Why are states given ‘grant in aid’ | రాష్ట్రాలకు ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎందుకు ఇస్తారు?
ఇండియన్ పాలిటీ
1. కిందివాటిలో సరైనవి ?
ఎ) ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి అనుమతితో మాత్రమే
పార్లమెంటులో ప్రవేశపెడతారు
బి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికను
రాష్ట్రపతికి సమర్పిస్తారు
సి) బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితో లోక్సభలో
ప్రవేశపెడతారు
డి) భారత సంఘటిత నిధి రాష్ట్రపతి ఆధీనంలో
ఉంటుంది
ఇ) విదేశీ రుణాలను సేకరించేటప్పుడు రాష్ట్రపతి
అనుమతి తప్పనిసరి
ఎఫ్) విదేశీ రుణాలను సేకరించేటప్పుడు రాష్ట్రపతి
అనుమతి అవసరం లేదు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) బి, సి, డి, ఎఫ్ 4) ఎ, బి, సి, డి, ఇ
2. ఉప రాష్ట్రపతికి సంబంధించి సరైనవి ?
ఎ) ఉప రాష్ట్రపతి పదవిని మనదేశం కెనడా నుంచి
గ్రహించింది
బి) ఉప రాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని
రాజ్యాంగ పరిషత్లో హెచ్వీ కామత్ ప్రతిపాదించారు
సి) ఉప రాష్ట్రపతి పదవిని మనదేశం అమెరికా నుంచి
గ్రహించింది
డి) ప్రకరణ 63 దేశానికి ఉపరాష్ట్రపతి ఉండాలని
తెలుపుతుంది
ఇ) ప్రకరణ 62 దేశానికి ఉపరాష్ట్రపతి ఉండాలని
తెలుపుతుంది
ఎఫ్) ఉప రాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభ
ఎక్స్అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారు
1) ఎ, బి, డి, ఎఫ్ 2) బి, సి, డి, ఎఫ్
3) సి, డి, ఇ, ఎఫ్ 4) బి, సి, ఎఫ్
3. కిందివాటిని జతపర్చండి.
ఎ) కార్యానంతర శాసనం 1) ఒక వ్యక్తికి ఒక నేరానికి ఒకసారికంటే ఎక్కువ సార్లు శిక్ష విధించకూడదు
బి) గెర్రీ మాండరింగ్ 2) ఒక వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్షం చెప్ప మని నిర్బంధం చేయకూడదు
సి) డబుల్ జపార్డి 3) ఒక వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితే శిక్షించాలి
డి) సెల్ఫ్ ఇంక్రిమినేషన్ 4) నియోజకవర్గాల
పునర్విభజన
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
4. ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైనవి?
ఎ) వీటిని రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించారు
బి) భారత ప్రభుత్వ చట్టం- 1935లో వీటిని
ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా పేర్కొన్నారు
సి) వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు
డి) రాజ్యాంగంలో భాగం-4లో ప్రకరణలు 36-51
వరకు ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు
ఇ) ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు
ఎఫ్) ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ ఉంది
1) ఎ, బి, సి, డి 2) డి, ఇ, ఎఫ్
3) బి, సి, డి, ఇ 4) ఎ, సి, ఇ
5. కిందివాటిని జతపర్చండి.
ఎ) 26వ రాజ్యాంగ సవరణ 1) రాజవంశస్థులకు రాజభరణాలు ఉన్నవారికి ప్రత్యేక
సదుపాయాలను రద్దుచేయడం
బి) 96వ రాజ్యాంగ సవరణ 2) ఒరియా భాషను ఒడియాగా మార్చారు
సి) 56వ రాజ్యాంగ సవరణ 3) గోవాను 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు
డి) 36 రాజ్యాంగ సవరణ 4) సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పడింది
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
6. కింది వాటిలో సరైనది.
ప్రతిపాదన (A): మంత్రిమండలి అనేది పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం
కారణం (R): లోక్సభలో మెజారిటీ ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు రెండూ నిజం, కానీ Aకు R సరైన
వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
7. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): రాష్ట్రపతి పార్లమెంటులో భాగం
కారణం (R): రాష్ట్రపతి భాగం లేనిదే ఏ బిల్లు చట్టంగా
మారలేదు
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన
వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
8. కిందివాటిలో జాతీయ అభివృద్ధి మండలి సభ్యులు ఎవరు?
ఎ) క్యాబినెట్ మంత్రులు
బి) అన్ని రాష్ట్రాల ముఖ్యమంవూతులు
సి) ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంవూతులు
డి) కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులు
ఇ) నీతి ఆయోగ్ సభ్యులు
1) ఎ, సి, డి, ఇ 2) ఎ, బి, డి, ఇ
3) ఎ, బి, సి, ఇ 4) పై అందరూ
9. ఎన్నికల సంఘం వద్ద మొత్తం ఎన్ని ఎన్నికల గుర్తులు ఉన్నాయి?
1) 83 2) 84 3) 86 4) 88
10. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ ఎవరికి బాధ్యత వహిస్తుంది?
1) ప్రజలకు ప్రత్యక్షంగా 2) శాసన వ్యవస్థకు
3) న్యాయ వ్యవస్థకు 4) ఏదీకాదు
11. స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ఎక్కడి నుంచి గ్రహించారు?
1) అమెరికా విప్లవం నుంచి
2) ఫ్రెంచ్ విప్లవం నుంచి
3) రష్యా విప్లవం నుంచి 4) ఏవీకాదు
12. పంచాయతీరాజ్ పాలన ముఖ్యోద్దేశం?
1) వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం
2) గ్రామీణాభివృద్ధి సాధించడం
3) దళితుల అభివృద్ధికి కృషిచేయడం
4) సామాజిక అభివృద్ధి పథకంలో ప్రజలను
భాగస్వాములను చేయడం
13. కింది వాటిలో బ్రిటిష్ కాలంలో ద్వంద్వ ప్రభుత్వం (డ్యూయల్ గవర్నమెంట్) ప్రధానోద్దేశం ?
1) ఆంగ్లేయులు భారతీయులతో రెవెన్యూను వసూలు
చేసి సివిల్, మిలటరీ అధికారులుగా ఉండటం
2) సాధారణ పరిపాలనకు రెండు రకాల పాలనా
వేత్తలు ఉండటం
3) ప్రధానమైన పాలనా అంశాలు స్థానిక రాజుల
చేతిలో, మిగతా అంశాలు బ్రిటిష్ పాలకుల
ఆధీనంలో ఉండటం
4) కొంత భూభాగం స్థానిక రాజులతో,
మిగతా భూభాగం బ్రిటిష్ వారు పరిపాలించడం
14. రాష్ట్రాలకు ‘ గ్రాంట్ ఇన్ ఎయిడ్’ ఎందుకు ఇస్తారు?
1) కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పెంపొందించడానికి
2) ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి
3) వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచడానికి
4) వివిధ అభివృద్ధి, పునరావాస పథకాల కోసం
15. రాజ్యసభ ఎన్నేండ్లకు ఒకసారి రద్దవుతుంది?
1) రెండేండ్లు 2) మూడేండ్లు
3) ఆరేండ్లు 4) అసలు రద్దుకాదు
16. ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులకన్నా ఆదేశిక సూత్రాలకు ఆధిక్యత ఇచ్చింది?
1) 36వ రాజ్యాంగ సవరణ
2) 38వ రాజ్యాంగ సవరణ
3) 40వ రాజ్యాంగ సవరణ
4) 42వ రాజ్యాంగ సవరణ
17. పార్లమెంట్ పంపిన ద్రవ్యబిల్లు రాష్ట్రపతికి వచ్చినప్పుడు ?
1) రాష్ట్రపతి ఆమోదం తెలపాలి 2) తిరస్కరించాలి
3) తనవద్ద ఉంచుకోవాలి
4) పునఃపరిశీలన కోసం తిరిగి పంపాలి
18. రాష్ట్రపతి మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరికానివి?
ఎ) రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే పద్ధతిని
అమెరికా నుంచి గ్రహించారు
బి) ఈ తీర్మానాన్ని రాజ్యసభలో గానీ, లోక్సభలో
గానీ ప్రవేశపెట్టవచ్చు
సి) రాష్ట్రపతితో నియమించబడ్డ సభ్యులు కూడా
మహాభియోగ తీర్మానం ఓటింగ్లో పాల్గొనవచ్చు
డి) ఒక సభ ఆమోదించి మరోసభ
తిరస్కరించినప్పుడు తీర్మానం వీగిపోతుంది
ఇ) ఈ తీర్మానం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి
ఎఫ్) రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే పద్ధతిని
కెనడా నుంచి గ్రహించారు
1) ఇ, ఎఫ్ 2) ఎ, బి, సి 3) ఎ, ఇ 4) బి, సి, ఇ
19. రాష్ట్రపతి వీటో అధికారాలకు సంబంధించి జతపర్చండి.
ఎ) సస్పెన్సివ్ వీటో 1) కేంద్ర మంత్రిమండలి
లేదా పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా కారణంతోగానీ, కారణం లేకుండాగానీ తిరస్కరించడం
బి) పాకెట్ వీటో 2) భారత రాష్ట్రపతికి
ఈ అధికారం లేదు. అమెరికా అధ్యక్షుడికి వీటో
అధికారం ఉంది
సి) క్వాలిఫైడ్ వీటో
3) పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రిమండలి బిల్లుల విషయం లో రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెల్పకుండా లేక తిరస్కరించకుండా అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బిల్లులను తన దగ్గర ఉంచుకోవడం
డి) అబ్జల్యూట్ వీటో
4) పార్లమెంట్ లేదా కేంద్రమంవూతిమండలి ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదం తెల్పకుండా అనేక సవరణలు, సలహాలూ సూచనలను చేస్తూ పునఃపరిశీలన కోసం తిరిగి వెనకకు పంపడం
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
20. కిందివాటిని జతపర్చండి.
ఎ) బిజు జనతాదళ్ 1) 1984
బి) బహుజన్ సమాజ్వాదీ పార్టీ 2) 1999
సి) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3) 1966
డి) శివసేన 4) 1997
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
21. ప్రధాని పదవిపై కిందివాటిని జతపర్చండి.
ఎ) ప్రధాని సమానుల్లో ప్రథముడు
1) విలియం హార్కోర్ట్
బి) క్యాబినెట్ ప్రభుత్వం అనే భవనానికి ప్రధాని
పునాదిరాయి వంటివారు 2) సర్ ఐవర్ జెన్నింగ్స్
సి) ప్రధానమంత్రి చుక్కల్లో చంద్రుడు
3) లార్డ్ మార్లే
డి) అనేక గ్రహాలను తనచుట్టూ తిప్పుకునే
నక్షత్రం వంటివారు 4) లార్డ్ మన్రో
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?