పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పండిలా
మన పిల్లలకు మనం వయసు పెరిగే కొద్దీ అనేక విషయాలను వారి వయసుకు తగ్గట్టుగా నేర్పుతాం. అలాంటి వాటిలో సంపాదన, ఖర్చు, పొదుపు, మదుపు లాంటి డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. అయితే వారికి యుక్త వయసు వచ్చే వరకు ఆగి వారి డబ్బుకు సంబంధించిన అలవాట్లను గుర్తించి మొదట వారికి పొదుపుగా ఖర్చు పెట్టాలంటూ హితబోధలను మొదలు పెడతాం. కానీ, ఆర్థిక పరమైన అంశాలను పిల్లలకు ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత మంచిది. ఐదారేండ్ల పిల్లలకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పాఠాలు చెప్పడం గొప్ప ఐడియా కాకపోవచ్చు . కానీ వారికి డబ్బు విలువను గుర్తించడం చెప్పగలిగితే వారికి అలవాట్లలో చాలా మార్పులు రావచ్చు. ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించే అలవాటు జీవితంలో ఎప్పటికైనా మేలే చేస్తుంది.
డబ్బుగురించి మాట్లాడండి
మంచి చెడు అలవాట్ల గురించి పిల్లలతో ఎక్కువగా మాట్లాడతాం. కానీ, డబ్బు గురించి మాట్లాడం. పిల్లలకు డబ్బు విలువ తెలియకపోవచ్చు. పది రూపాయలకు వంద రూపాయలకు తేడా తెలియకపోవచ్చు అవి ఎలా వస్తాయో కూడా అర్థం కాకపోవచ్చు. కానీ, వాటి కోసం ఎలా శ్రమపడాలో తెలియచెప్పవచ్చు సంపాదన ఎలా అర్థం అయ్యేలా చెప్పడానికి చాలా పిట్టకథలే చెప్పొచ్చు. వారికి వెంటనే అర్థం కాకపోయినా వారిలో ఒక అవగాహన క్రమంగా కలుగుతుంది. మీరు నగదుతో కాకుండా డెబిట్ కార్డు, క్రెడిట్ బిల్లులను చెల్లిస్తున్నప్పుడు చూస్తుండటం సహజం. అలాంటి సందర్భాల్లోనే వారికి చెల్లింపు పద్దతుల గురించి తెలియ చేయవచ్చు. చిన్న మొత్తాలను పొదుపు చేసేందుకు పిగ్గీ బ్యాంక్ ప్రాధాన్యతలను చూపిస్తూ ఆ బొమ్మ చరిత్రను చెప్పొచ్చు. కొంత పొదుపు చేసిన తర్వాత ఆ డబ్బుతో వారు మరిచిపోలేని ఓ ప్రయోజనాన్ని చూపించగలిగితే వారికి పొదుపు విలువ ఏమిటో తెలుస్తుంది.
ఆర్థిక క్రమశిక్షణ
ఇంట్లో బయట విరివిగా వినిపించే పదాలు ఆన్లైన్ పేమెంట్, ఈఎంఐ, క్రెడిట్, డెబిట్ కార్డు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు ఇట్లా అనేకం. వీటి గురించి సందర్భం వచ్చినప్పుడల్లా వివరంగా చెప్పగలిగితే అర్థం చేసుకోగలరు. నేడు డబ్బు అంటే కేవలం నగదు మాత్రమే కాదు. అంతా ఆన్లైన్లో జరిగే లావాదేవీలే. అవి ఎలా జరుగుతాయో చెబితే, ఆన్లైన్ లావాదేవీల్లో మోసాల గురించి కూడా వివరించవచ్చు. వీటి గురించి వారే పెద్దయ్యాక వారే తెలుసుకుంటారులే అనుకుంటే పొరపాటే. ఆలోగానే మీరిచ్చే తర్ఫీదు వారికి మార్గదర్శి అయి ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతుంది. ఆర్థిక పరమైన బరువు బాధ్యతలు క్రమశిక్షణతోనే అర్థం అవుతాయి. డబ్బు విషయంలో క్రమశిక్షణ ఫోకస్ లేకుండా స్వతహాగా చాలా అరుదుగా అబ్బుతుంది. యవ్వనంలోనే బడ్జెటింగ్, పొదుపు, మదుపు వంటి విషయాలను సమయం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉండాలి.
ఇవీ కూడా చదవండి..
అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
వచ్చేనెల 1 నుంచి కేవీల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు