Government Jobs 2023 | ఇంకా 2 రోజులే గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి రాయ్‌పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Raipur), మర్మగావ్ పోర్ట్ అథారిటీ (Mormugao Port Trust), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు ఎల్లుండి ( జూలై 10)తో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.AIIMS Raipur Recruitment | రాయ్‌బరేలిలో 176 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
AIIMS Raipur Recruitment 2023 | బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ తదితర విభాగాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పూర్ (Raipur)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 169
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 45 ఏండ్లు మించకూడదు.
పేస్కేల్ : నెలకు రూ.67700
ఎంపిక : రాతపరీక్ష, డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 10
వెబ్సైట్ : https://www.aiimsraipur.edu.in/
2. Mormugao Port Trust | మర్మగావ్ పోర్ట్ అథారిటీలో పైలట్ ట్రెయినీ పోస్టులు
Mormugao Port Trust | పైలట్ ట్రెయినీ, సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గోవాలోని మర్మగావ్ పోర్ట్ అథారిటీ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, షిప్పింగ్ మంత్రిత్వశాఖ నుంచి జారీచేసిన కాంపిటెన్సీ మాస్టర్ ఆఫ్ ఫారెన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు: 05
పోస్టులు: పైలట్ ట్రెయినీ, సేఫ్టీ ఆఫీసర్
అర్హతలు: పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, షిప్పింగ్ మంత్రిత్వశాఖ నుంచి జారీచేసిన కాంపిటెన్సీ మాస్టర్ ఆఫ్ ఫారెన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: 30-40 ఏండ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.50000 నుంచి రూ.2లక్షలు
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : ది సెక్రటరీ, మోర్ముగావో పోర్ట్ అథారిటీ, హెడ్‌ల్యాండ్, సదా, గోవా -403804.
చివరి తేది: జూలై 10
వెబ్సైట్ : https://mptgoa.gov.in/
3.NIT Hamirpur Recruitment | నిట్ హమిర్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
NIT Hamirpur Recruitment | సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమిర్పూర్(Hamirpur)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ (Screening Test), షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ (Trade Test), పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview) ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 84
పోస్టులు : సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్/టెక్నికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి ఇంటర్, ఐటీఐ, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
జీతం : నెలకు రూ.21700 నుంచి రూ.209200 వరకు
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 10
వెబ్సైట్ : https://nith.ac.in
4.CRPF SMO Recruitment | సీఆర్పీఎఫ్లో 18 స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
CRPF SMO Recruitment 2023 | అనస్థీషియా, సర్జరీ, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ, మెడిసిన్ తదితర విభాగాలలో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (Specialist Medical Officer) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 18
పోస్టులు : స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్
విభాగాలు : సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ, మెడిసిన్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: 70 ఏండ్లు మించకూడదు.
జీతం : రూ.85,000.
ఇంటర్వ్యూ తేదీ: జులై 10
వెబ్సైట్ : https://rect.crpf.gov.in/
5.WII Recruitment | వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ పోస్టులు
Wildlife Institute of India Recruitment 2023 | మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS), అసిస్టెంట్(Assistant), టెక్నీషియన్ (Technician), టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంఎస్సీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 15
పోస్టులు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నీకల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీకల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్, బీఎస్సీ, బీఈ, బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా, ఎంఎస్సీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు : వెబ్సైట్లో
ఎంపిక : రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా
వయస్సు : 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
చివరితేదీ : జూలై 10
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ అడ్రస్‌కు పంపించాలి).
వెబ్సైట్ : https://wii.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు