఉంది.
- ఈ విధంగా రెండోదశలో అల్ప మరణాల రేటు, అధిక జననాల రేటు వల్ల జనాభా పెరుగుదల అధికంగానే ఉంది. దీన్ని జనాభా విస్ఫోటనం అంటారు.
- మరణాలు అనేవి ఆర్థిక అంశాలపైన జననాలు అనేవి సాంఘిక అంశాలపైన ఆధారపడి ఉంటాయి.
- ఈ దశలో జననాల రేటు 35 -40 శాతం మధ్యలో ఉంటుంది. మరణాల రేటు 15-20 శాతం మధ్యలో ఉంటుంది. వార్షిక వృద్ధిరేటు 2 శాతంపైన నమోదవుతుంది.
- సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ దశలో ఉంటాయి.
- 1921 నుంచి భారతదేశం ఈ దశలోనే ఉంది.
మూడో దశ(Third Stage)
- జనాభా పరిణామ సిద్ధాంతం మూడో దశలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది ఉంటుంది.
- ఈ దశలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మారటం. పారిశ్రామికీకరణ వల్ల నగరీకరణ కూడా పెరగడం, పారిశ్రామిక ఉపాధి అవకాశాలు పెరగడం, నగరాల్లో పట్టణాల్లో ఏర్పడే గృహ సమస్యలు, నీటి సమస్యలు, కుటుంబ భారం మొదలైన సమస్యలు అధిగమించడానికి, తలసరి ఆదాయం, జీవన ప్రమాణస్థాయిని పెంచుకోవడం కోసం పరిమిత కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన జననరేటు తగ్గుతుంది.
- పారిశ్రామికీకరణ ఆధునికీకరణ, నగరీకరణ, పట్టణీకరణ అక్షరాస్యత, ఆధునిక వైద్య సౌకర్యాల కల్పన, సాంప్రదాయ విలువల కంటే ఆధునిక సాంకేతిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రజల దృక్పదాలలో/ ఆలోచనల్లో మార్పు రావడం వల్ల మరణాల రేటు తగ్గుతుంది.
- ఈ విధంగా మూడవ దశలో జననాల రేటు, మరణాల రేటు రెండూ తక్కువగానే ఉండటం వల్ల జనాభా పెరుగుదల కూడా తక్కువగానే ఉంటుంది.
- ఈ దశలో జనన రేటు 35-40 శాతం నుంచి 15-20 శాతానికి తగ్గుతుంది.
- సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ దశలో ఉంటాయి.
మాక్స్ జనాభా పరిణామ సిద్ధాంతం
- మాక్స్ అనే ఆర్థిక వేత్త జనాభా పరిణామ సిద్ధాంతాన్ని 4 దశల్లో వివరించారు.
1వ దశ : అధిక జనన, మరణ రేట్లు- తక్కువ జనాభా వృద్ధిరేటు
2వ దశ: అధిక, స్థిర జనన రేటు, వేగంగా తగ్గే మరణ రేటు – సత్వర జనాభా వృద్ధి
3వ దశ : తగ్గుతున్న జనన రేటు, తక్కువ స్థిర మరణ రేటు – వేగంగా పెరిగే జనాభా
4వ దశ : తక్కువ జనన, మరణరేట్లు అల్పస్థాయిలో స్థిర జనాభా
సీపీ బ్లాకర్ జనాభా సిద్ధాంతం - సి.పి.బ్లాకర్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని 5 దశలుగా వివరించారు.
మొదటిదశ: అధిక సంతానోత్పత్తి మరియు మరణాల రేటుతో గుర్తించిన అధిక స్థిర దశ.
రెండోదశ: అధిక సంతానోత్పత్తి, అధికంకానీ క్షీణిస్తున్న మరణాల ద్వారా గుర్తించిన ప్రారంభ విస్తురిస్తున్న దశ.
మూడోదశ: క్షీణిస్తున్న సంతానోత్పత్తితో ఆలస్యంగా విస్తరిస్తున్న దశ. కానీ మరణాలు మరింత వేగంగా తగ్గుతున్నాయి.
నాలుగో దశ: తక్కువ సంతానోత్పత్తితో సమానమైన తక్కువ మరణాల ద్వారా సమతుల్యతతో కూడిన తక్కువ స్థిర దశ.
ఐదోదశ: తక్కువ మరణాలు, తక్కువ సంతానోత్పత్తి మరియు జనన మరణాల సంఖ్యతో క్షీణిస్తున్న దశ.
ప్రాక్టీస్ బిట్స్
1. అధిక జనన, మరణాల రేట్ల నుంచి అల్ప జనన మరణాల రేట్లకు మారడాన్ని ఏమంటారు?
ఎ) జనాభా పరిణామం
బి) జనాభా పరివర్తన
సి) జనాభా మార్పు డి) పైవన్నీ
2. జనాభా మార్పు సంయోగం, లక్షణాలు ధోరణి మొదలైన అంశాల గురించి తెలియజేసేది ఏది?
ఎ) డెమోగ్రఫీ బి) పాపులేషన్ సైన్స్
సి) ఎ, బి డి) జనాభా శాస్త్రం
3. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించినది ఎవరు?
ఎ) వారెన్ సింప్సన్ దాంప్సన్
బి) ఫ్రాంక్ వాలెస్ నోట్ స్టెయిన్
సి) కోల్ డి) హోవర్
4. ‘Economic Development in low income Countries అనే గ్రంథం దేన్ని గురించి వివరిస్తుంది?
ఎ) జనాభా
బి) జనాభా పరిణామ సిద్ధాంతం
సి) సమాజం డి) పైవన్నీ
5. జనాభా పరిణామ సిద్ధాంతం దేన్ని గురించి వివరిస్తుంది?
ఎ) జనన, మరణ రేట్లకు, ఆర్థిక వృద్ధికి మధ్యగల సంబంధం
బి) జనన, మరణ రేట్లకు, ఆర్థికాభివృద్ధికి మధ్యగల సంబంధం
సి) జనన రేటుకు, ఆర్థికాభివృద్ధికి మధ్యగల సంబంధం
డి) జనన రేటు, మరణ రేటుకు మధ్యగల సంబంధం
6. జనాభా పరిణామం, జనాభా చక్రానికి సంబంధించినదని పేర్కొన్నది ఎవరు?
ఎ) థామ్సన్ బి) నోట్ స్టెయిన్
సి) డోలోన్ డి) కోల్
7. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినది ఎవరు?
ఎ) W.S. థామ్సన్
బి) W. నోట్ స్టెయిన్
సి) కోల్ & హోవర్ డి) డోలోన్
8. జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం మొదటి దశ?
ఎ) జనన మరణ రేట్లు అధికం, జనాభా పెరుగుదల స్థిరం
బి) జనన రేటు ఎక్కువ మరణ రేటు తక్కువ
సి) జనన రేటు తక్కువ మరణ రేటు ఎక్కువ
డి) జనన మరణ రేట్లు అల్పం, జనాభా పెరుగుదల స్థిరం
9. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, జనాభా పరిణామ సిద్ధాంతంలోని ఎన్నోదశ ?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) ఏదీకాదు
10. అభివృద్ధి చెందిన దేశాలు జనాభా పరిణామ సిద్ధాంతంలో ఏ దశకు చెందుతాయి?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడోదశ డి) నాలుగో దశ
11. 1921కి పూర్వం భారతదేశం ఏ దశలో ఉండేది?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
12. జనాభా విస్ఫోటనం లేదా జనాభా విజృంభణ జనాభా పరిణామ సిద్ధాంతంలో ఎన్నోదశ?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
13. మాక్స్ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎన్ని దశల్లో వివరించాడు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 4
14. అధిక జననరేటు, తక్కువ మరణరేటు జనాభా పరిణామ సిద్ధాంతంలో ఎన్నోదశ?
ఎ) మొదటి దశ బి) రెండోదశ
సి) మూడో దశ డి) నాలుగోదశ
15. అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభా పరిణామ సిద్ధాంతంలో ఎన్నో దశలో ఉంటాయి?
ఎ) మొదటి దశ బి) రెండోదశ
సి) మూడో దశ డి) నాలుగోదశ
16. 1951-91 మధ్య భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉంది?
ఎ) మొదటి దశ బి) రెండోదశ
సి) మూడో దశ డి) నాలుగోదశ
17. సీపీ బ్లాకర్ అనే ఆర్థిక వేత్త జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ఎన్ని దశలుగా వివరించారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
18. జననరేటు 35-40 శాతం నుంచి 15-20 శాతం తగ్గితే అది జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏ దశకు చేరుకున్నట్లు
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగోదశ
19. మరణాలు ఆర్థిక అంశాలపైన ఆదారపడితే జననాలు దేనిపై ఆధారపడతాయి?
ఎ) సాంఘిక అంశాలు
బి) సౌకర్యాలు
సి) అభివృద్ధి డి) పైవన్నీ
20. పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ, పట్టణీకరణ, అభివృద్ధి, ప్రజల ఆలోచనల్లో మార్పు రావడం అనేది జనాభా పరిణామ సిద్ధాంతంలో ఎన్నో దశ?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
21. అల్పజననం, అల్పమరణం, అల్ప జనన వృద్ధి రేటు ఇది జనాభా పరిణామ సిద్ధాంతంలో ఏ దశ?
ఎ) మొదటి దశ బి) రెండో దశ
సి) మూడో దశ డి) నాలుగో దశ
సమాధానాలు
1-డి 2-సి 3-ఎ 4-బి
5-బి 6-సి 7-బి 8-ఎ
9-బి 10-సి 11-ఎ 12-బి
13-సి 14-బి 15-బి 16-బి
17-డి 18-సి 19-ఎ 20-సి
21-సి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు