Village lights | గ్రామ దివిటీలు
మూఢనమ్మకాలు, సామాజిక కట్టువ్యవసాయం ప్రధానమైన మనదేశంలో ఇప్పటికీ గ్రామీణ జనాభే అధికం. సరైన వసతుల్లేక ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలెన్నో ఉన్నాయి. బాట్ల చాటున ఉన్న ఊర్లు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. వీటిని నివారించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్నాయి. వాటిలో కొన్ని సక్సెస్ అవుతుండగా, మరికొన్ని ప్రజలకు చేరువకాలేక పోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నది, ఏం చేస్తే గ్రామాలు ఆర్థికంగా, వ్యవసాయకంగా, సామాజికంగా అభివృద్ధి పథంలోకి వస్తాయనే అంశాలను విశ్లేషించి గ్రామీణుల అభివృద్ధికి పాటుపడే వారే గ్రామీణాభివృద్ధి నిపుణులు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి నిపుణులందించే కోర్సులు, వాటిని అందిస్తున్న సంస్థలు, ఉద్యోగావకాశాల గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం.
రూరల్ డెవలప్మెంట్ కోర్సులు
-దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అన్నారు గాంధీజీ. ఆ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టికేంద్రీకరించాయి. గ్రామాల్లో వసతులను మెరుగుపర్చడానికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సామాజిక, విద్య, వైద్య, ఆర్థికపరమైన అవసరాలను తీర్చేలా అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటిని ప్రతిఒక్కరు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగితేనే ఆయా పథకాల లక్ష్యం నెరవేరుతుంది. అయితే వాటితో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చనే విషయాలపై అవగాహన కల్పించకపోవడంవల్ల అవి అర్హులకు చేరడం లేదు. దీంతో ప్రభుత్వాలు గ్రామీణాభివృద్ధి నిపుణులను నియమించుకుంటున్నాయి. ఏయే ప్రాంతాలకు ఎలాంటి పథకాలు అవసరం, వాటి రూపకల్పన, అమలు తీరు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి.. వంటి విషయాలను వీరిద్వారా తెలుసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఐఆర్డీ, టిస్ వంటి సంస్థలు, విశ్వవిద్యాలయాలు గ్రామీణాభివృద్ధి నిపుణులను తయారు చేయడానికి రూరల్ డెలప్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్ కోర్సులు ఉన్నాయి.
-గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడేవారు, కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగి విశాల దృక్పథంతో ఆలోచించేవారు, వివిధ రకాల ప్రజలతో మమేకం కావాలనుకునేవారు, ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలిగే వారు ఈ కోర్సులు చేయవచ్చు.
ఉద్యోగావకాశాలు
-దేశంలోని గ్రామీణ ప్రాంతాలే గ్రామీణాభివృద్ధి కోర్సులు చేసినవారికి ఉద్యోగ వనరులు. ప్రస్తుతం ప్రభుత్వరంగంలోనే విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబన చేకూర్చడంలో భాగంగా ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు జరగడానికి, సోషల్ ఆడిట్ నిర్వహణ వంటి అంశాలకు గ్రామీణాభివృద్ధి నిపుణులు అవసరమవుతారు. దీంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రైవేటురంగంలోని కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటికి కూడా రూరల్ డెవలప్మెంట్ కోర్సు చేసిన అభ్యర్థులు తప్పనిసరి.
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సామాజిక పథకాలైన పనికి ఆహార పథకం, సంపూర్ణ గ్రామ స్వరాజ్య యోజన, స్వర్ణజయంతి గ్రామ స్వరాజ్ యోజన వంటి పథకాల్లో గ్రామీణాభివృద్ధి అధికారి (వీడీఓ)గా, ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రూరల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ (ఎస్ఐపీసీసీడీ), వివిధ ప్రభుత్వ విభాగాలు, గ్రామీణ బ్యాంకులు, ఎన్జీవోలు, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో హ్యూమన్ ఆగ్రానమిస్ట్గా, ఏరియా ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ అండ్ సేల్స్ మేనేజర్, రిసెర్చ్ హెడ్, నేషనల్ సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్, రూరల్ టెక్నాలజీ ప్రాజెక్ట్ హెడ్, రూరల్ మార్కెటింగ్ మేనేజర్, రూరల్ బిజినెస్ సేల్స్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ క్లయింట్ సర్వీస్ మేనేజర్లుగా పనిచేయవచ్చు.
-ప్రధానంగా రెడ్‌క్రాస్ సొసైటీ, వరల్డ్ బ్యాంక్, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు, నాబార్డ్, టాటా టెలీ సర్వీసెస్, ఆదిత్య బిర్లాగ్రూప్, ప్రధాన్, కేర్, అమూల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ (ఐఐఆర్డీ) వంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ ఎన్జీవోలు గ్రామీణాభివృద్ధి నిపుణుల నియామకాలను చేపడుతున్నాయి.
నేర్చుకునే అంశాలు
-వివిధ యూనివర్సిటీలు అందించే యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించేలా వివిధ అంశాలను బోధిస్తున్నాయి.
బీఏ
-మూడేండ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సు చేయడానికి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ కోర్సులో..
-ఎలిమెంట్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్
-రూరల్ డెవలప్మెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్
-ఇండియన్ రూరల్ ఎకనామిక్ సీన్
-ఇండియన్ రూరల్ సోషల్ సీన్
ఎంఏ
-ఈ కోర్సు చేయడానికి బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో భాగంగా..
-రూరల్ డెవలప్మెంట్: కాన్సెప్ట్స్ అండ్ డైమెన్షన్స్
-ఇండియన్ రూరల్ ఎకనామిక్ సీన్
-ఇండియన్ రూరల్ సోషల్ సీన్
-ఎకనామిక్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్
-రూరల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
-రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్ట్రాటజీస్
-వర్కింగ్ విత్ పీపుల్: టెక్నిక్స్ అండ్ ప్రాసెస్
-సోషల్ రిసెర్చ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్
-నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్: ల్యాండ్, వాటర్, వెజిటేషన్
-హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ సెక్టార్
-మైక్రోఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్
-రూరల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్
-రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్
-వాలంటరీ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్
పీజీ డిప్లొమా
-రూరల్ డెవలప్మెంట్: కాన్సెప్ట్స్ అండ్ డైమెన్షన్స్
-రూరల్ ఎకానమీ ఆఫ్ ఇండియా, సోషల్ సెక్టార్ ఆఫ్ రూరల్ ఇండియా
-రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా
-రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్ట్రాటజీస్
-రూరల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్
-ఈ కోర్సును కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ- మైసూర్, కేఐఐటీ స్కూల్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ (కేఎస్ఆర్ఎం)- భవానిపట్నా, మహరాజా హరిశ్చంద్ర పోస్ట్‌గ్రాడ్యుయేట్ కాలేజీ (మొరాదాబాద్)లు అందిస్తున్నాయి.
సర్టిఫికెట్ కోర్సు
-రూరల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ అడ్మినిస్ట్రేషన్
-నేచురల్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్
-రూరల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్
-రూరల్ ఎనర్జీ ప్లానింగ్
-ట్రాన్స్ఫర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్స్
-రూరల్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్, డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్, ల్యాండ్ రిఫార్మ్స్, రూరల్ ఇన్స్టిట్యూషన్స్, జెండర్ డెవలప్మెంట్, లైవ్లీహుడ్ ఇష్యూస్, సోషల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, వాటర్‌షెడ్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వంటి వివిధ అంశాలను ఈ కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు.
-సర్టిఫికెట్ కోర్సును ఇగ్నో, మరికొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
-కోర్సులో భాగంగా నేర్చుకునే అంశాలతోపాటు క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టులు కీలకంగా ఉంటాయి. వీటితోపాటు కొన్ని యూనివర్సిటీలు రూరల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ ఆఫర్ చేస్తున్నాయి.
కోర్సులు అందిస్తున్న సంస్థలు
-ఎన్ఐఆర్డీ- హైదరాబాద్ (www.nird.org.in/), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం)- జైపూర్ (www.iirm.ac.in), ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ (ఆనంద్- ఐఆర్ఎంఏ), అమిటీ స్కూల్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ (www.amity.edu), జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (www.xiss.ac.in), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (www.tiss.edu), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, ఘజియాబాద్ (www.imt.edu) వంటి ప్రముఖ సంస్థలతోపాటు కాకతీయ విశ్వవిద్యాలయం, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, డా.బీఆర్ అంబేద్కర్ వర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో, డా. హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలు వివిధ కాంబినేషన్లతో రూరల్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి.
-హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీ రెసిడెన్షియల్ విధానంలో పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నది. ఇది ప్రతి ఏడాది రెండుసార్లు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది.
ఎంపిక
-రూరల్ డెవలప్మెంట్లో బీఏ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు చేయాలనుకునేవారు ఆయా సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. దీనికోసం ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
-ఎన్ఐఆర్డీ, టిస్, ఐఐఆర్ఎం, ఐఆర్ఎంఏ వంటి సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో ప్రవేశపరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిని గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఐఆర్ఎంఏ వంటి సంస్థల్లో ప్రవేశం పొందాలంటే క్యాట్ లేదా గ్జాట్ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన వారై ఉండాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?