States of Telangana – Rulers | తెలంగాణలోని సంస్థానాలు – పాలకులు

-నిజాం పాలకుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక్క గురుగుంట (కర్ణాటక) సంస్థానం తప్ప మిగతా 14 సంస్థానాలు తెలంగాణలో ఉన్నాయి.
-ఈ సంస్థానాల హోదా జాగీర్ల కన్నా మించింది. ఎందుకంటే జాగీర్లు నిజాం నవాబు ఇచ్చినవి, కానీ సంస్థానాలు అసఫ్‌జాహీ వంశం రాక పూర్వం ముందునుంచే ఉన్నాయి.
1. గద్వాల సంస్థానం
-మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైంది.
-గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. వీరి ఇంటిపేరు ముష్టిపల్లి.
-వీరి ప్రథమ రాజధాని పూడూరు. ఈ పూడూరు రాజపత్రాల్లో కేశవనగరంగా పేర్కొని ఉంది.
-వీరు గధ, వాలు అనే ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించడం వలన వీరు నిర్మించిన నగరానికి గదవాలు అనే పేరు వచ్చింది. కాలక్రమేన గద్వాల అయ్యింది.
-గద్వాల సంస్థానానికి ఆధ్యుడు పెద్ద సోమభూపాల్ (సోమనాద్రి).
-పెద్దన్న వీరారెడ్డి ఈ సంస్థాన స్థాపకుడు.
-గద్వాల సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకురాలు మహారాణి శ్రీ ఆదిలక్ష్మి దేవమ్మ.
-ఈమె కాలంలో గద్వాల సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది.
2. వనపర్తి సంస్థానం
-ఇది కూడా మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉంది.
-ఈ సంస్థాన మొదటి రాజధాని నూగూరు.
-మొదటి రామకృష్ణారావు నూగూరు నుంచి రాజధానిని వనపర్తికి మార్చాడు.
-ఈ సంస్థాన పాలకుల ఇంటిపేరు జనుంపల్లి. వీరు మోటాటి రెడ్డి వంశీయులు.
-ఈ సంస్థాన మూలపురుషుడు వీరకృష్ణ భూపతి (వీరకృష్ణారెడ్డి).
-ఈ సంస్థానాధీశుల్లో మొదటి రామకృష్ణారావు ప్రసిద్ధిగాంచిన వ్యక్తి.
-ఇతనికి నిజాం ప్రభువు 1817లో రాజ బహద్దూర్ అనే బిరుదు ఇచ్చాడు.
-రామకృష్ణారావు దత్తపుత్రుడు మొదటి రాజారామేశ్వరరావు. ఇతను వనపర్తి సంస్థాన చరిత్రలో మొదటిసారిగా శాశ్వత భూమిశస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు.
-ఈ సంస్థాన చివరి పాలకుడు రాజారామేశ్వరరావు. ఈయన తల్లి సరళాదేవి.
-ఈ సంస్థానం 1948లో భారత యూనియన్‌లో విలీనమైంది.
3. అమరచింత సంస్థానం
-మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆత్మకూరు సంస్థానం అమరచింత సంస్థానంగా వర్థిల్లింది.
-ఈ సంస్థాన మొదటి రాజధాని తివుడంపల్లి.
-తరువాత రాజధానిని కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న ఆత్మకూరుకు మార్చారు.
-ఈ సంస్థాన పాలకులు పాకనాటి రెడ్డి కులస్తులు. వీరి ఇంటిపేరు ముక్కెరవారు.
-ఈ సంస్థానానికి మూలపురుషుడు గోపాల్ రెడ్డి.
-ఈ సంస్థాన పాలకుడైన పెద్ద వెంకటరెడ్డి రాజధానిని తివుడంపల్లి నుంచి ఆత్మకూరుకు మార్చాడు.
-ఈ సంస్థాన చివరి పాలకురాలు రాణి రాంభూపాల శ్రీమంత స్వయ్ రాణి భాగ్యలక్ష్మమ్మ. ఈమె శ్రీరాంభూపాల్ బల్వంత్ బహద్దూర్ భార్య.
-అమరచింత సంస్థానంలో తయారైన మస్లిన్ వస్ర్తాలు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచాయి.
4. జటప్రోలు సంస్థానం
-కొల్లాపూర్ సంస్థానంగా పిలిచే ఈ జటప్రోలు సంస్థానం మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది ఎడమ తీరాన ఉంది.
-ఈ సంస్థానాధీశులు పద్మనాయక వంశీయులు.
-వీరి ఇంటిపేరు సురభి. వీరిది రేచర్ల గోత్రం.
-ఈ సంస్థాన స్థాపకుడు పిల్లలమర్రి భేతాళరెడ్డి.
-వీరి రాజధాని జటప్రోలు. సురభి లక్ష్మణరాయలు తన రాజధానిని 1840లో జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చాడు.
-ఈ సంస్థానాన్ని పరిపాలించిన రాజా వెంటక లక్ష్మణరావును నిజాం ప్రభువు మహబూబ్‌నగర్ అలీఖాన్ అని ప్రశంసించి 1905 డిసెంబర్ 28న వంత్ బహద్దూర్ అనే బిరుదు ఇచ్చాడు.
-ఈ సంస్థాన చివరి పాలకుడు రాజా వెంకట జగన్నాథరావు.
-ఇతనికాలంలో జటప్రోలు సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది.
5. దోమకొండ సంస్థానం
-తొలుత బిక్కవోలు సంస్థానంగా పిలిచే దోమకొండ సంస్థానం నిజామాబాద్ జిల్లాలో ఉంది.
-దోమకొండ సంస్థానం కుతుబ్‌షాహీల కాలంలో ఆవిర్భవించింది.
-ఈ సంస్థానాధీశులు పాకనాటి రెడ్డి శాఖకు చెందినవారు.
-ఈ పాలకులు కామినేని వంశీయులు. వీరిది రాచమళ్ల గోత్రం. బిక్కనూరు (బిక్కవోలు)లో వెలసిన సిద్ధరామేశ్వరుడు వీరి కులదైవం.
-ఈ సంస్థాన మూలపురుషుడు కామనేడు.
-ఈ సంస్థాన స్థాపకుడు కామినేని చౌదరి.
-దోమకొండ సంస్థాన రాజధాని బిక్కవోలు (బిక్కనూరు)ను రాజన్న చౌదరి కామారెడ్డికి మార్చాడు.
-రాజన్న చౌదరి కుమారుడు రాజేశ్వరరావు రాజధానిని కామారెడ్డి నుంచి దోమకొండకు మార్చాడు.
-దోమకొండ సంస్థానాధీశుల్లో సుప్రసిద్ధుడు రాజేశ్వరరావు.
-దోమకొండ సంస్థాన చివరి పాలకుడు రాజా సోమేశ్వరరావు.
-ఇతని కాలంలో ఈ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది.
6. పాపన్నపేట సంస్థానం
-పాపన్నపేట సంస్థానం ప్రాచీన సంస్థానాల్లో ఒకటి.
-ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్‌గా ఉన్న సమయంలో ఈ సంస్థానం ఏర్పడింది.
-మెదక్ మొత్తం పాపన్నపేట సంస్థానంలో ఉంది.
-పాపన్నపేట సంస్థాన పాలకుల్లో రాయ్‌బగాన్ రాణి శంకరమ్మ 12వ తరానికి చెందినవారు.
-నిజాం ప్రభువు రాణి శంకరమ్మ పరిపాలనాదక్షత, యుద్ధ నైపుణ్యం చూసి రాయ్‌బగాన్ బిరుదుతో సత్కరించి, రాజలాంఛనాన్ని ప్రసాదించాడు.
-రాయ్‌బగాన్ అంటే ఆడ సింహం అని అర్థం.
-సదాశివరెడ్డి (రాణి శంకరమ్మ దత్తపుత్రుడు) పాపన్నపేట సంస్థానాధీశుల్లో ప్రముఖుడు. ఇతని భార్య పార్వతి. ఈమె గద్వాల సంస్థానాధీశుని కూతురు.
-సదాశివరెడ్డి సోదరుడు సంగారెడ్డి పొట్లచెరువు సంస్థానాన్ని పాలించాడు.
-ఈ సంస్థానాధీశులకు చార్హజార్ అనే బిరుదు ఉండేది.
-పాపన్నపేట సంస్థాన చివరి పాలకుడు రాజా రామచంద్రారెడ్డి.
-ఇతని కాలంలో ఈ సంస్థానం భారత యూనియన్‌లో కలిసిపోయింది.
7. మునగాల సంస్థానం
-మునగాల సంస్థానం కృష్ణా జిల్లా (ఆంధ్రప్రదేశ్) నందిగామ తాలూకాలోనిది.
-ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో నల్లగొండ జిల్లాలో కలిపారు.
-18వ శతాబ్దాంతం వరకు ఈ సంస్థాన పాలకుల సమాచారం తెలియదు.
-1790లో ఫ్రెంచి-బ్రిటిష్ కంపెనీల మధ్య సంభవించిన యుద్ధాల్లో మునగాల సంస్థానధీశురాలైన కీసర లచ్చమ్మ రావు బ్రిటిష్ కంపెనీకి సహాయం చేశారు.
-1802లో లచ్చమ్మ సేవలకు సంతోషించి బ్రిటిష్‌వారు పేష్కస్ ఇచ్చి సన్మానించారు.
-మునగాల సంస్థానాధీశులు జబ్దతులక్రాన్ బిరుదు వహించారు.
-మునగాల సంస్థాన పాలకుడు కీసర ముకుందప్ప మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు దక్కన్ దండయాత్రల్లో సహకరించి మునగాల సంస్థానాన్ని సనదు ద్వారా పొందాడు.
-రాణి లచ్చమ్మ దత్తపుత్రుడు నాయని వెంకటరంగారావు 1900లో మునగాల రాజాగా పదవి స్వీకరించాడు.
-వీరి సంస్థానంలో దివాను కొమర్రాజు వెంకటలక్ష్మణరావు.
-వెంకటరంగారావు వీరి సంస్థాన పరిధిలో ఉన్న తాడువాయి గ్రామంలోని మహాలింగ దేవాలయాన్ని పునరుద్ధరించాడు.
-రాజా వెంకటరంగారావు కుమార్తె సరళాదేవి. ఈమె వనపర్తి రాజా కృష్ణదేవరాయల సతీమణి.
-సరళాదేవి పేరున వనపర్తి సమీపంలో సరళా సాగర్ నిర్మించారు.
-1947లో మునగాల సంస్థానం మద్రాసు రాష్ట్రంలో విలీనమైంది.
8. పాల్వంచ సంస్థానం
-పూర్వం శంకరగిరి సంస్థానంగా పేరుగాంచిన పాల్వంచ సంస్థానం ఖమ్మం జిల్లాలో ఉంది.
-పాల్వంచ సంస్థానాధీశుల పూర్వీకులు కాకతీయ ప్రతాపరుద్రుని సేనానులుగాను, అశ్వసైన్యాధీశులుగాను వ్యవహరించిన పద్మనాయక వంశీయులు.
-1324లో అప్పన్న అనే వ్యక్తి శంకరగిరి, హసనాబాద్ ప్రాంత పాలకునిగా ఉన్నాడు.
-1698 వరకు ఇతని వంశీయులు బహమని, ముసునూరి, పద్మనాయక, గోల్కొండ సుల్తాన్లకు సామంతులుగా వ్యవహరించారు.
-1769లో పాల్వంచ పాలకుడు నరసింహ అశ్వారావు.
-1796లో వెంకటరామ నరసింహ అప్పారావు పాల్వంచ సంస్థానాధీశుడుయ్యాడు.
-పాల్వంచ సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకుడు విజయ అప్పారావు.
-ఇతని కాలంలో పాల్వంచ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది.
-పాల్వంచ సంస్థాన చరిత్రను రచించింది కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ శర్మ.
ప్రాక్టీస్ బిట్స్
1. గద్వాల సంస్థానాధీశుల మొదటి రాజధాని ఏది?
1) పూడూరు 2) గూడూరు
3) తివుడంపల్లి 4) బిక్కవోలు
2. గద్వాల కోటను ఎప్పుడు నిర్మించారు?
1) 1600-1690 2) 1698-1704
3) 1690-1700 4) 1695-1701
3. గద్వాల సంస్థాన స్థాపకుడెవరు?
1) చెన్నమరెడ్డి 2) వీరారెడ్డి
3) పెద్దన్న వీరారెడ్డి 4) సోమభూపాల్
4. వనపర్తి సంస్థాన మొదటి రాజధాని ఏది?
1) పూడూరు 2) గూడూరు
3) తివుడంపల్లి 4) నూగూరు
5. వనపర్తి సంస్థాన పాలకుల ఇంటిపేరు?
1) ముక్కెరవారు 2) జనుంపల్లి
3) సురభి 4) ఏదీకాదు
6. వనపర్తి సంస్థన చివరి పాలకుడు?
1) గోపాల్‌రెడ్డి 2) రాంభూపాల్
3) రాజారామేశ్వరరావు 4) ఎవరూకాదు
7. అమరచింత రాజధానిని తివుడంపల్లి నుంచి ఆత్మకూరుకు మార్చిందెవరు?
1) గోపాల్‌రెడ్డి 2) రామకృష్ణారావు
3) రాంభూపాల్ 4) పెద్ద వెంకటరెడ్డి
8. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగల మస్లిన్ వస్ర్తాలు ఏ సంస్థానంలో తయారయ్యేవి?
1) వనపర్తి 2) అమరచింత
3) జటప్రోలు 4) దోమకొండ
9. జటప్రోలు సంస్థానం ఏ జిల్లాలో ఉంది?
1) నల్లగొండ 2) నిజామాబాద్
3) మహబూబ్‌నగర్ 4) పాల్వంచ
10. జటప్రోలు సంస్థాన స్థాపకుడెవరు?
1) జగన్నాథరావు 2) కామినేని చౌదరి
3) పిల్లలమర్రి భేతాళరెడ్డి 4) లక్ష్మణరావు
11. జటప్రోలు సంస్థాన రాజధానిని జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు 1840లో మార్చిందెవరు?
1) జగన్నాథరావు 2) కామనేడు
3) సురభి లక్ష్మణరాయలు 4) ఎవరూకాదు
12. జటప్రోలు సంస్థాన పాలకుల్లో ఎవరికి వంత్ బహద్దూర్ అనే బిరుదు ఉంది?
1) రాజా వెంకటలక్ష్మణరావు 2) జగన్నాథరావు 3) భేతాళరెడ్డి 4) కామనేడు
13. దోమకొండ సంస్థాన స్థాపకుడు ఎవరు?
1) కామినేని చౌదరి 2) రాజన్న చౌదరి
3) రాజేశ్వరరావు 4) కామనేడు
14. దోమకొండ సంస్థాన రాజధానిని బిక్కవోలు (బిక్కనూరు) నుంచి కామారెడ్డికి మార్చిందెవరు?
1) రాజన్న చౌదరి 2) కామినేని చౌదరి
3) కామనేడు 4) రాజేశ్వరరావు
15. ఏ సంస్థాన పాలకునికి చార్ హజార్ అనే బిరుదు ఉంది?
1) మునగాల 2) దోమకొండ
3) పాపన్నపేట 4) జటప్రోలు
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు