Group 2, 3 – Sociology Special | శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు?
1. ‘భారతదేశంలో సామాజిక ఉద్యమాలు’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) రజని కొఠారీ 2) ఎంఎస్ఏ రావు
3) ఘన్ శ్యాం షా 4) ఏఆర్ దేశాయ్
2. ఎంఎస్ఏ రావు పేర్కొనని సామాజిక ఉద్యమాలు?
1) సంస్కరణవాద ఉద్యమాలు
2) పరివర్తన ఉద్యమాలు
3) తిరుగుబాటు ఉద్యమాలు
4) విప్లవాత్మక ఉద్యమాలు
3. ఉద్యమాలు, స్వభావాలకు సంబంధించి సరిగా జతపర్చండి.
ఎ. తిరోగమన ఉద్యమాలు 1. సామాజిక నిర్మితిని పూర్తిగా మార్చివేసి దాని స్థానంలో నూతన వ్యవస్థను నిర్మించడం
బి. సంస్కరణ ఉద్యమాలు 2. సామాజిక వ్యవస్థలో కొన్ని ప్రత్యేక అంశాల్లో పరివర్తన తేవడం
సి. వ్యతిరేక ఉద్యమాలు 3. సమాజం మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని ఒక ఆదర్శవంతమైన దశకు తీసుకెళ్లడం
డి. ఉటోపియన్ ఉద్యమాలు 4. సమకాలీన సమాజంలో వేగంగా ఏర్పడే మార్పులను వ్యతిరేకించడం
ఇ. విప్లవాత్మక ఉద్యమాలు 5. సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5 2) ఎ-4, బి-2, సి-5, డి-3, ఇ-1
3) ఎ-4, బి-5, సి-3, డి-2, ఇ-1 4) ఎ-3, బి-4, సి-5, డి-1, ఇ-2
4. స్టేట్మెట్స్.
ఎ. రైతాంగ ఉద్యమాలను ఏఆర్ దేశాయ్ రైతాంగ పోరాటం అని పేర్కొన్నాడు
బి. రైతాంగ ఉద్యమాలను కాథలిన్ గౌ రైతుల తిరుగుబాటు అని పేర్కొన్నాడు
సి. అఖిల భారత కిసాన్ సభ 1936 గయ సభలో దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ఇచ్చింది సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) ఎ 2) ఎ, బి 3) ఎ, సి 4) ఎ, బి, సి
5. శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు?
1) వారెన్ హేస్టింగ్స్ 2) కారన్ వాలిస్
3) కెప్టెన్ రీడ్ 4) థామస్ మన్రో
6. జతపర్చండి.
ఎ. నీలిమందు రైతుల తిరుగుబాటు 1.1917
బి. దక్కన్ అలజడులు 2.1918
సి. చంపారన్ రైతు ఉద్యమం 3.1859-60
డి. ఖేదా రైతు ఉద్యమం 4. 1875
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-1, డి-2
7. మలబారు ప్రాంతంలో జరిగిన రైతుల తిరుగుబాటులో పాల్గొన్నవారు?
1) హిందూ పేద రైతులు
2) ముస్లిం పేద రైతులు
3) క్రిస్టియన్ పేద రైతులు
4) జొరాస్ట్రియన్ పేద రైతులు
8. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి సరికానిది?
1) ఈ పోరాటం 1946 నుంచి 51 వరకు జరిగింది
2) దొడ్డి కొమురయ్య మరణంతో ఈ పోరాటం హింసాత్మకంగా మారింది
3) చైనాలో తప్ప ఆసియాలో ఇంతపెద్ద రైతాంగ పోరాటం ఎక్కడా జరగలేదని ప్రముఖ చరిత్రకారుడు విల్ఫ్రెజ్ కాంట్వెల్ స్మిత్ పేర్కొన్నాడు
4) ఈ పోరాటాన్ని ప్రచారం చేయడానికి అరుణోదయ సాంస్కృతిక మండలి మా భూమి అనే నాటికను ప్రదర్శించింది
9. ఆచార్య ఎన్జీ రంగాతో సంబంధం లేని అంశం?
1) స్వతంత్ర రాష్ట్ర రైతు సంఘం, రైతు కూలీ సంఘాలను 1923లో గుంటూరులో ఏర్పాటు చేశాడు
2) ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాన్ని 1928లో బీవీ రత్నంతో కలిసి స్థాపించాడు
3) భారత రైతు కేంద్రాన్ని 1933లో స్థాపించాడు
4) ఆంధ్ర రైతు పోరాట సమితిని 1934లో స్థాపించాడు
10. జతపర్చండి.
ఎ. కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన్ 1. తూర్పు బెంగాల్
బి. భారతీయ కిసాన్ యూనియన్ 2. పశ్చిమ బెంగాల్
సి. షెట్కారీ సంఘటన్ 3. మహారాష్ట్ర
డి. పాబ్నా రైతుల తిరుగుబాటు 4. ఉత్తరప్రదేశ్
5. రాజస్థాన్
1) ఎ-5, బి-4, సి-2, డి-1 2) ఎ-5, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1 4) ఎ-1, బి-2, సి-3, డి-4
11. కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న రైతు చట్టాలతో సంబంధం లేని చట్టం?
1) రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపర (ప్రోత్సహక, సులభతర) చట్టం-2020
2) ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం-2020
3) రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ డెవలప్మెంట్, కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం-2020
4) నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం-2020
12. భారతీయ కిసాన్ యూనియన్ మహేంద్ర సింగ్ టికాయత్ నాయకత్వంలో దేనికి వ్యతిరేకంగా పోరాడారు?
1) వడ్డీ వ్యాపారుల మోసాలకు వ్యతిరేకంగా
2) విద్యుత్ టారిఫ్ పెంపుదలకు వ్యతిరేకంగా
3) విత్తన ధరల పెంపుదలకు వ్యతిరేకంగా
4) భూమి శిస్తు పెంపుదలకు వ్యతిరేకంగా
13. కేంద్ర క్యాబినెట్ నుంచి ఎవరిని తొలగించినప్పుడు ఉత్తరప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కిసాన్ ర్యాలీ జరిగింది?
1) దేవీలాల్ 2) చరణ్ సింగ్
3) ఎన్జీ రంగా
4) మహేంద్ర సింగ్ టికాయత్
14. నక్సల్బరీ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది?
1) 1967లో డార్జిలింగ్ కొండ ప్రాంతంలోని నీలిమందు తోటల్లో సాయుధ రైతాంగ తిరుగుబాటు ప్రారంభమైంది
2) 1969లో అస్సాంలోని దిమిరాజి ప్రాంతంలో తేయాకు తోటల్లో విప్లవ పోరాటం ప్రారంభమైంది
3) 1967లో డార్జిలింగ్ కొండ ప్రాంతంలోని తేయాకు తోటల్లో సాయుధ రైతాంగ తిరుగుబాటు ప్రారంభమైంది
4) 1967లో పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల్లో మల్బరీ తోటల్లో సాయుధ రైతాంగ తిరుగుబాటు ప్రారంభమైంది
15. తుడుం దెబ్బ ఉద్యమంతో సంబంధం లేని అంశం?
1) సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదికన గిరిజనుల వర్గీకరణ
2) రిజర్వేషన్ల ప్రయోజనాలను అన్ని తెగలకు జనాభా ప్రాతిపదికన కల్పించడం
3) ఖాయితీ లంబాడాలు, వాల్మీకి బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి చేర్చడాన్ని వ్యతిరేకించడం
4) గిరిజనులకు శాశ్వత నివాస సదుపాయాలను, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం
16. జతపర్చండి.
ఎ. రంప తిరుగుబాటు 1. రాంచీ
బి. మూండా తిరుగుబాటు 2. ఒరిస్సా
సి. కోల్ తిరుగుబాటు 3. తూర్పు గోదావరి
డి. ఖోండ్ తిరుగుబాటు 4. చోటానాగపూర్
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
17. మద్రాస్ ప్రెసిడెన్సీ రూపొందించిన ఏ చట్టం వల్ల కొండరెడ్లు, కోయ తెగల జీవనాధారాన్ని కోల్పోయారు
1) మద్రాస్ భూమిశిస్తు చట్టం- 1882
2) మద్రాస్ అటవీ చట్టం- 1882
3) మద్రాస్ గిరిజన చట్టం- 1882
4) మద్రాస్ అటవీ ఉత్పత్తుల చట్టం- 1882
18. గోండ్ ఉద్యమం..
ఎ. గోండ్వానా ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో విస్తరించి ఉంది
బి. గోండ్ల సమస్యల అధ్యయనానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రముఖ మానవ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ను నియమించింది
పై వాటిలో సరైనవి గుర్తించండి?
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, సి
19. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందస్తు హెచ్చరికగా జరిగిన గిరిజన ఉద్యమం?
1) నాగా ఉద్యమం
2) సంతాల్ తిరుగుబాటు
3) పహరియా తిరుగుబాటు
4) తానా భగత్ ఉద్యమం
20. జతపర్చండి.
ఎ. కొండదొర ఉద్యమం 1. సేవారామ్
బి. ఒరాన్ ఉద్యమం 2. రాణి గైడిన్లూ
సి. కుకీ తిరుగుబాటు 3. జాత్ర భగత్
డి. భిల్ తిరుగుబాటు 4. కొర్ర మల్లయ్య
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-2, బి-4, సి-3, డి-1
21. గోండ్లు ఆత్మనిగ్రహ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా చేపట్టారు?
1) మద్యపానానికి వ్యతిరేకంగా
2) అధిక భూమి శిస్తుకు వ్యతిరేకంగా
3) మతపరమైన అల్లర్లకు వ్యతిరేకంగా
4) మాంసాహార అలవాట్లకు వ్యతిరేకంగా
22. నరబలి ఆచారాన్ని, శిశు హత్యలను నిషేధిస్తూ 1837లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన గిరిజన ఉద్యమం?
1) కోల్ తిరుగుబాటు
2) ఖోండ్ తిరుగుబాటు
3) సంతాల్ తిరుగుబాటు
4) హో తెగ తిరుబాటు
23. హుకుం సింగ్ కమిషన్ (2001) ఏ అంశాన్ని అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
1) వెనుకబడిన తరగతుల సాధికారత సాధనకు
2) షెడ్యూల్డ్ కులాల సాధికారత సాధనకు
3) షెడ్యూల్డ్ తెగల సాధికారత సాధనకు
4) అత్యంత వెనుకబడిన తరగతుల సాధికారత సాధనకు
24. వెనుకబడిన తరగతుల ఉద్యమాల ప్రభావం వల్ల సర్ లెస్లీ మిల్లర్ కమిటీని ఏర్పాటు చేసినవారు?
1) మద్రాస్ ప్రెసిడెన్సీ
2) మైసూర్ మహారాజు
3) కొచ్చిన్ మహారాజు 4) ఏడో నిజాం
25. వెనుకబడిన తరగతుల ఉద్యమానికి కారణం కానిది?
1) బ్రాహ్మణాధిక్యత
2) సామాజిక అసమానతలు
3) కులాంతర వివాహాలు
4) కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు
26. స్టేట్మెంట్స్
ఎ. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఈవీ రామస్వామి నాయకర్ కేరళలో 1925లో ప్రారంభించాడు
బి. రామస్వామి నాయకర్ కుడి అరసు అనే ఆంగ్ల వార పత్రికను, రివోల్ట్ అనే తమిళ దిన పత్రికను ప్రారంభించాడు
సి. రామస్వామి నాయకర్ 1924లో వైకోమ్ (కేరళ) సత్యాగ్రహంలో, 1937లో మద్రాస్లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాడు
పై వాటిలో సరైనవి?
1) ఎ, బి సరైనవి, సి తప్పు
2) ఎ, సి సరైనవి బి తప్పు
3) ఎ, బి, తప్పు సి సరైనది
4) ఎ, సి తప్పు, బి సరైనది
27. జస్టిస్ ఉద్యమంతో సంబంధం లేనివారు?
1) సీఎన్ మొదలియార్ 2) టీఎం నాయర్
3) పీ త్యాగరాజ శెట్టి 4) సీఎన్ కనమొలిన్
28. స్టేట్మెంట్స్.
ఎ. మహాత్మా జ్యోతిరావు ఫులే 1963లో సత్యశోధక్ సమాజ్ను స్థాపించాడు
బి. స్వామి వివేకానంద సలహాపై శ్రీనారాయణ గురు 1903లో శ్రీనారాయణ ధర్మ పరిపాలనా సంస్థను స్థాపించాడు
పై వాటిలో సరైనవి?
1) ఎ సరైనది బి తప్పు
2) ఎ తప్పు బి సరైనది
3) ఎ, బి సరైనవి 4) ఎ, బి తప్పు
29. జతపర్చండి.
ఎస్ఎన్డీపీ కార్యదర్శి ప్రత్యేకత
ఎ. టీకే మాధవన్ 1. సంస్థ విస్తరణ కాలం
బి. సీఎస్ వేలాయుధన్ 2. పౌర హక్కుల డిమాండ్ కాలం
సి. సీ కేశవన్ 3. విద్యా కార్యక్రమాల కాలం
డి. ఆర్ శంకర్ 4. వినతి పత్రాల కాలం
ఇ. పల్పు, కుమారన్, అసన్ 5. ఉద్యమ కాలం
1) ఎ-1, బి-2, సి-4, డి-5, ఇ-3
2) ఎ-5, బి-1, సి-2, డి-3, ఇ-4
3) ఎ-4, బి-5, సి-3, డి-2, ఇ-1
4) ఎ-1, బి-4, సి-3, డి-2, ఇ-5
30. మహాత్మా జ్యోతిరావు ఫులే రచన కానిది?
1) గులాంగిరీ 2) ఇషార
3) మనుధర్మ యథేచ్ఛ
4) సార్వజనిక్ సత్యధర్మ్
సమాధానాలు
1-3, 2-3, 3-2, 4-2,
5-2, 6-4, 7-2, 8-4, 9-4, 10-2, 11-3, 12-2, 13-2, 14-3, 15-4, 16-2, 17-2, 18-1, 19-2, 20-3, 21-1, 22-2, 23-4, 24-2, 25-3, 26-3, 27-4, 28-2, 29-2, 30-3.
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు