-స్త్రీవాద దృక్పథంతో రచనలు చేసిన సుప్రసిద్ధ రచయిత- చలం. ఈయన రచించిన నాటకాలు- చిత్రాంగి, శశాంక, విడాకులు, రంగదాసు, పురూరవ, మంగమ్మ, జయదేవ, త్యాగం. చిత్రాంగిని నిర్దోషిగా చిత్రీకరిస్తూ రాసిన నాటకం చిత్రాంగి. స్త్రీపురుషులకు ప్రధానమైనది పవివూతవూపేమ తప్ప వివాహబంధం కాదని చాటిన నాటకం విడాకులు. స్వేచ్ఛా శృంగారం ప్రతిపాదించిన నాటకం శశాంక.
-చలం అన్వేషణకు, ఆధ్యాత్మికమైన ఆత్మదర్శనానికి ప్రతీకగా నిలిచే నాటకం పురూరవ.
-కొప్పరపు సుబ్బారావు రచించిన నాటకాలు- రోషనార, రాణావూపతాప్, తారాశశాంక.
-మేవాడ్ రాజ్యపతనం, జేబున్నీస్ నాటకాల రచయిత- పింగళి నాగేందర్ రావు.
-పీవీ రాజమన్నారు రచించిన నాటకాలు- తప్పెవరిది, మనోరమ.
-హేతువాద దృక్పథంతో నార్ల వెంక రావు రచించిన నాటకాలు- సీతజోస్యం, జాబాలి, నరకంలో హరిశ్చంవూదుడు
-బోయి భీమన్న రచించిన నాటకాలు- పాలేరు, కూలిరాజు
-సుంకర, వాసిడ్డి రచించిన సుప్రసిద్ధ నాటకాలు- మా భూమి, ముందడుగు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసిన నాటకం- మా భూమి
-కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ కొండుముది గోపాలరాయశర్మ రచించిన నాటకం- ఎదురీత.
-ఇదా ప్రపంచం నాటక రచయిత- కణ్వశ్రీ
-తెలుగు నాటక రంగాన్ని గురజాడ వంటి మహా కవుల అడుగుజాడల్లోంచి దారి మళ్లించి మధ్యతరగతి జీవితానికి అద్దం పట్టే సమస్యాత్మక నాటకాలు రచించిన సుప్రసిద్ధ రచయిత ఆచార్య ఆత్రేయ. ఈయన అసలు పేరు కిళాంబి వెంకటనరసింహాచార్యులు
-దీక్ష సినిమాతో చలనచివూతరంగంలో ప్రవేశించిన ఆత్రేయ సుమారు 400 చిత్రాలకు మాటల్ని, పాటల్ని అందించి చలనచిత్ర జగతిలో మాటల, పాటల మాంత్రికుడిగా, మనసుకవిగా చెరగని స్థానాన్ని సంపాదించారు.
-పాశ్చాత్య నాటక రచయిత ఇప్సన్ రచనల ప్రభావంచే తెలుగులో రచనలు చేసి ఆంధ్రా ఇప్సన్గా ప్రసిద్ధిగాంచారు ఆత్రేయ.
-ఆత్రేయ రచించిన నాటకాలు- గౌతమబుద్ధ, అశోక సామ్రాట్, పరివర్తన, వాస్తవం, ఈనాడు, ఎన్జీవో, విశ్వశాంతి, కప్పలు, భయం, మనసు-వయసు. మధ్యతరగతి జీవితాలను అద్భుతంగా చిత్రించిన నాటకం- ఎన్జీవో. ఇది 1949 నాటి ఆంధ్రనాటక పరిషత్తు పోటీల్లో ప్రథమ బహుమతి పొందింది. ఇందులోని ప్రధాన పాత్రలు- గోపి, రంగనాథం, సీత. ఈ నాటకానికి ఆత్రేయ మొదట పెట్టిన పేరు- అద్దె కొంప.
-1947లో రగులుతున్న మతకల్లోలాలకు స్పందించి ఆత్రేయ రాసిన నాటకం- ఈనాడు. ఇది గాంధీకి అంకితమిచ్చారు. ఆత్రేయ రచించిన నాటికలు- అశ్వఘోషుడు, ఆత్మార్పణ, ఎవరుదొంగ, ఒక్కరూపాయి, ఓటునీకే, అంతర్యుద్ధం, అంత్యార్పణ, కళకోసం, కాపలావాని దీపం, చస్తే ఏం, చావకూడదు, తెరచిన కళ్లు, ప్రగతి, మాయ, వరవూపసాదం మొదలైనవి. ఆత్రేయ రచనలపై సమగ్ర పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాపొందిన పరిశోధకుడు- డా. తండు కృష్ణకౌండిన్య.
-పినిశెట్టి రచించిన నాటకాలు- పల్లెపడుచు, అన్నాచెప్లూలు, కులంలేని పిల్ల. నాటికలు- ఆడది, చలిజ్వరం, రిక్షావాడు, అమ్మ మొదలైనవి.
-బెల్లంకొండ రామదాసు రచించిన నాటకాలు- పునర్జన్మ, మాస్టార్జీ
-పంజరం నాటక రచయిత- అవసరాల సూర్యారావు
-గొల్లపూడి మారుతిరావు రచించిన నాటకం- రాగరాగిణి. ఈయన రచించిన నాటికలు కాలం వెనక్కి తిరిగింది, నీలయ్యగారి దెయ్యం, చీకటిలాంటి కోరిక, అనంతం, పగ, చదరంగం, రేపటి మనిషి, వాన వెలసిన రాత్రి మొదలైనవి.
-ఆరుద్ర రచించిన నాటకం- రాదారి బంగళా. ఈయన అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. ఈయన రచించిన నాటికలు- విషవూపయోగం, దేవుని ఎదుట న్యాయాధికారి, పార్కుబెంచి, నన్ను గురించే, దరఖాస్తుఫారం, అక్కయ్యకి ప్రమోషన్.
-శతాధిక నాటక రచయిత కొర్రపాటి గంగాధర రావు రచించిన సుప్రసిద్ధ నాటకాలు- తస్మాత్ జాగ్రత్త, రాగశోభిత, యథా ప్రజా తథా రాజా.
-మరో మొహంజొదారో నాటక రచయిత- ఎన్ఆర్ నంది
-పడాల రామారావు రచించిన నాటకాలు- సందేశం, ఇదా స్వతంత్రం మొదలైనవి.
-నిజం, తిరస్కక్షుతి నాటకాల రచయిత- రావి శాస్త్రి
-పరుచూరి వెంక రావు రచించిన ప్రసిద్ధ నాటకం- సమాధి కడుతున్నాం చందాలివ్వండి
-ఎన్ తారక రామారావు రచించిన నాటకాలు- చరమాంకం, సప్తపది, శరణం గచ్ఛామి
-ఒంటెద్దు బండి నాటక రచయిత- ఎల్బీ శ్రీరాం
-అంఅః నాటక రచయిత- అనంత హృదయరాజ్
-విరియాల లక్ష్మీపతి రాసిన నాటకం- పంచమ వేదం
-యండమూరి వీరేంవూదనాథ్ రచించిన సుప్రసిద్ధ నాటకాలు- రఘుపతి రాఘవ రాజారాం, పుట్ట, డామిట్ కథ అడ్డం తిరిగింది, శివరంజని, జలతరంగిణి. 1975లో ఆంధ్రవూపదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నాటకం రఘుపతి రాఘవ రాజారాం. ఈయన రచించిన నాటికలు కుక్క, మనుష్యులొస్తున్నారు జాగ్రత్త, చీమ కుట్టిన నాటకం, మనీ+షీ మొదలైనవి.
-సమస్యాత్మక నాటక రచయితగా హాస్య, కరుణ రసాల సమ్మేళనంతో పటుత్వంగల సంభాషణలతో ‘మార్గశీర్ష’ అనే కలం పేరుతో నాటకాలు రచించినవారు- బీవీ రమణమూర్తి. ఈయన రచించిన నాటకాలు- పసుపు బొట్టు పేరంటానికి, సుప్తసింహం జూలు దులిపింది, అమృతవర్షిణి, శ్వేతపత్రం మొదలైనవి. కళాసాగర్ అవార్డు, చక్రపాణి అవార్డు, పరుచూరి అవార్డులను పొందిన నాటకం పుసుపు బొట్టు పేరంటానికి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాసిన నాటకం సుప్తసింహం జూలు దులిపింది. స్త్రీ సమస్యలపై రాసిన నాటకం శ్వేతపత్రం. పాత్రలకు, ప్రేక్షకులకు సంబంధం కలిగించి ‘ట్రిలగి’ అనే టెక్నిక్‌ను ప్రవేశపెట్టిన రచయిత మార్గశీర్ష.
-భమిడిపాటి కామేశ్వర రావు రచించిన నాటకాలు- తప్పనిసరి, వద్దంటే పెళ్లి
-చెకోవ్ రచించిన చెర్రీ ఆర్బెర్డ్కు అనుసరణగా శ్రీశ్రీ, వరదలు కలిసి రచించిన నాటకం సంపెంగ తోట
-ఫెరన్స్ మోల్నార్డ్ రచించిన ‘ది ప్లే ఈజ్ ద థింగ్’ నాటకానికి అనుసరణగా డీవీ నరసరాజు రచించిన నాటకం ‘నాటకం’.
నాటిక
-నాటక సాహిత్యంలో అంతర్భాగాలైన సాహిత్య ప్రక్రియలు నాటిక, ఏకాంకిక.
లక్షణాలు
1) ప్రదర్శనా కాలపరిమితి సుమారు గంట ఉంటుంది.
2) ఏక నాయకం అంటే నాయకుడు ఒక్కడే ఉంటాడు.
3) ఏక వస్తుకం
4) రెండు నుంచి ఐదు లేదా ఆరు రంగాలు ఉంటాయి.
ఏకాంకిక
-ఏక నాయకను, ఏక వస్తుకం, విధిగా ఏకరంగములను కలిగి, స్థలకాలైక్యాలు పాటించి, ప్రదర్శనం 30 నుంచి 45 నిమిషాల్లోపు ముగిసినచో దాన్ని ఏకాంకిక అని అంటారు. కానీ నేడు నాటిక, ఏకాంకిక అనే పదాలు సమానార్థకాలుగా వాడుతున్నారు.
-తెలుగులో తొలి స్వతంత్ర ఏకాంకిక సర్వారాయుడు రచించిన గ్రామ కచేరి
-పీవీ రాజమన్నారు రచించిన నాటికలు- ఏమి మగవాళ్లు, నాగుపాము, నిష్ఫలం, దయ్యాల లంక మొదలైనవి.
-చలం రచించిన నాటికలు- భక్త కుచేల, ద్రౌపది, సత్యవంతుడు, భానుమతి, నర్సింహావతారం, ఆడవాళ్ల ఆకలి, యముడి ముందు చలం, స్వతంత్రం మొదలైనవి.
-ముద్దుకృష్ణ రచించిన నాటికలు- టీ కప్పులో తుఫాను, అపవాదు, అనార్కలి, చాటపెయ్య, ఎత్తు పైఎత్తు, అనాథ శరణాలయం మొదలైనవి.
-మల్లాది విశ్వనాథ కవిరాజు రచించిన నాటికలు- దొంగాటకం, రాజీ, లేత విడాకులు, దొంగలు షరాబు, కిర్రుగానుగ మొదలైనవి.
-మొక్కపాటి నరసింహ శాస్త్రి రచించిన ఏకాంకికలు- మొక్కుబడి, అభ్యుదయం, పెద్దమామయ్య, అసాధారణ సమావేశం, వారసత్వం, పాతివూవత్యం మొదలైనవి.
-శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన నాటికలు- రాజరాజు, కలం పోటు, పునాదిరాయి, టీ పార్టీ మొదలైనవి.
-డీవీ నరసరాజు రచించిన నాటికలు- అంతర్వాణి, ప్రేమపక్షులు, కోడిపుంజులు, ఈ ఇల్లు అమ్మబడును, ఆత్మహత్య, స్వర్గసీమ మొదలైనవి.
-భమిడిపాటి రాధాకృష్ణ రచించిన నాటికలు- భజంవూతీలు, పెళ్లి పందాలు, అంతా ఇంతే, దంత వేదాంతం
-బుచ్చిబాబు రచించిన నాటికలు- దారినపోయే దానయ్య, తిష్య రక్షిత, ఉమర్ ఖయ్యూం, అంతిమజ్ఞానం మొదలైనవి.
-నార్ల వెంక రావు రచించిన నాటికలు- ప్రారబ్ధం, దాంపత్యం శకున పక్షి, వెలుగు నీడలు, కొత్తగడ్డ, ఏకాభివూపాయం, భంగపాటు, ఇంటిగుట్టు, భావకవి, దొంగదొర, ఆడవూబతుకు, వంతెన, అర్ధాంగి, ఆశాపాశం మొదలైనవి.
-సుంకర సత్యనారాయణ రచించిన ఏకాంకికలు- కనువిప్పు, రాబందులు, పిచ్చివాడు, ఆగస్టు 15, వీరకుంకుమ, సరిహద్దులు, జీతగాడు, కాంగ్రేజా? అంగ్రేజా?
-సోమంచి యజ్ఞన్న శాస్త్రి రచించిన నాటికలు- లోకులు కాకులు, యమునాతీరే ఎవరికి వారే, వస్తుంది రాష్ట్రం, రాకేం చేస్తుంది, ఆంధ్రనాటకరంగానికి జై మొదలైనవి.
-మొదలి నాగభూషణ శర్మ రచించిన నాటికలు- విషాదాంతం, అన్వేషణ, పెళ్లికోసం, రాజదండం, జీవన సంగ్రామం, దూరతీరాలు, మృత్యుభాష్యం
-కన్నడ నాటికలను ‘చెప్పుడు మాటలు’ పేరుతో తెలుగులోకి అనువదించిన రచయిత- తిరుమల రామచంద్ర
-‘తీరని బాకీ’ అనే పేరుతో మలయాళ నాటికలను తెలుగులోకి అనువదించిన రచయిత- పుట్టపర్తి నారాయణాచార్యులు.
-నవ నాటికలు అనే పేరుతో తమిళ నాటికలను తెలుగులోకి అనువదించిన రచయిత- శ్రీవాత్సవ.
మాదిరి ప్రశ్నలు
1. సురవరం ప్రతాపరెడ్డి రచించిన నాటకం?
1) చిత్రాంగి 2) శంబుక వధ
3) భక్త తుకారాం 4) శబరి
2. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసిన నాటకం
1) మా భూమి 2) ఎదురీత
3) ఈనాడు 4) పాలేరు
3. చలం అన్వేషణకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నాటకం?
1) చిత్రాంగి 2) శశాంక
3) విడాకులు 4) పురూరవ
4. కింది వాటిలో ఆచార్య ఆత్రేయ రచనలు?
1) ఈనాడు 2) ఎన్జీవో
3) విశ్వశాంతి 4) పైవన్నీ
5. సీత జోస్యం నాటక రచయిత?
1) నార్ల వెంక రావు 2) చలం
3) ఆత్రేయ 4) సి నారాయణ రెడ్డి
సమాధానాలు : 1-3, 2-1, 3-4, 4-4, 5-1