When did the 74th Amendment come into force?74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తేదీ?
ఇండియన్ పాలిటీ
1. ప్రతిపాదన (A): భారత రాజ్యాంగం ఒకచేత్తో హక్కులను ప్రసాదించి మరో చేతితో వెనక్కి తీసుకున్నది
కారణం (R): ప్రజలకు ప్రాథమిక హక్కుల రూపంలో ఏది లభిస్తున్నదో అంచనా వేయడం కష్టం
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
2. భారత ప్రభుత్వ చట్టం 1935ని పటిష్టమైన బ్రేకులు కలిగిన ఇంజిన్ లేని యంత్రం వంటిది అని ఎవరు వర్ణించారు?
1) జవహర్లాల్ నెహ్రూ 2) సర్దార్ వల్లభాయ్ పటేల్ 3) మహాత్మాగాంధీ 4) ప్రొ. కె.టి.షా
3. రాజ్యాంగ దిన్సోతవంగా ఏ రోజును జరుపుకుంటున్నాము?
1) జనవరి 26 2) నవంబర్ 26
3) ఆగస్టు 15 4) పైవన్నీ
4. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఏక కాలంలో లేనప్పుడు రాష్ట్రపతిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు?
1) లోక్‌సభ స్పీకర్ 2) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ 3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4) రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనలేదు
5. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చినా పౌరస్వతం, ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు అనేవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి?
1) 15 ఆగస్టు 1949 2) 30 జూన్ 1948
3) 26 నవంబర్ 1949 4)15 ఆగస్టు 1947
6. భాషా ప్రాతిపాదిక రాష్ర్టాల ఏర్పాటును వ్యతిరేకించిన కమిషన్ ఏది?
1) షా కమిషన్ 2) థార్ కమిషన్
3) ఫజల్ అలీ కమిషన్ 4) జె.వి.పి కమిషన్
7. అనుగ్రహ సిద్ధాంతాని (సంతృప్తి విధానం)కి సంబంధించిన కింది వాటిని పరిశీలించండి.
ఎ. ప్రకరణ 310 తెలియజేస్తుంది
బి. సివిల్ సర్వీస్ ఉద్యోగులు రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు.
సి. ఈ సిద్ధాంతాన్ని బ్రిటన్ నుంచి గ్రహించాడు.
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
8. ఏ రాజ్యాంగం భారత రాజ్యాంగం అని పిలువబడుతుంది అని పేర్కొంటున్న ప్రకరణ ఏది?
1) ప్రకరణ 393 2) ప్రకరణ 1
3) ప్రకరణ 394 4) ప్రకరణ 395
ఎ) 1 బి) 3, 4 సి) 2, 3, 4 డి) 2
9. 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1) నూతనంగా 11వ షెడ్యూల్‌ను చేర్చారు
2) 1 జూన్ 1993 నుంచి అమలులోకి వచ్చింది
3) నూతనంగా 9 ఏ భాగాన్ని చేర్చారు
4) నూతనంగా 9 బి భాగాన్ని చేర్చారు
5) నూతనంగా 12వ షెడ్యూల్‌ను చేర్చారు
ఎ) 1, 2, 3 బి) 4, 5 సి) 3, 5 డి) 2, 3, 5
10. కింది వాటిని జతపర్చండి.
1. చార్టర్ చట్టం, 1813 అ. ఈస్టిండియా కంపెనీ కాలంలో మొదటి చట్టం
2. భారత ప్రభుత్వ చట్టం, 1858 ఆ. ఈస్టిండియా కంపెనీ ఏకస్వామ్యం రద్దు
3. రెగ్యులేటింగ్ చట్టం, 1773 ఇ. ఈస్టిండియా కంపెనీ పాలన పరిసమాప్తం
4. భారత కౌన్సిల్ చట్టం, 1861 ఈ. గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్‌లను జారీ చేయు అధికారం కల్పించారు
ఎ) 1-ఆ, 2-ఈ, 3-ఇ, 4-అ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఆ, 2-ఇ, 3-అ, 4-ఈ
డి) 1-ఇ, 2-అ, 3-ఆ, 4-ఈ
11. రాజ్యాంగంలోని ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఎవరికి లభిస్తుంది?
ఎ) వ్యక్తులకు బి) భారతదేశంలో నివసిస్తున్నవారికి సి) పౌరులకు డి) అందరికి
12. ప్రతిపాదన (A): కేంద్ర మంత్రి మండలి లిఖిత పూర్వక సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు.
కారణం (R): జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం రాష్ట్రపతి విచక్షణాధికారం
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు
4) A తప్పు, R నిజం
13. ప్రతిపాదన (A): రాష్ట్రపతికి రాజ్యాంగం క్షమాభిక్ష అధికారాలను ప్రసాదించింది.
కారణం (R): కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు క్షమాభిక్ష అధికారాలను ఉపయోగిస్తారు.
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
14. ఇతర భూభాగాల విలీనం ద్వారా భారత పౌరసత్వం పొందినవారు?
1) పాండిచ్చేరి 2) గోవా 3) 1, 2 4) ఎదీకాదు
15. ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకోవడాన్ని న్యాయస్థానం అనుమతించదు ఈ ప్రక్రియను న్యాయ పరిభాషలో ఏమంటారు?
1) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ 2) డాక్ట్రిన్ ఆఫ్ వేవర్
3) డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటీ 4) ఏదీకాదు
16. ఎప్పుడు జనతా ప్రభుత్వం పౌర పురస్కారాలను రద్దు చేసింది?
1) 1976 2) 1978 3) 1977 4) 1975
17. రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకొంటారు?
1) ప్రజలు ప్రత్యక్షంగా
2) ఎలక్ట్రోరల్ కాలేజ్ ద్వారా పార్లమెంటుకు, రాష్ర్టాల శాసనసభలకు, ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభలకు ఎన్నికైన సభ్యులు
3) పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకొంటారు
4) ఎలక్ట్రోరల్ కాలేజ్ ద్వారా పార్లమెంటు, రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు
18. న్యాయవ్యవస్థకు సంబంధించి సరైన వాటిని తెల్పండి?
ఎ. సుప్రీంకోర్టుపై శాసన, కార్యనిర్వాహక శాఖల ప్రభావం, నియంత్రణ ఉండదు
బి. సబార్డినేట్ కోర్టులు రాష్ట్ర న్యాయ వ్యవస్థకు అధ్యక్షత వహిస్తాయి
సి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి గవర్నర్ నియమిస్తాడు
డి. ఒక కేసులో ముఖ్యమైన అంశం ఇమిడి ఉందని హైకోర్టు భావిస్తే కింది కోర్టులోని ఆ కేసును నేరుగా హైకోర్టుకు బదిలీ చేసుకోవచ్చు
1) ఎ, బి 2) ఎ, సి 3) ఎ, డి 4) బి, సి, డి
19. రాజ్యాంగ సవరణలు, అవి జరిగిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. 42వ రాజ్యాంగ సవరణ-1978
బి. 24వ రాజ్యాంగ సవరణ-1971
సి. 26వ రాజ్యాంగ సవరణ-1971
డి. 86వ రాజ్యాంగ సవరణ-2005
1) బి, సి, డి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
20. ఇందిరాసహాని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఎంతకు మించకూడదని తెలిపింది?
1) 50 శాతం 2) 60 శాతం
3) 40 శాతం 4) 45 శాతం
21. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ప్రకారం పార్లమెంటు సవరించడానికి వీలు లేనిది?
1) పీఠిక 2) ప్రాథమిక హక్కులు
3) ప్రాథమిక విధులు 4) మౌలిక అంశాలు
22. 7వ షెడ్యూల్‌ను సవరించడానికి కావాల్సిన మెజారిటీ ఎంత?
1) పార్లమెంట్ సాధారణ మెజారిటీ
2) పార్లమెంట్లో 2/3వ వంతు మెజారిటీ
3) పార్లమెంట్లో 2/3వ వంతు మెజారిటీ, కనీసం 1/2వ వంతు రాష్ట్ర శాసనసభల ఆమోదం
4) పార్లమెంట్లో 2/3వ వంతు మెజారిటీ, అన్ని రాష్ట్ర శాసనసభల ఆమోదం
23. కింది వాటిలో ఏవి రాష్ట్ర గవర్నర్ విచక్షణాధికారాలు?
ఎ. ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రిని నియమించడం
బి. ఇతర మంత్రుల నియామకం
సి. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భంలో రాష్ట్రపతికి నివేదిక పంపడం
డి. అడ్వకేట్ జనరల్‌ను నియమించడం
1) ఎ, బి 2) ఎ, సి 3) ఎ, డి 4) ఎ, బి, సి, డి
24. ప్రతిపాదన A: రాష్ట్రపతి ప్రకరణ 134 ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరవచ్చు
కారణం R: సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయసలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు
1) A, R లు రెండూ నిజం, Aకు, R సరైన వివరణ
2) A, R లు రెండూ నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
25. ప్రతిపాదన A: ప్రకరణ 352 ప్రకారం రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు
కారణం R: రాజ్యాంగ యంత్రాంగం రాష్ర్టాల్లో విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
26. సభలో సభ్యత్వం లేకుండా సభలకు అధ్యక్షత వహించేది?
1) రాజ్యసభ ఛైర్మన్ 2) విధాన పరిషత్ ఛైర్మన్
3) అటార్ని జనరల్ 4) 1, 3
27. కింది వాటిలో ప్రాథమిక విధులుగా రాజ్యాంగంలో వేటిని పేర్కొన్నారు?
ఎ. మనదేశ మిశ్రమ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి పరిరక్షించడం
బి. అణగారిన వర్గాల వారికి సాంఘిక న్యాయాన్ని అందించడం
సి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసని, పరిశోధనా, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం
డి. వ్యక్తిగత సమష్టి చర్యల ద్వారా ప్రతి రంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయడం
1) ఎ, బి 2) బి 3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
28. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ. రెవెన్యూ డిపార్ట్మెంట్ బడ్జెట్‌ను తయారు చేస్తుంది
బి. పార్లమెంట్ అనుమతి లేనిది ఎలాంటి మొత్తాన్ని సంఘటిత నిధి నుంచి తీయలేరు
సి. పబ్లిక్ అకౌంట్స్ నుంచి తీసిన ప్రతిదానికి పార్లమెంట్ అనుమతి ఉండాలి
1) ఎ 2) బి, సి 3) బి 4) ఎ, బి, సి
29. రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు?
1) చీఫ్ ఎలక్షన్ కమిషనర్
2) లోక్‌సభ సెక్రటరీ జనరల్
3) రాజ్యసభ సెక్రటరీ జనరల్
4) ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్
30. ప్రతిపాదన A: ఇందిరాగాంధీకి డచ్ ప్రభుత్వం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ ఆర్క్ ప్రదానం చేసింది
కారణం R: ఇందిరాగాంధీ భారత ప్రధాన మంత్రి
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ 2) A, Rలు రెండూ నిజం కానీ Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) Aతప్పు, R నిజం
31. పాలనపై న్యాయశాఖ వేటితో నియంత్రణ చేస్తుంది?
ఎ. రిట్లు జారీ చేయడం
బి. న్యాయసమ్మతమైన తీర్పు
సి. న్యాయ సమీక్ష
డి. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు
1) ఎ, సి, డి 2) ఎ, బి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
32. ఆధునిక స్థానిక ప్రభుత్వాలు ప్రాచీన స్థానిక ప్రభుత్వాల నుంచి ఏ అంశాల్లో విభేదిస్తున్నాయి?
ఎ. ప్రాతినిధ్య లక్షణాలు బి. ఎన్నుకోబడే స్వభావం
సి. చట్టబద్ధ హోదా
డి. వీటి ఏర్పాటు ప్రజలు హక్కుగా భావించడం
1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?