General Studies | వ్యూహాత్మక ఆచరణ సూచీని ఏ సంస్థ విడుదల చేస్తుంది?
జనరల్ స్టడీస్
1. కింది వాటిలో ఏ అడవుల్లో భారతదేశంలో అత్యధిక కార్బన్ నిల్వలు ఉన్నాయి?
a. ఉష్ణమండల పొడి ఆకురాల్చే
b. ఉష్ణమండల తేమ ఆకురాల్చే
c. ఉష్ణమండల అర్ధ సతతహరిత
d. ఉష్ణమండల తడి సతతహరిత
2. మడ అడవులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలోని మడ అడవులు ఇటీవల కాలంలోక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి
2. ఒడిశా, మహారాష్ట్రల్లో మాత్రమే గతేడాది మడ అడవుల విస్తీర్ణం పెరిగింది
3. పశ్చిమబెంగాల్లోని సుందర్బన్లో ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి
కింది కోడ్లను ఉపయోగించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి.
a.1, 3 b.3 c.1, 2 d.1, 2, 3
3. కింది జతల్లో ఏది సరిగా సరిపోలింది?
ఉష్ణమండల తుఫాను ప్రాంతం
a. హరికేన్ ఆస్ట్రేలియా
b. విల్లీ విల్లీ జపాన్
c. బగియో ఫిలిప్పీన్స్
d. టైఫూ ఉత్తర అట్లాంటిక్
4. కింది వాటిని గమనించండి.
1. బైకాల్ సరస్సు
2. టాంగాన్యికా సరస్సు
3. సుపీరియర్ సరస్సు
4. విక్టోరియా సరస్సు
పైన పేర్కొన్న సరస్సుల్లో ఏవి పగులు లోయలో ఉన్నాయి?
a. 1, 3, 4 b. 2, 3
c. 1, 2, 3, 4 d. 1, 4
5. గంగా నదికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. జోషీమఠ్ భగీరథి నదితో ముడిపడి ఉంది
2. గంగా నది పొడవు బీహార్ రాష్ట్రంలో అతి తక్కువ
3. గంగా నదీ వ్యవస్థ పూర్తిగా హిమాలయ మూలాలున్న నదులతో కూడి ఉంది
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
a)1, 3 b) 2 c) 3 d)1, 2
6. కింది వాటిని పరిశీలించండి.
1. జాతీయ హరిత హైడ్రోజన్ కార్యక్రమం
2. హరితారుణ కార్యక్రమం
3. PM- PRANAM
4. వ్యర్థం నుంచి సంపద (Waste to Wealth)
5. MISTHI
6. అమృత ధరోహర్
పైన పేర్కొన్న కార్యక్రమాల్లో ఏవి దేశం హరిత వృద్ధిని సాధించడానికి ఉద్దేశించినవి?
a. 1, 2, 3, 4 b. 2, 3, 4, 5
c. 1, 2, 3, 4, 5, 6 d. 1, 3, 4, 6
7. 2023-24 బడ్జెట్లో ఉపయోగించిన ముని అనే పదం దేన్ని సూచిస్తుంది?
a. మున్సిపాలిటీల కోసం కొత్త పథకాలు
b. మున్సిపాలిటీ జారీ చేసిన రుణ భద్రత
c. లైంగిక వేధింపుల ద్వారా దోపిడీకి గురైన పిల్లలకు ఇచ్చిన రుణాలు
d. అనాథల కోసం నగదు సబ్సిడీ పథకం
8. దేశంలో పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. మొదటి పంచవర్ష ప్రణాళికలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై జమీందారీ వ్యవస్థ రద్దు చేయబడింది
2. రెండో పంచవర్ష ప్రణాళిక దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి భరోసా ఇచ్చేలా అత్యుత్తమంగా
వనరులు కేటాయించింది
3. రెండో పంచవర్ష ప్రణాళిక ఆర్థిక సరళీకరణ ప్రారంభాన్ని వ్యక్తపరిచింది
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
a. 1, 2 b. 2, 3
c. 1, 3 d. 1, 2, 3
9. జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ పథకానికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. ఈ పథకం MSME రంగానికి సంబంధించినది
2. ఇది అధిక నాణ్యతతో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది
3. ఇది పర్యావరణంపై కనిష్ఠ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది
4. ఇది ప్రధానమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మైలురాయి
కింది కోడ్ల ద్వారా సరైన జవాబును గుర్తించండి.
a. 1, 4 b. 2, 3
c. 1, 2, 3 d. పైవన్నీ
10. బ్రిక్స్ బ్యాంక్‌లో సభ్యత్వం పొందడానికి ఏ దేశాలు అర్హత కలిగి ఉన్నాయి?
a. ఏ దేశమైనా
b. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు
c. ప్రపంచ బ్యాంకు లేదా ఐఎంఎఫ్ సభ్య దేశాలు
d. ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశం
11. వ్యూహాత్మక ఆచరణ సూచీని ఏ సంస్థ విడుదల చేస్తుంది?
a. ప్రపంచ బ్యాంకు b. UNCTAD
c. WTO d. OECD
12.‘ASEEM’ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించినది?
a. ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందించడం
b. ఎంఎస్ఎంఈల ద్వారా వస్తువుల సేకరణ కోసం ఆన్లైన్ పోర్టల్
c. రక్షణ వస్తువుల సేకరణకు ఆన్లైన్ వేదిక
d. ఉద్యోగాలున్న కార్మికుల నైపుణ్యాల చిత్రణకు డిజిటల్ పోర్టల్
13. పదాలు అర్థం
1. భిక్కు బౌద్ధ సన్యాసంలో నియమిత పురుషుడు
2. భిక్కుని బౌద్ధ సన్యాసంలో నియమిత స్త్రీ
3. విహారాలు వర్షాకాలం సమయంలో నిర్మించిన తాత్కాలిక నివాసాలు
పైన పేర్కొన్న వాటిలో ఏవి సరిపోలలేదు?
a. 1, 3 b. 3
c. 1, 2 d. 2
14. కింది అంశాలను గమనించండి.
1. ఘియాసుద్దీన్ బాల్బన్
2. జలాలుద్దీన్ ఖిల్జీ
3. ఘియాసుద్దీన్ తుగ్లక్
4. అల్లావుద్దీన్ ఖిల్జీ
5. మహమ్మద్ తుగ్లక్ 6. బాహల్ లోడీ
పైన పేర్కొన్న రాజులను కాలక్రమానుసారం
అమర్చండి.
a. 1, 3, 4, 6, 5, 2
b. 1, 2, 3, 4, 5, 6
c. 1, 2, 5, 4, 3, 6
d. 1, 2, 4, 3, 5, 6
15. పర్యాటకులకు సంబంధించి కింది జతలను గమనించండి.
1. ఇబన్బటూటామొరాకో
2. అబ్దుల్ రజాక్ మరఖండిఉజ్బెకిస్థాన్
3. అల్బెరూనీఅఫ్గానిస్థాన్
పై వాటిలో ఏవి సరైనవి?
a. 1 b. 2 c. 2, 3 d. 1, 2, 3
16. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. సరోజినీనాయుడు భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలు
2. ఏవో హ్యూమ్ ఎన్నడూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కాలేదు
3. భారత జాతీయ కాంగ్రెస్‌కు అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు మౌలానా అబుల్‌కలాం ఆజాద్
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి కావు?
a. 1, 2 b. 2, 3
c. 1, 2, 3 d. 1
17. స్వాతంత్య్ర పోరాట సమయంలో కల్పనాదత్ దేనికి ప్రధాన మహిళా నిర్వాహకురాలు?
a. స్వదేశీ ఉద్యమం
b. కాకోరి దోపిడీ
c. చిట్టగాంగ్ ఆయుధశాలపై దాడి
d. క్విట్ ఇండియా ఉద్యమం
18. కింది వాటిని గమనించండి.
1. అతిక్రమణ సిద్ధాంతం
2. సైన్య సహకార కూటమి
3. లాహోర్ ఒప్పందం
4. పిట్స్ ఇండియా చట్టం
సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
a. 3, 2, 1, 4 b. 1, 2, 3, 4
c. 2, 1, 4, 3 d. 4, 2, 3, 1
19. ‘భౌరియా’ అనే పదం ఏ సంగీత నాటక సంప్రదాయక రూపం?
a. అంకియానాట్ b. భావై
c. తమాషా d. జాట్ర
20. కింది వాటిలో ఏ నివేదికలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) విడుదల చేయదు?
1. ప్రపంచ ఆర్థిక స్థితి నివేదిక
2. ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదిక
3. ప్రపంచ పోటీతత్వ నివేదిక
4. ప్రపంచ ఆర్థిక స్థిరత్వ నివేదిక
సరైన జవాబును గుర్తించండి.
a. 2, 4 b. 1, 3
c. 3 d. పైవన్నీ
21. మిలిటరీ విన్యాసం దేశం
1. గరుడశక్తి ఫ్రాన్స్
2. శక్తి ఇండోనేషియా
3. ధర్మరక్షక జపాన్
పైన పేర్కొన్న మిలిటరీ విన్యాసాల్లో ఏవి
సరిపోలాయి?
a. 1, 2 b. 1, 2, 3
c. 3 d. 2, 3
22. సమాచార సంఘంపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ సదస్సు (United Nations World Summit on the Inform ation Society)లో ఏ రాష్ర్టానికి ‘ఉత్తమ ప్రాజెక్ట్’ అవార్డు లభించింది?
a. తెలంగాణ b. ఏపీ
c. సిక్కిం d. మేఘాలయ
23. తెలంగాణ ప్రభుత్వం T-IDEA కింద పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్రం వ్యవస్థాపకులకు కింది వాటిలో ఏ ప్రోత్సాహకాలను అందిస్తుంది?
1. స్టాంపు డ్యూటీని తిరిగి చెల్లిస్తుంది
2. వడ్డీ, పెట్టుబడి రాయితీలను అందిస్తుంది
3. మూలధన సహాయాన్ని అందిస్తుంది
4. నాణ్యత నియంత్రణ, పేటెంట్ నమోదు కోసం చేయూత
సరైన జవాబును గుర్తించండి.
a. 1, 2 b.1, 3
c. 2, 3 d.1, 2, 3, 4
24. గిరిజనులు రాష్ట్రం
1. గోండులు రాజస్థాన్
2. భిల్ తమిళనాడు
3. డోంగ్రియాకోండ్ ఒడిశా
4. మాల్దారీలు గుజరాత్
పైన పేర్కొన్న వాటిలో ఏవి సరిపోలినవి?
a. 1, 2 b. 1 c. 3, 4 d. 4
25. కింది జల విద్యుత్తు ఉత్పాదక ప్రాజెక్టులను వాటి అనుబంధిత నదులను పరిశీలించండి.
1. విష్ణుగాట్ పాల్కోటి జల విద్యుతుత్పాదక ప్రాజెక్ట్ -అలకనంద నది
2. సుబన్సిరి దిగువ జల విద్యుతుత్పాదక ప్రాజెక్ట్ – తీస్తా నది
3. క్వార జల విద్యుతుత్పాదక ప్రాజెక్టు- చీనాబ్ నది
పైన పేర్కొన్న వాటిలో ఏవి సరిగా జతపరచబడినవి?
a. 2 b. 1, 3 c. 2, 3 d. 1, 2, 3
26. కింది దేశాలను గమనించండి.
1. కెనడా 2. భారత్
3. జర్మనీ 4. ఇటలీ
5. జపాన్ 6. యూకే
7. యూఎస్ఏ
పైన పేర్కొన్న వాటిలో G7లో ఉన్న దేశాలు ఏవి?
a. 1, 2, 3, 4, 5, 6 b. 3, 4, 5, 6
c. 1, 2, 4, 5, 6, 7
d. 1, 2, 3, 4, 5, 6, 7
27.‘ఆర్థిక సహకారానికి అంతర్జాతీయ వేదిక’ అని కూడా పిలిచే ‘I2U2 సదస్సు’లో కింది దేశాల్లో ఏవి సభ్యులుగా ఉన్నాయి?
1. భారత్ 2. ఇజ్రాయెల్
3. యూకే 4. యూఏఈ
కింద ఇచ్చిన కోడ్ల ఆధారంగా సరైన జవాబును గుర్తించండి.
a. 1, 2 b. 2, 3, 4
c. 1, 2, 4 d. 1, 2, 3
28. భారతదేశంతో ఇటీవల ఏ దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) ఆమోదించింది?
a. శ్రీలంక b. ఆస్ట్రేలియా
c. ఫ్రాన్స్ d. జర్మనీ
29. ఏ మధ్య ప్రాచ్య దేశంతో భారతదేశం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(CEPA)పై తొలిసారి సంతకం చేసింది?
a. యూఏఈ b. సౌదీ అరేబియా
c. ఒమన్ d. బహ్రెయిన్
30. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి కింది జతలను పరిశీలించండి.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంశాలు
1. SDG 1 : పేదరికం లేకపోవడం
2. SDG 2 : ఆకలి లేకపోవడం
3. SDG 11 : అసమానతలను తగ్గించడం
4. SDG 14 : భూమిపై జీవనం
పై జతల్లో ఎన్ని సరిపోలినవి?
a. ఒక జత b. రెండు జతలు
c. మూడు జతలు
d. నాలుగు జతలూ సరైనవే
31. మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియమించిన అయ్యంగార్ కమిటీ లక్ష్యం ఏమిటి?
1. రాజకీయ సంస్కరణలను ప్రారంభించడం
2. మత సంస్కరణలను ప్రారంభించడం
3. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ప్రారంభించడం
4. విద్యా సంస్కరణలను ప్రారంభించడానికి
కోడ్లు:
a. 2, 4 b. 1, 3
c. 1, 2, 4 d. 1, 3
32. కింది వాటిలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏవి?
1. ఆర్టికల్ 15 2. ఆర్టికల్ 16
3. ఆర్టికల్ 38 4. ఆర్టికల్ 46
కింది కోడ్లను ఉపయోగించి సరైన జవాబును ఎంపిక చేయండి.
a. 1, 2 b. 1, 2, 3
c. 1, 2, 3, 4 d. 3, 4
33. కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) ప్రధాన విధి ఏది?
1. పారిశ్రామిక పార్కుల కోసం భూములను సేకరించడం
2. వివిధ పరిశ్రమల కోసం భూమి/ప్లాట్లు/షెడ్లు కేటాయించడం
3. పారిశ్రామిక ప్రాంతాలకు అనుకూల ప్రాంతాలను గుర్తించడం
4. ప్రభుత్వ రంగంలోనే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించి అభివృద్ధి చేయడం
కోడ్లు:
a. 1, 2, 4 b. 3, 4
c. 1, 2, 3 d. 2, 3, 4
సమాధానాలు
1.a 2.b 3.c 4.c
5.a 6.c 7.b 8.a
9.d 10.b 11.a 12.d
13.b 14.d 15.a 16.d
17.c 18.d 19.a 20.b
21.c 22.d 23.d 24.c
25.b 26.b 27.c 28.b
29.a 30.b 31.d 32.c
33.c
నరేష్కుమార్,
విష్ణు ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్, 8977500939
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు