BIOLOGY | కీటకాలతో ఎంటమోఫిలి.. నత్తలతో మెలకోఫిలి
పరాగ సంపర్కం (POLLINATION)
- పుష్పంలోని పరాగకోశం నుంచి పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం రెండు రకాలు 1. స్వపరాగ సంపర్కం
2. పర పరాగ సంపర్కం. - ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్ప కీలాగ్రాన్ని చేరటాన్ని ఆత్మ పరాగ లేదా స్వపరాగ సంపర్కం అంటారు.
ఉదా: పొగాకు, బఠాని మొక్కలు - ఒక పుష్పంలోని కేసరాల్లో గల పరాగరేణువులు అదే జాతికి చెందికి చెందిన వేరొక పుష్పంలోని కీలాగ్రం చేరడాన్ని పర పరాగ సంపర్కం అంటారు.
పర పరాగసంపర్కం ఉపయోగాలు - డార్విన్ పరిశోధనలు ఆత్మపరాగ సంపర్కం కంటే పర పరాగసంపర్కం మేలని తేల్చాయి.
1. పర పరాగసంపర్కం వల్ల ఏర్పడే విత్తనాల సంఖ్య అధికంగా ఉంటుంది.
2. విత్తనాలు బరువుగా, పెద్దగా ఉండి త్వరగా వృద్ధి చెంది ఎక్కువ ఫలాలనిస్తాయి.
3. భూమిపైన ఈ మొక్కలు తక్కువ విస్తీర్ణాన్ని ఆవరించి, తక్కువ కాలంలో ఎక్కువ పుష్పాలనిస్తాయి.
4. ఈ మొక్కలకు వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉంటుంది. - పర పరాగసంపర్కం రకాలు
- గాలి ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని ఎనిమోఫిలి అంటారు.
ఉదా: వరి (ఒరైజా), తాటి (బొరానస్) - కొన్ని మొక్కల పరాగ రేణువులకు రెక్కలు ఉంటాయి. ఉదా: పైనస్
- పరాగరేణువులను స్వీకరించడానికి ఈ పుష్పాల్లో ఈక లాంటి లేదా కుంచె వంటి కీలాగ్రాలుంటాయి.
- నీటి ద్వారా మొక్కల్లో జరిగే పర పరాగ సంపర్కాన్ని హైడ్రోఫిలి లేదా జల పరాగ సంపర్కం అంటారు.
- వాలిస్నేరియా వంటి మొక్కల్లో నీటి ఉపరితలంపై జల పరాగసంపర్కం జరుగుతుంది.
- జోస్టిరా, సెరటోఫిల్లమ్ మొక్కల్లో నీటి లోపల పరాగ సంపర్కం జరుగుతుంది.
- జంతువుల సహాయంతో జరిగే పర పరాగసంపర్కాన్ని జంతు పరాగసంపర్కం అంటారు.
- పక్షుల ద్వారా జరిగే పర పరాగసంపర్కాన్ని ఆర్నిథోఫిలి అంటారు. ఉదా: బిగ్నోనియా, డెలోనిక్స్
- కీటకాల సహాయంతో జరిగే పర పరాగసంపర్కాన్ని ఎంటమోఫిలి అంటారు.
ఉదా: ఎక్కువ ఆవృతబీజ మొక్కలు - గబ్బిలాల ద్వారా జరిగే పర పరాగసంపర్కాన్ని కీరోప్టెరిఫిలి అంటారు. ఇది ఉష్ణ మండల మొక్కల్లో చాలా అరుదుగా జరుగుతుంది.
ఉదా: బాహీనియా, మ్యూస (అరటి) - నత్తల ద్వారా జరిగే పర పరాగ సంపర్కాన్ని మెలకోఫిలి అంటారు.
ఉదా: ఎరాయిడే కుటుంబపు మొక్కలు, లెమ్నా జాతులు
ఫలదీకరణం (Fertilization)
- స్త్రీ, పురుష సంయోగ బీజాల కలయికనే ఫలదీకరణం అంటారు.
- పరాగ రేణువులు (పురుష బీజ కణాలు) కీలాగ్రం (స్త్రీ బీజ అవయవాలు)ను చేరగానే, కీలాగ్రం తేనె వంటి పదార్థాన్ని స్రవిస్తుంది.
- పరాగ రేణువు నుంచి పరాగ నాళం ఏర్పడుతుంది. ఈ నాళం కీలం ద్వారా ప్రయాణించి అండాశయంలోని అండాన్ని చేరుతుంది.
- పరాగనాళం చివర పరాగనాళ కేంద్రం, ఉత్పాదక కేంద్రం అనే రెండు కేంద్రాలుంటాయి.
- అండకోశంలో రెండు కేంద్రాలుంటాయి.
- పరాగనాళం అండ రంధ్రం ద్వారా అండంలోకి ప్రవేశించిన తర్వాత పరాగనాళం
చివరన పగిలి దానిలోని ఒక పురుష కేంద్రం అండంలోని స్త్రీబీజ కణ కేంద్రంతో కలుస్తుంది. ఈ పద్ధతిని ఫలదీకరణం అంటారు. - ఫలదీకరణం చెందిన స్త్రీ బీజ కేంద్రాన్ని సంయుక్త బీజం అంటారు.
- పరాగనాళంలోని రెండో కేంద్రం అండంలోని వ్యవస్థిత కేంద్రంతో కలిసి అంకురచ్ఛదంగా ఏర్పడుతుంది.
- అంకురచ్ఛదంలో నిల్వ ఆహారం ఉంటుంది.
- ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా మారుతుంది.
ఫలం
- మొక్కల్లో ఫలదీకరణం జరిగిన తర్వాత అండాశయం ఫలంగా అభివృద్ధి చెందుతుంది.
- ఫలం లోపల విత్తనాలు ఏర్పడటం ఆవృత బీజ మొక్కల ముఖ్య లక్షణం.
- సాధారణంగా ఫలాలు కొన్ని నెలల్లోనే ఏర్పడతాయి. కాని లొడీసియా మొక్కలో ఫలాలు ఏర్పడటానికి 10 సంవత్సరాలు పడుతుంది.
- అండాశయంతో పాటు ఏ ఇతర పుష్పభాగమైనా ఫలంగా పెరిగితే దాన్ని అనృత ఫలం అంటారు.
ఉదా: యాపిల్లో పుష్పాసనం, - జీడిమామిడిలో పుష్పవృంతం అనృత ఫలాలుగా మారుతాయి.
- నిజ ఫలాలు ఫలదీకరణం చెందిన అండాశయం నుంచి ఏర్పడతాయి.
- నిజ ఫలాల్లో ఫల కవచం, విత్తనాలు అనే రెండు భాగాలుంటాయి.
- సరళ, సంకలిత ఫలాలు మొత్తం పుష్ప విన్యాసం నుంచి ఏర్పడతాయి.
- కండ గల ఫలాలు పక్వస్థితికి వచ్చినప్పుడు వాటి ఫలకవచం గుజ్జుగా కాని, రసయుతంగా కాని తయారవుతుంది.
ఉదా: టమాటా, అరటి, దోస, గుమ్మడి - టెంక గల ఫలాల్లో అంతఃఫలకవచం గట్టి టెంకలాగా ఉంటుంది.
ఉదా: మామిడి, కొబ్బరి - శుష్క ఫలాలు పక్వస్థితికి వచ్చినప్పుడు ఫలకవచం ఎండిపోయి గట్టిగా ఉంటుంది.
ఉదా: చిక్కుడు, బఠాని - పుష్ప విన్యాసం, దాని అనుబంధ భాగాలు ఒక ఫలంగా వృద్ధి చెందితే దాన్ని సంయుక్త ఫలం అంటారు. వీటిని బహుళ ఫలాలు అని కూడా అంటారు.
ఉదా: అనాస (అనాసస్), పనస (ఆర్టోకార్పస్), మల్బరి (మోరస్)
అనిషేక ఫలనం: ఫలదీకరణ జరగకుండానే అండాశయం ఫలంగా మారడాన్ని అనిషేక ఫలనం అంటారు. ఇటువంటి ఫలాల్లో విత్తనాలుండవు.
పుష్ప విన్యాసాక్షం - 2022 డిసెంబర్లో అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature-IUCN) హిమాలయాల్లోని మూడు ఔషధ మొక్కలను అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల జాబితాలో చేర్చింది. అవి..
1. మిజోట్రోఫిస్ పెల్లిటా- ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉంటుంది.
2. ప్రిటిల్లారియా సిర్రోసా- హిమాలయాల ప్రాంతం మొత్తంలో ఉంటుంది.
3. డాక్టిలోరిజా హటిగిరియా-హిమాలయాలు ఉన్న అన్ని దేశాల్లో ఉంటుంది.
పత్రం
- ఇది కాండం మీద బహిర్గతంగా, కణుపుల దగ్గర పెరిగే పార్శ ఉపాంగం.
- పత్రం గ్రీవాల్లో గ్రీవపు మొగ్గలు ఉంటాయి.
విధులు - కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేస్తుంది.
- వాయు వినిమయం ద్వారా ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్లను క్రమబద్ధీకరిస్తుంది.
- బాష్పోత్సేకం ద్వారా నీరు, లవణాల అంతర్గత రవాణాను ప్రోత్సహిస్తుంది.
పత్ర భాగాలు - పత్రంలో నాలుగు భాగాలుంటాయి. అవి పత్ర పీఠం, పత్రపుచ్ఛాలు, పత్ర వృంతం, పత్ర దళం.
- కాండానికి అతుక్కొని ఉండే పత్ర వృంతం పీఠభాగాన్ని పత్ర పీఠం అంటారు.
- నీరుల్లిలో పత్ర పీఠాలు ఆహారాన్ని నిల్వ చేస్తాయి.
- పత్ర పీఠానికి ఇరువైపులా పెరిగే ఆకుపచ్చని, సన్నటి పోచల వంటి నిర్మాణాలను పత్ర పుచ్ఛాలు అంటారు.
- రేగు (జిజిపస్), తుమ్మ (అకేసియా)లో పత్ర పుచ్ఛాలు కంటకాలుగా మార్పు చెంది ఉంటాయి.
- బఠానిలో పత్రపుచ్ఛాలు పత్రం వలె ఉంటాయి.
- పత్రదళాన్ని కాండానికి కలిపి ఉంచే సన్నటి కాడ వంటి భాగాన్ని పత్ర వృంతం అంటారు.
- ఇది పత్రం బరువును భరించి, పోషక పదార్థాలను ఇరువైపులా సరఫరా చేయడంలో తోడ్పడుతుంది.
- బొప్పాయి (కారికా), ఆముదం (రిసినస్)లో ఇది ఒక నాళం లాగా బోలుగా ఉంటుంది.
- పత్ర వృంతం కొన భాగంలో ఆకుపచ్చగా, బల్లపరుపుగా విస్తరించి ఉన్న పత్రభాగాన్ని పత్ర దళం అంటారు.
- ఎడారి మొక్కల్లో తప్ప మిగిలిన మొక్కల్లో పత్రదళం ఉంటుంది.
- పత్రంలో ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు.
- కాండంపైన శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు.
- నెపంథిస్ మొక్కలో పత్రదళం కూజా ఆకారంలో ఉంటుంది.
- కలబంద (అలోవీరా) మొక్కల్లో పత్రాలు ఆహారాన్ని, నీటిని నిల్వచేసే కండల పత్రాలుగా రూపాంతరం చెందుతాయి.
- రణపాల (బ్రయోఫిల్లమ్) మొక్కల పత్రాలపై పత్రోపరిస్థిత మొగ్గలు ఉంటాయి. ఇవి శాఖీయ
ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. - నత్రజని సంబంధిత పదార్థాలు లోపించిన నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నత్రజని సంబంధిత పదార్థాల కోసం కీటకాలను ఆకర్షించి భక్షిస్తాయి. ఈ మొక్కల్లోని పత్రాలు బోను పత్రాలుగా మార్పు చెంది కీటకాలను భక్షిస్తాయి. ఈ పత్రాల్లో జీర్ణగ్రంథులు ఏర్పడి జీర్ణ రసాలను స్రవిస్తాయి.
ఉదా: నెపంథిస్, డ్రాసిరా, యుట్రిక్యులేరియా
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో…
Previous article
TSHC Recruitment | తెలంగాణ కోర్టుల్లో 84 కాపీయిస్ట్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు