Economy | పచ్చదనానికి ప్రథమస్థానం.. పరిశ్రమలకు ప్రాధాన్యం
మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-1956)
- మొదటి ప్రణాళిక కాలం -1951 ఏప్రిల్ 1 నుంచి 1956 మార్చి 31
- మొదటి ప్రణాళికా ముసాయిదా 1951 జూలైలో ప్రతిపాదించారు 1952. డిసెంబర్లో ఎన్డీసీ ఆమోదం పొందింది.
- మొదటి ప్రణాళిక రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- మొదటి ప్రణాళిక వ్యూహం హరడ్-డోమర్ నమూనా (హెచ్.డి. నమూనా)
- మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షులు – జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షులు గుల్జారీలాల్ నందా
- మొదటి ప్రణాళికా ప్రాధాన్యం -వ్యవసాయం
- మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి దీన్ని వ్యవసాయ ప్రణాళిక అని కూడా అంటారు.
- మొదటి ప్రణాళిక అంచనా వ్యయం మొదట రూ.2069 కోట్లు, తర్వాత రూ.2378 కోట్లకు పెంచారు.
- వాస్తవిక వ్యయం రూ. 1960 కోట్లు
అధిక వ్యయం చేసిన రంగాలు :
- వ్యవసాయ, నీటి పారుదల -600 కోట్లు (31శాతం)
- రవాణా, సమాచారం : రూ. 520 కోట్లు (27 శాతం)
- సామాజిక సేవలు రూ. 460 కోట్లు (22 శాతం)
- శక్తి వనరులు రూ. 260 కోట్లు (13 శాతం)
- పరిశ్రమలు & ఖనిజాలు రూ.120 కోట్లు (6 శాతం)
- మొదటి ప్రణాళికలో వ్యవసాయ & నీటిపారుదలకు అధిక వనరులు కేటాయించడం వల్ల దీన్ని వ్యవసాయ నీటి పారుదల ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
- మొదటి ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటు / లక్ష్యం 2.1 శాతం, సాధించిన వృద్ధి రేటు 3.6 శాతం
- ఆశించిన వృద్ధి రేటు కంటే సాధించిన వృద్ధి రేటు ఎక్కువ దీనికి ప్రధాన కారణం ప్రకృతి సహకరించడం
- ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక మొదటి ప్రణాళిక 13 శాతం ధరలు తగ్గాయి.
మొదటి ప్రణాళిక ప్రత్యేకతలు
- 1951లో ఐఆర్డీఏ చట్టం రూపొందించారు. ఇది నూతన పరిశ్రమల స్థాపనకు కావలసిన లైసెన్స్‌ను ఇస్తుంది. దీన్ని పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం అంటారు.
- 1951లో సీఎస్ఓ కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేశారు. ఇది జాతీయాదాయాన్ని అంచనావేస్తుంది.
- 1951లో రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చారు. ఇది భూ సంస్కరణలకు సంబంధించినది.
- 1951లో ఎస్ఎఫ్సీ చట్టం ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్ర స్థాయిలో పరిశ్రమలకు కావలసిన నిధులను అందిస్తుంది.
- 1952లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
- 1952లో జాతీయ అటవీ విధానం ప్రకటించారు.
- 1952 (సీడీపీ) సమాజాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
- 1952లో జాతీయాభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.
- 1953లో సీడీపీని దేశమంతా విస్తరిస్తూ NESS- National Extension Services Scheme/ జాతీయ విస్తరణ సేవల పథకం ప్రారంభమైంది.
- 1953లో మలేరియా వ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను మరిన్ని రంగాలకు విస్తరించే కార్యక్రమం.
- 1953లో మొదటి ఎస్‌ఎఫ్‌సీని పంజాబ్‌లో ఏర్పాటు చేశారు.
- 1954లో ఎస్ఐడీఓ (Small Industrial Development Organization) ఏర్పడింది.
- 1955లో నిత్యావసర వస్తువుల చట్టం ఏర్పాటు చేశారు.
- 1955లో ఐసీఐసీఐ ఏర్పాటు చేశారు.
- మొదటి ప్రణాళికలో భాక్రానంగల్ ప్రాజెక్ట్ (హిమాచల్ ప్రదేశ్)
- దామోదర్ వ్యాలీ (పశ్చిమ బెంగాల్)
- హిరాకుడ్ ప్రాజెక్ట్ (ఒడిశా)
- నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (ఏపీ, తెలంగాణ)
- మాచ్‌ఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ (ఏపీ, ఒడిశా)లు ప్రారంభించారు.
- ఈ ప్రాజెక్ట్‌లను జవహర్లాల్ నెహ్రూ ‘ఆధునిక దేవాలయాలు’ అని పేర్కొన్నారు.
- సింద్రి ఎరువుల కార్మాగారం (జార్ఖండ్)
- చిత్తరంజన్ రైల్ ఇంజన్ ఫ్యాక్టరీ (పశ్చిమ బెంగాల్)
- హిందుస్థాన్ కేబుల్స్ ఫ్యాక్టరీ (పశ్చిమ బెంగాల్)
- హిందుస్థాన్ షిప్‌యార్డ్ (విశాఖపట్నం ఏపీ)
- హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటీ) -కర్ణాటక
- పెరంబదూర్ ఇంటిగ్రిల్ కోచ్ ఫ్యాక్టరీ (తమిళనాడు), భారతీయ టెలిఫోన్ పరిశ్రమ (బెంగళూర్) మొదలగు నూతన పరిశ్రమలను మొదటి ప్రణాళికలో స్థాపించారు.
- సీడీపీ -కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
- ఐఆర్డీఏ- ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్
- సీఎస్ఓ – సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్
- ఎస్ఎఫ్సీ – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్
- ఎన్‌ఈఎస్‌ఎస్ -నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్
రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61) Second Five years plan
- రెండవ ప్రణాళిక కాలం 1956 ఏప్రిల్ 1 నుంచి 1961 మార్చి 31.
- రెండవ ప్రణాళిక రూపకర్త డా.పి.సి మహల నోబిస్
- వ్యూహం- మహలనోబిస్ నమూనా (4 రంగాల నమూనా)
అధ్యక్షులు – జవహర్లాల్ నెహ్రూ
ఉపాధ్యక్షులు- వి.టి. కృష్ణమాచారి - రెండవ ప్రణాళికను నెహ్రూ ఆలోచన, మహల నోబిస్ వ్యూహంతో రూపొందించడం వల్ల దీన్ని నెహ్రూ మహలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
- రెండో ప్రణాళిక ప్రాధాన్యం – భారీ పరిశ్రమలు
- రెండో ప్రణాళికా అంచనా వ్యయం రూ. 4800 కోట్లు
- వాస్తవిక వ్యయం రూ. 4672 కోట్లు
- రెండవ ప్రణాళిక భారీ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల దీన్ని బోల్డ్ ప్లాన్ ‘ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక’ అని పిలుస్తారు.
- అధిక వ్యయం చేసింది రవాణా సమాచారం- 27 శాతం
- పరిశ్రమలు, ఖనిజాలు -24 శాతం
- రెండో ప్రణాళికలో అధిక వనరులు రవాణా పరిశ్రమలకు కేటాయించడం వల్ల దీన్ని పరిశ్రమల, రవాణా ప్రణాళిక అని పిలుస్తారు.
- రెండో ప్రణాళిక ఆశించిన వృద్ధిరేటు / లక్ష్యం 4.5 శాతం
- సాధించిన వృద్ధిరేటు 4.3 శాతం
- రెండవ ప్రణాళికలో ధరలు 30 శాతం పెరిగాయి. కారణం 1957 -58, 1959-60లో అనావృష్టి సంవత్సరాలు.
- 1956లో సూయజ్ కాలువ మూసి వేయడం వల్ల భారత విదేశీ వ్యాపారం దెబ్బతిని విదేశీ మారక నిల్వలు 7 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అందుకే ధరలు 30 శాతం పెరిగాయి.
- రెండో ప్రణాళికలో 3 భారీ ఇనుము, ఉక్కు పరిశ్రమలను స్థాపించారు.
- రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం -1957 ఒడిశా -పశ్చిమ జర్మనీ సహకారంతో
- భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం 1959 ఛత్తీస్‌గఢ్- రష్యా సహకారంతో
- దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం -1959 పశ్చిమ బెంగాల్ -ఇంగ్లండ్ సహకారంతో స్థాపించారు
- 1956లో 2వ పారిశ్రామిక విధాన తీర్మానం చేశారు. ఎల్ఐసీని జాతీయం చేశారు.
- 1957లో ఆర్బీఐ కనిష్ఠ నిల్వల పద్ధతి అమలు చేసింది. దశాంశమాన పద్ధతి (ఒక రూపాయి =100 పైసలు)ని ప్రవేశపెట్టారు. కేంద్ర గిడ్డంగుల సంస్థను ఏర్పాటు చేశారు.
- 1958 వ్యవసాయ మార్కెటింగ్ కోసం ఎన్ఏఎఫ్ఈడీ, ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశారు.
- 1959లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం 8 అనుబంధ బ్యాంకులుగా గుర్తించింది.
- 1960లో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ – తమిళనాడులో ప్రారంభమైంది. హెవీ ఇంజినీరింగ్ ప్లాంట్ రాంచీ(జార్ఖండ్)లో ప్రారంభమైంది.
- ఎన్ఏఎఫ్ఈడీ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్
- ఎల్ఐసీ- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
ప్రాక్టీస్ బిట్స్
1. మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు?
ఎ) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) హరడ్-డోమర్
డి) గుల్జారీ లాల్ నందా
2. మొదటి ప్రణాళిక వాస్తవిక వ్యయం ఎంత?
ఎ) రూ. 2069 కోట్లు
బి) రూ. 2378 కోట్లు
సి) రూ. 1960 కోట్లు
డి) రూ. 1951 కోట్లు
3. మొదటి ప్రణాళికా వనరుల కేటాయింపులను జతపరచండి.
ఎ) వ్యవసాయం, నీటిపారుదల 1) రూ. 600 కోట్లు
బి) రవాణా, సమాచారం 2) రూ. 520 కోట్లు
సి) సామాజిక సేవలు 3) రూ. 260 కోట్లు
డి) శక్తి వనరులు 4) రూ. 460 కోట్లు
ఇ) పరిశ్రమలు, ఖనిజాలు 5) రూ. 120 కోట్లు
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3, ఇ-5
బి) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
సి) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
డి) ఎ-4, బి-5, సి-1, డి-2, ఇ-3
4. మొదటి ప్రణాళికలో సాధించిన వృద్ధిరేటు ఎంత?
ఎ) 2.1 శాతం బి) 3.6 శాతం
సి) 4.1 శాతం డి) 2.8 శాతం
5. మొదటి ప్రణాళికలో ధరలు?
ఎ) పెరిగాయి బి) తగ్గాయి
సి) 10 శాతం పెరిగాయి
డి) 13 శాతం తగ్గాయి
6. మలేరియా వ్యాధి నిర్మూలన కార్యక్రమం ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
ఎ) మొదటి ప్రణాళిక
బి) రెండవ ప్రణాళిక
సి) మూడవ ప్రణాళిక డి) ఏదీకాదు
7. రెండవ ప్రణాళిక నమూనా ఏది?
ఎ) హరడ్-డోమర్ నమూనా
బి) మహలనోబిస్ నమూనా
సి) 4 రంగాల నమూనా డి) బి, సి
8. రెండవ ప్రణాళికలో అధిక వనరుల కేటాయింపు?
ఎ) పరిశ్రమలు, ఖనిజాలు
బి) రవాణా, సమాచారం
సి) వ్యవసాయం, నీటిపారుదల
డి) శక్తి వనరులు
9. రెండవ ప్రణాళికను ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక అనడానికి కారణం?
ఎ) భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణం
బి) వ్యవసాయానికి ప్రాధాన్యం
సి) అధిక పెట్టుబడి కేటాయింపు
డి) పైవన్నీ
10. సూయజ్ కాలువ మూసివేత ఏ ప్రణాళిక కాలంలో జరిగింది?
ఎ) మొదటి ప్రణాళిక బి) రెండవ ప్రణాళిక
సి) మూడవ ప్రణాళిక డి) నాలుగో ప్రణాళిక
11. రెండవ ప్రణాళికా ఉపాధ్యక్షలు ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) గుల్జారీలాల్ నందా
సి) మహలనోబిస్
డి) వి.టి. కృష్ణమాచారి
12. భారీ ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రణాళిక కాలంలో నిర్మించారు?
ఎ) మొదటి ప్రణాళిక
బి) రెండవ ప్రణాళిక
సి) ఎ, బి డి) మూడవ ప్రణాళిక
13. రూర్కెలా, భిలాయ్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమల స్థాపన ఏ ప్రణాళికల్లో జరిగింది?
ఎ) మొదటి ప్రణాళిక బి) రెండవ ప్రణాళిక
సి) మూడవ ప్రణాళిక డి) పైవన్నీ
14. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) జార్ఖండ్ బి) ఒడిశా
సి) తమిళనాడు డి) పశ్చిమబెంగాల్
15. రూర్కెలా ఇనుము, ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు?
ఎ) రష్యా బి) పశ్చిమ జర్మనీ
సి) ఇంగ్లండ్ డి) అమెరికా
16. సింద్రి ఎరువుల కర్మాగారం ఏ ప్రణాళికలో స్థాపించారు?
ఎ) మొదటి ప్రణాళిక
బి) రెండవ ప్రణాళిక
సి) మూడవ ప్రణాళిక డి) ఏదీకాదు
17. రెండవ ప్రణాళికకు మరొక పేరు?
ఎ) పారిశ్రామిక ప్రణాళిక
బి) నెహ్రూ, మహలనోబిస్ ప్రణాళిక
సి) ధైర్యంతో కూడిన ప్రణాళిక
డి) పైవన్నీ
18. ఆర్బీఐ కనిష్ఠ నిల్వల పద్ధతిని ఏ సంవత్సరం నుంచి అమలు చేసింది?
ఎ) 1955 బి) 1956
సి) 1957 డి) 1958
19. రెండవ ప్రణాళికను నెహ్రూ మహలనోబిస్ ప్రణాళిక అనడానికి గల కారణం?
ఎ) నెహ్రూ ప్రధాని కావడం మహలనోబిస్ వ్యూహం
బి) నెహ్రూ ఆలోచన మహలనోబిస్ వ్యూహం
సి) నెహ్రూ అధ్యక్షుడు మహలనోబిస్ ఆలోచన
డి) నెహ్రూ మహలనోబిస్ వ్యూహం
సమాధానాలు
1-ఎ 2-సి 3-ఎ 4-బి
5-డి 6-ఎ 7-డి 8-బి
9-సి 10-బి 11-డి 12-ఎ
13-బి 14-సి 15-బి 16-ఎ
17-డి 18-సి 19-బి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు