‘క్రిప్టో’కు మాస్టర్ కార్డ్ సైతం ‘సై’

న్యూఢిల్లీ: ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలకు క్రమంగా చట్టబద్ధత పెరుగుతున్నది. ప్రముఖ ఇంటర్నేషనల్ పేమెంట్స్ దిగ్గజం మాస్టర్ కార్డ్.. తన వినియోగదారుల (మాస్టర్ కార్డు దారుల) నెట్వర్క్ పరిధిలో కొన్ని ఎంపిక చేసిన క్రిప్టో కరెన్సీ లావాదేవీలను అనుమతినిస్తున్నట్లు బుధవారం తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. అయితే, దానికి నాలుగు షరతులు అమలు చేస్తున్నట్లు తెలిపింది. సదరు నాలుగు షరతులకు అనుగుణంగా లావాదేవీలు సాగే క్రిప్టో కరెన్సీని తమ నెట్వర్క్ పరిధిలో అనుమతిస్తామని వెల్లడించింది.
భవిష్యత్‌లో ‘క్రిప్టో కరెన్సీ చెల్లింపుల కోసం మేం సన్నద్ధం అవుతున్నాం. ఈ ఏడాది మాస్టర్ కార్డ్ మా నెట్‌వర్క్‌లో నేరుగా ఎంపిక చేసిన క్రిప్టోకరెన్సీలతో లావాదేవీలను నిర్వహించడానికి అనుమతిస్తాం. కొత్త డిజిటల్ కరెన్సీలను ప్రారంభించాలనే ప్రణాళికను అమలు చేసేందుకు సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ బ్యాంకులతో చురుకుగా పాల్గొంటుంది’ అని మాస్టర్ కార్డు తెలిపింది. మాస్టర్ కార్డ్ ఇప్పటికే వైరెక్స్ , బిట్పేతో సహా కొన్ని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది.
- Tags
Latest Updates
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు
సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
బహ్మనీలు..గోల్కండ కుతుబ్ షాహీలు
ముల్కీ ఉద్యమం మూలాలు
స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ఎప్పుడు?
ఓపెన్ ఇంటర్లో కొత్త కరిక్యులం
ఎంఈవో కార్యాలయాల్లోనూ ఆధార్
28న ఇంటర్ ఫలితాలు విడుదల
ఐడబ్ల్యూఎఫ్లో పోస్టుల భర్తీ
ఇండియన్ ఆర్మీలో 458 పోస్టుల భర్తీ