Geography | సెండాయ్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం దేనికి సంబంధించింది?
1. ఏ దేశాలను కలపడం టాపి (TAPI) గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ లక్ష్యం?
ఎ) తుర్కెమెనిస్థాన్, అర్మేనియా, పాకిస్థాన్, ఇరాన్
బి) తుర్కెమెనిస్థాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్
సి) తుర్కెమెనిస్థాన్, అర్మేనియా, పాకిస్థాన్, భారత్
డి) తుర్కెమెనిస్థాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్
2. కింది వాటిలో సరైనవి?
1. దేశంలో మహిళా అక్షరాస్యతకు, సంతానోత్పత్తికి మధ్య రుణాత్మక సంబంధం ఉంది
2. దేశంలో మహిళా అక్షరాస్యత అధికంగా ఉంటే, సంతానోత్పత్తి తక్కువగా ఉంటుంది
3. దేశంలో మహిళా అక్షరాస్యత అధికంగా ఉండే, సంతానోత్పత్తి కూడా అధికంగా ఉంటుంది
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 3 డి) 2, 3
3. భారత్‌లో అత్యధికంగా ఎగుమతి అయ్యే సముద్ర ఆహార వస్తువు ఏది?
ఎ) సజీవ చేపలు
బి) ఘనీభవించిన రొయ్యలు
సి) ఘనీభంచిన పీతలు
డి) ఘనీభవించిన చేపలు
4. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బంగారు నిక్షేపాలు ఉన్న సూచనలు ఇచ్చిన తుమకూరు ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) తమిళనాడు బి) ఆంధ్రప్రదేశ్
సి) మహారాష్ట్ర డి) కర్ణాటక
5. 1992 రియో సదస్సు అజెండా 21 దేనికి సంబంధించింది?
ఎ) జనాభా విస్ఫోటనం
బి) గ్రీన్హౌస్ వాయువుల విడుదల నియంత్రణ సి) సుస్థిరాభివృద్ధి
డి) పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞాన బదిలీ
6. దేశంలో షెల్ గ్యాస్ నిల్వలు ముఖ్యంగా ఏ రాష్ర్టాల్లో లభిస్తాయి?
ఎ) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్
బి) హర్యానా, పంజాబ్
సి) హర్యానా, అసోం
డి) ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్
7. ‘సెండాయ్ ఫ్రేమ్‌వర్క్’ ఒప్పందం దేనికి సంబంధించింది?
ఎ) వాతావరణ మార్పు
బి) విపత్తుల ప్రమాదాలను తగ్గించడం
సి) క్యాన్సర్ నివారణ
డి) హెచ్ఐవీ నివారణ/తగ్గింపు
8. స్వాతంత్య్రం తర్వాత దేశంలో అభివృద్ధి పరిచిన మొదటి సముద్ర ఓడ రేవు?
ఎ) కొచ్చి బి) కోల్‌కతా
సి) విశాఖపట్నం డి) కాండ్లా
9. కింది వాటిలో ఏ రాష్ర్టాన్ని పూర్తి సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించారు?
ఎ) సిక్కిం బి) కర్ణాటక
సి) కేరళ డి) పంజాబ్
10. డాన్యూబ్ నది కింది ఏ దేశాల గుండా ప్రయాణించదు?
ఎ) జర్మనీ-ఆస్ట్రియా
బి) స్లొవేకియా-యుగోస్లేవియా
సి) హంగరి-రుమేనియా
డి) బల్గేరియా-ఫ్రాన్స్
11. జతపర్చండి.
1. జర్మనీ-ఫ్రాన్స్ ఎ. ఓడర్నిస్సే రేఖ, హిడెన్‌బర్గ్ రేఖ, 24…0 రేఖాంశం
2. జర్మనీ-పోలెండ్ బి. మాజినాట్ రేఖ, సిగ్ఫ్రాయిడ్ లైన్
3. రష్యా-ఫిన్లాండ్ సి. మానర్హీము రేఖ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి
బి) 1-సి, 2-బి, 3-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-సి
డి) 1-బి, 2-సి, 3-ఎ
12. కింది వాటిని జతపర్చండి.
1. దక్షిణ యూరప్ ఎ. ఆల్పైన్ ముడత పర్వతాలు
2. రష్యా బి. కాకసస్, యూరల్ పర్వతాలు
3. స్పెయిన్, ఫ్రాన్స్ సి. కొలెన్ పర్వతాలు
4. నార్వే, స్వీడన్ డి. పైరనీస్ పర్వతాలు
ఎ) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
13. ముర్రే, ముర్రంబ్రిడ్జి, డార్లింగ్, లాబియన్ నదులు ఏ ఖండంలో ఉన్నాయి?
ఎ) ఉత్తర అమెరికా బి) ఆసియా
సి) ఆఫ్రికా డి) ఆస్ట్రేలియా
14. ప్రపంచంలోని జలగర్భంలో గల అతిపెద్ద ప్రవాళ బిత్తిక ‘గ్రేట్ బారియర్’ ఎక్కడ ఉంది?
ఎ) ఆస్ట్రేలియా బి) ఆఫ్రికా
సి) యూరప్ డి) ఉత్తర అమెరికా
15. దయ్యాల నగరం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
ఎ) అరికా బి) సావోపాలో
సి) శాంటియాగో డి) మెక్సికన్ సిటీ
16. అంటార్కిటికా ఖండంలోని వీచే అతి తీవ్రమైన, దట్టమైన చలి పవనాలను ఏమని పిలుస్తారు?
ఎ) వెల్డులు బి) కెటబాలిక్ పవనాలు
సి) కంపాలు డి) బ్లిజార్డ్స్
17. ప్రపంచంలో ఎత్తుగా, దక్షిణంగా ఉన్న ఖండం?
ఎ) దక్షిణ అమెరికా బి) ఆఫ్రికా
సి) అంటార్కిటికా డి) ఆస్ట్రేలియా
18. ప్రపంచంలోని కాఫీ పండే ఎస్టేట్లను ఏమని పిలుస్తారు?
ఎ) గుయానో బి) ఫజెండాలు
సి) పంపాలు డి) ఏదీకాదు
19. ప్రపంచంలో నీటి పరిమాణం పరంగా అతిపెద్ద జలపాతమైన ‘ఇగ్వాజో’ ఏ నదిపై ఉంది?
ఎ) నీగ్రో బి) మాగ్డలీన
సి) పరానా డి) అమెజాన్
20. ఆసియా ఖండంలో తక్కువ జనాభా గల దేశం?
ఎ) మలేషియా బి) కిరిబతి
సి) బంగ్లాదేశ్ డి) మాల్దీవులు
21. టండ్రా మండలంలో నివసించే ప్రజల ప్రధాన వృత్తి?
ఎ) వేటాడటం బి) చేపలు పట్టడం
సి) పై రెండూ డి) వ్యవసాయం
22. టైగా మండలంలో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం?
ఎ) జవోస్టాక్ బి) ఒమికాన్
సి) లీనా డి) వేర్ఖోయానస్క్
23. ప్రపంచంలో అత్యంత ఉత్తరాన నివసించే తెగ?
ఎ) ఎస్కిమోలు బి) లాపులు
సి) యాకుత్లు డి) ఎవరూకాదు
24. లాటరైట్ నేలలకు సంబంధించి నిజమైన వాటిని గుర్తించండి.
1. ఇవి ఎర్రగా ఉండటానికి కారణం అందులో కరిగి ఉన్న ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్
2. తోట పంటలకు అనుకూలమైనది
3. లీచింగ్ ప్రక్రియ వల్ల ఏర్పడుతాయి
4. బాక్సైట్ ఖనిజం ఎక్కువగా ఉంటుంది
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 2, 4 డి) 1, 2, 3, 4
25. ఎడారి నేలలకు సంబంధించి నిజమైన వాటిని గుర్తించండి.
1. నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది
2. హ్యూమస్ పదార్థం అతి తక్కువగా ఉంటుంది
3. నీటిపారుదల సౌకర్యాలు కల్పించుకో గలిగితే గోధుమ, బార్లీ పంటలకు అనుకూలమైనవి
4. దేశ భూభాగంలో 1.29 శాతం కలిగి ఉన్నాయి
ఎ) 1, 3 బి) 2, 3 సి) 2, 4 డి) 3, 4
26. దేశంలో అవనాళికా క్రమక్షయం ఎక్కువగా గల ప్రాంతాలు?
ఎ) యమునా నదీలోయ
బి) చంబల్ నదీలోయ
సి) నర్మదా నదీలోయ డి) 1, 2
27. కింది ఏ రాష్ట్రంలో ఒండ్రు నేలలు అత్యల్ప స్థాయిలో విస్తరించి ఉన్నాయి?
ఎ) తమిళనాడు బి) హర్యానా
సి) మధ్యప్రదేశ్ డి) పశ్చిమబెంగాల్
28. ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి రాష్ర్టాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
ఎ) ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్
బి) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమబెంగాల్
సి) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్
డి) ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్
29. కింది వాటిలో తప్పు జతను గుర్తించండి.
ఎ) రబీ- ఆవాలు, పుచ్చకాయలు
బి) రబీ- ఆవాలు, బార్లీ
సి) జైద్- పుచ్చకాయలు, కూరగాయలు
డి) ఖరీఫ్- పత్తి
30. కింది వాటిలో తప్పు జతను గుర్తించండి.
ఎ) భారతదేశం ప్రపంచంలో ఫలాల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది
బి) భారత్ ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది
సి) ఉత్తరప్రదేశ్ గోధుమ ఉత్పత్తిలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది
డి) ఫలాలు, కూరగాయల, సుగంధ ద్రవ్య పంటలను సాగు చేయడాన్ని హార్టికల్చర్ అని పిలుస్తారు
31. కింది వాటిని జతపర్చండి.
గనుల ప్రాంతం ఖనిజం
1. మలజ్ ఖండ్ ఎ. బొగ్గు
2. కుద్రేముఖ్ బి. కాపర్
3. కోర్బా సి. ఇనుప ధాతువు
4. జాదూగూడ డి. యురేనియం
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
32. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో తూర్పుకనుమల్లో ఎక్కువగా లభించే ఖనిజం?
ఎ) ఇనుము బి) బాక్సైట్
సి) బంగారం డి) థోరియం
33. కరగండా బొగ్గు క్షేత్రం ఏ దేశంలో ఉంది?
ఎ) కజకిస్థాన్ బి) జర్మనీ
సి) ఉక్రెయిన్ డి) జాంబియా
34. ఏ పరిశ్రమలో అత్యధిక శాతం కార్మికులను నియమించుకుంటారు?
ఎ) జౌళి బి) ఇనుము, ఉక్కు
సి) మోటార్ డి) నౌకాయాన
35. నూలు, వస్త్ర పరిశ్రమ ముంబై పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉండటానికి కారణం?
1. తేమగల వాతావరణం
2. ఓడరేవు సౌకర్యాలు
3. పెట్టుబడుల లభ్యత
4. విద్యుత్ అందుబాటు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 3, 4 డి) పైవన్నీ
36. చమురు శుద్ధి కర్మాగారాలు దేశంలోని ప్రముఖమైన ఓడరేవులకు దగ్గరగా ఏర్పాటు చేయడానికి కారణం?
ఎ) తీర ప్రాంతం వెంట చమురు క్షేత్రాలు ఏర్పాటై ఉన్నందున
బి) ఇతర దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేయడం వల్ల
సి) వాటి ద్వారా తయారైన ఉత్పత్తులను ఈ రేవుల నుంచి దిగుమతి చేయడం వల్ల
డి) పెట్రోలియం పదార్థాలను వినియోగించడంలో ముఖ్య కేంద్రాలైనందున
37. సింద్రీ అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి?
ఎ) ఎరువుల కర్మాగారం
బి) అల్యూమినియం కర్మాగారం
సి) సిమెంట్ కర్మాగారం
డి) కాగితం కర్మాగారం
38. ప్రస్తుతం సిమెంట్‌ను ఎక్కువ ఉత్పత్తి చేసే మొదటి మూడు రాష్ర్టాలు?
ఎ) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు
బి) మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
సి) ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్
డి) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్
39. దేశంలో ఏ జనాభా లెక్కల్లో మెట్రోపాలిటన్ నగర భావనను అధికారికంగా నిర్వహించారు?
ఎ) 1981 బి) 1991
సి) 2001 డి) 2011
40. దేశంలో అత్యధికంగా శ్రామికులు కలిగిన రాష్ర్టాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
ఎ) ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్
బి) ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర
సి) ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
డి) ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర
41. దేశంలో 2011 జనగణన ప్రకారం జనాభా సానుకూలత ఎంత శాతం ఉంది?
ఎ) 61.4 బి) 60.4
సి) 58.4 డి) 64.8
42. వలసలకు కారణమైన వికర్షక కారణం కానిదేది?
ఎ) జీవన ప్రమాణాలు తక్కువగా ఉండటం
బి) ప్రకృతి వైపరీత్యాలు
సి) నిరుద్యోగం
డి) మెరుగైన జీవన ప్రమాణాలు
43. వలసలకు కారణమైన ఆకర్షక కారణం కానిదేది?
ఎ) విలాసవంతమైన జీవితం
బి) మెరుగైన విద్య, ఆరోగ్య సేవలు
సి) అధిక వేతనాలు డి) పౌరయుద్ధం
44. తోడేళ్లు, నక్కలు, అడవి కుక్కలను సంరక్షిస్తున్న అభయారణ్యం?
ఎ) పోచారం బి) శివారం
సి) మంజీర డి) పాకాల
45. బ్రిటిష్ వారు అటవీ విధానాన్ని తొలిసారి ఏ సంవత్సరంలో ప్రకటించారు?
ఎ) 1884 బి) 1894
సి) 1892 డి) 1891
46. మొసళ్ల పరిరక్షణ కోసం హైదరాబాద్ ఫసీ చట్టం 1952 కింద ఏర్పాటు చేసిన అభయారణ్యం?
ఎ) శివారం వన్యప్రాణి అభయారణ్యం
బి) పాకాల అభయారణ్యం
సి) కిన్నెరసాని అభయారణ్యం
డి) ప్రాణహిత అభయారణ్యం
47. జతపర్చండి.
1. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎ. పెగడపల్లి
2. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం బి. రామవరం
3. ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రం సి. రేవులపల్లి
ఎ) 1-ఎ, 2-సి, 3-బి
బి) 1-బి, 2-ఎ, 3-సి
సి) 1-ఎ, 2-బి, 3-సి
డి) 1-బి, 2-సి, 3-ఎ
సమాధానాలు
1-బి, 2-ఎ, 3-బి, 4-డి,
5-బి, 6-ఎ, 7-బి, 8-డి, 9-ఎ, 10-డి, 11-సి, 12-డి, 13-డి, 14-ఎ, 15-ఎ, 16-బి, 17-సి, 18-బి, 19-సి, 20-డి, 21-సి, 22-బి, 23-సి, 24-డి, 25-బి, 26-డి, 27-సి, 28-బి, 29-ఎ, 30-బి, 31-సి, 32-బి, 33-ఎ, 34-ఎ, 35-డి, 36-సి, 37-ఎ, 38-డి, 39-బి, 40-ఎ, 41-డి, 42-డి, 43-డి, 44-ఎ, 45-బి, 46-సి, 47-సి
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు