NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST (UG) | మెడికల్ ప్రవేశాలకు గేట్ వే నీట్ ( యూజీ )

వైద్యుడిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన, ఎవర్గ్రీన్ కెరీర్‌గా పేరుగాంచిన వైద్య వృత్తిలో ప్రవేశించాలంటే ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేయాలి. ఈ కోర్సులో ప్రవేశాలు పొందడానికి జాతీయస్థాయిలో నిర్వహించే నీట్-2022 ప్రకటనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నీట్ యూజీ
పరీక్షకు అర్హతలు, పరీక్ష విధానం, ముఖ్యతేదీలు నిపుణ పాఠకుల కోసం…
పరీక్ష విధానం
– నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఎ, సెక్షన్ బి.
– ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి.
– మొత్తం 200 ప్రశ్నలు. 720 మార్కులు.
– ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు -1 మార్కు కోత విధిస్తారు.
– పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్. పరీక్ష సెంటర్లో ఇచ్చే బాల్ పాయింట్ పెన్‌తో ఓఎంఆర్‌లో జవాబులు గుర్తించాలి.
– పరీక్ష కాలవ్యవధి మూడు గంటల 20 నిమిషాలు.
– పరీక్ష 13 భాషల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర అభ్యర్థులు తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు భాషలో ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 7
పరీక్ష తేదీ: జూలై 17 (మధ్యాహ్నం
2 నుంచి 5.20 వరకు)
వెబ్సైట్: https://neet.nta.nic.in
నీట్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్). జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షను 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశాలు
– అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, దేశంలోని కాలేజీల్లో జాతీయస్థాయి కోటాలో, ఎయిమ్స్, జిప్మర్, డీయూ, బీహెచ్‌యూ, ఏఎంయూ, ఏఎఫ్ఎంసీ, జీజీఎస్‌ఐపీయూ, ఈఎస్ఐసీ, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా నీట్ ర్యాంక్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తాయి.
– నోట్: ఆయా యూనివర్సిటీల నిబంధనల కనుగుణంగా ప్రవేశాలు ఉంటాయి.
ఎవరు అర్హులు?
-ఇంటర్ (బైపీసీ) లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
– డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎటువంటి గరిష్ఠ వయో పరిమితి లేదు.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?