Protections of the disabled | అశక్తుల రక్షణలు
ది పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ (1995)
-ఈ చట్టం పూర్తిపేరు ద పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్)- 1995
-ఇది 1996, జనవరి 1న అమల్లోకి వచ్చినప్పటికీ, ఫిబ్రవరి 2 నుంచి పూర్తిస్థాయిలో అమలుచేయబడింది.
-దేశంలో మొదటిసారి వికలాంగులను ఈ చట్టం ద్వారా ఏడు రకాలుగా గుర్తించారు.
-ఆసియా పసిఫిక్ డెకేడ్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్‌లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ చట్టాన్ని రూపొందించారు.
-చట్టంలో పేర్కొన్న 7 రకాల అశక్తతల్లో ఒకటిగానీ అంతకంటే ఎక్కువగానీ అశక్తతలు 40 శాతానికి మించి ఉన్నట్లయితే 3 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
-పనిచేసేచోట, విద్యాలయాల్లో, ప్రభుత్వ ప్రయాణ సౌకర్యాల్లో, ఇతర సామాజిక వనరుల వినియోగానికి సంబంధించి అశక్తులకు స్నేహపూర్వకమైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు.
-అశక్తుల సంక్షేమం అనేది రాజ్యాంగం ప్రకారం 26 యూనిట్లలోని 9వ అంశం అయినప్పటికీ 253వ రాజ్యాంగ నిబంధన ఇచ్చిన అధికారంతో పార్లమెంట్ ఈ చట్టం చేసింది.
-ఈ చట్టాన్ని అనుసరించి చీఫ్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ని ఏర్పాటుచేశారు.
-కేంద్రంలో సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు. అన్ని రాష్ర్టాల్లో స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు.
ది మెంటల్ హెల్త్ యాక్ట్- 1987
-1993 April 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి.. సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ ఆథారిటీలను ఏర్పాటుచేశారు.
-బ్రిటిష్‌వారు ఏర్పాటుచేసిన Indian Lunacy act – 1912 స్థానంలో దీనిని ఏర్పర్చారు.
-మానసిక అనారోగ్యులకు మానవ హక్కుల భంగం కలుగకుండా చూడటమే ఈ చట్టం ముఖ్యఉద్దేశం
-ఈ చట్టాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్వారు అమలుపరుస్తున్నారు.
ది నేషనల్ ట్రస్ట్ యాక్ట్- 1999
-ఈ చట్టం పూర్తి పేరు : The National trust for the welfare of persons with Autism, cerebral policy, Mental Retardation and multiple disabilities act – 1999
-ఈ చట్టం కింద నేషనల్ ట్రస్ట్‌ను రూపొందించారు.
-నిర్మయ: ఇది అశక్తులకు సంబంధించిన బీమా పథకం. 2007లో ప్రారంభించారు. 1,00,000 వరకు వైద్యసేవలకు చెల్లిస్తారు. 1,34,174 మంది రిజిస్టర్ చేసుకున్నారు.
-ARUNIM: అసోసియేషన్ ఫర్ రిహాబిలిటేషన్ అండర్ నేషనల్ ట్రస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ మార్కెటింగ్
n దీనిని అబ్దుల్ కలాం 2008 సెప్టెంబర్ 22న ప్రారంభించారు.
-అశక్తులకు సంబంధించిన హస్తకళా నైపుణ్యాలను/వారు తయారుచేసిన వస్తువులను అమ్మేందుకు మార్కెటింగ్, లోన్ సౌకర్యాలు, ప్రచారాన్ని కల్పిస్తారు.
-2014లో సమర్థ్-2014 పేరు మీద ప్రదర్శనను నిర్వహించారు.
-ఎకనామిక్, ఎంటర్ప్రైజెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే E3 దీని నినాదం
-సహ్యోగి అనే పథకం కింద మాస్టర్ ట్రెయినీస్కి శిక్షణ ఇస్తున్నారు.
-సంభవ్ పేరు మీద న్యూఢిల్లీలో జాతీయ పునరావాస వనరుల కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.
-సమర్థ్: అశక్తులకు సంబంధించిన తాత్కాలిక, దీర్ఘకాలిక నివాస కేంద్రాలు
-దేశవ్యాప్తంగా 119 కేంద్రాలు ఉన్నాయి.
-అనాథ అశక్తులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
-గరుడ: జీవితకాలపు నివాస కేంద్రాలు
-దేశవ్యాప్తంగా 12 మాత్రమే ఉన్నాయి.
-ఈ సేవలు వయసులో పెద్దవారైన అశక్తులకు మాత్రమే.
-బడ్తే కదమ్ పేరుతో అశక్తుల పట్ల సానుకూల దృక్పథాన్ని సమాజంలో పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.
-2008 నుంచి జ్ఞాన్ ప్రభావ్ పథకం కింద నెలకు రూ. 1000 చొప్పున ఉపకార వేతనాలను ఇస్తున్నారు.
అసిస్టెన్స్ టు డిసేబుల్డ్ పర్సన్స్ ఫర్ పర్చేజ్
-ప్రతినెలా రూ. 6500-15,000 వరకు ఆదాయం ఉన్నవారికి 100 శాతం ఉచితంగా, రూ. 15,000లకు పైగా ఆదాయం ఉన్నవారికి 50 శాతం రాయితీతో వివిధ పరికరాలు కొనేందుకు సాయం చేస్తారు.
ఏఐఎంఐసీఓ ద్వారా సేవలు
-రాష్ట్రపతి పేరు మీద లాభాపేక్ష లేని సంస్థగా 1972 సెప్టెంబర్‌లో ఏర్పాటుచేశారు.
-సుమారు 2,00,000 మంది ప్రతి ఏడాది లబ్ధి పొందుతున్నారు.
-2013లో కృత్రిమ అవయవాలపై అవగాహన కల్పించేందుకు స్వావలంబన్ పేరుతో ప్రదర్శన నిర్వహించారు.
డిసేబిలిటీ, ఆరోగ్యపరమైన పథకాలు
-బీసీజీ టీకా- 1962
-ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్- 1978
-1979 నుంచి ఈపీఐలో భాగంగా పోలియో వ్యాక్సిన్‌ని ఇస్తున్నారు.
-1985 నుంచి ఈపీఐని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ)గా మార్చారు.
-పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని 1995 నుంచి అమలుపరుస్తున్నారు.
-2014, డిసెంబర్ 25న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మిషన్ ఇంద్ర ధనస్సును ప్రారంభించింది.
-జనవరి 18న నేషనల్ ఇమ్యునైజేషన్ డేగా జరుపుకొంటారు.
-2008లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్‌ను ప్రారంభించారు.
-నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ (ఎన్పీపీసీడీ)ను 2007లో ప్రారంభించారు.
-నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్జీసీపీ)ను 1962లో ప్రారంభించారు.
-1992 ఆగస్టులో ఎన్జీసీపీని ఎన్ఐడీడీసీపీగా మార్చారు.
-2006 మార్చి 17 నుంచి అయోడిన్ రహిత ఉప్పుపై నిషేధం విధించారు.
-1955లో నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
-ఈ పథకాన్ని 1983లో నేషనల్ లెప్రసీ ఎరాడిక్షన్ ప్రోగ్రామ్ (ఎన్ఎల్ఈపీ)గా మార్చారు.
-నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ కార్యక్రమాన్ని 1999లో ప్రారంభించారు.
-ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్ ఎట్ సెకండరీ లెవల్ పథకాన్ని 2009లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్ 2013లో భాగంగా అమలు పరుస్తున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?