TET Science Special | ఒక ప్రాంతం శీతోష్ణస్థితిని నిర్ధారించే ప్రామాణిక కాలం?
1. గాలి నిరంతరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి కారణం?
1) భూ ఆకర్షణ శక్తి 2) భూ భ్రమణం
3) భూ పరిభ్రమణం 4) పైవన్నీ
2. గాలి ధర్మాలు?
1) గాలికి ఒత్తిడి ఉంది
2) బరువు ఉంది
3) ఖాళీస్థలాన్ని ఆక్రమించుకొంటుంది
4) పైవన్నీ
3. వాతావరణస్థితిని తెలిపే అంశాలు?
1) వేడిమి, మేఘాలు 2) గాలిలో తేమ
3) ఒత్తిడి 4) పైవన్నీ
4. రుతువులు ఏర్పడటానికి గల కారణం?
1) భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల
2) భూమి అక్షం వంగి ఉండటం వల్ల
3) 1, 2 4) పైవేవీకాదు
5. వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని ఎన్ని రకాలుగా/ కాలాలుగా విభజించవచ్చు?
1) 4 2) 3 3) 2 4) 5
6. సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం త్వరగా జరిగే కాలం?
1) చలికాలం 2) ఎండాకాలం
3) వర్షాకాలం 4) పై అన్ని కాలాలు
7. మామిడి పండ్లు, ముంజలు లభించే కాలం?
1) శీతాకాలం 2) ఎండాకాలం
3) వర్షాకాలం 4) చలికాలం
8. నెమళ్లు నాట్యం చేసే కాలం?
1) చలికాలం 2) ఎండాకాలం
3) వర్షాకాలం 4) శీతాకాలం
9. ఉష్ణోగ్రతల్లో ఉండే మార్పుల ఆధారంగా ఎన్ని పొరలున్నాయి?
1) 3 2) 4 3) 5 4) 6
10. భూమికి అతి దగ్గరగా ఉన్న పొర/ ఆవరణం?
1) ఎక్సోఆవరణం 2) థర్మో ఆవరణం
3) మీసో ఆవరణం 4) ట్రోపో ఆవరణం
11. నోటి ద్వారా గాలిని ఊదడం వల్ల శబ్దం చేసేవి?
1) మౌతార్గాన్ 2) గిటార్, వీణ
3) వీణ, సన్నాయి
4) వయోలిన్, మౌతార్గాన్
12. వాయుసేనకు సంబంధించిన యుద్ధ విమానాల్లో హెలికాప్టర్లలో ఉపయోగించేది?
1) పారాచూట్ 2) గాలిమర
3) రాకెట్ 4) గాలి బెలూన్
13. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు?
1) ఆక్సిజన్ 2) నైట్రోజన్
3) కార్బన్ డైయాక్సైడ్
4) హైడ్రోజన్
14. నత్రజని తర్వాత ఎక్కువగా గాలిలో ఉండే వాయువు?
1) కార్బన్ డైయాక్సైడ్ 2) ఆక్సిజన్
3) ఆర్గాన్ 4) హైడ్రోజన్
15. నీటిలో నివసించే జంతువులు బ్రతకడానికి కారణం?
1) నీటిలోని హైడ్రోజన్
2) నీటిలోని కార్బన్ డై యాక్సైడ్
3) నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్
4) నీటిలోని నైట్రోజన్
16. వాతావరణంలో మారే అంశాలు?
1) వాతావరణంలో తేమ
2) ఉష్ణోగ్రత
3) సూర్యోదయం, సూర్యాస్తమయం
4) పైవన్నీ
17. అండమాన్ నికోబార్ ద్వీపంలో సునామీ సంభవించిన సంవత్సరం?
1) 2014 2) 2004
3) 2008 4) 2006
18. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదిక?
1) వెదర్ 2) వెదర్ రిపోర్ట్
3) వెదర్ ఫోర్కాస్ట్ 4) వెదర్ గ్రాఫ్
19. గతంలో జరిగిన వాతావరణం వివరాలను తెలియజేసే నివేదిక?
1) వెదర్ 2) వెదర్ రిపోర్ట్
3) వెదర్ ఫోర్కాస్ట్ 4) వెదర్ గ్రాఫ్
20. ఒక ప్రాంతంలోని గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలను కొలిచే సాధనం?
1) క్లినికల్- థర్మామీటర్
2) ల్యాబొరేటరీ థర్మామీటర్
3) సిక్స్-థర్మామీటర్
4) థర్మిస్టర్ థర్మామీటర్
21. గరిష్ఠ, కనిష్ఠ థర్మామీటర్లో ఉపయోగించే ద్రవాలు?
1) పాదరసం 2) ఆల్కహాల్
3) గాలి 4) పాదరసం ఆల్కహాల్
22. గరిష్ఠ, కనిష్ఠ థర్మామీటర్లో సూచికల స్థానాలను మార్చేందుకు అవసరమయ్యేది?
1) గాజు కడ్డీ 2) రాగి కడ్డీ
3) దండయస్కాంతం
4) విద్యుదయస్కాంతం
23. వాతవరణ శాఖ వర్షపాతాన్ని కొలిచే సాధనం?
1) నేలపదును 2) స్థూపాకార బీకరు
3) రెయిన్ గేజ్ 4) నీటిపాత్ర
24. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయాల్లో వర్షం కురిస్తే రైతులు జరిపే పండుగలు?
1) నేలపదును
2) ఏరువాక – పొలం పండుగలు
3) నాగుల చవితి
4) కార్తీక పౌర్ణమి
25. పవనవేగాన్ని, దిశను కొలిచే సాధనం?
1) రెయిన్‌గేజ్ 2) హైడ్రోమీటర్
3) అనిమోమీటర్ 4) మ్యమిడోమీటర్
26. గాలిలోని తేమశాతాన్ని ఎలా పిలుస్తారు?
1) నీటి ఆవిరి 2) తుషారం
3) పొగమంచు 4) ఆర్ద్రత
27. ప్రతి సంవత్సరం, ఒక ప్రాంతంలో ఒకే వాతావరణం ఒకే సమయంలో ఒకే విధంగా ఉండటాన్ని ఏమంటారు?
1) వాతావరణ నమూనా
2) శీతోష్ణస్థితి
3) తేమశాతం 4) ఆర్ధ్రత
28. ఒక ప్రాంతం శీతోష్ణస్థితిని నిర్ధారించే ప్రామాణిక కాలం?
1) 10 సంవత్సరాలు
2) 15 సంవత్సరాలు
3) 20 సంవత్సరాలు
4) 25 సంత్సరాలు
29. మనదేశ శీతోష్ణస్థితిని అధ్యయనం చేసే సంస్థ?
1) ఐఎండీ 2) ఐఆర్ఎస్
3) ఐఎంఎస్ 4) ఐఏఆర్ఎస్
30. భూమి మీద ఉష్ణోగ్రత వ్యత్యాసాలు?
1) రుతువులు 2) మాసాలు
3) గాలులు 4) వర్షపాతాలు
31. భూమధ్యరేఖకు ఇరువైపులా చల్లని గాలులు వీచే అక్షాంశ విలువలు?
1) 0o -10o 2) 0o -20o
3) 10o -30o 4) 0o -30o
33. భూమి మీద గాలులు, సముద్రం మీదకు వీచే నెలలు?
1) మార్చి-జూన్ 2) జూన్- సెప్టెంబర్
3) సెప్టెంబర్-డిసెంబర్
4) డిసెంబర్ -మార్చి
34. తుఫానుల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి?
1) ఉపగ్రహాలు 2) రాడార్లు
3) రాకెట్లు 4) ఉపగ్రహాలు, రాడార్లు
35. ప్రత్యేక సమయాల్లో వీచేగాలులు?
1) పవనాలు 2) తుఫానులు
3) రుతుపవనాలు 4) పెనుగాలులు
36. సాధారణంగా తుఫాన్లు సంభవించే కాలం?
1) మే-జూన్ 2) అక్టోబర్-నవంబర్
3) డిసెంబర్-జవనరి
4) 1 లేదా 2
37. కిందివాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి?
ఎ) మన చుట్టూ గాలి ఉంది
బి) ఖాళీస్థలాల్లో గాలి ఉంది
సి) గాలి మనకు కనబడదు
4) గాలి వర్షాన్ని ఇస్తుంది
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
38. భూమి నిరంతరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడానికి కారణం?
ఎ) భూ ఆకర్షణ శక్తి బి) భూ భ్రమణం
సి) భూ పరిభ్రమణం డి) సౌరశక్తి
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
39. కింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) భూమిపైన గాలి పరిమాణం కొన్ని చోట్ల ఎక్కువ
బి) భూమిపైన గాలి పరిమాణం కొన్ని చోట్ల తక్కువ
సి) గాలికి ఒత్తిడి, బరువు ఉంటుంది
డి) గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
40. వాతావరణానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ) భూమి చుట్టూ గాలి ఒక దుప్పటిలాగా ఆవరించి ఉంది
బి) వేడిమి, మేఘాలు, గాలిలో తేమ, ఒత్తిడి ద్వారా వాతావరణ స్థితిని తెలుసుకోవచ్చు
సి) వాతావరణం ప్రతిరోజూ ఒకేలా ఉండదు
డి) వాతావరణం ప్రతిరోజూ ఒకేలా ఉంటుంది
1) ఎ, సి 2) ఎ, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
41. కింది వాక్యాల్లో సరైన దాన్ని ఎన్నుకోండి?
ఎ) భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడం వల్ల కాలాలు, రుతువులు ఏర్పడతాయి
బి) భూమి అక్షం వంగి ఉండటం వల్ల కాలాలు, రుతువులు ఏర్పడతాయి
సి) వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని మూడు కాలాలుగా విభజిస్తారు
4) కాలాలు సాధారణంగా 4 రకాలు
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
42. చలికాలానికి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి?
ఎ) సూర్యోదయం ఆలస్యంగా జరుగుతుంది
బి) సూర్యాస్తమయం త్వరగా జరుగుతుంది
సి) సీతాకోక చిలుకలు మొక్కలపై తిరుగుతుంటాయి
4) మామిడి చెట్లకు పూత వస్తుంది
1) ఎ, డి 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
43. ఎండాకాలానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ) ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అధికవేడి ఉంటుంది
బి) మామిడి పండ్లు, ముంజలు లభిస్తాయి
సి) ఎండాకాలం ఉన్ని బట్టలు ధరిస్తారు
డి) చల్లని నీళ్లు పానీయాల కన్నా వేడి పదార్థాలు తాగాలనిపిస్తుంది
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి 4) సి, డి
44. వర్షాకాలానికి సంబంధించి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి?
ఎ) నెమళ్లు నాట్యం చేస్తాయి
బి) జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి
సి) సెప్టెంబర్ మాసానికి వర్షాలు తగ్గి క్రమంగా చలికాలం ప్రారంభమవుతుంది
డి) ఈ కాలంలో చల్లని ఆహారాన్ని తినాలనిపిస్తుంది
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
45. వాతావరణ పొరలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ) భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతల్లో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజిస్తారు
బి) భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం
సి) మనం ట్రోపో ఆవరణంలో ఉంటూ దానిలోని గాలిని పీలుస్తాం
డి) ట్రోపో ఆవరణంలో భూమి నుంచి పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
46. కింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) వాతావరణం సౌరశక్తి ద్వారానే వేడెక్కుతుంది
బి) ధ్రువాల కన్నా భూమధ్య రేఖా ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది
సి) ఉష్ణోగ్రతల్లోని భేదాలు గాలి కదలడానికి వాతావరణం ఏర్పడటానికి కారణమవుతున్నాయి
డి) సూర్యకిరణాలు, గాలి, సముద్రాలు, నదులు, చెట్లు భూమిపైన ఉండే ప్రదేశం, ఎత్తు మొదలైనవి వాతావరణంలో
మార్పులకు కారణాలు
1) ఎ, బి 2) బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
47. కింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) మౌతార్గాన్, సన్నాయి వంటి సాధనాలు గాలి ద్వారా పనిచేస్తాయి
బి) గాలి ఒత్తిడి ద్వారా పారాచూట్ పని చేస్తుంది.
సి) గాలికుండే శక్తి ద్వారా పవన విద్యుత్‌ను తయారు చేయవచ్చు
డి) గాలి అల్పపీడన ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతం వైపునకు ప్రసరిస్తుంది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
48. కింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు నత్రజని
బి) గాలిలో ఎక్కువగా ఉండే రెండో వాయువు ఆక్సిజన్
3) నీటిలో కరిగిన ఆక్సిజన్ వల్ల జలచరాలు జీవస్తాయి
4) గాలి మనకు జీవనాధారం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
49. కింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) చెత్త కాలిస్తే వచ్చే పొగ వల్ల విషపూరిత వాయువులు గాలిలో చేరతాయి
బి) పొగ తాగేవారు వదిలిన గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, టి.బి. క్యాన్సర్ వస్తాయి
సి) గాలి కాలుష్యం కాకుండా చెట్లను నాటాలి
4) కాలుష్యకారక కర్మాగారాలను అదుపులో పెట్టాలి
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
50. కింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలిపే నివేదిక వెదర్ ఫోర్కాస్ట్
బి) గతంలో జరిగిన వాతావరణం వివరాలను తెలియజేసే నివేదిక వెదర్ రిపోర్ట్
సి) సాధారణంగా మనం రెండింటిని కూడా వాతావరణ నివేదిక అంటుంటాం
డి) మనదేశంలో వాతావరణ సమాచారం ఐ.ఎం.డి. తెలియజేస్తుంది
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి 4) సి, డి
సమాధానాలు
1-4 2-4 3-4 4-3
5-3 6-1 7-2 8-3
9-3 10-4 11-1 12-1
13-2 14-2 15-3 16-4
17-2 18-3 19-2 20-3
21-4 22-3 23-3 24-2
25-3 26-4 27-2 28-4
29-1 30-3 31-4 32-3
33-4 34-4 35-3 36-4
37-4 38-3 39-4 40-3
41-3 42-4 43-3 44-3
45-4 46-3 47-4 48-3
49-4 50-2
కృష్ణ
విషయ నిపుణులు,
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు