TSPSC Group 4 Model Paper | తెలంగాణలో నదులు ఏ దిశ నుంచి ఏ దిశగా ప్రవహిస్తున్నాయి?
గత శనివారం తరువాయి..
34. కింది సంస్థలను వాటి ప్రధాన కార్యాలయాలను సరిగా జత చేయండి.
1. నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎ. అహ్మదాబాద్
2. ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ బి. బెంగళూరు
3. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) సి. హైదరాబాద్
4. డిజాస్టర్ మిటిగేషన్ ఇన్స్టిట్యూట్ డి. న్యూఢిల్లీ
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
35. విపత్తులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
1. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సంభవించే తుఫానులను హరికేన్లు అంటారు
2. సాధారణంగా అగ్ని పర్వతాలు, భూకంపాలు, భూపాతాలు సునామీ రావడానికి కారణమవుతాయి
3. హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులను సైక్లోన్లు అంటారు
4. సునామీ అనే పదం జపనీస్ భాష నుంచి వచ్చింది
ఎ. 1 బి. 1, 2
సి. 1, 2, 3 డి. 1, 2, 3, 4
36. కింది వాటిని పరిశీలించి సరైన వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
1. లక్షద్వీప్ దీవుల సమూహం నుంచి మినీకాయ్ ద్వీపాన్ని వేరుచేసే జలమార్గాన్ని తొమ్మిదో డిగ్రీ చానల్ అంటారు
2. మినీకాయ్ (లక్షద్వీప్) ద్వీపాన్ని మాల్దీవులను వేరు చేసే చానల్‌ను ఎనిమిదో డిగ్రీ చానల్ అంటారు.
3. బంగాళాఖాతంలో అండమాన్ దీవులను, నికోబార్ దీవులను వేరు చేసే చానల్‌ను పదో డిగ్రీ చానల్ అంటారు
ఎ. 1 బి. 2
సి. 1, 2 డి. 1, 2, 3
37. లడఖ్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1.లడఖ్ 2019, అక్టోబర్ 31న భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది
2. లడఖ్ భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం
3. లడఖ్‌కు లేహ్ (వేసవి), కార్గిల్ (శీతాకాల) రాజధానులు
4. లడఖ్‌ను ‘లిటిల్ టిబెట్’ అని అంటారు
ఎ. 1, 3 బి. 2
సి. 3, 4 డి. 4
38. భారత ప్రామాణిక సమయం, గ్రీనిచ్ సగటు సమయం మధ్య సమయ వ్యత్యాసం ఎంత?
ఎ. 5 గంటలు బి. 6 గంటలు
సి. 5 1/2 గంటలు డి. 6 1/2 గంటలు
39. కింది రాష్ర్టాల్లో ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం?
ఎ. మధ్యప్రదేశ్ బి. బీహార్
సి. పశ్చిమ బెంగాల్ డి. మహారాష్ట్ర
40. కింది ఖండాల్లో ఏది అత్యధిక జనాభా వృద్ధి రేటును కలిగి ఉంది?
ఎ. ఆఫ్రికా బి. ఆసియా
సి. ఉత్తర అమెరికా డి. దక్షిణ అమెరికా
41. కింది వాటిలో ప్రపంచీకరణ ద్వారా అతి తక్కువ లాభపడిన రంగం ఏది?
ఎ. రవాణా రంగం
బి. వ్యవసాయ రంగం
సి. సేవా రంగం
డి. తయారీ రంగం
42. కింది పట్టణాల్లో కర్కటక రేఖకు దగ్గరగా ఉన్న పట్టణం ఏది?
ఎ. నాగ్‌పూర్ బి. కోల్‌కతా
సి. జోధ్‌పూర్ డి. ఢిల్లీ
43. సరికాని వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. ఏదైనా ఒక రాష్ట్రం తీరరేఖతో గాని ఇతర దేశాలతోగాని సరిహద్దు లేకుండా ఉంటే అటువంటి రాష్ర్టాన్ని భూపరివేష్ఠిత రాష్ట్రం అంటారు
2. భారతదేశంతో అతి ఎక్కువ సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్
3. భారత్‌లో మూడు సముద్రాలతో సరిహద్దు గల రాష్ట్రం తమిళనాడు
4. జార్ఖండ్ రాష్ర్టానికి తీరరేఖ లేదు, కానీ అంతర్జాతీయ సరిహద్దు ఉంది
ఎ. 1 బి. 1, 2
సి. 2, 3 డి. 4
44. శివాలిక్ పర్వత శ్రేణులను వివిధ రాష్ర్టాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు, వాటిని సరిగా జత చేయండి.
1. సిక్కిం ఎ. కచ్చర్ కొండలు
2. పశ్చిమ బెంగాల్ బి. దుద్వా కొండలు
3. అసోం సి. చురియా మురియా కొండలు
4. ఉత్తరాఖండ్ డి. డ్వార్ఫ్ కొండలు
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
45. గంగానదికి సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?
1. గంగానది పొడవు మొత్తం 2525 కిలోమీటర్లు, ఇందులో 2415 కి.మీ. భారతదేశంలోనే ప్రవహిస్తుంది
2. గంగానది అలకనంద, భగీరథి నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది, ఇది దేవ ప్రయాగ వద్ద ఏర్పడుతుంది
3. గంగానదిని భారత ప్రభుత్వం 2008, నవంబర్‌లో జాతీయ నదిగా గుర్తించింది
4. గంగానది ఉపనదుల్లో యమునా నది అతిపెద్దది
ఎ. 1, 2 బి. 1, 3
సి. 1, 2, 4 డి. 1, 2, 3, 4
46. తెలంగాణలో కింది ప్రదేశాలు దేనికి ప్రసిద్ధి చెందిందో సరిగా జత చేయండి.
1. చాపలు ఎ. నిజామాబాద్
2. ఇత్తడి సామగ్రి బి. వరంగల్, అలంపూర్
3. తివాచీలు సి. పెంబర్తి
4. రూసా గడ్డి డి. మహబూబ్‌నగర్
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
47. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?
1. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్నారు
2. ఈ ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీరు ఎత్తిపోతల ద్వారా లభిస్తుంది
3. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు
4. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రెండు వేల కోట్ల రూపాయలుగా అంచనా వేశారు
ఎ. 1 బి. 1, 2
సి. 1, 2, 3 డి. 4
48. కింది వాటిని సరిగా జత చేయండి.
1. పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎ. మంచిర్యాల జిల్లా
2. మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం బి. నాగర్‌కర్నూల్ జిల్లా
3. ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సి. మెదక్ జిల్లా
4. అమ్రాబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డి. సంగారెడ్డి జిల్లా
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
49. కింది అంశాలను సరిగా జత చేయండి.
1. ఎపికల్చర్ ఎ. పండ్ల మొక్కల పెంపకం
2. పోమీకల్చర్ బి. తేనెటీగల పెంపకం
3. ఒలేరి కల్చర్ సి. పట్టు పురుగుల పెంపకం
4. సెరికల్చర్ డి. కూరగాయల మొక్కల పెంపకం
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
50. కింది వాటిలో సరికాని వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
1. తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిధిలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీని నిర్మిస్తున్నారు
2. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట వద్ద 200 ఎకరాల్లో 1999 జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేశారు. ఇక్కడ జీవ వైవిధ్యపరమైన పరిశోధన, ఉత్పాదక కార్యకలాపాలు, శిక్షణ ఇస్తారు
3. భారతదేశంలో బల్క్ డ్రగ్ టీకాలకు రాజధానిగా హైదరాబాద్ పేరుగాంచింది
4. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో ఆరోగ్య పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయనున్నారు
ఎ. 1, 2 బి. 1, 4
సి. 1, 2, 3 డి. 1, 2, 3, 4
51. సుమారు 800 సంవత్సరాల వయస్సు కలిగిన అతిపెద్ద మర్రిచెట్టు పిల్లలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ఎ. మెదక్ బి. మహబూబ్‌నగర్
సి. ఆదిలాబాద్ డి. నల్లగొండ
52. కింది అంశాలను సరిగా జత చేయండి.
1. కుంతాల జలపాతం ఎ. జగిత్యాల జిల్లా
2. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ బి. జనగామ జిల్లా
3. ముత్యంపేట చక్కెర పరిశ్రమ సి. ఆదిలాబాద్ జిల్లా
4. జఫర్‌గఢ్ కోట డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
53. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి కింది అంశాలను సరిగా జత చేయండి.
1. మున్సిపల్ కార్పొరేషన్లు ఎ. 17
2. జిల్లా ప్రజాపరిషత్‌లు బి. 32
3. మున్సిపాలిటీలు సి. 129
4. నగర పంచాయతీలు డి. 25
ఎ. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
54. తెలంగాణలో నదులు ఏ దిశ నుంచి ఏ దిశగా ప్రవహిస్తున్నాయి?
ఎ. ఈశాన్యం నుంచి నైరుతి
బి. వాయవ్యం నుంచి నైరుతి
సి. ఈశాన్యం నుంచి ఆగ్నేయం
డి. వాయవ్యం నుంచి ఆగ్నేయం
55. తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి, చివరి నదులు ఏవి?
ఎ. మంజీరా, హరిద్ర
బి. మంజీరా, సీలేరు
సి. మంజీరా, శబరి డి. శబరి, సీలేరు
56. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1. ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువే ఆ దేశ జాతీయాదాయంగా పరిగణిస్తారు
2.జాతీయాదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం
3. స్థిర ధరల్లో తలసరి ఆదాయాన్ని గణిస్తే వాస్తవ తలసరి ఆదాయం వస్తుంది
4. వాస్తవ తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణ స్థాయి వృద్ధి చెందుతుంది
ఎ. 1, 2 బి. 3, 4
సి. 2 డి. 1, 2, 3, 4
57. నీతి ఆయోగ్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య/వ్యాఖ్యలు ఏవి?
1.నీతి ఆయోగ్‌లో నీతి (NITI) అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
2. నీతి ఆయోగ్‌ను ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
3. 2015, జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది
4. నీతి ఆయోగ్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు
ఎ. 1 బి. 2, 3
సి. 4 డి. 3
58. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
ఎ. ఖరీఫ్ కాలం – అక్టోబర్ నుంచి సెప్టెంబర్
బి. విత్త సంవత్సరం – ఏప్రిల్ నుంచి మార్చి
సి. విద్యా సంవత్సరం – జూన్ నుంచి మే
డి. క్యాలెండర్ సంవత్సరం – జనవరి నుంచి డిసెంబర్
59. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు వర్తించే కాలం?
ఎ. 2012-17 బి. 2010-15
సి. 2020-25 డి. 2021-26
60. ప్రపంచ పెట్టుబడి నివేదికను ఎవరు ప్రచురిస్తారు?
ఎ. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)
బి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)
సి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (వోఈసీడీ)
డి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (ఆంక్టాడ్)
61. అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు ఏర్పడితే దాని ప్రభావం నేరుగా ఏ వస్తువులు/సరుకులపై ఉంటుంది?
ఎ. ఆహార ధాన్యాలు
బి. బంగారం, వెండి
సి. వంట నూనెలు
డి. నిల్వ చేయలేని వినియోగ వస్తువులు
62. స్వర్ణ విప్లవం (గోల్డెన్ రెవల్యూషన్) దేనికి సంబంధించినది?
ఎ. విలువైన లోహాలు ఉత్పత్తి
బి. పప్పుదినుసుల ఉత్పత్తి
సి. జనపనార ఉత్పత్తి
డి. నాలుగో పంచవర్ష ప్రణాళిక
63. భారతదేశం ఏ పంచవర్ష ప్రణాళికలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు మారింది?
ఎ. మొదటి పంచవర్ష ప్రణాళిక
బి. రెండో పంచవర్ష ప్రణాళిక
సి. మూడో పంచవర్ష ప్రణాళిక
డి. నాలుగో పంచవర్ష ప్రణాళిక
సమాధానాలు
34. బి 35. డి 36. డి 37. బి
38. సి 39. డి 40. ఎ 41. బి
42. బి 43. డి 44. ఎ 45. డి
46. బి 47. సి 48. ఎ 49. డి
50. డి 51. బి 52. ఎ 53. సి
54. డి 55. సి 56. డి 57. సి
58. ఎ 59. డి 60. డి 61. బి
62. డి 63. బి
బీవీ రమణ
డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్,
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు