Economy | గుణ శ్రేణిలో జనాభా… అంకశ్రేణిలో ఆహారం
జనాభా
- ఒక దేశ ఉత్పత్తి పరిమాణం ఆ దేశంలోని భౌతిక, మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది.
- వృద్ధి, అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కేవలం భౌతికమైన సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై కూడా ఆధారపడుతుంది.
- సహజవనరులను సమర్థవంతంగా ఉపయోగించి అధికోత్పత్తిని, దేశ ప్రగతిని పెంపొందించడం మానవ వనరుల
సామర్థ్యంపై ఆధారపడుతుంది. - దేశంలోని జనాభా, వారి విద్యా ప్రమాణాలు, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహార విధానాలు, నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆదాయ పంపిణీ మొదలైన వాటిని వనరులుగా చెప్పవచ్చును.
- మానవ వనరులలో జనాభా ముఖ్యమైంది. అందుకే దేశంలోని జనాభాను మానవ వనరులు అంటారు.
- మానవ వనరులపై చేసే పెట్టుబడిని ‘మానవ పెట్టుబడి’ అని ‘మానవ మూలధనం’ అంటారు.
- జనాభా పరిమాణం, పెరుగుదల తీరు, పెరుగుదల రేటు మొదలైనవి అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేస్తాయి
- జనాభా పరిమాణం బట్టి జనాభాను అధిక జనాభా, అభిలషణీయ జనాభా, అల్ప జనాభా అని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
అధిక జనాభా
- ఒకదేశ భౌగోళిక (భూభాగం) విస్తీర్ణం కంటే జనాభా ఎక్కువగా ఉంటే దాన్ని అధిక జనాభా అంటారు. ఒక దేశంలోని సహజ వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి కావలసిన దానికంటే అధికంగా జనాభా ఉంటే దాన్ని అధిక జనాభా అంటారు.
- అధిక జనాభా వల్ల ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగిత ఏర్పడుతుంది. పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, అవినీతి మొదలైన దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
- అధిక జనాభా అభివృద్ధికి ఆటంకమై సాధించిన వృద్ధిని కూడా హరింపచేసి అనర్థాలకు దారి తీస్తుంది.
ఉదా: భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్
అభిలషణీయ జనాభా
- ఒకదేశ భౌగోళిక (భూభాగం) విస్తీర్ణానికి సరిపడే జనాభాను అభిలషణీయ జనాభా అంటారు. ఒకదేశంలోని సహజవనరులను సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి కావలసిన జనాభా ఉంటే అభిలషణీయ జనాభా అంటారు. అభిలషణీయ జనాభా ఆ దేశ ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది.
ఉదా: అభివృద్ధి చెందిన దేశాల్లో అభిలషణీయ జనాభా ఉంటుంది.
అల్ప జనాభా
- ఒకదేశ భౌగోళిక (భూభాగం)విస్తీర్ణం కంటే జనాభా తక్కువగా ఉంటే దాన్ని అల్పజనాభా అంటారు. ఒక దేశంలోని సహజవనరులను సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి కావలసిన దాని కంటే తక్కువ జనాభా ఉంటే దాన్పి అల్ప జనాభా అంటారు.
- అల్ప జనాభా గల దేశాల్లో మానవ వనరుల కొరత ఏర్పడి ఆర్థికాభివృద్ధి మందకొడిగా ఉంటుంది.
ఉదా: రష్యా, ఆస్ట్రేలియా, అరబ్‌దేశాలు - పై అంశాలను బట్టి జనాభా పరిమాణం రేటు కొన్ని దేశాల ఆర్థికాభివృద్ధికి దోహద పడితే, మరికొన్ని దేశాలకు ఆర్థికాభివృద్ధిని ఆటంకపరుస్తుందిని తెలుస్తుంది.
జనాభా నిర్వచనం
- జనాభా అనేపదం సర్వవ్యాప్తి చెందినది
- జనాభా అనేది ఒక ప్రాంతంలోని వ్యక్తుల సంఖ్యను సూచించడానికి సాధారణంగా ఉపయోగించే పదం
- జనాభా అంటే దేశం లేదా ప్రాంతంలోని మొత్తం వ్యక్తుల లేదా నివాసుల సంఖ్య
- ఒక నిర్ణీత ఆవాస ప్రాంతంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని నివసించే ప్రజల సమూహాన్ని జనాభా అంటారు.
- జనాభా అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించిన ఒక జాతికి చెందిన వ్యక్తుల సమూహం.
- జనాభా అనేది ఒక జాతికి చెందిన దీవుల సమూహం.
- ప్రపంచంలోని ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించే జాతికి చెందిన మొత్తం వ్యక్తుల ఉపసమితి.
- ఒక దేశ జనాభా, జనాభా కూర్పు, జనాభా సంయోగం జనాభా లక్షణాలు, జనాభా ధోరణి మొదలైన అంశాల గురించి తెలియజేసే దాన్ని ‘డెమోగ్రఫీ’ లేదా ‘పాపులేషన్ సైన్స్’ అంటారు.
థామస్ రాబర్ట్ మాల్థస్ (టి.ఆర్.మాల్థస్ – 1766-1834) - ప్రపంచంలో జనాభాను గురించి శాస్త్రీయంగా మొదట అధ్యయనం చేసిన శాస్త్రవేత్త, ఆర్థికవేత్త టి.ఆర్. మాల్థస్
- ఇతని ప్రకారం జనాభా గుణశ్రేణిలో పెరుగుతుంటే, ఆహార ధాన్యాలు అంకశ్రేణిలో పెరుగుతాయని చెప్పాడు.
- జనాభా- గుణశ్రేణి (2X4X8X16……)
- ఆహారం – అంకశ్రేణి (2+4+8+16……)
- జనాభా ఇలా గుణశ్రేణిలో పెరుగుతూ ఉంటే ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవుతుందని చెప్పారు.
- ఇతని ప్రకారం ‘ఈ ప్రకృతి ఒక భోజనశాల వంటిదని అందులో ఆహ్వానితులకు మాత్రమే కడుపు నిండుతుందని, ఆహ్వానం లేనివారు ఆకలి చావులు చావాల్సిందే’ అని పేర్కొన్నారు.
- ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డా ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడు అవుతాడు’ అని మాల్థస్ పేర్కొన్నాడు.
- ప్రపంచంలో మొదటిసారిగా జనాభాను గురించి అణువనువునా అధ్యయనం చేయడం వల్ల మాల్థస్ను ‘ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ లేదా ఫాదర్ ఆఫ్ పాపులేషన్ సైన్స్’ అని కూడా అంటారు.
ఎడ్విన్ కానన్ (1861-1935) - ఎడ్విన్ కానన్ బ్రిటిష్ ఆర్థిక వేత్త, ఆర్థిక ఆలోచన చరిత్రకారుడు.
- ఇతను అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని (Aptimum Population Theory) ప్రతిపాదించాడు.
- ఈ సిద్ధాంతం ప్రకారం జనాభా పెరుగుదల ఒక దశ వరకు మంచిదే. అంటే సహజ వనరులు పుష్కలంగా ఉన్నంత వరకు జనాభా పెరుగుదల మంచిదే. కానీ సహజవనరులు సమృద్ధిగా వినియోగించుకున్నాక లేదా సహజవనరులు పరిమితమై జనాభా పెరిగితే అది ఆర్థిక వ్యవస్థకు ఆటంకం. కాబట్టి ఏ జనాభా వద్ద తలసరి ఆదాయం గరిష్ఠ స్థాయికి చేరుతుందో ఆ జనాభాను అభిలషణీయ జనాభా అంటారు.
- దీని ప్రకారం భూమిపై పుట్టే ప్రతిబిడ్డా కడుపుతోపాటు రెండు కాళ్ళు, రెండు చేతులతో పుడతాడు, అంటే అభివృద్ధికి కారకుడవుతాడు.
- ఎడ్విన్ కానన్ ప్రకారం ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డా ఒక అభివృద్ధి కారకం’
మాలిని బాలసింగం - కుటుంబంలో ప్రతి జననం ఒక శుభ ఘడియ, కానీ ఈ జననాలు అధికమైతే కుటుంబం, దేశం భరించలేవు’ అని పేర్కొన్నాడు.
ప్రాక్టీస్ బిట్స్
1. అభివృద్ధి ప్రధానంగా దేనిపై ఆధారపడుతుంది?
ఎ) సహజ వనరులపైన మాత్రమే
బి) మానవ వనరులపైన మాత్రమే
సి) సహజ, మానవ వనరులపైన
డి) దేశ ప్రగతి పైన
2. మానవ వనరులు అంటే?
ఎ) జనాభా
బి) విద్య, వైద్యం, ఆరోగ్యం
సి) పేదరికం నిరుద్యోగం
డి) పైవన్నీ
3. సహజ వనరులు అంటే?
ఎ) భూమి, నీరు
బి) అడవులు, ఖనిజాలు
సి) వర్షపాతం, వాతావరణం
డి) పైవన్నీ
4. అభిలషణీయ జనాభా ఏ దేశాల్లో ఉంటుంది?
ఎ) అభివృద్ధి చెందుతున్న దేశాలు
బి) అభివృద్ధి చెందిన దేశాలు
సి) వెనుకబడిన దేశాలు డి) పేద దేశాలు
5. అల్ప జనాభా గల దేశాలకు ఉదాహరణ?
ఎ) రష్యా బి) ఆస్ట్రేలియా
సి) అరబ్ దేశాలు డి) పైవన్నీ
6. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించిన ఒకే జాతికి చెందిన వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు?
ఎ) జనాభా బి) సంఘం
సి) సమూహం డి) పైవన్నీ
7. మానవ వనరులపై చేసే పెట్టుబడిని ఏమంటారు?
ఎ) మానవ మూలధనం
బి) మానవ పెట్టుబడి
సి) ఎ, బి డి) మానవ వ్యయం
8. ప్రపంచంలో జనాభా గురించి మొదట అధ్యయనం చేసిన ఆర్థిక వేత్త ఎవరు?
ఎ) ఎడ్విన్ కానన్ బి) టి.ఆర్. మాల్థస్
సి) ఆడమ్‌స్మిత్ డి) జె.ఎం. కీన్స్
9. మాల్థస్ ప్రకారం జనాభా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రెట్టింపు అవుతుందని పేర్కొన్నాడు?
ఎ) 10 బి) 15 సి) 20 డి) 25
10. అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
ఎ) మాల్థస్ బి) ఎడ్విన్ కానన్
సి) మాలిని బాల సింగం డి) కీన్స్
11. కుటుంబంలో ప్రతిజననం ఒక శుభ ఘడియ, కానీ ఈ జననాలు అధికమైతే కుటుంబం, దేశం భరించలేదని పేర్కొన్నది ఎవరు?
ఎ) టి.ఆర్.మాల్థ్ధస్
బి) ఎడ్విన్ కానన్
సి) మాలిని బాలసింగం
డి) ఎ.సి.పిగూ
12. భూమిపై పుట్టే ప్రతిబిడ్డా ఒక అభివృద్ధి కారకం అని పేర్కొన్నది ఎవరు?
ఎ) టి.ఆర్ మాల్థస్ బి) ఎడ్విన్ కానన్
సి) మాలిని బాలసింగం డి) మార్షల్
13. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ్డా ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడు అవుతాడు అని పేర్కొన్నది ఎవరు?
ఎ) టి.ఆర్ మాల్థస్ బి) ఎడ్విన్ కానన్
సి) మాలిని బాల సింగం డి) కీన్స్
14. థామస్ రాబర్ట్ మాల్థస్ ఏ దేశస్థుడు?
ఎ) అమెరికా బి) ఇంగ్లండ్
సి) పోర్చుగల్ డి) గ్రీక్
15. మాల్థస్ ప్రకారం ఆహారోత్పత్తి, జనాభా ఏ శ్రేణిలో పెరుగుతాయి?
ఎ) ఆహారం- అంకశ్రేణి, జనాభా – గుణశ్రేణి
బి) ఆహారం- గుణశ్రేణి, జనాభా – అంకశ్రేణి
సి) ఆహారం, జనాభా – గుణశ్రేణి
డి) ఆహారం, జనాభా – అంకశ్రేణి,
16. ‘ఈ ప్రకృతి భోజనశాల వంటిదని ఇక్కడ ఆహ్వానితులకే కడుపు నిండుతుంది. ఆహ్వానం లేనివారు ఆకలి చావులకు గురికావలసిందే’ అని పేర్కొన్నది ఎవరు?
ఎ) టి.ఆర్ మాల్థస్ బి) ఎడ్విన్ కానన్
సి) మాలిని బాలసింగం
డి) రికార్డో
17. జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధికి ఆటంకం కాబట్టి జనాభా పెరుగుదలను నియంత్రించాలని మొదట సూచించిన వ్యక్తి ఎవరు?
ఎ) మాల్థస్ బి) ఎడ్విన్ కానన్
సి) మాలిని బాలసింగం
డి) రాబిన్స్
18. ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ గ్రంథాన్ని ఏ సంవత్సరంలో రచించారు.
ఎ) 1879 బి) 1798
సి) 1889 డి) 1879
19. ఫాదర్ ఆఫ్ డెమోగ్రఫీ ఎవరు?
ఎ) కానన్ బి) బాలసింగం
సి) థామస్ రాబర్ట్ మాల్థస్
డి) ఆడమ్‌స్మిత్
20. ఫాదర్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అని ఎవరిని అంటారు?
ఎ) టి.ఆర్. మాల్థస్ బి) ఎ. కానన్
సి) బాలసింగం
డి) ఆడమ్‌స్మిత్
21. ఒక దేశం జనాభా, జనాభా కూర్పు, జనాభా సంయోగం, జనాభా లక్షణాలు, ధోరణలు గురించి వివరించేది?
ఎ) డెమోగ్రఫీ
బి) పాపులేషన్ సైన్స్
సి) పాపులేషన్ స్పాట్స్
డి) ఎ, బి
22. ఒక దేశంలోని జనాభాను ఏమంటారు?
ఎ) మానవ మూలధనం
బి) మానవ వనరులు
సి) మానవ పెట్టుబడి డి) పైవన్నీ
23. జనాభా పరిమాణాన్ని బట్టి జనాభాను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
24. జనాభా అనేది?
ఎ) ఒక జాతికి చెందిన జీవుల సమూహం
బి) వివిధ జాతులకు చెందిన జీవుల సమూహం
సి) రెండు జాతులకు చెందిన
జీవుల సమూహం డి) పైవన్నీ
సమాధానాలు
1-సి 2-డి 3-డి 4-బి
5-డి 6-ఎ 7-సి 8-బి
9-డి 10-బి 11-సి 12-బి
13-ఎ 14-బి 15-ఎ 16-ఎ
17-ఎ 18-బి 19-సి 20-ఎ
21-డి 22-డి 23-బి 24-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు