Members of the National Development Council | జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులుగా ఉండేవారు?
ఇండియన్ పాలిటీ
1. కింద పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో గాంధేయవాద సూత్రాలేవి?
ఎ. ఉమ్మడి పౌరస్మృతిని ప్రజలకు కల్పించడం
బి. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం
సి. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం
డి. కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం
1) ఎ, బి 2) బి, సి, డి 3) బి, సి 4) పైవన్నీ
2. కింది కమిషన్లను జతపర్చండి.
ఎ. షా కమిషన్ 1. ఎమర్జెన్సీ దారుణాలపై జనతా
ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించింది
బి. కే సంతానం కమిటీ 2. అవినీతి నిర్మూలన
సి. ఫజల్ అలీ కమిషన్ 3. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
డి. రాజమన్నార్ కమిటీ 4. రాష్ర్టాల పునర్
వ్యవస్థీకరణకు సంబంధించింది
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
3. కింది వాటిలో న్యాయ సమీక్షకు అవకాశం లేని అంశాలు?
ఎ. కేంద్ర మంత్రిమండలి, రాష్ట్రపతికి సలహాలివ్వడం
బి. పార్లమెంటు కార్యక్రమాలు
సి. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రాష్ట్రపతి పేరుమీదుగా నిర్వహించాలి.
డి. రాష్ట్ర మంత్రిమండలి, గవర్నర్‌కు సలహా నివ్వడం
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
4. కింది వాటిలో న్యాయవ్యవస్థకు సంబంధించి సరైనవి?
ఎ. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ అనే
భావనను అమెరికా నుంచి గ్రహించారు
బి. ఏకీకృత న్యాయవ్యవస్థ అనే భావనను బ్రిటన్
నుంచి గ్రహించారు
సి. దేశంలో న్యాయశాఖ విభజన లేదు
డి. దేశంలో న్యాయశాఖ విభజన ఉంది
ఇ. దేశంలో న్యాయవ్యవస్థ పితామహుడు వారన్ హేస్టింగ్స్
ఎఫ్. దేశంలో న్యాయవ్యవస్థ పితామహుడు కారన్ వాలీస్
1) ఎ, బి, సి 2) ఎ, డి, ఇ
3) ఎ, బి, సి, ఎఫ్ 4) ఎ, డి, ఎఫ్
5. ముఖ్యమంత్రి కింది ఏ సంస్థల్లో సభ్యుడిగా ఉంటాడు?
ఎ. జాతీయ అభివృద్ధి మండలి
బి. అంతర్ రాష్ట్ర కౌన్సిల్
సి. జాతీయ సమైక్యత మండలి
డి. జోనల్ కౌన్సిళ్లు
1) బి, సి 2) బి, డి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
6. రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు?
ఎ. కేంద్రం, రాష్ర్టాలను పునర్వ్యవస్థీకరించడం
బి. గవర్నర్ వ్యవస్థ
సి. రాజ్యాంగ సవరణలో కేంద్రం ఆధిక్యత
డి. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ
ఇ. ద్వంద్వ ప్రభుత్వం
1) ఎ, బి, సి 2) సి, డి, ఇ
3) బి, సి, డి 4) ఎ, ఇ
7. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): రాజ్యాంగంలో మైనారిటీ అనే పదం నిర్వచింపబడలేదు
కారణం(R): మైనారిటీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు
4) A తప్పు, R నిజం
8. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): ప్రభుత్వ పరిధి పెరగడంవల్ల క్యాబినెట్, సచివాలయం ప్రాముఖ్యత పెరిగింది
కారణం (R): సాంకేతికత అభివృద్ధి చెందడంతో ప్రభుత్వ ఏజెన్సీల ఏర్పాటుకు దోహదమైంది
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు
4) A తప్పు, R నిజం
9. లోక్‌సభ స్పీకర్‌కు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు
బి. స్పీకర్‌గా నియమించే సమయానికి సభలో సభ్యుడు కావలసిన అవసరం లేదు. కానీ 6 నెలల్లోగా సభ్యుడు కావాలి
సి. తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పిస్తారు
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
10. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. కేంద్ర మంత్రిమండలి పార్లమెంటుకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది
బి. కేంద్ర మంత్రులు రాష్ట్రపతి అభీష్టమున్నంతవరకు పదవిలో కొనసాగుతారు
సి. ప్రధానమంత్రి శాసనాలకు సంబంధించిన విషయాలను రాష్ట్రపతికి తెలపాలి
1) ఎ 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
11. జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరు సభ్యులుగా ఉంటారు?
ఎ. ప్రధానమంత్రి బి. ఆర్థిక సంఘం చైర్మన్
సి. క్యాబినెట్ మంత్రులు డి. ముఖ్యమంత్రులు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, డి 4) పైవన్నీ
12. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సరైన వాక్యం?
ఎ. రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం గురించి పేర్కొనలేదు
బి. అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే
ప్రవేశపెట్టాలి
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
13. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కిందివాటిలో సరైనది?
ఎ. ఆదేశిక సూత్రాలు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుపుతాయి
బి. ఆదేశిక సూత్రాలను కోర్టు ద్వారా అమలుచేయలేం
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
14. అధికార విభజనకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం?
ఎ. రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ అధికార విభజన గురించి పేర్కొంటుంది
బి. కేంద్ర జాబితాలో ప్రస్తుతం 100 అంశాలున్నాయి. ప్రారంభంలో 97 ఉండేవి
సి. రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 61 అంశాలున్నాయి. ప్రారంభంలో 66 ఉండేవి
డి. ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం 52 అంశాలున్నాయి. ప్రారంభంలో 47 ఉండేవి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, డి 4) పైవన్నీ
15. కింది వారిలో జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో రాష్ట్రపతులు ఎవరు?
ఎ. రాజేంద్ర ప్రసాద్ బి. సర్వేపల్లి రాధాకృష్ణన్ సి. నీలం సంజీవరెడ్డి డి. వీవీ గిరి
ఇ. జాకీర్ హుస్సేన్ ఎఫ్. ఫకృద్దీన్ అలీ అహ్మద్
1) ఎ, సి, డి 2) బి, సి, ఎఫ్
3) బి, డి, ఎఫ్ 4) సి, డి, ఇ
16. కింది వారిలో జాతీయ అత్యవసర పరిస్థితులు విధించిన సందర్భంలో ప్రధానమంత్రులు ఎవరు?
ఎ. జవహర్లాల్ నెహ్రూ బి. లాల్‌బహదూర్ శాస్త్రి సి. మొరార్జీ దేశాయ్ డి. ఇందిరాగాంధీ
ఇ. గుల్జారిలాల్ నందా
1) ఎ, డి 2) బి, డి 3) సి, డి 4) ఎ, సి, డి
17. కింది వాటిని జతపర్చండి.
ఎ. గోలక్‌నాథ్ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1. కోకా సుబ్బారావు
బి. కేశవానంద భారతి కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2. ఎస్ఎం సిక్రీ
సి. సుప్రీంకోర్టులో తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి 3. వైవీ చంద్రచూడ్
డి. సుప్రీంకోర్టులో ఎక్కువ కాలం సీజేగా పనిచేసింది 4. కేజీ బాలకృష్ణన్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
18. కింది వాటిని జతపర్చండి.
ఎ. ప్రకరణ 65 1. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం
బి. ప్రకరణ 66 2. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం
సి. ప్రకరణ 67 3. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా
వ్యవహరించడం
డి. ప్రకరణ 69 4. ఉపరాష్ట్రపతి హోదా
పదవీకాలం పరిమితి
1) ఎ-2, బి-4, సి-3, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
19. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): సమన్యాయ పాలన చట్టం ఔన్నత్యాన్ని నిరూపిస్తుంది
కారణం (R): విచక్షణాధికారాలు నిరంకుశత్వానికి దారితీస్తాయి
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు
4) A తప్పు, R నిజం
20. కింది వాటిలో సరైన వాక్యం?
ఎ. కేంద్ర కార్యనిర్వహణ అధికారం ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది
బి. సివిల్ సర్వీసు బోర్డుకు ప్రధానమంత్రి ఎక్స్అఫీషియో చైర్మన్‌గా ఉంటారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
21. దేశంలో మొదటి మహిళా గవర్నర్?
1) వీఎన్ రమాదేవి 2) శారదా ముఖర్జీ
3) కుముద్‌బెన్ జోషి 4) సరోజినీ నాయుడు
22. తన పదవీకాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కోని ప్రధానమంత్రి ఎవరు?
1) చౌదరి చరణ్‌సింగ్ 2) ఏబీ వాజ్‌పేయి
3) చంద్రశేఖర్ 4) వీపీ సింగ్
23. ఏ రాష్ట్ర హైకోర్టు బంద్‌లు చట్ట, రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చింది?
1) తమిళనాడు 2) కేరళ హైకోర్టు
3) బెంగాల్ 4) కర్ణాటక
24. రాజ్యాంగ అత్యవసర స్థితి ప్రకటన దేనికి దారితీస్తుం ది?
1) రాష్ట్రపతి పాలన
2) స్వేచ్ఛ హక్కు తాత్కాలిక రద్దు
3) ఉద్యోగుల జీతాల్లో కోత
4) మధ్యంతర ఎన్నికల నిర్వహణ
25. రాజ్యాంగ సవరణకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. రాజ్యంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు
బి. సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్రపతి అనుమతి అవసరం
సి. సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు
డి. రాష్ట్ర శాసనసభలకు సవరణ బిల్లును ప్రవేశపెట్టే అధికారం లేదు
ఇ. ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే సంయుక్త సమావేశానికి అవకాశం లేదు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) బి, డి, ఇ 4) ఎ, సి, డి, ఇ
26. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో కింది వాటిలో సరైనవి?
ఎ. 1969లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యింది
బి. 1972లో ఆంధ్రప్రదేశ్ నుంచి కోస్తాంధ్రను విడదీయాలని జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమయ్యింది
సి. 2010, ఫిబ్రవరి 3న శ్రీకృష్ణకమిటీని వేశారు
డి. 2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. అందులో ఆరు పరిష్కార మార్గాలు సూచించింది
ఇ. 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం
ఎఫ్. 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం
1) ఎ, బి, ఎఫ్ 2) ఎ, సి, ఎఫ్
3) ఎ, సి, డి, ఇ 4) పైవన్నీ
27. అవినీతి ఆరోపణలు వచ్చిన న్యాయమూర్తులు?
ఎ. వీ రామస్వామి బి. సౌమిత్రసేన్
సి. పీడీ దినకరన్ డి. భగవతి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?