Indian Polity | మంత్రి మండలి దేనికి సమష్టి బాధ్యత వహిస్తుంది?
1. కింది వాటిలో ఏది ఆదేశ సూత్రం?
1) అంటారానితనం రద్దు
2) గ్రామ పంచాయతీల సంస్థ
3) మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ
4) జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ
2. రాజ్యాంగ పనితీరు సమీక్షించడానికి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఏ సంవత్సరంలో నియమించిన జాతీయ కమిటీ అంతర్రాష్ట్ర వాణిజ్య, కామర్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
1) 2001 2) 2002
3) 1999 4) 1998
3. అత్యవసర స్థితి ప్రకటన అనేది కింది ఏ కాల వ్యవధికి అమల్లో ఉన్నప్పుడు లోక్‌సభ వ్యవధిని పార్లమెంట్ చట్టం ద్వారా పొడిగించవచ్చు?
1) ఏక కాలంలో రెండు సంవత్సరాలు మించకూడదు. అత్యవసర ప్రకటన ఉపసంహరించిన ఒక సంవత్సరం వ్యవధికి మించి ఏ సంద ర్భంలోనూ దాన్ని పొడిగించకూడదు.
2) ఏకకాలంలో ఒక సంవత్సరానికి మించకూడదు, అత్యవసర స్థితి ఉపసంహరించిన పన్నెండు నెలల కాలానికి మించి ఏ సందర్భంలోనూ దాన్ని పొడిగించకూడదు.
3) ఏకకాలంలో ఒక సంవత్సరానికి మించకూడదు, అత్యవసర స్థితి ఉపసంహరించిన మూడు నెలల కాలానికి మించి ఏ సందర్భంలోనూ దాన్ని పొడిగించకూడదు.
4) ఏకకాలంలో ఒక సంవత్సరానికి మించకూడదు, అత్యవసర స్థితి ఉపసంహరించిన ఆరు నెలల కాలానికి మించి ఏ సందర్భంలోనూ దాన్ని పొడిగించకూడదు.
4. భారత ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయక పదవి కలిగి ఉన్నాడనే ఆరోపణతో ఎవరైనా పార్లమెంటు సభ్యుడి మీద అనర్హత వేటు అనే అంశం మీద భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి కిందివాటిలో సరైనది?
1) రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి. ఆ అభిప్రాయాన్ని ఆయన అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు
2) రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి వచ్చే ముందు ఆయన ఎవరి అభిప్రాయం తీసుకోవలసిన అవసరం లేదు
3) రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి, ఆ అభిప్రాయం ప్రకారం
వ్యవహరించాలి.
4) రాష్ట్రపతి తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయాలి. సుప్రీంకోర్టు నిర్ణయానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలి
5. పంచాయతీల ఆర్థిక స్థితిని సమీక్షించడానికి కిందివారిలో ఎవరు ఆర్థిక కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు?
1) రాష్ట్ర గవర్నర్ 2) ప్రధానమంత్రి
3) అటార్నీ జనరల్ 4) ముఖ్యమంత్రి
6. ఆర్టికల్ 263 కింద ఇంటర్ గవర్నమెంట్ కౌన్సిల్‌గా పిలిచే ఒక శాశ్వత అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని కింది ఏ కమిటీ/ కమిషన్ సిఫారసు చేసింది?
1) మదన్ మోహన్ పూంచీ కమిషన్
2) రాజమన్నార్ కమిటీ
3) కృష్ణ కమిటీ
4) సర్కారియా కమిటీ
7. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది దేనికి ఉంటుంది?
1) ఇతర కోర్టులను మినహాయించడానికి సుప్రీంకోర్టు
2) రాజమన్నార్ కమిటీ
3) శ్రీకృష్ణ కమిటీ
4) ఆ వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లే
రాష్ట్ర హైకోర్టు
8. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగంలో కొంత భాగం విఫలమైతే ఆ రాష్ర్టానికి చెందిన ఎవరి ద్వారా ఒక నివేదికను రాష్ట్రపతికి పంపవచ్చు?
1) ముఖ్యమంత్రి 2) హోంమంత్రి
3) గవర్నర్ 4) హోంకార్యదర్శి
9. మంత్రి మండలిలో ప్రధానమంత్రితో సమా మొత్తం మంత్రుల సంఖ్యకు సంబంధించి రాజ్యాంగం విధించిన పరిమితి ఎంత?
1) లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 10 శాతం
2) లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 12 శాతం
3) లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతం
4) లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 20 శాతం
10. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరి సలహాకు అనుగుణంగా రాష్ట్రపతి వ్యవహరించాలి?
ఎ) పార్లమెంటు 2) లోక్‌సభ
3) ప్రధానమంత్రి అధ్యక్షతతో కూడిన మంత్రి మండలి
4) ప్రధానమంత్రి లేదా ఉప ప్రధానమంత్రి
11. ఏ అర్హత కలిగిన వ్యక్తిని రాష్ర్టానికి అడ్వకేట్ జనరల్‌గా రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు?
1) విధాన సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి
2) హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి
3) మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తిగా
నియమించడానికి
4) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి
12. ఒక రాష్ట్ర శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత కంటే తక్కువ ఉండ కూడదు?
1) 44 2) 52 3) 40 4) 65
13. లోక్‌సభ మొత్తం సభ్యుల్లో (1) రాష్ర్టాల నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్న, (2)పార్లమెంట్ చట్టప్రకారం ఎన్నుకున్న కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల గరిష్ఠ సంఖ్య వరుసగా?
1) 500, 50 2) 515, 35
3) 530, 20 4) 540, 10
14. ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు కావడానికి అవసరమైన కనీస వయస్సు?
1) 20 సం.లు 2) 25 సం.లు
3) 22 సం.లు 4) 28 సం.లు
15. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి భారత దేశంలో ఎన్ని గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలున్నాయి?
1) 19 2) 29 3) 99 4) 59
16. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి భారతదేశంలో ఎన్ని గుర్తింపు పొందిన జాతీయ పార్టీలున్నాయి?
1) 5 2) 7 3) 9 4) 8
17. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లను (100 శాతం) గెలుచుకున్న భారతదేశంలోని మొట్టమొదటి పార్టీ?
1) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
2) సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF)
3) సిక్కిం సంగ్రామ్ పరిషత్ (SSP)
4)ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)
18. 1913 భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా వలస వచ్చిన భారతీయులు యూఎస్ఏలో కింది ఏ విప్లవాత్మక సంస్థలు ఏర్పాటు చేశారు?
1) ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్
2) అభినవ్ భారత్
3) ఆజాద్ హింద్ ఫౌజ్
4) గదర్‌పార్టీ
19. 2020 ఫిబ్రవరి 1 నాటికి రాజ్యసభలో కింది ఏ రాజకీయ పార్టీల్లో ఒకటి కంటే ఎక్కువ సభ్యులున్నారు?
1) రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
2) ఆమ్ ఆద్మీ పార్టీ
3) కేరళ కాంగ్రెస్ (M)
4) అసోం గణ పరిషత్
20. 2020 ఫిబ్రవరి 1 నాటికి లోక్‌సభలో కింది ఏ రాజకీయ పార్టీల్లో ఒకటి కంటే ఎక్కువ సభ్యులున్నారు?
1) అప్నా దళ్
2) నేషనల్ పీపుల్స్ పార్టీ
3) రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ
4) నాగా పీపుల్స్ పార్టీ
21. ప్రముఖ పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భారతదేశంలోని కింది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
1) తిరువనంతపురం 2) త్రిస్సూర్
3) కోజికోడ్ 4) మలప్పురం
22. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలోని కింది లోక్‌సభ నియోజకవర్గాల్లో దేనికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు?
1) వారణాసి 2) భావనగర్
3) వడోదర 4) అలహాబాద్
23. 2020 ఫిబ్రవరి 1 నాటికి లోక్‌సభలో అత్యధిక సభ్యులు గల రెండో రాజకీయ పార్టీ ఏది?
1) ద్రవిడ మున్నేట్ర కజగం
2) భారత జాతీయ కాంగ్రెస్
3) భారతీయ జనతాపార్టీ
4) అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
24. 2020 ఫిబ్రవరి 1 నాటికి లోక్‌సభలో కింది రాజకీయ పార్టీల్లో దేనికి గరిష్ఠ బలం ఉంది?
1) భారతీయ జనతా పార్టీ
2) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
3) భారత జాతీయ కాంగ్రెస్
4) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
25. కొత్త రాష్ర్టాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న రాష్ర్టాల ప్రాంతాలు, సరిహద్దులు లేదా పేర్లను మార్చడం దేని ద్వారా చేయవచ్చు?
1) పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ
2) పార్లమెంటులో సాధారణ మెజారిటీ
3) పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ
4) పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ, రాష్ట్ర శాసన సభలో కనీసం సగం ఆమోదం
26. 2019లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ‘జనసేన’ పార్టీని ఎవరు స్థాపించారు?
1) చిరంజీవి
2) డబ్ల్యూ. లక్ష్మీనారాయణ
3) నాగార్జున 4) పవన్ కల్యాణ్
27. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
1) విజయలక్ష్మీ పండిట్ 2) అనిబీసెంట్
3) సుచేతా కృపలాని 4) అన్నా చాందీ
28. 2020 ఫిబ్రవరి 1 నాటికి రాజ్యసభలో అత్యధిక సభ్యులను కలిగి ఉన్న పార్టీ ఏది?
1) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2) భారతీయ జనతా పార్టీ
3) భారత జాతీయ కాంగ్రెస్
4) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
29. భారతదేశంలో అతి పురాతన జాతీయ పార్టీ?
1) భారతీయ జన సంఘ్
2) భారత జాతీయ కాంగ్రెస్
3) భారత కమ్యూనిస్ట్ పార్టీ
4) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్
ఇండియా (మార్క్సిస్ట్)
30. కింది వాటిలో భారతదేశంలోని పురాతన కమ్యూనిస్ట్ పార్టీ ఏది?
1) ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ
2) వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
3) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
4) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
(మార్క్సిస్ట్)
31. కింది ఏ సవరణ చట్టం ద్వారా, 1978లో ఆర్టికల్ 19(1)(f), ఆర్టికల్ 31లను తొలగించడంతో ఆస్తిహక్కు అనే ముఖ్యమైన ప్రాథమిక హక్కును తొలగించారు?
1) 44 2) 56 3) 35 4) 40
32. కింది వారిలో రాజ్యసభ ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఎవరు?
1) భారత రాష్ట్రపతి 2) ప్రధాన మంత్రి
3) భారత ఉపరాష్ట్రపతి
4) రక్షణ మంత్రి
33. మంత్రి మండలి సమష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది?
1) ప్రజల సభ 2) ప్రధాన మంత్రి
3) భారత ఉపరాష్ట్రపతి
4) రక్షణ మంత్రి
34. భారత అటార్నీ జనరల్‌గా నియమితమయ్యే వ్యక్తి దేనికి అర్హుడై ఉండాలి?
1) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు
2) రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు
3) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యేందుకు
4) హైకోర్టు న్యాయమూర్తిగా
నియామకమ్యేందుకు
35. ముఖ్యమంత్రితో సహా, ఒక రాష్ట్రంలోని మంత్రి మండలిలో మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంతకు మించకూడదు?
1) 5 శాతం 2) 15 శాతం
3) 8 శాతం 4) 12 శాతం
36. కింది వారిలో ఎవరు ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు?
1) శాసనసభ స్పీకర్
2) భారత ఉపరాష్ట్రపతి
3) ముఖ్యమంత్రి
4) ఆ రాష్ట్ర గవర్నర్
37. పార్లమెంట్‌లోని ఏ సభలోనూ ఎంత కాలంలోగా సభ్యులు కాని పక్షంలో ఒక కేంద్ర మంత్రి మంత్రిగా కొనసాగరు?
1) వరుసగా 12 నెలలు
2) వరుసగా 9 నెలలు
3) వరుసగా 6 నెలలు
4) వరుసగా 3 నెలలు
38. కేంద్ర వ్యవహారాల పాలనకు సంబంధించి మంత్రి మండలి అన్ని నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేయడమనేది ఎవరి బాధ్యత?
1) సంబంధిత మంత్రి
2) ప్రధాన మంత్రి
3) క్యాబినెట్ సెక్రటేరియట్
4) సంబంధిత విభాగంలో భారత ప్రభుత్వ కార్యదర్శి
39. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం కేంద్ర పార్లమెంట్ ఎవరితో కూడి ఉండాలి?
1) రాష్ట్రపతి వరుసగా రాజ్యసభ, లోక్‌సభగా పిలిచే రెండు సభలు, మంత్రి మండలి
2) రాష్ట్రపతి వరుసగా రాజ్యసభ, లోక్‌సభ అని పిలిచే రెండు సభలు
3) రాజ్యసభ, లోక్‌సభ అని పిలిచే రెండు సభలు
4) రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాజ్యసభ లోక్‌సభ అని పిలిచే రెండు సభలు
40. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 274 ప్రకారం రాష్ర్టాలు ఆసక్తి ప్రదర్శించే పన్నులను ప్రభావితం చేసే బిల్లుల విషయంలో ఎవరి ముందస్తు సిఫారసు అవసరం?
1) ప్రధాన మంత్రి 2) ఆర్థిక మంత్రి
3) నీతి ఆయోగ్ సీఈవో
4) భారత రాష్ట్రపతి
41. రాజ్యాంగంలోని ఆర్టికల్ 134(1) ప్రకారం ఒక క్రిమినల్ కేసులో ఏదైనా హైకోర్టు కింది విధంగా చేసినపుడు ఆ హైకోర్టు వెలువరించిన ఏదైనా తీర్పు, తుది ఆదేశం లేదా శిక్షకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు?
1) నిందితుడైన వ్యక్తికి విధించిన శిక్ష ఉత్తర్వు మీద అప్పీలును నిర్ధారించడంతోపాటు ఆ వ్యకికి జీవితఖైదు విధించినప్పుడు
2) నిందితుడైన వ్యక్తికి విధించిన శిక్ష ఉత్తర్వు మీద అప్పీలును నిర్ధారించడంతోపాటు ఆ వ్యక్తికి మరణిశిక్ష విధించినప్పుడు
3) నిందితుడైన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన ఉత్తర్వును కొట్టివేయడంతో పాటు అతనికి మరణిశిక్ష విధించినప్పుడు
4) నిందితుడైన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన ఉత్తర్వును కొట్టివేయడంతో పాటు అతనికి జీవితఖైదు విధించినప్పుడు
ans
1-2 2-2 3-4 4-3
5-1 6-4 7-1 8-3
9-3 10-3 11-2 12-3
13-3 14-2 15-4 16-2
17-3 18-4 19-2 20-1
21-1 22-1 23-2 24-1
25-2 26-4 27-2 28-2
29-2 30-3 31-1 32-3
33-1 34-3 35-2 36-4
37-3 38-2 39-2 40-4
41-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు