గాలి నుంచే ఆక్సిజన్… ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్!
- గాలి నుంచే ఆక్సిజన్‌ను గ్రహించే యంత్రం
- ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దిగుమతి
- వారం రోజుల్లో భారత్‌కు 10వేల యంత్రాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా సెకండ్ వేవ్‌లో రోగుల ప్రాణాలను కాపాడటానికి ఆక్సిజన్ అతి కీలకంగా మారింది. మెడికల్ ఆక్సిజన్‌కు విపరీత డిమాండ్ ఏర్పడింది. దవాఖానల్లో ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. పరిశ్రమల నుంచి తెచ్చే ఆక్సిజన్ చాలడం లేదు. ఆక్సిజన్ కొరతతో దేశవ్యాప్తంగా 60 మందికిపై కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు పరిశ్రమలు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లతో పాటు నేరుగా గాలి నుంచి ఆక్సిజన్‌ను గ్రహించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. వివిధ దేశాల నుంచి 10,636 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వారం రోజుల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో తీసుకురానున్నట్టు పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ మంగళవారం తెలిపారు. ఇప్పటికే అమెరికా నుంచి 636 కాన్సన్ట్రేటర్లతో విమానాలు బయల్దేరాయని చెప్పారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏం చేస్తుంది
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఒక ఎలక్ట్రానిక్ మెడికల్ పరికరం. ఇది గాలిలో నుంచి ఆక్సిజన్‌ను ఫిల్టర్ చేస్తుంది. సాధారణంగా గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు గ్రహించిన ఆక్సిజన్ 90-95% స్వచ్ఛతతో ఉంటుంది. దీనిని ముక్కు ద్వారా రోగికి అందించవచ్చు. ఇది నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్‌ను రోగి శరీరంలోకి పంపుతుంది.
మధ్యస్థ లక్షణాలున్నవారికే
కరోనా మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికే ఈ కాన్సన్ట్రేటర్లు ఉపయోగకరమని వైద్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి 85 శాతం కంటే దిగువకు పడిపోతే నిమిషానికి 50 లీటర్ల ఒత్తిడితో ఆక్సిజన్ అందించాల్సి ఉంటుందని, ఇది కాన్సన్ట్రేటర్లతో సాధ్యం కాదని చెప్తున్నారు. సిలిండర్లతోనే సాధ్యమని తెలిపారు. అయితే ఒక్కసారి కొనుగోలు చేస్తే ఏండ్ల తరబడి పనిచేయడం, మళ్లీ మళ్లీ ఆక్సిజన్ నింపాల్సిన అవసరం లేకపోవడంతో వైద్యపరంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు బాగా డిమాండ్ ఉన్నది. ప్రస్తుత కరోనా సమయంలో డిమాండ్ మరింత పెరిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు